• అరబిక్

  PDF

  మానవహక్కుల రేఖలు - ఇస్లామీయ రాజ్యాలలో మానవ హక్కుల గురించి ఈ వ్యాసం స్పష్టం చేస్తున్నది. ఇస్లామీయ అఖీదహ్ మరియు షరిఅతుల ఛాయలో ప్రతి ఒక్కరికి వారి వారి అసలు హక్కు ఇవ్వబడుతున్నది. ఇక్కడి చట్టం ప్రజలందరికీ సమ్మతమైన, నిస్పక్షపాతమైన ధార్మిక ఆదేశాలపై ఆధారపడి ఉన్నది.

 • అరబిక్

  PDF

  ఇస్లాం ధర్మంలో స్వేచ్ఛ, స్వాతంత్ర్యం - షేఖ్ సఊద్ అష్షరీమ్ హఫిజహుల్లాహ్ మక్కాలోని మస్జిద్ అల్ హరామ్ లో 2-11-1432హి శుక్రవారం నాడు ఇచ్చిన ఖుత్బహ్ ప్రసంగంలో ఇస్లాం ధర్మంలో స్వేచ్ఛ మరియు స్వాతంత్ర్యం యొక్క అవగాహన గురించి చక్కగా వివరించారు. స్వేచ్ఛ మరియు స్వాతంత్ర్యం అనే పదాల అసలు అవగాహన ఏమిటి, ఎలా ప్రజలు దానిని దుర్వినియోగం చేస్తున్నారు, స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు సరైన హద్దులలో ఉండక పోతే ఎంత నష్టమో అనే ముఖ్యాంశాన్ని ఇస్లాం ధర్మం ఎలా స్పష్టం చేస్తున్నదో వివరించారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపుతూ సరైన పద్ధతిలో స్వేచ్ఛా, స్వాతంత్ర్ల్యాలను ఎలా వ్యక్తిగతంగా మరియు సామాజికంగా ఉపయోగించుకోవచ్చో చర్చించారు.

 • అరబిక్

  PDF

  ఇస్లాం నిర్వచనం వివరణ - ఈ వ్యాసంలో క్లుప్తంగా ఇస్లాం నిర్వచనం మరియు దాని మూలసిద్ధాంతాల వివరణ ఉన్నది.

 • అరబిక్

  PDF

  అల్లాహ్ యొక్క ఏకదైవత్వ ఛాయలో శాంతిభద్రతలు - గౌరవనీయులైన షేఖ్ సాలెహ్ బిన్ ముహమ్మద్ ఆలే తాలిబ్ హఫిజహుల్లాహ్ మక్కాలోని మస్జిదె హరామ్ లో 20-4-1432హి శుక్రవారం నాడు ఇచ్చిన ఖుత్బహ్ ప్రసంగం ఇది. రెండు అత్యంత పవిత్ర మస్జిదులు కలిగి ఉన్న సౌదీ అరేబియాపై అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం - ఇక్కడి శాంతి భద్రతలని ఆయన ప్రస్తావించారు. దీనిని ఇలాగే కొనసాగించాలని, దీనిని భంగం చేసి దేశాన్ని అశాంతి, అలజడులకు గురి చేసే అవకాశం శత్రువులకు ఇవ్వవద్దని ఆయన ప్రజలను అర్థించారు. ముస్లింలు అల్లాహ్ యొక్క అంతిమ గ్రంథమైన ఖుర్ఆన్ మరియు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతులను, ఇస్లామీయ పండితుల మరియు ఇస్లామీయ జ్ఞానాన్ని సంపాదించే మార్గంలో నివశిస్తున్న సజ్జనుల మార్గదర్శకత్వాన్ని మాత్రమే అనుసరించాలని సలహా ఇస్తూ, దానిలో మనందరి శ్రేయస్సు మరియు సాఫల్యం ఉందని తెలిపినారు.

 • అరబిక్

  PDF

  ముస్లిం రక్తం చిందించడం నిషిద్ధం - షేక్ సాలెహ్ బిన్ ముహమ్మద్ ఆలే తాలిబ్ హఫిజహుల్లాహ్. 17-2-1432హి శుక్రవారం మక్కాలోని మస్జిద్ అల్ హరామ్ లో చేసిన ఖుత్బహ్ ప్రసంగంలో ముస్లింల రక్తం చిందించడం నిషిద్ధమని ఉపదేశించారు. ఆత్మహత్యల ద్వారా ముస్లింల మరియు అమాయకులైన ముస్లిమేతరుల ప్రాణాలు తీయడం, వారి రక్తం చిందించడం ఇస్లాం ధర్మంలో నిషిద్ధం అని ఆయన బోధించారు. పరలోకంలో తీర్పుదినాన అలాంటి ఆత్మహత్యలకు పడబోయే తీవ్రమైన కఠినశిక్షల గురించి ప్రస్తావించి, ముస్లిం యువకులు అలాంటి తప్పులకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

 • అరబిక్

  PDF

  అమాయకుల రక్తం చిందించడం నిషిద్ధం - షేఖ్ సలాహ్ అల్ బుదీర్ హఫిజహుల్లాహ్. మస్జిద్ నబవీలో 3-2-143హి నాడు ఇచ్చిన ఖుత్బహ్ ప్రసంగం. ఇస్లామీయ షరిఅతులో రక్తం మరియు దాని ఉన్నత స్థానం - అది ముస్లిందైనా లేక ముస్లిమేతర అమాయకులదైనా. ముస్లింతో ఒడంబడిక చేసుకున్న ముస్లిమేతరుల రక్తం చిందించడం ఇస్లాంలో నిషిద్ధం. ఈజిప్టు దేశంలోని అలేగ్జాండ్రియా పట్టణంలోని ఒక చర్చీలో జరిగిన సంఘటన వైపు ఆయన తన ఉపన్యాసంలో సంజ్ఞ చేసినారు. అలాంటి సంఘటన అల్లాహ్ యొక్క ధర్మానికి మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీథులకు వ్యతిరేకమైందని తీవ్రంగా ఖండించారు.

 • అరబిక్

  PDF

  ఉత్తమ దైవవిశ్వాసం (ఈమాన్) - సహనం మరియు ఓర్పు. "ఏ ఈమాన్ ఉత్తమమైనది? అనే ప్రశ్నకు ఆయన సహనం మరియు ఓర్పు" అని సమాధానమిచ్చిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీథు నుండి ఈ మాటలు తీసుకోబడినాయి.

 • అరబిక్

  PDF

  ఈ ఉపన్యాసంలో షేఖ్ సాలెహ్ అల్ ఫౌజాన్ ఇస్లాం ధర్మంలోని గొప్ప అనుగ్రహాల గురించి ముస్లింలకు జ్ఞాపకం చేసినారు.

 • అరబిక్

  PDF

  క్లుప్తంగా ఇదియే ఇస్లాం - అద్భుతమైన ఇస్లాం ధర్మం యొక్క సాక్ష్యప్రకటన, దాని మూలసిద్ధాంతాలు, దాని మూలస్థంభాలు, దాని శుభాలు, దాని అసలు ఉద్దేశ్యం మొదలైన ముఖ్యాంశాలన్ని ఇక్కడ ఉన్నాయి. తద్వారా ఎవరైతే ఇస్లాం ధర్మం గురించి తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నారో లేదా ఇస్లాం ధర్మంలో ప్రవేశించాలని కోరుకుంటున్నారో అలాంటి వారి కొరకు ఇది చాలా ఉపయోగపడుతుంది.

 • అరబిక్

  ఇస్లాం ధర్మం యొక్క ఖ్యాతి పెంచడంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా ఆసక్తి కనబరచేవారు. ఇస్లాం ధర్మానికి కించపరచే లేదా నష్టం కలిగించే పలుకులకు మరియు పనులకు చాలా దూరంగా ఉండేవారు. ఆయన జీవిత చరిత్రలో ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది. దీనిని వివరించే కొన్ని ఉదాహరణలు ఈ వ్యాసంలో ఇవ్వబడినాయి. ఈ వ్యాసం అష్షర్కల్ వసత్ లో 3/3/1429హి నాడు (నెం.10696) ప్రచురించబడింది.

ఫీడ్ బ్యాక్