కేటగిరీలు

 • MP3

  ఈ కార్యక్రమం / అకాడమీ యొక్క అసలు ఉద్దేశ్యాలు, లక్ష్యాలు : ఇంగ్లీషు భాష మాట్లాడే ప్రజల్ని ముస్లిమేతరులకు ఇస్లాం ధర్మాన్ని పరిచయం చేయడం మరియు ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం ధర్మ శాంతి సందేశాన్ని ప్రచారం చేయడం వైపు ప్రోత్సహించడం. ప్రధాన ఉద్దేశ్యాలు - సాంస్కృతిక పరిమితులకు అతీతంగా ఇంగ్లీషు భాషలో సంభాషించే సామర్ధ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం, ఇస్లామీయ పదాల సముచిత జ్ఞానం మరియు వాడుక, వివిధ సంస్కృతులకు చెందిన ప్రజలతో ఇస్లామీయ భావనలు, సిద్ధాంతాల గురించి ఇంగ్లీషులో చర్చించడం, వారు కోరిన అంశాలపై సంక్షిప్తమైన ఇస్లామీయ ప్రజెంటేషన్లు ఇవ్వడం, ఇస్లాం ధర్మ ప్రచారంలో ఇంగ్లీషు భాషను ఉపయోగించే నైపుణ్యతను అభివృద్ధి చేసుకోవడం.

 • మోడరేట్ ధర్మం ఇంగ్లీష్

  PDF

  'వసతియ్యహ్ అహ్లె సున్నహ్ బైనల్ ఫిరాఖ్' (వివిధ వర్గాల మధ్య అహ్లె సున్నతుల్ జమఆత్ యొక్క మితతత్వం) అనే పేరుతో ప్రచరించబడిన పి.హెచ్.డి థీసిస్ లోని మూడవ భాగం నుండి ఇది సంకలనం చేయబడింది. దీనిని సౌదీ అరేబియాలోని ఇస్లామీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ ముహమ్మద్ బకరీమ్ ముహమ్మద్ బఅబ్దుల్లాహ్ తయారు చేసినారు. నేను ఈ థీసిస్ యొక్క మూడవ భాగంలో నుండి 'Moderation of the Muslims between extremism and negligence' (తీవ్రవాదం మరియు నిర్లక్ష్యాల మధ్య ముస్లింల మధ్యేమార్గం) అనే భాగాన్ని ఇంగ్లీషులోనికి అనువదించాను.

 • video-shot

  MP4

  పూర్వ కాలంలో స్త్రీ స్థానం ఏమిటి? అమ్మబడే మరియు కొనబడే ఒక వస్తువుగా ఆమెను పరిగణించేవారు, ఆమెకు మానమర్యాదలు ఉండేవి కావు. ఆమె ఒక మామూలు జంతువుగా లేక ఒక గృహోపకరణ సామానుగా అమ్మబడేది; ఆమెను బలవంతంగా పెళ్ళి చేసుకునేవారు లేక వ్యభిచారంలోకి దింపేవారు. ఆమెకు వారసత్వ హక్కు ఉండేది కాదు లేక ఆమెకు స్వంతంగా సంపద ఉంచుకునే హక్కు ఉండేది కాదు; ఒకవేళ ఆమె వద్ద ఏమైనా సంపద ఉంటే దానిని ఆమె అనుమతి లేకుండానే ఆమె భర్త బలవంతంగా లాక్కునేవాడు. కొన్ని అనాగరిక సమాజాలు ఇంకో అడుగు ముందుకు వేసి, ఆమెను అసలు మనస్సు, ఆత్మ కలిగి ఉన్న మనిషిగా పరిగణించాలా లేదా అనే చర్చలు కొనసాగించాయి! ఇంత జరిగినా, కొన్ని సమాజాలు ఇస్లాం ధర్మాన్ని స్త్రీలను హింసిస్తున్నదనీ మరియు అణగద్రొక్కుతున్నదనీ, ఆమెకు అన్యాయం చేస్తున్నదనీ నిందిస్తున్నాయి. ఈ వీడియోలో వీటన్నిటిలోని సత్యాసత్యాలను మేము నిష్పక్షపాతంగా చర్చిస్తున్నాము. ఇస్లాం ధర్మం స్త్రీలకు ఇచ్చిన హక్కులను మరియు భద్రతను గురించి స్పష్టంగా వివరిస్తున్నాము.

 • video-shot

  MP4

  అంతిమ దినాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాజం యొక్క బాధ్యతలు, కర్తవ్యాలు అనే ఈ అంశం గురించి షేఖ్ అబ్దుల్లాహ్ హాకిమ్ ఉపన్యసించారు. ఇందులో ఆయన అల్లాహ్ యొక్క సందేశాన్ని అత్యంత ఖచ్చితమైన మరియు సరైన పద్ధతిలో ఇతరులకు అందజేయవలసిన మన బాధ్యతను గురించి వివరించారు.

 • PDF

  1- ఇస్లాం ధర్మంతో సంబంధం లేని వేరే ధర్మం నేషన్ ఆఫ్ ఇస్లాం అనే పేరుతో తలెత్తడం మరియు దాని చరిత్ర. 2- దానిలోని మార్గభ్రష్టత్వం.

 • MP3

  మానవజాతి కొరకు రోల్ మోడల్ గా మరియు అత్యుత్తమ నాయకుడిగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రదర్శించిన గొప్ప గుణగణాలు. ఎందుకంటే ఆయన ప్రపంచంపై వేసినంత ప్రభావశీలమైన గంభీర ముద్ర ఇంకెవ్వరూ వేయలేక పోయారు. ఈనాటికీ ఆయనను అనుసరించే ప్రజలు ప్రపంచంలో 1.8 బిలియన్ల కంటే ఎక్కువగా ఉన్నారు.

 • DOC

  ఇస్లాం ధర్మంలో ఒక సవిశాల నాగరికతను గుర్తించిన అనేక పాశ్చాత్య ముస్లిమేతర పండితుల అభిప్రాయాలు.

 • PDF

  డాక్టర్ జొహర్ షనాన్ ఇద్రీస్ 10 అక్టోబరు 2011 నాడు ప్రచురించిన వ్యాసం. చివరిసారి అది 23 అక్టోబర్ 2011 సరిదిద్దబడింది. దీనిని 3831 మంది సందర్శించారు అంటే సరాసరి రోజుకు 7 మంది దీనిని చదువుతున్నారు. దీని రేటింగ్ 5 కు 5. 149 మంది దీనిని ముద్రించుకున్నారు. ఇద్దరు ఈమెయిల్ ద్వారా ఇతరులకు పంపినారు. దీనిపై ఇంత వరకు ఎవ్వరూ వ్యాఖ్యానించలేదు.

 • DOC

  ఇస్లామీయ నాగరికత మరియు సంప్రదాయంపై డాక్టర్ జహూర్ సంకలనం చేసిన కొందరు ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తుల ఉల్లేఖనలు.

 • video-shot

  MP4

  ఈనాడు ముస్లిం సమాజం చాలా బలహీనంగా ఉన్నది. ఐకమత్యం లేదు. అన్ని వైపుల నుండి దాడులకు గురవుతున్నది. ఒకప్పుడు ఎంతో గొప్ప స్థితిలో ఉండి, ప్రపంచాన్ని శాసించిన ముస్లిం సమాజం, ఈనాడు ఇలాంటి దయనీయ పరిస్థితిలోనికి ఎందుకు దిగజారిపోయింది ? ఈ పరిస్థితిని మనం ఎలా సరిదిద్దగలం ? ఈ ఉపన్యాసంలో షేఖ్ అబ్దుల్ రహీమ్ గ్రీన్ ఈ విషయాలపై చర్చించినారు.

ఫీడ్ బ్యాక్