ఇది రబ్వహ్ జాలియాత్ లోని అద్దావహ్ సబ్జెక్టు యొక్క పాఠ్య పుస్తకం. దీనిలో అల్లాహ్ యొక్క ధర్మం వైపు ప్రజలను ఎందుకు పిలవాలి మరియు ఎలా పిలవాలి అనే అంశాలకు సంబంధించిన అనేక విషయాలు వివరంగా చర్చించబడినాయి.
ఖుర్ఆన్ రచయిత ఎవరు అనే అతి ముఖ్యమైన విషయాన్ని ఈ పుస్తకం ప్రామాణిక ఆధారాలతో, చాలా చక్కగా చర్చించినది. నిష్పక్షపాతంగా దీనిలోని విషయాలను గురించి లోతుగా ఆలోచిస్తే, అసలు సత్యాన్ని గ్రహించటం తేలికవుతుంది. దాని ద్వారా ఇరపరలోక సాఫల్యాల మార్గాన్ని కనుగొంటారు. ఇన్షా అల్లాహ్.
ఏకదైవత్వం గురించి, ఏక దైవారాధన గురించి సామాన్యంగా ప్రజలకు వచ్చే అనేక సందేహాలకు ఈ పుస్తకంలో వివరంగా జవాబు ఇవ్వబడింది. బహుదైవారాధన, అల్లాహ్ కు భాగస్వామ్యం కలిగించటం ఎంత ఘోరమైన పాపమో, దానికి గల కారణాలేమిటో కూడా ఇక్కడ చర్చించబడినాయి. దీని ద్వారా మనకు జ్ఞానోదయం కలిగి, సరైన మార్గంలో మిగిలిన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేక శ్రద్ధతో దీనిని చదవండి.
ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ఆధారంగా ఈ పుస్తకంలో ప్రళయ ఘడియ చిహ్నాల గురించి చక్కగా వివరించబడింది. రచయిత జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ గారు చాలా కష్టపడి, అనేక ప్రామాణిక ఆధారాలతో ఈ విషయాలను మన ముందుకు తీసుకు వచ్చారు. సమయం మించి పోక ముందే ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల్ని సరిదిద్దుకోవటానికి ఉపయోగపడే ఒక మంచి పుస్తకం.
ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనల ఆధారంగా ఈ పుస్తకంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు విధానం గురించి చక్కగా వివరించబడింది. రచయిత జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ గారు చాలా కష్టపడి, అనేక ప్రామాణిక ఆధారాలతో ఈ విషయాలను మన ముందుకు తీసుకు వచ్చారు. దీనిని చదివి ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల్ని సరిదిద్దుకోవటానికి ఉపయోగపడే ఒక మంచి పుస్తకం.
ఖుర్ఆన్ లోని వేర్వేరు విషయాల ననుసరించి, ఖుర్ఆన్ వచనాల భావపు అర్థాన్ని సంకలనం చేయటం జరిగినది. గౌరవనీయులైన అబుల్ ఇర్ఫాన్ గారు చాలా కష్టపడి దీనిని పాఠకులకు అందించినారు. అల్లాహ్ వారి ఈ కృషిని స్వీకరించుగాక. దాదాపు 38 విషయాలకు సంబంధించిన వచనాలను ఆయన ఇక్కడ వరుస క్రమంలో ఒకచోటికి చేర్చినారు – అల్లాహ్ గురించి, తౌహీద్ గురించి, గ్రంథప్రజల విశ్వాసం గురించి, ప్రాపంచిక ఆకర్షణల గురించి, అత్యాధునిక దివ్యగ్రంథమైన ఖుర్ఆన్ గురించి, అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి, ఆదిమానవుడి నుండి అంతిమ మానవుడి వరకు ప్రతి ఒక్కరూ అనుసరించవలసిన ఇస్లాం ధర్మం గురించి, పరలోక జీవితం గురించి మరియు మరణం తర్వాత సంభవించబోయే విషయాల గురించి ఈ గ్రంథంలో ఖుర్ఆన్ సందేశాలను ఒకచోటికి చేర్చినారు.
దేవుడు ఒక్కడే, ఇస్లాం, ఏకదైవారాధన గొప్పతనం, ఆరాధన, లాయిలాహ ఇల్లల్లాహ్, సజ్దా (సాష్టాంగం) కేవలం అల్లాహ్ కొరకే సమ్మతం, సహాయం కొరకు అల్లాహ్ నే అర్థించాలి, అగోచర జ్ఞానం, జిన్నాతులకు అగోచర జ్ఞానం లేదు, దైవదూతలకు అగోచర జ్ఞానం లేదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు అగోచర జ్ఞానం ఉండేది కాదు, మరణం ప్రతి ఒక్కరికీ ఉంది, అల్లాహ్ ఒక్కడే సర్వశక్తిమంతుడు, అల్లాహ్ పై నమ్మకం, అల్లాహ్ యే సర్వాధికారి అనటానికి సాక్ష్యం, బహుదైవారాధన,