• MP3

  ఈ కార్యక్రమం / అకాడమీ యొక్క అసలు ఉద్దేశ్యాలు, లక్ష్యాలు : ఇంగ్లీషు భాష మాట్లాడే ప్రజల్ని ముస్లిమేతరులకు ఇస్లాం ధర్మాన్ని పరిచయం చేయడం మరియు ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం ధర్మ శాంతి సందేశాన్ని ప్రచారం చేయడం వైపు ప్రోత్సహించడం. ప్రధాన ఉద్దేశ్యాలు - సాంస్కృతిక పరిమితులకు అతీతంగా ఇంగ్లీషు భాషలో సంభాషించే సామర్ధ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం, ఇస్లామీయ పదాల సముచిత జ్ఞానం మరియు వాడుక, వివిధ సంస్కృతులకు చెందిన ప్రజలతో ఇస్లామీయ భావనలు, సిద్ధాంతాల గురించి ఇంగ్లీషులో చర్చించడం, వారు కోరిన అంశాలపై సంక్షిప్తమైన ఇస్లామీయ ప్రజెంటేషన్లు ఇవ్వడం, ఇస్లాం ధర్మ ప్రచారంలో ఇంగ్లీషు భాషను ఉపయోగించే నైపుణ్యతను అభివృద్ధి చేసుకోవడం.

 • MP3

  ఇస్లాం ధర్మంలోని సౌందర్యాన్ని చక్కగా వివరించే గొప్ప ఆడియో. దీనిని డాక్టర్ నాజీ ఇబ్రాహీం అర్ఫాజ్ తయారు చేసారు. అందరికీ నచ్చే ఒక మంచి ఆడియో ప్రోగ్రాం ఇది.

 • MP3

  అనేక కోణాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి వివరించే ఒక గొప్ప ఆడియో ఇది. ఆయన యొక్క కొన్ని బోధనలను ప్రస్తావించారు మరియు ఆయన జీవిత ఘటనలపై ఒకసారి దృష్టి సారించారు. అంతేగాక, ప్రపంచ ధార్మిక గ్రంథాలు ఆయన గురించి ఏమి పలికాయో పేర్కొన్నారు. ఇంకా, ఆయన గురించి సైన్సు పరంగా వివిధ కోణాలలో కొందరు ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రజ్ఞుల పలికిన అద్భుత విషయాలు మరియు పొగడ్తలు, ఆయన యొక్క అత్యుత్తమ గుణగణాలు మరియు సమగ్ర చట్టం గురించి ప్రస్తావించారు.

 • MP3

  ఈ రికార్డింగ్ లో జ్ఞానం అర్జించడంలోని అనేక శుభాల గురించి ప్రస్తావించబడింది - వ్యక్తిగత కర్తవ్యం, జ్ఞానార్జనలో లభించే పుణ్యాలు, ధార్మిక జ్ఞానం సంపాదించే సరైన మార్గం, విద్యార్థుల నైతికత, తన ధర్మం గురించి ప్రతి ముస్లిం తెలుసుకోవలసిన అతి ముఖ్య విషయాలు.

 • MP3

  ఈ ఉపన్యాసంలో ఇహపరలోకాలలో వడ్డీల వలన కలిగే ఘోర ప్రమాదాల గురించి షేఖ్ ఉమర్ సులైమాన్ చర్చించారు. అంతేగాక దాని నుండి ఎలా బయటపడవచ్చో తెలిపారు.

 • MP3

  ఎవరైనా సంతోషాన్ని ఎలా పొందగలరు మరియు అత్యంత ముఖ్యమైన ఇస్లామీయ జీవిత విధానం ప్రకారం సంతోషంలో ఏ యే అంశాలు కలిసి ఉన్నాయి. ఇస్లామీయ దృక్పథం తప్పకుండా నిజమైన సంతోష జీవితం వైపు తీసుకు వెళుతుంది.

 • MP3

  ఖుర్ఆన్ అవతరించినపుడు అరబ్బులు నిరక్షరాస్యులుగా ఉన్నప్పటికీ, చాలా శ్రద్ధతో నిండిన మనస్సులతో దానిని వారు అందుకున్నారు. దానిని కంఠస్థం చేయటానికి ముందు, వారు దానిని తమ జీవితాలలో మరియు నడవడిలో అమలు పరిచారు. ఇది మహోన్నతుడైన అల్లాహ్ యొక్క "ఇఖ్రా అంటే పఠించు" అనే ఆదేశానికి వారి ప్రతిస్పందన.

 • MP3

  ఇస్లామీయ పదాల ఆడియో డిక్షనరీ ఇంగ్లీషు పదాల అనువాదం అరబీ భాషలో. దీని తయారు చేసిన వారు డాక్టర్ అబ్దుల్లాహ్ అబూ అషీ అల్ మలికీ మరియు డాక్టర్ అబ్దుల్ లతీఫ్ అల్ షేఖ్ ఇబ్రాహీమ్. ధార్మిక పదాల ఒక సమగ్రమైన నిఘంటువు, పదపట్టిక, ధార్మిక పదాలు మరియు పరిభాషలతో కూడిన పదపట్టికలు.

 • MP3

  అల్లాహ్ వద్దకు చేర్చే సన్మార్గం కనుగొన్న ప్రతి నవముస్లిం కొరకు ఇది ఒక గొప్ప కానుక. వారి విశ్వాసాన్ని మరింత బలర్చుకోవడానికి మరియు భద్రంగా కాపాడుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆడియోలలో ముస్లింగా మారటం వలన లభించే ప్రతిఫలం, ఇస్లాం ధర్మం యొక్క ఉత్తమమైన విశేషతలు మరియు ఇస్లాం ధర్మంలోని ముఖ్యమైన విషయాన్నింటినీ షేఖ్ ఫహద్ సాలెమ్ బహమ్మమ్ ఇక్కడ చర్చించారు. ఒకరి దైవవిశ్వాసం ఆధారంగా చేసుకోవలసిన అర్కాన్ అల్ ఈమాన్ అంటే దైవ విశ్వాసపు మూలసిద్ధాంతాలు మరియు అవయవాల ఉత్తమమైన ఆచరణలు (ఆరాధనలు) మరియు హృదయాల ఉత్తమమైన ఆచరణలు (తౌహీద్ అనే ఏకదైవత్వ సిద్ధాంతం) కలిగి ఉన్న అర్కాన్ అల్ ఇస్లాం అంటే ఇస్లాం మూల సిద్ధాంతాలను ఆయన చక్కగా వివరించారు. ఇస్లాం ధర్మం ఒక సామాజిక ధర్మం అయినందున, చిన్నా లేక పెద్ద, ముస్లిం లేక ముస్లిమేతరులు మొదలైన సమాజంలోని ప్రతి ఒక్కరితో ఒక ముస్లిం ఎలా ప్రవర్తించాలి, షేఖ్ ఫహద్ వివరించారు. తర్వాత ఆయన అనుమతించబడిన మరియు నిషేధించబడిన కొన్ని ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించారు. అలాగే ఒకరి ఈమాన్ అంటే దైవవిశ్వాసాన్ని పెంచే మరియు అల్లాహ్ ఆజ్ఞలను పాటించడంలో సహాయపడే అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. అల్లాహ్ మార్గంలో అడ్డుపడే (కామం, అత్యాశ, దురాశ, అపోహలు మరియు అజ్ఞానం వంటి) కొన్ని ఆటంకాలను కూడా ఆయన పేర్కొన్నారు. అంతేగాక ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఒక వ్యక్తి తన సృష్టికర్త వద్ద మనస్పూర్తిగా పశ్చాత్తాప పడేందుకు అవసరమైన వాటిని చూపారు. చివరిగా, నవముస్లిం కొరకు ఆయన మంచి సందేశాన్ని ఇచ్చారు.

 • MP3

  సున్నీలు మరియు షియాల గురించి వివరిస్తున్న మంచి వ్యాసం. కొందరు అమాయుకులు షియాలదే అసలైన ఇస్లాం మరియు వారే అసలు ముస్లింలనే భ్రమకు గురికాకుండా, షియాల మార్గభ్రష్టత్వాన్ని స్పష్టంగా బట్టబయలు చేస్తున్నది. అదే సమయంలో, ఇది సాధారణ షియాలలో సత్యాన్వేషణ ఆసక్తిని పెంచి, ఆలోచింపజేసి, ఇస్లాం ధర్మంలో ప్రవేశించేలా చేస్తుంది.

 • పెద్ద ప్రశ్నలు ఇంగ్లీష్

  MP3

  డాక్టర్ లారెన్స్ బ్రౌన్ మానవుల మెదడులో మెలిగే కొన్ని పెద్ద ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు - నన్ను ఎవరు పుట్టించారు, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, నేనొక మంచి వ్యక్తిగా జీవిస్తే సరిపోతుందా, మనం కోరుకున్న విధంగా దేవుడిని ఎందుకు ఆరాధించకూడదు ...

 • MP3

  "Where Hearts and Souls Meet" అంటే ఎక్కడైతే హృదయాలు మరియు ఆత్మలు కలుసుకుంటాయో అనే ఈ వ్యాసాన్ని ఘదా ఖపాగై రచించగా, ఇక్కడ చక్కని స్వరంలో చదవబడింది. ముస్లింలు ఒకే దిక్కుకు తిరిగి ఎందుకు నమాజు చేస్తారు అనే ప్రశ్నకు ఇక్కడ సమాధానం ఇవ్వబడింది. ఏమిటా మక్కాలోని క్యూబిక్ అంటే ఘనాకృతిలోని నల్లటి కట్టడం ? ముస్లింల కొరకు మక్కా ఎందుకు అంత పవిత్రమైంది ?

 • MP3

  సాక్ష్యప్రకటన, ఎలా నమాజు చేయాలి, ఎలా సంతోషంగా ఉండాలి, మహిళల గురించి కొన్ని విషయాలు మరియు జీసస్ అలైహిస్సలాం యొక్క దైవత్వ అంశం మొదలైన ఇస్లాం గురించిన అనేక అంశాలను కొందరు పండితులు ఇచ్చిన ఈ ఉపన్యాసాలు చర్చిస్తున్నాయి.

 • MP3

  "When Life Begins" అంటే జీవితం ప్రారంభమైనపుడు అనే నవల యొక్క కంఠస్వర రూపం. జబ్ జిందగీ షురూ హోగీ అనే ప్రసిద్ధ ఉర్దూ నవల యొక్క ఇంగ్లీషు అనువాదం ఇది. దీనిని అబూ యహ్యా తయారు చేసినారు. ఇది ప్రపంచం మరియు మరణానంతర జీవితం యొక్క సమగ్ర రేఖాచిత్రాన్ని ఆసక్తికరమైన నవల రూపంలో మన ముందు పెడుతున్నది.

 • MP3

  మానవజాతి కొరకు రోల్ మోడల్ గా మరియు అత్యుత్తమ నాయకుడిగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రదర్శించిన గొప్ప గుణగణాలు. ఎందుకంటే ఆయన ప్రపంచంపై వేసినంత ప్రభావశీలమైన గంభీర ముద్ర ఇంకెవ్వరూ వేయలేక పోయారు. ఈనాటికీ ఆయనను అనుసరించే ప్రజలు ప్రపంచంలో 1.8 బిలియన్ల కంటే ఎక్కువగా ఉన్నారు.

 • MP3

  అల్ జుమహ్ పత్రిక సంపుటి 24, 3వ ప్రచురణలోని వ్యాసాల ఆడియో రికార్డింగు.

 • MP3

  అల్ జుమహ్ పత్రిక సంపుటి 24, 11వ ప్రచురణ వ్యాసాల ఆడియో రికార్డింగు

 • MP3

  ఎలా క్రైస్తవులు జీసస్ అలైహిస్సలాం ను దేవుడిగా మార్చినారో వివరించే రచన యొక్క ఆడియో రికార్డింగు.

 • MP3

  తన హజ్ సమయంలో ముహమ్మద్ అల్ షరీష్ రచించిన "Hajj - The Journey of Hearts" హజ్ యాత్ర - హృదయాల యాత్ర అనే వ్యాసం యొక్క ఆడియో రికార్డింగు. క్లిష్టసమయాలలో కూడా అల్లాహ్ నుండి ప్రతిఫలం ఆశిస్తూ సహనం, ఓర్పు చూపే హజ్ యాత్రికులను ఆయన చూసారు. అది చూసి నన్ను నేను ఇలా ప్రశ్నించుకున్నాను - "వీరికీ మరియు పరస్పరం విమర్శలు మరియు వాదోపవాదాలలో మునిగి ఉండే ప్రజలకూ మధ్య ఉన్న తేడా ఏమిటి ?" చివరిగా నాకు అర్థం అయింది ఏమిటంటే నేను చూస్తున్నది జైద్ లేదా అమర్ యొక్క శరీరాలు కాదు, కానీ నేను చూస్తున్నది జైద్ మరియు అమర్ యొక్క మంచి హృదయాలు, మనస్సులు.

 • MP3

  "Beyond Mere Christianity" అంటే క్రైస్తవానికి ఆవల అనే రచన యొక్క ఆడియో రికార్డింగు. ఒకవేళ దీనిని చదివే పాఠకుడు క్రైస్తవుడు అయినట్లయితే, దయచేసి ఇది వారిని కించపరచటానికి తయారు చేయలేదని, కేవలం ప్రవక్త జీసస్ అలైహిస్సలాం పై ఉన్న ప్రగాఢ ప్రేమను పంచుకోవటంలో భాగంగా దీనిని అర్థం చేసుకోవాలని మనవి.

పేజీ : 3 - నుండి : 1
ఫీడ్ బ్యాక్