అసలు ప్రవక్తత్వం అంటే ఏమిటి అనే విషయాన్ని ఈ కరపత్రం చరిస్తున్నది. ప్రవక్తలందరూ అందజేసిన దివ్యసందేశం ఒక్కటే - కేవలం అల్లాహ్ మాత్రమే సకల ఆరాధనలకు అర్హుడు. తమ ప్రవక్తత్వాన్ని నిరూపించుకోవడానికి అల్లాహ్ ఆజ్ఞతో ప్రవక్తలందరూ కొన్ని మహిమలు చేసి చూపారు.
ఇస్లాం ధర్మం నాస్తికత్వం గురించి చాలా వివరంగా ప్రామాణిక ఆధారాలతో ఇక్కడ చర్చించబడింది. ఇంకా ఇందులో “మనం ఈ ప్రపంచంలో ఎందుకు కష్టనష్టాలకు గురవుతున్నాము, బాధలు పడుతున్నాము, ఈ ప్రపంచంలో అల్లాహ్ ఎందుకు ప్రజలను శిక్షిస్తాడు, స్వయంగా ఆయన మన ఎదురుగా ఎందుకు రాడు, ఆయన ఎందుకు మనల్ని పరీక్షిస్తున్నాడు” మొదలైన ప్రశ్నలకు జవాబు ఇవ్వవలసినదిగా నాస్తికులకు సవాలు చేయబడుతున్నది. మనం అల్లాహ్ ను ఎందుకు విశ్వసించాలో హేతుబద్దంగా సమాధానం ఇవ్వబడింది.
షాబాన్ నెల సగభాగం గడిచిన పోయిన తర్వాత ఉపవాసం పాటించ వచ్చునా? ఎందుకంటే షాబాన్ నెల సగభాగం తర్వాత ఉపవాసం ఉండటాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించారని విన్నాను.
హిజాబ్ అనేది అల్లాహ్ కు చూపే విధేయతకు చిహ్నం, హిజాబ్ సిగ్గు, లజ్జ, సచ్ఛీలతలకు చిహ్నం, హిజాబ్ చెడు నుండి కాపాడే రక్షణ కవచం, హిజాబ్ హుందాతనం, హిజాబ్ గౌరవం మరియు హిజాబ్ ఆత్మవిశ్వాసం - మొదలైన ముఖ్యాంశాలను ఈ కరపత్రం చర్చిస్తున్నది.
ఇస్లాం ధర్మం గురించి పరిచయం చేస్తున్న ఒక సంక్షిప్త కరపత్రం ఇది. ఇస్లాం ధర్మ ఐదు మూలసిద్ధాంతాలు, ఇస్లాం ధర్మంలోని ఆరాధనలు మరియు వాటి అసలు ఉద్దేశం, ఇస్లాం ధర్మ విశ్వాసం యొక్క ఆరు మూలసిద్ధాంతాలు మొదలైన వాటిపై దృష్టి సారిస్తున్నది. చాలా సులభరీతిలో, చక్కటి పదాలలో పై విషయాలన్నీ దీనిలో ప్రస్తావించబడినాయి.
ఈ ప్రాపంచిక జీవితం ఎంత చిన్నదో మరియు తీర్పుదినం ఎంత దగ్గరలో ఉందో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు వివిరంగా బోధించారు. ఆయన అంతిమ దినం గురించి అనేక చిహ్నాలను సూచించారు. వాటిలో కొన్ని జరిగిపోయినాయి. మరికొన్ని జరుగుతున్నాయి. మిగిలినవి భవిష్యత్తులో జరగ బోతున్నాయి. ఆ అంతిమ దినం కొరకు కష్టపడి తయారు కావాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు మరియు మనకు జ్ఞాపకం చేసియున్నారు.
ఈ వ్యాసం షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ రచించిన హజ్, ఉమ్రహ్ మరియు జియారహ్ అనే పుస్తకం నుండి తీసుకోబడింది. ఈ సంక్షిప్త మరియు సింపుల్ పుస్తకంలో రచయిత, హజ్ మరియు ఉమ్రహ్ యొక్క ఆరాధనా ఆచరణలన్నీ చాలా స్పష్టంగా వివరించారు.