ఉర్దూ భాషలో మౌలానా ముహమ్మద్ జునాగడీ మరియు హాఫిజ్ సలాహుద్దీన్ యుసుఫ్ లు కలిసి తయారు చేసిన అహ్సనుల్ బయాన్ అనే ప్రపంచ ప్రసిద్ధ ఖుర్ఆన్ సంకలనం యొక్క తెలుగు అనువాదమిది. దీనిని ముమ్మద్ అజీజుర్రహ్మాన్ గారు తెలుగులో అనువదించినారు. శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్, హైదరాబాదు వారు ప్రచురించినారు. వారి అనుమతి లేకుండా ఎవరూ దీనిని అధిక సంఖ్యలో ప్రింటు చేయరాదు. తెలుగు భాషలో ఇటువంటి అమూల్యమైన గ్రంథం లభ్యమవటం మన అదృష్టం.
ఇది తెలుగు భాషలో ఖుర్ఆన్ భావం యొక్క అనువాదము. మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు ఇక్కడ పొందుపరచ బడినది. దీనిని మెరుగుపరచటానికి, మీ సలహాలు ఏమైనా ఉంటే దయచేసి అనువాదకుడికి పంపగలరు. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో ప్రతి అరబీ వచనమునకు దాని ప్రక్కనే తెలుగు అనువాదం చేయబడినది.
ఈ పుస్తకం జీసస్ మరియు ముహమ్మద్ గురించి క్రైస్తవులలో ఉన్న అనేక అపోహలను ప్రామాణిక ఆధారాలతో దూరం చేస్తున్నది. సత్యం తెలుసుకోగోరిని ప్రతి ఒక్కరికీ ఇది ప్రయోజనం చేకూర్చును.
ఈ పుస్తకంలో అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని గురించి చాలా వివరంగా చర్చించబడినది. ఇంకా షిర్క్ అంటే బహుదైవారాధన రుగ్మతల గురించి కూడా విశదీకరించటం జరిగినది. అంతే గాక అల్లాహ్ యొక్క సందేశహరుడిని, సందేశాన్ని మరియు అల్లాహ్ కు దూరం చేసే తాగూత్ అంటే దుష్టశక్తుల గుర్తింపు మరియు ఇతర ఏకదైవారధనకు సంబంధించిన విషయాలు కూడా దీనిలో విపులంగా చర్చించబడినవి. ప్రతి పాఠకునికి దీనిలోని విషయాలు ఇహపరలోకాలలో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి.
అత్తౌహీద్ అంటే ఏకదైవత్వం పై వ్రాయబడిన ఉత్తమ పుస్తకాలలో ఇది ఒకటి. దీనిలో సకల లోక సృష్టికర్త యొక్క ఏకదైవత్వం గురించి వివరంగా చర్చించబడినది. అల్లాహ్ గురించి తెలుసుకోదలచిన ప్రతి ఒక్కరూ తప్పక చదవ వలసిన ఒక మంచి పుస్తకం.
క్లుప్తంగా బహిర్భూమి అంటే టాయిలెట్ కు వెళ్ళే పద్దతి (కాలకృత్యాలు), స్నానం చేయటం, నీళ్ళులేని పరిస్థితిలో పరిశుద్ధమయ్యే పద్ధతి, ఉదూ, నమాజ్, పండగరోజు చేసే నమాజు, మృతశరీరం - స్నానం, నమాజు, అంత్యక్రియలు, తప్పనిసరిగా చేయవలసిన దానం - జకాత్, ఉపవాసం, మక్కా యాత్ర (హజ్)
ఇది Islamicpamphlets పబ్లిషర్స్ ప్రచురించిన కరపత్రాల సంకలనం. దీనిలో అనేక మంచి మంచి వ్యాసాలు ఉన్నాయి. ఇస్లాం గురించి తెలుసుకోవాలనుకునే వారి కొరకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇస్లాం గురించి ప్రజలలో వ్యాపించి ఉన్న అపోహలను, భ్రమలను దూరం చేస్తుంది. అంతేగాక, 1436హిజ్రీ (2015) సంవత్సరపు రమదాన్ సాంస్కృతిక పోటీ పుస్తకం కూడా. దీని చివరిలో పోటీ షరతులు మరియు క్విజ్ ప్రశ్నలు ఉన్నాయి. వాటి జవాబులు సమయంలోపల రబ్వహ్ జాలియాత్ కు పంపగలిగితే, మీరు మంచి బహుమతి పొందే అవకాశం కూడా ఉన్నది.
ఇస్లామీయ విధేయతా విధానం మరియు మీలాదున్నబీ, దర్గాల వద్ద జరిగే ఆరాధనలు మరియు మ్రొక్కుబడులు, ముహర్రం నెలలో జరిగే బిదఆతులు, నెల్లూరు రొట్టెల పండుగ, సఫర్ నెలలో జరిగే బిదఆతులు, ఆఖరి చహర్షుబా, శకునాలు, రజబ్ నెల బిదఆతులు, రజబ్ కె కుండే, మేరాజ్ నబీ పండుగ, షాబాన్ నెల బిదఆతులు, వసీలాలోని బిదఆతులు, ఉరుసుల ఆచారాలు, తావీజులు, చేతబడులు, జాదూ, ఇంద్రజాలం, జ్యోతిష్యం, వాలెంటైన్స్ డే పండుగ మొదలైన ఇస్లాం ధర్మంలో లేని బిదఆతులు అంటే నూతన కల్పితాల గురించి ఈ పుస్తకంలో రచయిత సవివరంగా ప్రామాణిక ఆధారాలతో చర్చించినారు.