నేను నమాజు చేస్తున్నట్లుగానే, మీరూ నమాజు చేయండి అనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పలుకుల ఆధారంగా షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ ఈ పుస్తకంలో నమాజు విధానాన్ని ప్రామాణికమైన ఆధారాలతో వివరించారు.
అరబీ భాషలో మరియు అనేక ఇతర భాషలలో ఇది చాలా ప్రసిద్ధి చెందిన దుఆల సంకలనం. దీనిలో ఖుర్ఆన్ మరియు సున్నతుల నుండి వివిధ సందర్భాలలో ఉపయోగపడే అనేక దుఆలు జమ చేయబడినాయి. ఇది మీకు కూడా చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. హిస్నుల్ ముస్లిం అంటే ముస్లింల సురక్షిత కోట అని అర్థం.
సత్యాన్వేషణ చేస్తున్నవారి కోసం ఇదొక మంచి పుస్తకం. వారికిది సరైన, సత్యమైన మార్గాన్ని చూపిస్తుంది. వివిధ ధర్మపు పేర్ల అసలు మూలం & వాటి భావం గురించి, సృష్టికర్త - మానవుడు - సృష్టి కీ మధ్య ఉన్న సంబంధం విషయమై వివిధ మతాల దివ్యగ్రంథాలు ఇస్తున్న వివరణ గురించి, వివిధ మతాల సార్వజనికత గురించి నిజాయితీగా ఆలోచించమని అడుగుతున్నది. హిందూ, క్ర్తైస్తవ, యూదు మరియు ఇతర మతాల వారిని స్వచ్ఛమైన దైవధర్మపు (ఇస్లాం) ప్రత్యేకతల గురించి తెలుసుకోవటానికీ పుస్తకం ఉపయోపడుతుంది.
గ్రామీణ ముస్లిం స్వయం శిక్షణాభివృద్ధి గ్రంథాలయంవారు ప్రచురించిన విశ్వాస ప్రదాయిని అనే ఈ విలువైన పుస్తకాన్ని షాహ్ ఇస్మాయీల్ ముహద్దిస్ (ర) ఉర్దూలో రచించగా, దానిని తెలుగులో సిరాజుర్రహ్మాన్ ఉమ్రీ గారు అనువదించారు. దీనిలో తౌహీద్, వివిధ రకాల షిర్క్ ల గురించి వివరంగా చర్చించినారు.
ఈ పుస్తకంలో సహాబాల కాలంలోని అహ్లుస్ సున్నత్ వల్ జమాఅత్, ఔలియా అల్లాహ్ అంటే ఎవరు, షైతాను ఔలియాల గురించి, నాలుగు ఇమాములు గురించి, తఖ్లీద్ వాస్తవికత, వహాబీల వాస్తవికత, వహాబీ అనే బిరుదు ఎందుకు వచ్చింది, ఇస్లాంలో బయలుదేరిన నూతన వర్గాలు, సూఫీలు, మార్గభ్రష్టులు, తబ్ లీగ్ జమాఅతు, గులూ, మొదలైన విభిన్న విషయాల గురించి వివరంగా చర్చించడం జరిగింది.
ఇస్లామీయ ఏకదైవత్వం గురించి ప్రచురించబడిన మంచి పుస్తకాలలో ఒకటి. దీనిలో ప్రతి మానవుడు తన సృష్టికర్త గురించి తెలుసుకోవలసిన అనేక విషయాలు స్పష్టంగా తెలుపబడినాయి. అంతేగాక కొందరు ప్రజలలో కనబడే అవిశ్వాసం, కపటత్వం మరియు నూతన కల్పితాల గురించి కూడా స్పష్టంగా వివరించబడింది.
డా. సయీద్ అహ్మద్ ఉమ్రీ మదనీ గారు ఈ పుస్తకంలో పరస్పరం విభేదిస్తున్న అసత్య పలుకులతో, ప్రజలను అయోమయంలో పడవేసి, తప్పుడు దారి పట్టిస్తున్న ఖాదియానియత్ గురించి ప్రామాణిక ఆధారాలతో చాలా క్షుణ్ణంగా చర్చించారు. సత్యం తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు తప్పకుండా చదవ వలసిన మంచి రిసెర్చ్ పుస్తకమిది.
ముస్లింలు మరియు ముస్లిమేతరుల కొరకు ఇది ఒక మంచి పుస్తకం. దీనిలో అల్లాహ్ పై విశ్వాసం గురించి మరియు మన ఆరాధనలలోని అనేక తప్పిదాల, కల్పితాల, భ్రమల గురించి చర్చించబడింది. అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన పద్ధతిలో అల్లాహ్ ను ఎలా ఆరాధించాలనే విధానం వైపు ఇది దారి చూపుతున్నది.
ఈ పుస్తకంలో ‘సకల లోకాల సృష్టికర్త అసలు పేరేమిటి’ అనే ముఖ్యమైన విషయాన్ని డాక్టర్ అబ్దుల్ కరీమ్ (నాగిరెడ్డి శ్రీనివాస రావు) గారు చాలా వివరింగా చర్చించినారు. అనేక వాస్తవాలను ప్రామాణిక ఆధారాలతో సహా మన ముందుంచారు. దీనికి మూలం ఇంగ్లీషులోని రమదాన్ జుబైరీ గారి పరిశోధన. ఎలాంటి పక్షపాతం లేకుండా దీనిని చదివినట్లయితే, మనలోని అనేక అపోహలు, భ్రమలు తొలగిపోయి, అసలైన సృష్టకర్త వైపు మరలి, ఇహపరలోకాల సాఫల్యం వైపుకు సాగటానికి అవకాశం ఉంది.
హిందూ ధర్మ గ్రంథాలలో, క్రైస్తవ ధర్మగ్రంథాలలో మరియు ఖుర్ఆన్ లో సర్వలోక సృష్టకర్త అయిన ఆ ఏకైక ఆరాధ్యుడిని గురించి వివరించిన అనేక విషయాలు ఈ పుస్తకంలో చర్చించబడినాయి. ప్రతి ఒక్కరూ విశాల దృక్పథంతో చదవవలసిన పుస్తకం ఇది. దీని ద్వారా మనకు సరైన మార్గదర్శకత్వం లభిస్తుందని ఆశిస్తున్నాము.