ఇస్లాం పరిచయం

అంశాల సంఖ్య: 17

  • ఇస్లాం ధర్మ సహాబాల వృత్తాంతాల కార్యక్రమం (ఖిస్సత్ ఇస్లామ్ సహాబీ) - సౌదీ అరేబియాలోని అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ రేడియో సీరియల్ గా ప్రసారం చేయబడిన సహాబాల (రదియల్లాహు అన్హుమ్) వృత్తాంతాలన్నింటినీ ఒకచోట చేర్చి, ఈ ప్రోగ్రాం తయారు చేసినారు. దీనిని డాక్టర్ హసన్ హబషీ (అల్లాహ్ ఆయనపై అనుగ్రహం చూపుగాక) తయారు చేసినారు.

  • ఇస్లామీయ షరిఅతు అమలు చేయడం ద్వారానే శాంతి భద్రతలు స్థాపించబడతాయి. ఇస్లామీయ షరిఅతు సృష్టిపై అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం. ఎవరైతే దీనిని విశ్వసిస్తారో వారు అల్లాహ్ యొక్క ధర్మంపై ఉన్నట్లే. అలాంటి అల్లాహ్ యొక్క దాసులు శాంతి భద్రతలలో, సుఖశాంతులలో ఉంటారు. మరి ఎవరైతే తమ ఇష్టానుసారం జీవిస్తారో, తమ సంపద మరియు తమ కోరికల ఆధారంగా జీవిస్తారో, వారు ఒక్కసారి తమ జీవితం గురించి ఆలోచించుకోవాలి, సత్యాన్వేషణ చేయాలి.

  • ఇస్లాం యొక్క అనుగ్రహాలు - షేక్ సయీద్ బిన్ వహాఫ్ అల్ గహతానీ చేసిన ఈ ప్రసంగం రియాద్ లోని పెద్ద జామియా మస్జిదులో రికార్డు చేయబడింది. మానవజాతిపై సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క అనుగ్రహాలలో అతి గొప్ప అనుగ్రహాలు ఇస్లాం ధర్మంలో ఉన్నాయని ఆయన తెలిపినారు. దీనికి మనం ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో ఆయన తెెలిపినారు.

  • రియాద్ లోని ప్రధాన జామియా మస్జిదులో అల్ షేఖ్ ఇచ్చిన ప్రసంగం. దీనిలో ఆయన ఇస్లాం ధర్మంలోని కొన్ని శుభాల గురించి వివరించారు మరియు ఇస్లాం ధర్మంలోని అద్భుతాలను పరిచయం చేసారు. తర్వాత ఆయన ప్రజల ప్రశ్నలకు జవాబిచ్చారు.

  • మానవహక్కుల రేఖలు - ఇస్లామీయ రాజ్యాలలో మానవ హక్కుల గురించి ఈ వ్యాసం స్పష్టం చేస్తున్నది. ఇస్లామీయ అఖీదహ్ మరియు షరిఅతుల ఛాయలో ప్రతి ఒక్కరికి వారి వారి అసలు హక్కు ఇవ్వబడుతున్నది. ఇక్కడి చట్టం ప్రజలందరికీ సమ్మతమైన, నిస్పక్షపాతమైన ధార్మిక ఆదేశాలపై ఆధారపడి ఉన్నది.

  • video-shot

    ఆండ్రాయిడ్ మరియు ఐఫోనుల కోసం ఉచిత ఆప్స్. ముస్లిమేతరులకు ఇస్లాం గురించి అనేక భాషలలో పరిచయం చేసే ఒక మంచి ఆప్స్ ఇది. ముస్లిమేతరులు ఇస్లాం ఉత్తమ బోధనల గురించి సరిగ్గా అర్థం చేసుకోవటానికి ఉపయోగపడే ఇస్లాం ధర్మం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఇతర ముఖ్యమైన అనేక అంశాలను వివరించే అనేక విషయాలు ఉన్నాయి. ఇస్లాం వైపు ఆహ్వానించదలచిన తమ ముస్లిమేతర పరిచయస్థులకు వారి భాషలోనే, సముచితమైన ఇస్లామీయ అంశాలు మరియు విషయాలను ఎంచుకొని తేలిగ్గా పంపవచ్చు. దీనిని ఇస్లాంహౌస్ ఎంతో కష్టపడి తయారుచేసింది.

  • ఇస్లాం ధర్మంలో స్వేచ్ఛ, స్వాతంత్ర్యం - షేఖ్ సఊద్ అష్షరీమ్ హఫిజహుల్లాహ్ మక్కాలోని మస్జిద్ అల్ హరామ్ లో 2-11-1432హి శుక్రవారం నాడు ఇచ్చిన ఖుత్బహ్ ప్రసంగంలో ఇస్లాం ధర్మంలో స్వేచ్ఛ మరియు స్వాతంత్ర్యం యొక్క అవగాహన గురించి చక్కగా వివరించారు. స్వేచ్ఛ మరియు స్వాతంత్ర్యం అనే పదాల అసలు అవగాహన ఏమిటి, ఎలా ప్రజలు దానిని దుర్వినియోగం చేస్తున్నారు, స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు సరైన హద్దులలో ఉండక పోతే ఎంత నష్టమో అనే ముఖ్యాంశాన్ని ఇస్లాం ధర్మం ఎలా స్పష్టం చేస్తున్నదో వివరించారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపుతూ సరైన పద్ధతిలో స్వేచ్ఛా, స్వాతంత్ర్ల్యాలను ఎలా వ్యక్తిగతంగా మరియు సామాజికంగా ఉపయోగించుకోవచ్చో చర్చించారు.

  • ఇస్లాం నిర్వచనం వివరణ - ఈ వ్యాసంలో క్లుప్తంగా ఇస్లాం నిర్వచనం మరియు దాని మూలసిద్ధాంతాల వివరణ ఉన్నది.

  • ముస్లిం రక్తం చిందించడం నిషిద్ధం - షేక్ సాలెహ్ బిన్ ముహమ్మద్ ఆలే తాలిబ్ హఫిజహుల్లాహ్. 17-2-1432హి శుక్రవారం మక్కాలోని మస్జిద్ అల్ హరామ్ లో చేసిన ఖుత్బహ్ ప్రసంగంలో ముస్లింల రక్తం చిందించడం నిషిద్ధమని ఉపదేశించారు. ఆత్మహత్యల ద్వారా ముస్లింల మరియు అమాయకులైన ముస్లిమేతరుల ప్రాణాలు తీయడం, వారి రక్తం చిందించడం ఇస్లాం ధర్మంలో నిషిద్ధం అని ఆయన బోధించారు. పరలోకంలో తీర్పుదినాన అలాంటి ఆత్మహత్యలకు పడబోయే తీవ్రమైన కఠినశిక్షల గురించి ప్రస్తావించి, ముస్లిం యువకులు అలాంటి తప్పులకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

  • అమాయకుల రక్తం చిందించడం నిషిద్ధం - షేఖ్ సలాహ్ అల్ బుదీర్ హఫిజహుల్లాహ్. మస్జిద్ నబవీలో 3-2-143హి నాడు ఇచ్చిన ఖుత్బహ్ ప్రసంగం. ఇస్లామీయ షరిఅతులో రక్తం మరియు దాని ఉన్నత స్థానం - అది ముస్లిందైనా లేక ముస్లిమేతర అమాయకులదైనా. ముస్లింతో ఒడంబడిక చేసుకున్న ముస్లిమేతరుల రక్తం చిందించడం ఇస్లాంలో నిషిద్ధం. ఈజిప్టు దేశంలోని అలేగ్జాండ్రియా పట్టణంలోని ఒక చర్చీలో జరిగిన సంఘటన వైపు ఆయన తన ఉపన్యాసంలో సంజ్ఞ చేసినారు. అలాంటి సంఘటన అల్లాహ్ యొక్క ధర్మానికి మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీథులకు వ్యతిరేకమైందని తీవ్రంగా ఖండించారు.

  • ఈ ఉపన్యాసంలో షేఖ్ సాలెహ్ అల్ ఫౌజాన్ ఇస్లాం ధర్మంలోని గొప్ప అనుగ్రహాల గురించి ముస్లింలకు జ్ఞాపకం చేసినారు.

  • క్లుప్తంగా ఇదియే ఇస్లాం - అద్భుతమైన ఇస్లాం ధర్మం యొక్క సాక్ష్యప్రకటన, దాని మూలసిద్ధాంతాలు, దాని మూలస్థంభాలు, దాని శుభాలు, దాని అసలు ఉద్దేశ్యం మొదలైన ముఖ్యాంశాలన్ని ఇక్కడ ఉన్నాయి. తద్వారా ఎవరైతే ఇస్లాం ధర్మం గురించి తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నారో లేదా ఇస్లాం ధర్మంలో ప్రవేశించాలని కోరుకుంటున్నారో అలాంటి వారి కొరకు ఇది చాలా ఉపయోగపడుతుంది.

  • సామాజిక హక్కులు: ఇప్పటికే పాశ్చాత్య దేశాలలోని ఇస్లామీయ సమాజ నివేదికల ద్వారా ఇస్లాం ధర్మంలోని సామాజిక హక్కులు మరియు వాటి గౌరవనీయ స్థానం గురించి అందరికీ అర్థం అవుతున్నది. వాటికి తగిన స్థానం ఇవ్వకపోతే సామాజిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది మరియు తీవ్రపరిణామాలు ఎదురవుతాయి.

  • ఇస్లాం ధర్మం యొక్క ఖ్యాతి పెంచడంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా ఆసక్తి కనబరచేవారు. ఇస్లాం ధర్మానికి కించపరచే లేదా నష్టం కలిగించే పలుకులకు మరియు పనులకు చాలా దూరంగా ఉండేవారు. ఆయన జీవిత చరిత్రలో ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది. దీనిని వివరించే కొన్ని ఉదాహరణలు ఈ వ్యాసంలో ఇవ్వబడినాయి. ఈ వ్యాసం అష్షర్కల్ వసత్ లో 3/3/1429హి నాడు (నెం.10696) ప్రచురించబడింది.

  • ఇస్లాం లోని ఆణిముత్యాలు

  • ఆరంభంలో రచయిత ఇలా పేర్కొన్నాడు, ”ప్రజలను అల్లాహ్ యొక్క ధర్మం వైపు ఆహ్వానించాలనే ఉద్దేశ్యంతో నేను ఈ పుస్తకాన్ని వ్రాసాను... ఈ విశ్వప్రపంచం ఎలా సృష్టించబడింది, మానవుడు ఎలా సృష్టించబడినాడు, అతడి మార్గదర్శకత్వం కోసం అల్లాహ్ తన ప్రవక్తలను పంపబడం ద్వారా అతడిపై ఎలా గొప్ప అనుగ్రహం చూపినాడు మరియు పూర్వ ధర్మాల పరిస్థితి ఏమిటి మొదలైన విషయాలను నేను ఇక్కడ క్లుప్తంగా వివరించాను. తర్వాత ఇస్లాం ధర్మాన్ని దాని అర్థం మరియు మూలసిద్ధాంతాల ఆధారంగా పరిచయం చేసాను. కాబట్టి ఎవరైనా సత్యాన్వేషణ చేయాలనుకుంటే, వారికి ఇక్కడ సరైన నిదర్శనాలతో సన్మార్గం లభిస్తుంది. ఎవరైతే మోక్షం, ముక్తి కొరకు అన్వేషిస్తున్నారో, వారికి అసలైన మోక్షమార్గం ఇక్కడ లభిస్తుంది. ఎవరైతే దైవప్రవక్తల, దైవసందేశహరుల మరియు సజ్జనుల మార్గాన్ని అనుసరించాలనుకుంటున్నారో, అలాంటి వారి కొరకు ఆ సన్మార్గం ఇక్కడ వివరించబడింది. ఎవరైతే ఆ మహాపురుషుల మార్గాన్ని వదిలి పెట్టారో, అలాంటి వారు మూర్ఖులు తప్ప మరేమీ కాదు. అసలు అలాంటి వారే మార్గభ్రష్టులు. వాస్తవానికి ప్రతి ధర్మం, మతం, సిద్ధాంతం ప్రజలను తమ వైపుకే పిలుస్తున్నది. తమ వద్దే సత్యం ఉందని వాదిస్తుంది. అయితే ఇస్లాం ధర్మం స్వీకరించిన వేల, లక్షల మంది నిరూపిస్తున్నదేమిటంటే, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించేటంత వరకు తమకు సత్యం అంటే ఏమిటో తెలియదనే వాస్తవాన్ని ఏకకంఠంతో స్వచ్ఛందంగా గొంతెత్తి చాటుతున్నారు మరియు ఇస్లాం ఛాయలో తప్ప తామెక్కడా మనశ్శాంతి, సంతోషం పొందలేదని సత్యం పలుకుతున్నారు. ప్రతి మానవుడు మనశ్శాంతి, సుఖసంతోషాల కోసం అన్వేషిస్తూ ఉంటాడనేది ఒక నగ్నసత్యం. అలాంటి వారి కోసమే నేనీ పుస్తకాన్ని తయారు చేసాను. నా యొక్క ఈ కృషి కేవలం అల్లాహ్ కోసం చేసిన కృషిగా మాత్రమే స్వీకరించబడాలని, ఇహపరలోకాలలో మంచి ప్రతిఫలం ప్రసాదించే పుణ్యకార్యంగా పరిగణించబడాలని నేను అల్లాహ్ వద్ద ప్రార్థిస్తున్నాను.”

ఫీడ్ బ్యాక్