ముస్లిమేతరుల కొన్ని ప్రశ్నలు

వివరణ

ఇస్లాం గురించి తెలుసు కోవాలనుకుంటున్న ముస్లిమేతరుల కోసం ఇది చాలా మంచి పుస్తకం. దీనిలో ముస్లిమేతరులు తరుచుగా అడిగే ప్రశ్నలను డాక్టర్ జాకిర్ నాయక్ గారు ఒక చోట సంకలనం చేసినారు.

Download
వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి

పూర్తి వివరణ

 ముస్లిమేతరుల కొన్ని ప్రశ్నలు

సంకలనం

డా. జాకిర్ నాయక్

అనువాదం

ముహమ్మద్ కరీముల్లాహ్                              దివ్యఖుర్ఆన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్, హైదరాబాద్.

Common Questions asked about Islam

Writer :                Dr Zakir Naik

                             President IRF, Mumbai, India.

Translator:          Muhammed Kareemullah

                             Divya Quran Educational 

                               Foundation, Hyderabad, India

Copy rights:         No copy rights to print for

                               dawah purpose, can print and   

                               distribute free of cost.

Source:  www.irf.net  www.islamhouse.com

 ఇస్లాం గురించి హిందువుల కొన్ని ప్రశ్నలు

1.    వేదాలు మరియు ఇతర హిందూ మత గ్రంథాలు విగ్రహారాధనను నిషేధించాయని హిందూ ధర్మ పండితులు అంగీకరిస్తున్నారు. కానీ ఆరంభంలో మనస్సు పరిపక్వం చెందక పోవటం వలన ఆరాధనలో ఏకాగ్రత కోసం ఏదైనా విగ్రహం అవసరమవుతుందనీ, ఆధ్యాత్మికతలో మనస్సు ఉన్నత చైతన్య స్థాయికి చేరుకున్న తరువాత, ఆరాధనలో ఏకాగ్రత కోసం విగ్రహం అవసరం ఉండదనీ కొందరు హిందువులు అంటారు. దీని గురించి మీరేమంటారు ?

జవాబు: నిష్పక్షపాతంగా ఈ ప్రశ్నను గమనిస్తే దైవారాధనలో చూపవలసిన ఏకాగ్రత విషయంలో మామూలు ముస్లిం కూడా ఉన్నత స్థాయికి చేరుకున్నాడని అర్థం అవుతున్నది.  

దైవారాధనలో చూపే ఏకాగ్రత విషయంలో ముస్లింలు ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఒకవేళ ఆరంభంలో మాత్రమే దైవారాధనలో ఏకాగ్రత కోసం విగ్రహం కావలసి వచ్చి, తర్వాత దశలలో మనస్సు ఉన్నత స్థాయికి చేరుకున్నపుడు విగ్రహం యొక్క అవసరం లేకపోతున్నట్లయితే, ఇప్పటికే ముస్లింలు దైవారాధనలో మనస్సును కేంద్రీకరించడంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారని నేను చెబుతున్నాను. ఎందుకంటే వారు అల్లాహ్ ను ఆరాధించేటప్పుడు దైవారాధనలో ఏకాగ్రత కోసం ఎలాంటి విగ్రహం లేదా ప్రతిమ యొక్క అవసరం వారికి కలగడం లేదు.

ఆకాశంలో నుండి ఎందుకు ఉరుముల శభ్దం వస్తుందని ఒక చిన్నపిల్లవాడు అడిగినప్పుడు అతడికి ఏమని జవాబివ్వాలి?

ఒకసారి మా సంస్థలో నేను ఒక స్వామీజీతో చర్చిస్తుండగా, ఆయన ఇలా అన్నారు. ఎప్పుడైతే ఒక చిన్న పిల్లవాడు మనల్ని "ఆకాశం ఎందుకు ఉరుముతుంది?" అని అడిగినప్పపుడు, అతడికి మేమిలా జవాబిస్తాము "స్వర్గంలో తాతమ్మ పిండి రుబ్బుతున్నది"; ఎందుకంటే అసలు విషయం చెప్పినా అతడు అర్థం చేసుకోలేడు. అలాగే ఆరంభ దశలలో, దైవారాధనలలో ఏకాగ్రత కోసం ప్రజలకు విగ్రహాల, ప్రతిమల అవసరం కలుగుతుంది.

ఇస్లాం ధర్మంలో మేము అబద్ధం చెప్పడానికి అనుమతి లేదు. అది ఎంత చిన్నదైనా సరే. నా బిడ్డకు నేనెప్పుడూ అలాంటి తప్పుడు జవాబు ఇవ్వను. ఎందుకంటే పెరిగి పెద్దవాడై స్కూలు వెళ్ళడం మొదలు పెట్టిన తర్వాత, మెరుపుల తర్వాత ఆకాశంలో వినబడే ఉరుములకు కారణం అతి శీఘ్రంగా వేడెక్కిన వాయువుల వ్యాకోచం అని చదివినప్పుడు, అతడు టీచరు అబద్ధం చెబుతున్నాడని భావిస్తాడు. మరి కొన్నాళ్ళకు అసలు విషయం తెలిసిన తర్వాత తండ్రి తనతో అబద్ధం చెప్పాడని గ్రహిస్తాడు. ఒకవేళ పిల్లవాడు అర్థం చేసుకోలేడని మీరు భావిస్తే, విషయాలను వీలయినంత సులభం చేసి అతడికి చెప్పడానికి ప్రయత్నించాలి. అంతేగానీ విషయాన్ని దాటవేయడానికి అతడితో అబద్ధపు కథ చెప్పడం సరైన పద్ధతి కాదు. ఒకవేళ స్వయంగా మీకు దాని జవాబు తెలియకపోతే, అతడితో ‘నాకు తెలియదు’ అని చెప్పే ధైర్యం మీకు ఉండాలి. కానీ ఈ జవాబుతో నేటి చాలా మంది పిల్లలు సంతృప్తి చెందరు. ఒకవేళ ఇదే జవాబును నేను నా కుమారుడికి ఇస్తే, అతడు "అబ్బా (నాన్నా), నీకెందుకు తెలియదు?’ అని ఎదురు ప్రశ్నిస్తాడు. ఇది మంచిగా మీ హోమ్ వర్క్ చేయటం మరియు మీ పిల్లవానితో పాటు మీరు కూడా బాగా చదవుకోవటం తప్పనిసరి చేస్తున్నది.

1వ తరగతిలో ఉన్న విద్యార్థుల కొరకు దైవారాధనలో ఏకాగ్రత కోసం విగ్రహం, ప్రతిమ అవసరం కలుగుతున్నది – (2+2=4 అనేది 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు మాత్రమే కాకుండా ఆ తర్వాత కూడా మారకుండా ఒకేలా ఎందుకు ఉంటున్నది)

విగ్రహారాధన గురించి నన్ను ఒప్పించే ప్రయత్నంలో కొందరు హిందూ పండితులు ఇలా అన్నారు. 1వ తరగతిలో ఒక విద్యార్థికి ప్రాథమికంగా దైవారాధనలో ఏకాగ్రత ఎలా వృద్ధి చేసుకోవాలి అనే విషయాన్ని బోధించేటప్పుడు, అతడికి విగ్రహం సహాయంతో ఏకాగ్రత వృద్ధి చేసుకోవాలని బోధించడం జరుగుతుంది. కానీ, ఆ తర్వాత అతడు డిగ్రీ స్థాయికి చేరుకున్నాక, అతడికి దైవారాధనలో ఏకాగ్రత కోసం విగ్రహం, ప్రతిమ అవసరం ఉండదు.

గుర్తించదగిన ఒక అత్యంత ముఖ్యమైన వాస్తవం ఏమిటంటే, ఏదైనా విషయం యొక్క మౌలికాంశాలపై గట్టి పట్టు ఉంటే, భవిష్యత్తులో అతడు దానిలో అందరి కుంటే ముందు నిలబడగలడు. ఉదాహరణకు, 1వ తరగతికి మ్యాథమెటిక్స్ బోధించే ఒక టీచరు తన విద్యార్థులకు 2+2=4 అని బోధిస్తాడు. విద్యార్థి పరీక్ష పాసవుతాడా, డిగ్రీలో చేరతాడా, మ్యాథమెటిక్స్ లో పి.హెచ్.డి చేస్తాడా అనే దానితో సంబంధం లేకుండా, 2+2=4 అనే ప్రాథమిక కూడికలో ఎలాంటి మార్పూ రాదు. అది ఎక్కడా 5 లేక 6గా మారదు. పైతరగతులలో విద్యార్థులు కూడికలతో పాటు అల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, లాగరిథమ్ మొదలైన వాటిని కూడా నేర్చుకుంటారు. అయినా 2+2=4 అనే ప్రాథమిక కూడికలో ఎలాంటి మార్పూ రాదు. ఒకవేళ 1వ తరగతిలోని టీచర్ ప్రాథమిక అంశాలను తప్పుగా బోధిస్తే, ఆ విద్యార్థులు భవిష్యత్తులో ముందుకు దూసుకు పోతారని మనమెలా ఊహించగలం?

వేదాలలోని దైవభావన గురించిన ప్రాథమిక నియమం ఏమిటంటే దైవానికి రూపం లేదు. మరి, ఈ వాస్తవం తెలిసిన తర్వాత కూడా ప్రజలు దారి తప్పడాన్ని చూస్తూ పండితులు ఎలా నిశ్శబ్దంగా ఉండగలుగు తున్నారు.

1వ తరగతిలో ఉన్న మీ కుమారుడికి రెండు రెళ్ళు 4 కాదు, రెండు రెళ్ళు 5 లేక 6 అని చెప్పి, స్కూలు పాసైన తర్వాత రెండు రెళ్ళు 4 అనే నిజం చెప్పగలరా? ముమ్మాటికీ చెప్పలేరు. వాస్తవానికి ఒకవేళ తప్పు చేస్తున్నట్లయితే అతడిని సరిదిద్ది, రెండు రెళ్ళు 4 అని చెబుతారే గానీ అతడు స్కూలు పాసయ్యే వరకు నిరీక్షించరు; ఒకవేళ చిన్నప్పుడే అలా సరిదిద్దక పోతే, మీరు చేతులారా అతడి భవిష్యత్తు నాశనం చేసినవారవుతారు.

2.    వేర్వేరు భాషలలో వేర్వేరు పేర్లతో నీరు పిలవబడు తున్నది: ఇంగ్లీషులో వాటర్, హిందీలో పానీ, తమిళంలో తన్నీ. అలాగే దైవాన్ని అల్లాహ్ అని పిలిచినా, రామ్ అని పిలిచినా లేక జీసస్ అని పిలిచినా ఒకే దైవాన్ని పిలిచినట్లు కాదా?

జవాబు: మహోన్నత దివ్యనామాలు అల్లాహ్ కే చెందుతాయి.

17వ అధ్యాయం, 110వ వచనంలో ఖుర్ఆన్ ఇలా తెలుపుతున్నది:

"ప్రకటించు: ‘అల్లాహ్ అని పిలవండి లేదా రహ్మాన్ అని పిలవండి: ఆయనను మీరే పేరుతో పిలిచినా, మహోన్నత దివ్యనామాలన్నీ ఆయనకే చెందుతాయి.’" [దివ్యఖుర్ఆన్ 17:110]

అల్లాహ్ ను మీరు ఏ పేరుతోనైనా పిలవ వచ్చు. కానీ, అది అత్యంత సుందరమైన పేరు అయి ఉండాలి, మనస్సులో రూపాన్ని గుర్తుకు తెచ్చేలా ఉండకూడదు మరియు కేవలం అల్లాహ్ మాత్రమే కలిగి ఉండే దివ్యలక్షణాలు కలిగి ఉండాలి.

వేర్వేరు భాషలలో నీటిని వేర్వేరు పేర్లతో పిలవవచ్చు. అయితే, నీరు కాని దానిని ‘నీరు’ అని ఏ భాషలోనూ పిలవ లేము కదా!

మీరు నీటిని వేర్వేరు భాషలలో వేర్వేరు పేర్లతో పిలవ వచ్చు. ఉదాహరణకు ఇంగ్లీషులో వాటర్, హిందీలో పానీ, తమిళంలో తన్నీ, అరబీలో మా, సంస్కృతంలో అపహ్, శుద్ధ హిందీలో జల్, గుజరాతీలో జల్ లేదా పానీ, మరాఠీలో పాండీ, కన్నడంలో నీర్, తెలుగులో నీరు, మలయాళంలో వెల్లం మొదలైనవి. ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు నీరు త్రాగమని ఒక స్నేహితుడు తనకు సలహా ఇచ్చాడనీ, అయితే తను అలా త్రాగలేక పోతున్నాననీ, ఎందుకంటే అలా త్రాగగానే వాంతి వచ్చినట్లు ఉంటుందనీ ఒక వ్యక్తి నాతో చెప్పాడని అనుకుందాము. విచారించగా ఆ నీటిలో కంపు వాసన ఉందనీ, దాని రంగు పసుపు రంగులో ఉందనీ తెలియ వచ్చింది. అతడు ‘నీరు’ అని చెబుతున్నది వాస్తవానికి ‘మూత్రం’ అని నేను గ్రహించాను. కాబట్టి మీరు నీటిని వేర్వేరు భాషలలో వేర్వేరు పేర్లతో పిలవ వచ్చు. అయితే నీరు కాని దానిని నీరు అని పిలవ లేరు. ఈ ఉపమానం యదార్థానికి దగ్గరగా లేదని ప్రజలు భావించవచ్చు. నేను వారితో ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఏమీ తెలియని వ్యక్తి కూడా నీటిని మరియు మూత్రాన్ని తేలిగ్గా గుర్తు పట్టగలడు. మూత్రాన్ని ‘నీరు’ అని పిలవటానికి అతడు ఒక మూర్ఖుడై ఉండాలి. అలాగే ఎవరైనా వ్యక్తి సరైన దైవభావన అంటే దైవం అంటే ఎవరో, ఏమిటో ఖచ్ఛితంగా తెలిసి ఉన్నప్పుడు, ఇతరులు అసత్య దైవాలను పూజించడం చూస్తే, సహజంగానే అతడు ‘ఒక నిజమైన దైవానికి మరియు అసత్య దైవాలకూ మధ్య ఉండే భేదాన్ని’ వారెలా గుర్తించలేక పోతున్నారని ఆశ్చర్యపోతాడు.

వేర్వేరు భాషలలో వేర్వేరు పేర్లతో పిలవడం ద్వారా బంగారం యొక్క నాణ్యత ధృవీకరించబడదు. బంగారం నాణ్యత గుర్తించడానికి దానిని గీటురాయితో రుద్దవలసి ఉంటుంది.

అలాగే, బంగారాన్ని హిందీలో సోనా, ఇంగ్లీషులో గోల్డ్, అరబీలో దహబ అని పిలుస్తారు. బంగారానికి ఉన్న ఈ వివిధ పేర్లు తెలిసి ఉన్నా గానీ, ఒకవేళ ఎవరైనా వ్యక్తి తన వద్ద బంగారం 24 క్యారట్ల బంగారమని చెబుతూ మీకు అమ్మజూపితే, గోల్డ్ స్మిత్ వద్దకు వెళ్ళి దానిని పరీక్షించకుండానే మీరు అతడిని గ్రుడ్డిగా నమ్మరు. తన వద్దనున్న గీటురాయితో ఆ గోల్డ్ స్మిత్ అది అసలు బంగారమేనా కాదా అనేది నిర్ధారిస్తాడు. పసిడి రంగులో మెరిసి పోయే నగలన్నీ బంగారు నగలు కాజాలవు.

దైవత్వ సిద్ధాంతం యొక్క గీటురాయి - సూరతుల్ ఇఖ్లాస్. అలాగే, ఎవరైనా లేదా ఏదైనా దేవుడు అని దావా చేస్తున్నట్లయితే, దానిలోని సత్యాసత్యాలను దైవత్వ సిద్ధాంత గీటురాయితో పరీక్షించకుండా ఆ దావాను అంగీకరించకూడదు. దైవత్వ సిద్ధాంతపు గీటురాయి అంటే దైవం గురించిన స్వచ్ఛమైన నిర్వచనం దివ్యఖుర్ఆన్ లోని 112వ అధ్యాయంలో  ఇలా ఉన్నది:

"ప్రకటించు, ‘ఆయనే అల్లాహ్, ఏకైకుడు మరియు అద్వితీయుడు; స్వయం సమృద్ధుడు; ఆయన ఎవరికీ పుట్టలేదు మరియు ఆయనకు ఎవ్వరూ పుట్టలేదు; మరియు ఆయనను పోలినదేదీ లేదు.’’ [ఖుర్ఆన్ 112:1-4]

ఎవరైనా లేదా ఏదైనా సరే పై యాసిడ్ టెస్ట్ పాసైతే, ఆయనను లేదా దానిని దైవం అని పిలవవచ్చు.

నేను దైవాన్ని అని దావా చేసే మరియు పై నాలుగు వచనాల నిర్వచనాన్ని పూర్తి చేసే దివ్యశక్తియే యాసిడ్ టెస్ట్ పాసవుతుంది, దైవంగా పిలవబడుతుంది మరియు దైవంగా ఆరాధింపబడుతుంది.

ఉదాహరణకు ఎవరో ఒక మతోన్మాది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను దేవుడని అన్నాడనుకుందాం (అల్లాహ్ క్షమించుగాక). అతడి మాటలలోని సత్యాసత్యాలను ధృవీకరించేందుకు పై సూరతుల్ ఇఖ్లాస్ యాసిడ్ టెస్ట్ తో వాస్తవాన్ని పరీక్షించుదాం.

a)    "ఖుల్ హు అల్లాహు అహద్" - ప్రకటించు, ఆయనే అల్లాహ్, ఏకైకుడు - అద్వితీయుడు;

మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏకైకుడు మరియు అద్వితీయుడా? కాదు. కేవలం ఆయన ఒక్కడే ప్రవక్త మరియు సందేశహరుడు కాదు. ఆయనకు పూర్వం అనేక మంది ప్రవక్తలు మరియు సందేశహరులు వచ్చారు.

b)    "అల్లాహు సమద్" - అల్లాహ్ నిరుపేక్షాపరుడు, స్వయం సమృద్ధుడు;

మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేక కష్టాలను ఎదుర్కొన్నారనే విషయం మనకు తెలుసు. అల్లాహ్ పంపిన ఒక మహాశక్తివంతుడైన ప్రవక్త మరియు సందేశహరుడు అయినప్పటికీ, తన 63వ సంవత్సరంలో ఆయన చనిపోయారు మరియు మదీనాలో ఖననం చేయబడినారు.

c)    "లమ్ యలిద్ వ లమ్ యూలద్"– ఆయన ఎవరికీ పుట్టలేదు మరియు ఆయనకెవరూ పుట్టలేదు;

మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలోని అబ్దుల్లాహ్ మరియు ఆమినా దంపతులకు జన్మించిన విషయం మనందరికీ తెలుసు. ఆయనకు అనేకమంది పిల్లలు కలిగారు కూడా. ఉదా ఫాతిమహ్, ఇబ్రాహీమ్ ... రదియల్లాహు అన్హుమ్.

d)   "వ లమ్ యకుల్లహు కుఫువన్ అహద్" - మరియు ఆయనను పోలినదేదీ లేదు.

మరి ముస్లింలందరూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ఎంతో ప్రేమిస్తారు, గౌరవిస్తారు మరియు ఆయన ప్రతి ఆదేశాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తారు. అయినా, ఒక్క ముస్లిం కూడా ఆయన దేవుడిని పోలి ఉన్నారని పలకడు.

ఇస్లామీయ మూలసిద్ధాంతం - "లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ అర్రసూలుల్లాహ్" అంటే అల్లాహ్ తప్ప ఆరాధింపబడే అర్హత గలవారెవ్వరూ లేరు మరియు ముహమ్మద్ ఆయన యొక్క సందేశహరుడు. ఈ వచనం ప్రతిరోజు ఐదుసార్లు అదాన్ పలుకులలో అంటే నమాజు కొరకు పిలిచే పిలుపులో గొంతెత్తి ప్రకటించబడు తున్నది. తద్వారా ముస్లింలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఎంత గౌరవిస్తున్నా మరియు విధేయత చూపుతున్నా, ఆయన అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు దాసుడు మాత్రమే గానీ స్వయంగా దేవుడు కాదని వారికి ప్రతిరోజూ జ్ఞాపకం చేయబడుతున్నది.

ఇక ఇప్పుడు మీరు ఆరాధిస్తున్న దేవుళ్ళను కూడా సూరతుల్ ఇఖ్లాస్ అనే ఆ స్వచ్ఛమైన దైవభావన గీటురాయితో ఒకసారి పరీక్షించండి. “దైవభావన గీటురాయి”ని ఎంత నిష్పక్షపాతంగా ఉపయోగించాలో పైన వివరించాము. ఆరాధిస్తున్న దేవుళ్ళు సత్యమైన దేవుళ్ళేనా - కాదా అనే అసలు నిజాన్ని వెనువెంటనే కనుక్కోవసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. (ఎందుకంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోలేము కదా! అంతిమ శ్వాస కంటే ముందే మనం అసలు ప్రభువు ఎవరో కనుక్కోవాలి. ఇతర అసత్య దైవాలన్నింటినీ వదిలి పెట్టి, కేవలం ఆయనను మాత్రమే ఆరాధించాలి. అప్పుడే ఆయన మనకు స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. నరకాగ్ని నుండి కాపాడతాడు.)

3.    అన్ని ధర్మాలలో అత్యంత ప్రాచీన ధర్మం హిందూ ధర్మం. కాబట్టి, అది ప్రపంచంలోని అన్ని ధర్మాల కంటే అత్యంత స్వచ్ఛమైంది, ప్రామాణికమైంది మరియు ఉత్తమమైంది కాదా ?

జవాబు: ఇస్లాం ధర్మం ప్రపంచంలో అన్ని ధర్మాల కంటే అత్యంత ప్రాచీన ధర్మం. అన్ని ధర్మాల కంటే ప్రాచీన ధర్మం హిందూ ధర్మం కాదు. ప్రపంచంలోని మొట్టమొదటి ధర్మం మరియు అన్ని ధర్మాల కంటే అత్యంత ప్రాచీనమైన ధర్మం ఇస్లాం ధర్మం. ఇస్లాం ధర్మం 1400 సంవత్సరాల పాతది మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దానిని ప్రారంభించారనే అనే ఒక అపోహ ప్రజలలో ఉన్నది. అనంత కాలం నుండి ఇస్లాం ధర్మం ఉనికిలో ఉన్నది అంటే మానవుడు ఈ భూమిపై తన మొట్టమొదటి అడుగు పెట్టినప్పటి నుండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం ధర్మం యొక్క స్థాపకుడు కాదు. ఆయన అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త మరియు సందేశహరుడు. అంటే ఇస్లాం ధర్మం యొక్క చిట్టచివరి ప్రవక్త మరియు సందేశహరుడూను.

అత్యంత ప్రాచీన ధర్మమే అత్యంత స్వచ్ఛమైన మరియు అత్యంత ప్రామాణికమైన ధర్మం కానవసరం లేదు.

కేవలం అత్యంత ప్రాచీనమైన ధర్మం అనే ప్రాతిపదిక మీదే ఏ ధర్మమైనా అత్యంత స్వచ్ఛమైన మరియు ప్రామాణికమైన ధర్మమని దావా చేయజాలదు. ఒక పరిశుభ్రమైన గ్లాసులో అప్పుడే పరిశుద్ధం చేసిన చోటు నుండి సేకరించిన గ్లాసులోని నీళ్ళ కంటే తన ఇంట్లో పైనేమీ కప్పకుండా మూడు నెలల క్రితం ఉంచిన గ్లాసులోని నీళ్ళు స్వచ్ఛమైనవి అనడం ఎంత వరకు సబబుగా ఉంటుంది ?

అలాగే అత్యంత ఆధునిక ధర్మమే అత్యంత స్వచ్ఛమైన మరియు ప్రామాణికమైన ధర్మం కానవసరం లేదు.

మరోవైపు ఏ ధర్మమైనా తను అన్నింటి కంటే క్రొత్త ధర్మం మరియు ఈ మధ్యనే మొదలైన ధర్మం కావటం వలన ఇతర ధర్మాలన్నింటి కంటే తమదే చాలా స్వచ్ఛమైన మరియు ప్రామాణిక మైన ధర్మం అవుతుందని దావా చేయలేదు. మూడు నెలల క్రితం మంచిగా సీలు వేయబడి, ప్యాక్ చేయబడి జాగ్రత్తగా ఫ్రిజ్ లో ఉంచబడిన స్వేదనజలం (డిస్టిల్ వాటర్) కంటే అప్పుడే సముద్రంలో నుండి పట్టిన నీరు అత్యంత స్వచ్ఛమైందని చెప్పడం ఎంత వరకు సబబు ?

ఏ ధర్మమైనా స్వచ్ఛమైనది మరియు ప్రామాణికమైనది అనడానికి, ఆ ధర్మంలో ఎలాంటి నూతన కల్పితాలు, మార్పులు, చేర్పులు, తొలగింపులు ఉండరాదు. అంతేగాక ఆ ధర్మం ప్రేరణ మరియు దిశ యొక్క మూలాధారం సర్వలోక సృష్టికర్త మాత్రమే అయి ఉండాలి. ఈ భూమండలంపై కేవలం ఖుర్ఆన్ మాత్రమే తను అవతరించినప్పటి అసలైన మరియు స్వచ్ఛమైన రూపంలో కొన సాగుతున్నది. ఇతర ధర్మాల దివ్యగ్రంథాలన్నీ నూతన కల్పితాలు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు గురి కాకుండా కాపాడుకోలేక పోయాయి. అవతరించిన నాటి నుండి ఎన్నో లక్షల మంది ఖుర్ఆన్ గ్రంథాన్ని కంఠస్థం చేసి, తమ మెదడులో జాగ్రత్తగా భద్రపరిచినారు. నేటి ఆధునిక ప్రపంచంలో కూడా ఖుర్ఆన్ గ్రంథాన్ని పూర్తిగా కంఠస్థం చేసిన మిలియన్ల కొద్దీ ప్రజలు మన మధ్యన ఉన్నారు. అంతేగాక, అసలు ఖుర్ఆన్ నుండి ఖలీఫా ఉథ్మాన్ రదియల్లాహు అన్హు దాదాపు 14 శతాబ్దాల క్రితం తయారు చేయించిన ఖుర్ఆన్ కాపీలలో రెండు ఈనాటికి కూడా తాష్కెంట్ మ్యూజియంలోనూ మరియు టర్కీలోని కొప్టకీ మ్యూజియమ్ (Koptaki museum) లోనూ భద్రంగా ఉన్నాయి. వాటిలోనూ మరియు ఈనాడు మన ముందున్న ఖుర్ఆన్ లోనూ ఒక్క అక్షరం మార్పు కూడా లేదు.

15వ అధ్యాయమైన సూరహ్ అల్ హిజ్ర్, 9వ వచనంలో అల్లాహ్ ఇలా వాగ్దానం చేసినాడు :

"నిస్సందేహంగా మేము దివ్యసందేశాన్ని పంపాము; మరియు మేము తప్పకుండా దానిని కాపాడతాము (మార్చబడకుండా)."

అత్యంత ప్రాచీన ధర్మమే అత్యంత ఉత్తమమైన ధర్మం కానవసరం లేదు.

ఏ ధర్మమైనా అది అత్యంత ప్రాచీనమైన ధర్మమైనంత మాత్రాన అదే అత్యంత ఉత్తమమైన ధర్మమని దావా చేయజాలదు. అది ఎలా ఉంటుందంటే, కేవలం పాతది కావటం వలన 19వ శతాబ్దపు పాత కారు ఈమధ్యనే తయారైన టొయోటా కారు కంటే అత్యంత ఉత్తమ మైందని చెప్పడం లాంటిదన్నమాట. వృత్తాకారంలో త్రిప్పటం ద్వారా స్టార్ట్ అయ్యే రాడ్ గల 19వ శతాబ్దపు పాత కారుని, కేవలం పాతది కావటం వలన అది కీ తో స్టార్ట్ అయ్యే ఈనాటి ఆధునిక టొయోటా కారు కంటే ఉత్తమమైందని చెప్పడం ఎంత మూర్ఖత్వమో చూడండి.

అత్యంత అధునాతన ధర్మమే అత్యంత ఉత్తమమైన ధర్మం కానవసరం లేదు.

మరోవైపు ఏ ధర్మమైన కేవలం అత్యంత అధునాతనమైనది కావటం వలన మరియు ఇతర ధర్మాలన్నింటి కంటే చివరిలో రావడం వలన మాత్రమే అది అత్యుత్తమమైన ధర్మం అని దావా చేయజాలదు. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడే తయారైన 800CC సుజుకీ కారు, పదేళ్ళకు పూర్వం తయారైన మెర్సిడస్ 5000CC 500SEL కారు కంటే ఉత్తమమైనది దావా చేయడం వంటి దన్నమాట. ఏ కారు ఉత్తమమైనదో నిర్ణయించేందుకు ఆ కార్ల స్పెసిఫికేషన్లను పరిశీలించవలసి ఉంటుంది. ఉదాహరణకు కారు యొక్క హార్స్ పవర్, భద్రత, సిలీండర్ల కెపాసిటీ, పికప్, స్పీడ్, సౌలభ్యం మొదలైనవి. పదేళ్ళ క్రితం తయారైన 500SEL మెర్సిడెస్ 5000CC కారు ఈ మధ్యనే తయారైన సుజుకీ 800CC కారు కంటే ఎన్నో రెట్లు ఉత్తమమైంది కదా!  

మానవజాతి ఎదుర్కొనే సమస్యలకు సరైన పరిష్కారం చూపే ధర్మమే అత్యుత్తమమైన ధర్మం.

ఏ ధర్మమైనా అత్యుత్తమమైన ధర్మంగా పరిగణించబడాలంటే, అది మానవజాతికి ఎదురయ్యే సమస్యలన్నింటికీ సరైన పరిష్కారం కలిగి ఉండాలి. సత్యమైన మరియు స్వచ్ఛమైన ధర్మమై ఉండాలి. ఆది నుండి అంతం వరకు, అన్ని కాలాలకూ వర్తించాలి. ఇతర ధర్మాలతో పోల్చితే, కేవలం ఇస్లాం ధర్మంలో మాత్రమే మానవజాతి ఎదుర్కొనే సమస్యలన్నింటికీ సరైన పరిష్కారం ఉందనేది తేలిగ్గా కనిపెట్ట వచ్చు. ఉదాహరణకు, మద్యపానం, పురుషుల సంఖ్యను అధిగమిస్తున్న స్త్రీ జనాభా, మానభంగాలు మరియు అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు, జాత్యహంకారం, కులాల పట్టింపులు మొదలైనవాటికి సరైన పరిష్కారం ఇస్లాం ధర్మం మాత్రమే.

ఇస్లాం ధర్మం ఒక సత్యధర్మము. దాని ధర్మాదేశాలు మరియు పరిష్కారాలు అన్ని కాలాలకు వర్తిస్తాయి. 14 శతాబ్దాలుగా, అవతరించిన నాటి నుండి ఎలాంటి మార్పులు చేర్పులకు లోను కాకుండా స్వచ్ఛంగా, పరిశుద్ధంగా, అల్లాహ్ యొక్క స్వచ్ఛమైన అంతిమ వాక్కుగా అంతిమదినం వరకు రాబోయే అన్ని కాలాల కొరకు ఈ భూమండలంపై మిగిలి ఉన్న ఏకైక దివ్యగ్రంథం ఖుర్ఆన్. ఉదాహరణకు, పూర్వకాలం సాహిత్యం మరియు కవితలతో నిండిన మహిమల కాలంగా గుర్తించబడింది. మరి ఈనాటి కాలం ఆధునిక సైన్సు మరియు టెక్నాలజీలతో నిండిన మహిమల కాలంగా గుర్తించబడింది. మరి, ఈ మోడరన్ కాలంలో కూడా ఖుర్ఆన్ తనకు సాటి లేదని సమస్త మానవాళిని సవాలు చేస్తున్నది. ఇస్లాం ధర్మం మానవ నిర్మిత ధర్మం కాదు. కానీ అది సర్వలోక సృష్టికర్త మరియు ప్రభువు అయిన అల్లాహ్ మానవజాతి మార్గదర్శకత్వం కోసం అవతరింపజేసిన ధర్మం. ఆయన వద్ద కేవలం ఇస్లాం ధర్మం మాత్రమే సమ్మతించబడుతుంది.

4.    మృతదేహాలకు దహనసంస్కారాలు చేయకుండా ముస్లింలు ఎందుకు ఖననం చేస్తారు?

జవాబు:

·      మానవశరీరంలో ఉన్న మూలకాలు మట్టిలో కూడా ఉన్నాయి.

మానవశరీరంలో ఉన్న మూలకాలు కొద్దో గొప్పో మట్టిలో కూడా ఉన్నాయి. కాబట్టి, త్వరగా శిధిలమయ్యే మరియు మట్టిలో కలిసిపోయే గుణం వలన మృతదేహాన్ని మట్టిలో ఖననం చేయడమనేదే ఎక్కువ సైంటిఫిక్ గా ఉంటుంది.

·      వాతావరణ కాలుష్యం ఉండదు

మృతదేహాన్ని దహనం చేయడం వలన వాతావరణంలో కాలుష్యం పెరుగుతుంది. తత్ఫలితంగా ప్రజల ఆరోగ్యం చెడి పోయే మరియు వాతావరణానికి హాని కలిగే ప్రమాదం ఉంది. మరి, దీనికి భిన్నంగా మృతదేహాన్ని ఖననం చేయడం వలన అలాంటి ప్రమాదాలు లేవు.

·      చుట్టుప్రక్కల ప్రాంతంలోని పచ్చదనం నశించదు. 

ఒక మృతదేహాన్ని దహనం చేయడానికి, అనేక చెట్లు నరక వలసి ఉంటుంది. దాని వలన చుట్టుప్రక్కల పచ్చదనం నశించి, వాతావరణానికి మరియు పర్యావరణానికి హాని కలిగే ప్రమాదం ఉంది. మృతదేహాలను ఖననం చేయడం వలన, చెట్లు కాపాడ బడటమే కాకుండా, చుట్టుప్రక్కల ప్రాంతం సారవంతమవుతుంది. వాతావరణం మంచిగా తయారవుతుంది.

·      ఖర్చు

మృతదేహాన్ని దహనం చేసే ప్రక్రియ చాలా ఖర్చుతో కూడు కున్నది. ఎందుకంటే అందులో టన్నుల కొద్దీ కలప వాడవలసి ఉంటుంది. మృతదేహాలకు దహన సంస్కారం చేసే సాంప్రదాయం భారతదేశంలో ఉండటం వలన, ఆ ప్రక్రియలో ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు ఖర్చవు తున్నాయి. దీనికి భిన్నంగా మృతదేహాలను ఖననం చేయడంలో చాలా తక్కువ ఖర్చు అవుతుంది. కొన్ని చోట్లయితే అసలేమీ ఖర్చు కాదు.

·      కొన్నేళ్ళ తర్వాత మరో మృతదేహాన్ని అదే సమాధిలో ఖననం చేయవచ్చు.

ఒక మృతదేహాన్ని దహనం చేయడంతోనే అక్కడ వాడిన కలప పని పూర్తయిపోతుంది. మరో మృతదేహాన్ని దహనం చేసేందుకు పనికిరాదు. ఎందుకంటే కాలిన తర్వాత అది బూడిదగా మారిపోతుంది. దీనికి భిన్నంగా ఒక మృతదేహాన్ని ఖననం చేసిన సమాధిలోనే కొన్నేళ్ళ తర్వాత మరో మృతదేహాన్ని ఖననం చేయవచ్చు. ఎందుకంటే ఖననం చేయబడిన మృతదేహం కొంత కాలం తర్వాత మట్టిలో కలిసి పోతుంది.

5.    ఎందుకు ముస్లిం వివాహిత మహిళలు, హిందూ మహిళల వలే తమ నుదుటి మీద బొట్టు, తిలకం పెట్టుకోరు మరియు మంగళ సూత్రాన్ని ధరించరు ?

జవాబు:

బొట్టు :

‘బిందు’ అనే సంస్కృత పదం నుండి ‘బిందీ’ వచ్చింది, దీని అర్థం బొట్టు. సాధారణంగా ఇది కుంకుమ పౌడర్ నుండి తయారు చేయబడిన ఒక ఎర్రటి బొట్టు బిళ్ళ. హిందూ ధర్మానికి చెందిన మహిళలు దీనిని తమ రెండు కనుబొమ్మల మధ్య నుదుటి మీద పెట్టుకుంటారు. వారు దానిని పార్వతీ దేవి చిహ్నంగా పరిగణిస్తారు. మహిళలను మరియు వారి భర్తలను కాపాడే స్త్రీశక్తిని సూచిస్తుందని కొందరు హిందువుల నమ్మకం. సాంప్రదాయకంగా ఇది పెళ్ళి అయిందని సూచించే ఒక చిహ్నం. దీనిని హిందూ వివాహిత స్త్రీలు పెట్టుకుంటారు. దీనిని టిక్క అని కూడా పిలుస్తారు.

ఈరోజుల్లో ఆకర్షణీయమైన బొట్టు బిళ్ళలు పెట్టుకోవడం ఒక ఫ్యాషన్ గా మారి పోయింది మరియు పెళ్ళికాని కన్యలు మరియు స్త్రీలు కూడా దీనిని పెట్టుకుంటున్నారు. ఈనాటి బొట్టు వృత్తాకారానికే పరిమితం కాకుండా అండాకారం, నక్షతాకారం, గుండె ఆకారం మొదలైన వివిధ ఆకారాల్లో లభిస్తున్నది. అంతేకాక, అది నీలిరంగు, ఆకుపచ్చ రంగు, పసుపు రంగు, నారింజ రంగు మొదలైన వివిధ రంగుల్లో కూడా లభిస్తున్నది. అలాగే కేవలం కుంకమ పౌడర్ తో మాత్రమే తయారు చేసే పద్ధతికి స్వస్తి చెప్పి, ఈరోజుల్లో దీనిని రకరకాల పదార్థాలతో తయారు చేస్తున్నారు. ఇంకా ఇది రకరకాల డిజైన్లలో మరియు గాజు, తళతళలాడే ఇతర పదార్థాలతో తయారు అవుతున్నది.

మంగళసూత్రం :

హిందూ ధర్మంలో మంగళసూత్రం అంటే శుభాన్ని కలుగజేసే ఒక దారపు తాడు. ప్రత్యేకంగా దీనిని తమ పెళ్ళి అయిందని సూచించే చిహ్నంగా హిందూ ధర్మ స్త్రీలు మెడలో ధరిస్తారు. నల్లపూసలతో నిండిన రెండు దారపు తాళ్ళు కలిగి ఉండి మధ్యలో మామూలుగా ఒక బంగారం బిళ్ళ ఉంటుంది. చెడు నుండి కాపాడే రక్షణ కవచంగా నల్లపూసలు పనిచేస్తాయని వారి నమ్మకం. ఇంకా అవి ఆ స్త్రీ వివాహాన్ని మరియు ఆమె భర్త ప్రాణాన్ని కాపాడతాయని వారి నమ్మకం. దక్షిణ భారతదేశంలో, మంగళసూత్రాన్ని తాళి అని పిలుస్తారు. ఒక సన్నటి బంగారు ఛైను లేదా దారపు త్రాడుకు వ్రేలాడదీసిన ఒక చిన్న బంగారు నగ.

పెళ్ళైన హిందూ మహిళలు ఎట్టి పరిస్థితులలోనూ మంగళ సూత్రాన్ని తొలగించకూడదు. ఆమె విధవరాలు అయినప్పుడు మాత్రమే అది తొలగించ బడుతుంది.

·      కేవలం అల్లాహ్ మాత్రమే సంరక్షకుడు :

మానవజాతిని సర్వలోక ప్రభువైన అల్లాహ్ కంటే ఉత్తమంగా ఎవ్వరూ రక్షించలేరు. చెడు నుండి కాపాడు కునేందుకు ఎర్రటి బొట్టు లేక నల్లపూసల దారం మనకు అవసరం లేదు.

ఖుర్ఆన్ లోని 6వ అధ్యాయమైన సూరతుల్ అన్ఆమ్ లోని 14వ వచనంలో అల్లాహ్ యొక్క ప్రకటన ఇలా ఉంది : "ప్రకటించు: నా సంరక్షణ కొరకు భూమ్యాకాశాల సృష్టికర్త అయిన అల్లాహ్ ను కాకుండా మరొకరిని తీసుకోవాలా?" [ఖుర్ఆన్ 6:14]

ఇంకా ఖుర్ఆన్ లోని అనేక చోట్ల ఇదే విషయం తెలుపబడింది : "అల్లాహ్ యే నీ సంరక్షకుడు, మరియు ఆయన అత్యంత ఉత్తమంగా సహాయం చేస్తాడు." 3:150 మరియు 22:78

బొట్టు పెట్టుకోవడం లేదా మంగళసూత్రాన్ని ధరించడమనేది మనల్ని అత్యంత ఉత్తమంగా రక్షించే శక్తిగల ఆ సృష్టికర్త శక్తి సామర్ద్యాలను మనం నమ్మటం లేదని నిరూపిస్తుంది.  

·      ఇస్లామీయ వస్త్రధారణకు వ్యతిరేకం :

బొట్టు పెట్టుకోవడం లేదా మంగళసూత్రాన్ని ధరించడమనేది హిందువుల సాంప్రదాయం. ముస్లిమేతరులు ప్రత్యేకంగా ధరించే ఎలాంటి చిహ్నాలైనా, గుర్తులైనా, సంకేతాలైనా లేదా మచ్చలైనా ధరించేందుకు ఇస్లామీయ వస్త్రధారణ నియమాలు అనుమతించవు.

·      ఇస్లాం ధర్మంలో పెళ్ళైన స్త్రీలను మాత్రమే కాకుండా పెళ్ళికాని కన్యలను కూడా వేధించకూడదు.

ఒకసారి ఒక హిందూ స్నేహితుడు మంగళసూత్రం యొక్క లాభాల గురించి నాకు వివరిస్తూ, దాని ద్వారా పెళ్ళైన స్త్రీ సులభంగా గుర్తించబడుతుందని, తద్వారా పోకిరీగాళ్ళు ఆమెను వేధించకుండా మరియు ఆమెపై అత్యాచారం చేయకుండా వదిలి వేస్తారని పలికి నాడు. అయితే ఇస్లాం ధర్మంలో ఏ స్త్రీ అయినా సరే - పెళ్ళైనా లేదా పెళ్ళి కాకపోయినా, ముస్లిం స్త్రీ అయినా లేదా ముస్లిమేతర స్త్రీ అయినా సరే- అస్సలు వేధించబడకూడదు మరియు అత్యాచారానికి గురి కాకూడదు.

6.    నమాజు కొరకు పిలిచే అదాన్ పిలుపులో ముస్లింలు అక్బర్ చక్రవర్తి పేరు ఎందుకు పేర్కొంటారు?

జవాబు: అదాన్ పిలుపులో అక్బర్ చక్రవర్తి పేరు పేర్కొనబడు తుందని ముస్లిమేతరులు అపార్థం చేసుకున్నారు.

ఒకసారి నేను కేరళరాష్ట్రంలో ఒక కాన్ఫరెన్సులో హాజరయ్యాను. అక్కడ నా ప్రసంగం కంటే ముందు ఒక ముస్లిమేతర మినిష్టర్ గారు ప్రసంగించారు. భారత దేశంలో ముస్లింలు సాధించిన కార్యములు మరియు భారత ప్రగతిలో వారి పాత్ర గురించి ప్రధానంగా పేర్కొన్నారు. అక్బర్ చక్రవర్తి భారతీయ రాజులలో అత్యంత గొప్పవాడు కావడం వలన ముస్లింలు ప్రతిరోజూ ఐదు సార్లు నమాజు కొరకు పిలిచే పిలుపులో ఆయన పేరు పేర్కొనడం అద్భుతమైన విషయం అని  ఆయన చెప్పినారు. అయితే, ఆయన తర్వాత నేను ఇచ్చిన ప్రసంగంలో ఆయన యొక్క తప్పిదాన్ని సరిదిద్దగలిగాను మరియు ఆ అపార్థాన్ని దూరం చేయగలిగాను.

అదాన్ పిలుపులో వచ్చే ‘అక్బర్’ అనే పదానికీ, అక్బర్ చక్రవర్తికీ మధ్య ఎలాంటి సంబంధం లేదు.

అదాన్ పిలుపులో వచ్చే ‘అక్బర్’ అనే పదానికీ మరియు భారతదేశ చక్రవర్తి అక్బర్ కు మధ్య ఎలాంటి సంబంధం లేదు. అక్బర్ చక్రవర్తి పుట్టక ముందు ఎన్నో శతాబ్దాల నుండి అక్బర్ అనే పదం అదాన్ పలుకులలో పేర్కొనబడుతున్నది.

‘అక్బర్’ అంటే ‘మహా ఘనమైన వాడు’

అరబీ భాషా పదం ‘అక్బర్’ అంటే ‘మహా ఘనమైన వాడు’ అని అర్థం. అదాన్ పిలుపులో ‘అల్లాహు అక్బర్’ అని పలికినప్పుడల్లా, మేము ‘అల్లాహ్ యే అందరి కంటే మహా ఘనమైనవాడు’ లేదా ‘అల్లాహ్ యే అత్యంత ఘనమైన వాడు’ అని గొంతెత్తి ప్రకటిస్తున్నాము. ఇంకా అత్యంత ఘనమైనవాడు మరియు సాటిలేని ఏకైక ఆరాధ్యుడు అయిన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించ మని ప్రజలను పిలుస్తున్నాము.

7.    భారతీయ ముస్లింలు తమ కొరకు ప్రత్యేకమైన ముస్లిం పర్సనల్ లా కావాలని పట్టుబట్టే బదులు ఒకవేళ నేరస్థుడు ముస్లిం అయినట్లయితే అతడిని ఇస్లామీయ షరిఅహ్ చట్టం ప్రకారం శిక్షించాలని ఎందుకు పట్టుపట్టడం లేదు -  ఉదాహరణకు ఎవరైనా ముస్లిం దొంగతనం చేస్తే ముస్లిం క్రిమినల్ లా ప్రకారం అతని చేతులు నరకాలని ఎందుకు డిమాండ్ చేయడం లేదు ?

జవాబు: ముస్లిం పర్సనల్ లా అనేది ఒక వ్యక్తికి మరియు అతడి సమీప బంధువులకూ సంబంధించిన చట్టం. అంటే వివాహం, విడాకులు, వారసత్వం మొదలైన వాటికి సంబంధించిన దైవచట్టం. దీనిలో కొందరు ఇస్లామీయ పండితులు పరస్పరం అంగీకరించిన చట్టాలు కూడా ఉన్నాయి. తిన్నగా సమాజానికి హాని కలిగించే లేదా నష్టం కలిగించే ఏ నేరమూ మరియు ఏ కార్యమూ దీనిలో లేదు.

భారతదేశం ఒక లౌకిక మరియు ప్రజాస్వామ్య దేశం :

ఏ దేశంలోనైనా, వేర్వేరు వర్గాల ప్రజల పర్సనల్ లా చట్టాలు వేర్వేరుగా ఉండవచ్చు. భారతదేశం ఒక లౌకిక మరియు ప్రజాస్వామ్య దేశం కావడం వలన, వేర్వేరు వర్గాల ప్రజలు తమ స్వంత పర్సనల్ లా చట్టాన్ని అనుసరించే అవకాశం భారతదేశం ఇస్తున్నది.

ఇస్లామీయ పర్సనల్ లా చట్టం అత్యంత ఉత్తమమైనది :

ప్రపంచంలోని వివిధ పర్సనల్ లా చట్టాల కంటే అత్యంత ఉత్తమమైన మరియు అత్యంత ఉత్తమ ఫలితాన్నిచ్చే చట్టం ఇస్లామీయ పర్సనల్ లా చట్టం అని ముస్లింలు విశ్వసిస్తారు. ఇస్లాం ధర్మంపై తమకున్న పూర్తి నమ్మకం వలన భారతదేశంలోని ముస్లింలు కూడా ముస్లిం పర్సనల్ లా చట్టానికి ప్రాధాన్యత నిస్తారు.

క్రిమినల్ లా :

క్రిమినల్ లా అంటే సమాజంపై తిన్నగా ప్రభావం చూపే ఏదైనా నేరం లేదా ఏదైనా పనితో సంబంధం ఉన్న చట్టం. ఉదాహరణకు దొంగతనం, అత్యాచారం, హత్య, హింస మొదలైనవి.

ఏ దేశంలోనైనా ప్రజలందరి కోసం క్రిమినల్ చట్టం ఒక్కటే ఉండాలి :

ఏ దేశంలోనైనా, వేర్వేరు వర్గాల ప్రజల కోసం పర్సనల్ లా వలే క్రిమినల్ చట్టం కూడా వేర్వేరుగా ఉండటం సాధ్యం కాదు. వేర్వేరు వర్గాల ప్రజల కోసం మరియు వేర్వేరు ధర్మాల ప్రజల కోసం ఒకే విధమైన క్రిమినల్ చట్టం ఉండటం తప్పనిసరి. ఉదాహరణకు, ఇస్లాం ధర్మం ప్రకారం ఎవరైనా దొంగతనం చేస్తే అతడి చేతులు నరికి వేయాలి. కానీ హిందూ ధర్మంలో ఈ శిక్ష లేదు. ఒకవేళ ఒక హిందూ వ్యక్తి ఒక ముస్లిం వ్యక్తి సంపదను దోచుకుంటే, ఆ దొంగకు ఏ శిక్ష విధించాలి? దొంగ చేతులు నరికి వేయబడాలని ముస్లిం కోరుకుంటాడు, కానీ దానికి హిందూ ధర్మం అంగీకరించదు.

ముస్లిమేతరుల ప్రమేయం లేకుండా, భారతదేశంలోని ముస్లింలు స్వంతంగా ఇస్లామీయ క్రిమినల్ చట్టాన్ని అనుసరించలేరు :

తను చేసిన నేరానికి ఇస్లామీయ క్రిమినల్ చట్టం ప్రకారం తనకు శిక్ష విధించాలని ఒకవేళ ఎవరైనా ముస్లిం అంగీరించినా అది ఆచరణీయం కాదు. ఒకవేళ కొందరు ముస్లిమేతరులు ఒక ముస్లింపై పెట్టిన దొంగతనం కేసు వీగిపోతే, ఆ కేసులోని ప్రతి ఒక్కరి కొరకు వారి స్వంత పర్సనల్ లా ప్రకారం తీర్పు ఇవ్వాలంటే,  ఇస్లాం ధర్మం ప్రకారం తప్పుడు సాక్ష్యం ఇచ్చినందుకు ఆ సాక్షులకు 80 కొరడా దెబ్బలు కొట్టవలసి ఉంటుంది. కానీ భారతీయ క్రిమినల్ చట్టం ప్రకారం తప్పుడు సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి సులభంగా తప్పించుకోగలడు. కాబట్టి, ప్రతి ఒక్కరూ తమ స్వంత క్రిమినల్ చట్టాన్ని అనుసరిస్తున్న పుడు, ఎవరైనా ముస్లిమేతరుడికి ఒక ముస్లింపై ఏదైనా నేరం ఆరోపించడం చాలా సులభం. కానీ, అబద్ధపు సాక్ష్యం మరియు దొంగతనం కోసం తేలికపాటి శిక్షలున్న భారతీయ క్రిమినల్ చట్టాన్నే ఒకవేళ వారిద్దరిపై వర్తింపజేస్తే, తమ స్వార్థం కోసం దొంగలు ఇంకా ఎక్కువ దొంగతనం చేసేలా మరియు అబద్ధపు సాక్ష్యం ఇచ్చేవారిని ఇంకా ఎక్కువగా తప్పుడు సాక్ష్యం ఇచ్చేలా ప్రోత్సహిస్తుంది.

భారతదేశంలోని ముస్లింలు ఇస్లామీయ క్రిమినల్ చట్టాన్ని మొత్తం భారతీయులందరిపై వర్తింపజేయడం ద్వారా సమాజానికి ఎంతో మేలు కలుగుతుందని నమ్ముతారు. ఎందుకంటే దొంగతనం చేసిన వ్యక్తి చేతులు నరకడం వలన, తప్పకుండా భారతదేశంలో దొంగతనం నేరాలు తగ్గిపోతాయి. అలాగే అబద్ధపు సాక్ష్యం ఇచ్చిన నేరానికి 80 కొరడా దెబ్బల శిక్ష విధించడం వలన తప్పుడు సాక్ష్యం ఇవ్వకుండా ప్రజలను నివారిస్తుంది.

ఇస్లామీయ క్రిమినల్ లా అత్యంత ఆచరణీయమైనది :

ఇస్లాం ధర్మం నేరాన్ని వేలెత్తి చూపడమే కాకుండా, ఆ నేరం జరగకుండా నివారించే మార్గాన్ని కూడా చూపుతుంది. ఉదాహరణకు, దొంగతనం చేసిన వ్యక్తి చేతులు నరికే శిక్ష విధించడం, అత్యాచారం చేసిన వ్యక్తికి మరణశిక్ష విధించడం మొదలైనవి. ఇలాంటి కఠిన శిక్షల వలన, ఏ వ్యక్తి అయినా ఏదైనా నేరం చేసే ముందు కొన్ని వందల సార్లు ఆలోచిస్తాడు.

కాబట్టి, భారతదేశంలో నేరాలను తగ్గించే లేదా ఆపే సరైన పరిష్కారం – భారతీయులందరిపై ఇస్లామీయ క్రిమినల్ చట్టాన్ని వర్తింపజేయడం.

8.    ఇస్లాం ధర్మం ప్రకారం ప్రపంచంలోని ప్రతి జాతి కొరకు సందేశహరులు లేదా ప్రవక్తలు పంపబడితే, మరి భారతదేశానికి ఏ ప్రవక్త పంపబడినారు ? శ్రీరామ్ మరియు శ్రీకృష్ణ లను అల్లాహ్ యొక్క ప్రవక్తలుగా మనం భావించవచ్చా?

జవాబు:

·      ప్రతి జాతి కొరకు ప్రవక్తలు పంపబడినారు

35వ అధ్యాయమైన సూరతుల్ ఫాతిర్ లోని 24వ వచనంలో ఖుర్ఆన్ ఇలా తెలుపుతున్నది "... వారి మధ్య నివసిస్తూ, వారిని హెచ్చరించే ప్రవక్తను పంపని జాతి లేదు." [దివ్యఖుర్ఆన్ 35:24]

అలాగే, 13వ అధ్యాయమైన సూరతుల్ రాద్ లోని 7వ వచనంలో ఖుర్ఆన్ ఇలా తెలుపుతున్నది "... మరియు ప్రతి ఒక్కరి కోసం ఇది ఒక మార్గదర్శకత్వం." [దివ్యఖుర్ఆన్ 13:7]

·      కొందరు ప్రవక్తల వృత్తాంతాలు మాత్రమే ఖుర్ఆన్ లో పేర్కొనబడినాయి.

దీని గురించి 4వ అధ్యాయమైన సూరతున్నిసా లోని 164వ వచనంలో అల్లాహ్ ఇలా తెలుపుతున్నాడు, "కొందరు ప్రవక్తల వృత్తాంతం మేము పేర్కొన్నాము మరియు మరి కొందరు ప్రవక్తల వృత్తాంతం పేర్కొనలేదు" [దివ్యఖుర్ఆన్ 4:164]

40వ అధ్యాయమైన సూరతుల్ గాఫిర్ లోని 78వ వచనంలో ఇలాంటి సందేశమే మరలా ఇవ్వబడింది, "మీ కంటే పూర్వం కూడా మేము ప్రవక్తలను పంపాము: వారిలో కొందరి గురించి ప్రస్తావించాము మరియు మరికొందరి గురించి ప్రస్తావించలేదు..."[దివ్యఖుర్ఆన్ 40:78]

·      అల్లాహ్ తన అంతిమ సందేశమైన ఖుర్ఆన్ లో 25 మంది ప్రవక్తల పేర్లు మాత్రమే పేర్కొన్నాడు:

ఖుర్ఆన్ లో కేవలం 25 మంది ప్రవక్తల పేర్లు మాత్రమే పేర్కొనబడినాయి. ఉదాహరణకు ఆదమ్, నూహ్, అబ్రహాం, మోసెస్, జీసస్, ముహమ్మద్ ....

అల్లాహ్ యొక్క ప్రవక్తల సంఖ్య 1,24,000 కంటే ఎక్కువ :

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన దాని ప్రకారం 124,000 కంటే ఎక్కువ మంది ప్రవక్తలు ఈ ప్రపంచానికి పంపబడినారు.

·      అంతకు పూర్వం పంపబడిన ప్రవక్తలందరూ కేవలం తమ జాతి ప్రజల కొరకు మాత్రమే పంపబడినారు

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు పూర్వం పంపబడిన ప్రవక్తలందరూ కేవలం వారి స్వంత జాతి ప్రజల కొరకు మాత్రమే పంపబడినారు మరియు ఒక నిర్ణీత సమయం వరకే వారు అనుసరించ బడినారు.

3వ అధ్యాయమైన ఆలే ఇమ్రాన్ లోని 49 వ వచనంలో ఇలా పేర్కొనబడింది "మరియు ఇజ్రాయీల్ సంతతి కొరకు ఒక సందేశహరుడిగా, ..." [దివ్యఖుర్ఆన్ 3:49]

·      అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త - ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క చిట్టచివరి మరియు అంతిమ ప్రవక్త. 33వ అధ్యాయమైన సూరతుల్ అహజాబ్ లోని 40వ వచనంలో ఈ విషయం పేర్కొనబడింది,

"ముహమ్మద్ మీలో ఏ పురుషుడికీ తండ్రి కాదు, కానీ అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తల పరంపర ముగించే సీలు వంటి వారు. మరియు అల్లాహ్ అన్నీ ఎరుగును." [దివ్యఖుర్ఆన్ 33:40]

·      మొత్తం మానవజాతి కొరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పంపబడినారు

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిట్టచివరి ప్రవక్త కావటం వలన, ఆయనను కేవలం అరబ్బుల కోసం లేదా కేవలం ముస్లింల కోసం మాత్రమే ప్రవక్తగా చేసి పంపలేదు. ఆయనను మొత్తం మానవజాతి కొరకు ప్రవక్తగా చేసి పంపడం జరిగింది.

ఖుర్ఆన్ లోని 21వ అధ్యాయమైన సూరతుల్ అంబియాలోని 107వ వచనంలో దీని గురించి ఇలా పేర్కొనబడింది "సృష్టి మొత్తం కొరకు పంపబడినదే మీ కోసం కూడా పంపాము." [దివ్యఖుర్ఆన్ 21:107]

ఇలాంటి సందేశమే 34వ అధ్యాయమైన సబా సూరహ్ లోని 28వ వచనంలో మరలా పేర్కొనబడింది

"మేము యావత్తు ప్రపంచం కోసం సందేశహరుడిని పంపాము. వారికి శుభవార్తనివ్వమనీ మరియు హెచ్చరించమనీ, కానీ అనేక మంది గ్రహించరు." [దివ్యఖుర్ఆన్ 34:28]

సహీహ్ బుఖారీలో ఈ హదీథు నమోదు చేయబడింది

జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: అల్లాహ్ యొక్క ప్రవక్త ఇలా పలికారు, "ప్రతి ప్రవక్త అతడి జాతి కొరకు మాత్రమే పంపబడినాడు, కానీ నేను మొత్తం మానవజాతి కొరకు ప్రవక్తగా పంపబడినాను."

·      మరి భారతదేశానికి ఏ ప్రవక్త పంపబడినారు ?

భారతదేశానికి ఏ ప్రవక్త పంపబడినారు, శ్రీరామ్ లేదా శ్రీకృష్ణ లు కూడా అల్లాహ్ యొక్క ప్రవక్తలేనని పరిగణించవచ్చా అనే ప్రశ్నలకు ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీథులలో (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలలో) భారతదేశానికి పంపబడిన ప్రవక్త పేరు పేర్కొనబడిన వచనం ఏదీ లేదు. ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీథులలో శ్రీరామ్ మరియు శ్రీకృష్ణ పేర్లు పేర్కొనబడటం వలన వారు నిజంగా అల్లాహ్ యొక్క ప్రవక్తలేనా కాదా అనే విషయం గురించి ఎవ్వరూ నిర్ధారించలేరు. హిందువుల మెప్పు సంపాదించడానికి కొందరు ముస్లింలు, ముఖ్యంగా ముస్లిం రాజకీయ నాయకులు శ్రీరామ్ అలైహిస్సలాం అంటే అల్లాహ్ యొక్క శాంతి ఆయనపై కురుయుగాక అని అంటున్నారు. ఇలా పలకడం తప్పు, ఎందుకంటే ఆయన ప్రవక్త అని నిర్ధారించే ఎలాంటి ఋజువులూ ఖుర్ఆన్ లో మరియు సహీహ్ హదీథులలో లేవు. కాబట్టి, వారు అల్లాహ్ యొక్క ప్రవక్తలు కావచ్చు లేదా కాకపోవచ్చు. అయితే వారు కూడా అల్లాహ్ యొక్క ప్రవక్తలు అయి ఉండవచ్చేమో అని ఊహించడంలో ఎలాంటి తప్పూ లేదు.

ఒకవేళ శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుడు కూడా ప్రవక్తలేనని భావించినా, మనం ఈనాడు అంతిమ దైవప్రవక్త అయిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మాత్రమే అనుసరించ వలసి ఉంది. ఒకవేళ శ్రీరామ్ మరియు శ్రీకృష్ణ కూడా ప్రవక్తలే అయినా, వారు అప్పటి ప్రజల కొరకు మాత్రమే పంపబడినారు మరియు కేవలం ఆనాటి ప్రజలు మాత్రమే వారిని అనుసరించవలసి ఉంది. ఈనాడు, భారతదేశంతో పాటు యావత్తు ప్రపంచంలోని మొత్తం మానవజాతి, ఇహపరలోకాల సాఫల్యం కోసం మనందరి సృష్టికర్త యొక్క చిట్టచివరి మరియు అంతిమ ప్రవక్త అయిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మాత్రమే అనుసరించ వలసి ఉంది.

9.    ప్రతి కాలంలో అల్లాహ్ తన దివ్యసందేశాన్ని పంపి ఉంటే, మరి భారతదేశానికి ఏ దివ్యసందేశం పంపబడింది? వేదాలను మరియు ఇతర హిందూ దివ్యగ్రంథాలను మనం అల్లాహ్ యొక్క దివ్యసందేశాలుగా పరిగణించవచ్చా ?

జవాబు:

·      ప్రతి కాలంలో దివ్యసందేశం పంపబడింది

13వ అధ్యాయమైన రాద్ సూరహ్ లోని 38వ వచనంలో ఖుర్ఆన్ ఇలా ప్రకటిస్తున్నది "ప్రతి కాలం కొరకు ఒక దివ్యసందేశం పంపబడింది. [దివ్యఖుర్ఆన్ 13:38]

·      ఖుర్ఆన్ లో నాలుగు దివ్యసందేశాల పేర్లు పేర్కొనబడినాయి.

ఖుర్ఆన్ లో అల్లాహ్ కేవలం నాలుగు దివ్యసందేశాల పేర్లను మాత్రమే పేర్కొన్నాడు. అవి తౌరాహ్, జబూర్, ఇంజీల్ మరియు ఖుర్ఆన్.

తౌరాహ్ దివ్యసందేశం మోసెస్ (మూసా అలైహిస్సలాం) పై అవతరించబడింది. జబూర్ దివ్యసందేశం డేవిడ్ (దాఊద్ అలైహిస్సలాం) పై అవతరించబడింది. ఇంజీల్ దివ్యసందేశం జీసస్ (ఈసా అలైహిస్సలాం) పై అవతరించబడింది. మరియు చిట్టచివరి మరియు అంతిమ దివ్యసందేశమైన ఖుర్ఆన్, చిట్టచివరి మరియు అంతిమ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించబడింది.

·      ప్రాచీన దివ్యసందేశాలన్నీ ఆయా ప్రజల కొరకు మాత్రమే పంపబడినాయి.

ఖుర్ఆన్ కు పూర్వం అవతరించబడిన దివ్యసందేశాలన్నీ ఆయా ప్రజల కొరకు మాత్రమే పంపబడినాయి మరియు వారు నిర్ణీత కాలం వరకు మాత్రమే వాటిని అనుసరించడం జరిగింది. 

·      మొత్తం మానవజాతి కొరకు దివ్యఖుర్ఆన్ పంపబడింది

ఖుర్ఆన్ చిట్టచివరి మరియు అంతిమ దివ్యసందేశం కావటం వలన, అది ముస్లింలు మరియు అరబ్బుల కొరకు మాత్రమే కాకుండా, మొత్తం మానవజాతి కొరకు పంపబడింది. దీని గురించి ఖుర్ఆన్ లో ఇలా పేర్కొనబడింది:

సూరహ్ ఇబ్రాహీం, 14వ అధ్యాయం 1వ వచనం: "అలిఫ్, లామ్, రా. మేము అవతరింపజేసిన ఈ గ్రంథం మానవజాతిని అజ్ఞానపు అంధకారం నుండి బయటపడి వెలుగు వైపు వెళ్ళే దారి చూపుతుంది..." [ఖుర్ఆన్ 14:1]

ఇలాంటి మరో సందేశం ఇదే అధ్యాయంలోని 52వ వచనంలో ఉంది: "ఇది మానవజాతి కొరకు పంపబడిన సందేశం: దీనిలోని హెచ్చరికలను వారు గ్రహించాలి మరియు ఆయన ఏకైక దైవమని వారు తెలుసుకోవాలి: దీనిని విజ్ఞులు గ్రహించాలి." [ఖుర్ఆన్ 14:52]

2వ అధ్యాయమైన అల్ బఖరహ్ లోని 185వ వచనంలో ఇలా పేర్కొనబడింది: "రమదాన్ నెలలో మేము మానవ జాతి కోసం, స్పష్టమైన మార్గదర్శకంగా మరియు (మంచి చెడుల మధ్య సరిగ్గా) తీర్మానం చేసిదిగా ఖుర్ఆన్ గ్రంథాన్ని పంపాం." [ఖుర్ఆన్ 2:185]

ఇలాంటి సందేశమే 39వ అధ్యాయం అయిన సూరహ్ అజ్జుమర్ లోని 41వ వచనంలో పేర్కొనబడింది: "నిస్సందేహంగా, మానవాళి కొరకు సత్యమైన గ్రంథాన్ని మేము అవతరింపజేసాము."[ఖుర్ఆన్ 39:41]

·      భారతదేశం వైపు ఏ దివ్యసందేశం పంపబడింది?

"భారతదేశం వైపు సృష్టికర్త యొక్క ఏ దివ్యసందేశం పంపబడింది, వేదాలను మరియు హిందూ ధర్మ దివ్యగ్రంథాలను మనం సృష్టికర్త యొక్క దివ్యసందేశాలుగా పరిగణించవచ్చా లేదా?" అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతున్నది. ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీథులలో భారతదేశం వైపు పంపబడిన దివ్యసందేశం పేరు తెలిపే ఒక్క వచనం కూడా పేర్కొనబడలేదు. వేదాల మరియు ఇతర హిందూ ధర్మ దివ్యగ్రంథాల పేర్లు ఖుర్ఆన్ లో మరియు సహీహ్ హదీథులలో ఎక్కడా పేర్కొనబడక పోవటం వలన, ఖచ్ఛితంగా అవి కూడా సృష్టికర్త యొక్క దివ్యసందేశాలే అని ఎవ్వరూ చెప్పలేరు. అవి సృష్టికర్త యొక్క దివ్యసందేశాలు కావచ్చు, కాకపోవచ్చు.

ఒకవేళ వేదాలు కూడా సృష్టికర్త యొక్క దివ్యసందేశాలైనా, ఈనాడు మనం తప్పకుండా ఖుర్ఆన్ ను మాత్రమే అనుసరించ వలసి ఉంది.

ఒకవేళ వేదాలు మరియు ఇతర హిందూ ధర్మ దివ్యగ్రంథాలు కూడా సృష్టికర్త యొక్క దివ్యసందేశాలైనా, అవి ఆనాటి ప్రజల కోసం పంపబడినవే. వాటిని ఆ కాలంలో మాత్రమే అనుసరించవలసి ఉంది. ఈనాడు, భారతదేశంతో యావత్తు ప్రపంచంలోని మొత్తం ప్రజలందరూ సృష్టికర్త యొక్క చిట్టచివరి మరియు అంతిమ దివ్యగ్రంథం అయిన ఖుర్ఆన్ ను మాత్రమే అనుసరించవలసి ఉంది. అనంత కాలం కొరకు పంపబడక పోవటం వలన సృష్టికర్త ప్రాచీన దివ్యగ్రంథాలను వాటి అసలు రూపంలో భద్రంగా ఉండేలా కాపాడ లేదు. దివ్యసందేశం అనే దావా చేస్తున్న ఏ ఒక్క దివ్యగ్రంథం కూడా అది ఏ ధర్మానికి చెందినదైనా సరే, ఎలాంటి మార్పులు చేర్పులకు గురి కాకుండా దాని అవతరించిన అసలు రూపంలో మిగిలి లేదు – ఒక్క ఖుర్ఆన్ తప్ప. అంతిమదినం వరకు మార్గదర్శకత్వంగా పంపబడిన చిట్టచివరి దివ్యసందేశం కావడం వలన, ఎలాంటి మార్పులు చేర్పులకు గురి కాకుండా అసలు రూపంలోనే భద్రంగా ఉంచే బాధ్యతను సృష్టకర్త తనే స్వయంగా తీసుకున్నాడు.

సూరహ్ అల్ హిజ్ర్  15వ అధ్యాయం, 9వ వచనం: "నిస్సందేహంగా, మేము సందేశాన్ని పంపాము; మరియు దానిని తప్పకుండా కాపాడతాము." [ఖుర్ఆన్ 15:9]

10. ఖుర్ఆన్ లో వచ్చిన "అల్లాహ్" అనే పేరు నూటికి నూరు పాళ్ళు దేవుడి స్థాయికి సరిగ్గా సరిపోయే దివ్యనామం. మరి ఖుర్ఆన్ లోనే కాకుండా ఇతర గ్రంథాలలోనూ అల్లాహ్ పేరు ప్రస్తావించ బడిందా?

జవాబు:

దాదాపు అన్ని ప్రధాన ధర్మాల దివ్యగ్రంథాలలో సృష్టికర్త యొక్క దివ్యనామాలలో అల్లాహ్ పేరు కూడా పేర్కొనబడింది.

ఇలోహిమ్ అల్ ఇలాహ్ అలాహ్ (Elohim El, Elah, Alah)

హిబ్రూ భాషలోని బైబిల్ లో, తరుచుగా దేవుడిని ‘ఇలోహిమ్ (Elohim)’ అనే పేరుతో పేర్కొనడం జరిగింది. The ఇలోహిమ్ లోని ‘ఇమ్ (im)’ అనేది గౌరవార్థక బహువచనాన్ని సూచిస్తుంది. రెవరెండ్ స్కోఫీల్డ్ ఎడిట్ చేసిన (C.I. Scofield) ఇంగ్లీషు బైబిల్ లో ‘అల్ (El)’ లేదా ‘అలాహ్’ అనే పదాలు దేవుడిని సూచిస్తున్నాయి. ‘ఇలాహ్ Elah’ అనే పదాన్ని ‘Alah’ అనే స్పెల్లింగ్ తో కూడా వ్రాయవచ్చు. మరి, దీనికీ ముస్లింలు పిలిచే అల్లాహ్ ALLAH కు మధ్య ఉన్న భేదం కేవలం ఒకే ఒక్క అక్షరం ‘L’. ముస్లింలు అల్లాహ్ ‘Allah’ అని పేర్కొంటే, రెవరెండ్ గారు  అలాహ్ Alah అని పేర్కొన్నారు, మరియు ప్రజలు ఇలాహ్ అని ఉచ్ఛరిస్తున్నారు. ముస్లింలు అల్లాహ్ అని ఉచ్ఛరిస్తున్నారు. హిబ్రూ మరియు అరబీ భాషలు అక్కచెల్లెళ్ళ వంటి భాషలు. వాటి మధ్య చాలా దగ్గరి సంబంధం ఉంది. కాబట్టి, సృష్టికర్త పేరును అల్లాహ్ ‘Allah’ అనే పలకాలని గానీ ఇలాహ్ ‘Elah’ అని కాదని మేము చెబుతున్నాము.

నేను స్కూలులో చదువుకున్నపుడు, ‘D,O’ లను ‘డు’ అనీ, ‘T,O’ లను ‘టు’ అనీ పలకమనీ టీచర్లు నేర్పినారు. మరి ఇలాగే ‘G,O’ లను ‘గో’ అని కాకుండా ‘గూ’ అని పలకాలి కదా!

అలాగే ‘N,ﷻ‬,T’ లను నట్ అనీ, ‘C,ﷻ‬,T’ లను కట్ అనీ; ‘B,ﷻ‬,T’ లను బట్ అనీ పలుకుతున్నపుడు, ‘P,ﷻ‬,T’ ను ఎలా పలకాలి? ‘పట్’ అనే పలకాలి కదా, కానీ దానిని ‘పుట్’ అని పలుకుతాము. ఒకవేళ అలా ఎందుకు పలకాలి? అని మీరు అడిగితే, దానికి సమాధానం అది వారి భాష కాబట్టి వారి నిర్ణయం ప్రకారమే మనం పలకాలి. నేను పరీక్షలో ఉత్తీర్ణుడిని కావాలంటే, ‘P,ﷻ‬,T’ లను ‘పుట్ put’ అనే పలకాలి గానీ ‘పట్ pat’ అని కాదు. అలాగే A, L,L,A, H, అనే అక్షరాల సరైన ఉచ్ఛరణ అల్లాహ్ యే గానీ అలాహ్ లేదా ఇలాహ్ కాదు.

సిలువపై ఎక్కించబడినపుడు, జీసస్ అలైహిస్సలాం ‘అల్లాహ్ అల్లాహ్’ అనే పిలిచాడు.

కొత్త నిబంధన యొక్క మత్తాయి గోస్పెల్ 27వ అధ్యాయం, 46వ వచనంలో మరియు మార్క్ గోస్పెల్ 15వ అధ్యాయం, 34వ వచనంలో, జీసస్ (అ) ను సిలువపైకి ఎక్కించబడినపుడు, ఇలా పలికాడని పేర్కొనబడింది.

జీసస్ బిగ్గరగా "ఇలీ ఇలీ లా మా సబక్తనీ - E’-Li, E’-Lila’-masa-bach’-tha-ni?" అని పలికాడు. అంటే అర్థం, ‘నా ప్రభూ, నా ప్రభూ నన్నేందుకు విడిచి పెట్టేసినావు?’ మరి ఇది ‘జెహోవా! జెహోవా! నన్నెందుకు విడిచి పెట్టేసినావు?’ అనే పలుకులకు దగ్గరగా ఉన్నదా ? అబ్బా అబ్బా అనే పలుకులకు దగ్గరగా ఉందా ? జవాబు ‘కానే కాదు’. హిబ్రూ మరియు అరబిక్ భాషలు సిస్టర్ లాంగ్వేజీలు. ఒకవేళ మీరు "ఇలీ ఇలీ లా మాసబక్తనీ E’-Li,E’-Lila’-masa-bach’-tha-ni" అనే పదాలతో దాని అరబీ భాష అనువాద పదాలు ‘అల్లాహ్ అల్లాహ్ లామా తరక్తనీ’ దగ్గరగా లేవా?

జీసస్ (అ) యొక్క ఈ పలుకులు, " ఇలీ ఇలీ లా మాసబక్తనీ  - E’-Li,E’-Lila’-masa-bach’-tha-ni" ప్రపంచంలో దాదాపు 2000 కంటే ఎక్కువగా ఉన్న బైబిల్ యొక్క ప్రతి అనువాదంలోనూ వాటి అసలు హిబ్రూ భాషలోనే పేర్కొనబడినాయి అంటే వాటన్నింటిలో అల్లాహ్ అనే పదం ఉన్నది.

సిక్కిశమ్ లో "అల్లాహ్" పదం

సృష్టికర్త గురించి గురునానక్ సాహిబ్ పేర్కొన్న పేర్లలో "అల్లాహ్" అనే పేరు కూడా ఉంది.

ఋగ్వేదం 2వ గ్రంథం, 1వ శ్లోకం 2వ వచనంలోని  "అల్లాహ్" పదం

హిందూ ధర్మ గ్రంథాలలో అత్యంత ప్రాచీనమైనదైన ఋగ్వేదం 2వ గ్రంథం, 1వ శ్లోకం 2వ వచనంలో పేర్కొన్న సృష్టకర్త యొక్క దివ్యనామాలలో ఇలాహ్ అనే పదం వచ్చింది. దానిని సరిగ్గా పలికితే అల్లాహ్ అనే ఉచ్ఛరణతో సమానంగా ఉంటుంది.

అల్లోపనిషద్:

వివిధ ఉపనిషద్ లలో ఒక ఉపనిషద్ పేరు ‘అల్లో’ పనిషద్. దీనిలో సృష్టికర్తను అనేకసార్లు "అల్లాహ్" అనే పేరుతో పిలవడం జరిగింది.

 ఇస్లాం ధర్మంపై కొన్ని ప్రశ్నోత్తరాలు

1.    అవిశ్వాసులు ఎక్కడ కనబడితే అక్కడ వారిని చంపండి అని బోధిస్తున్న ఖుర్ఆన్ వచనం వలన ఇస్లాం ధర్మం హింస, రక్తపాతం మరియు క్రూరత్వాన్ని ప్రోత్సహించడం లేదా? 

జవాబు: ఇస్లాం ధర్మం హింసను ప్రోత్సహిస్తుందని మరియు తనను అనుసరించని ముస్లిమేతరులను చంపమని తన అనుచరులను ప్రేరేపిస్తుందని కొందరు నిరంతరం చేసే తమ తప్పుడు ప్రచారాన్ని సమర్ధించు కునేందుకు ప్రత్యేకంగా ఎంచుకున్న కొన్ని ఖుర్ఆన్ వచనాలను తరుచుగా పేర్కొంటూ ఉంటారు.

1. సూరహ్ అత్తౌబాలోని వచనం

ఇస్లాం ధర్మం హింస, రక్తపాతం మరియు క్రూరత్వాన్ని ప్రోత్సహిస్తుందంటూ ఇస్లాం ధర్మ విమర్శకులు సూరహ్ తౌబా లోని ఈ వచనాన్ని తరుచుగా పేర్కొంటూ ఉంటారు: "ఎక్కడ కనబడితే అక్కడ ముష్రికులను (బహుదైవారాధకులు, అవిశ్వాసులను) చంపండి." [9:5]

2. ఈ వచనం అవతరించింది యుద్ధభూమిలో

వాస్తవానికి ఇస్లాం ధర్మ విమర్శకులు దీని ముందు – వెనుక వచనాల్ని వదిలి పెట్టి, తమ వాదనకు సమర్ధన లభించే విధంగా ఈ వచనాన్ని మాత్రమే పేర్కొంటూ ఉంటారు. ఆ వచనం అవతరించిన సందర్భాన్ని అర్థం చేసుకునేందుకు, ఈ అధ్యాయం యొక్క మొదటి వచనం నుండి చదవ వలసి ఉంటుంది. ముస్లింల మరియు మక్కాలోని ముష్రికుల (బహుదైవారాధకుల) మధ్య సంధి ఒడంబడిక జరిగిందని, అయితే మక్కా ముష్రికులు దానిని ఉల్లంఘించారనీ, సంధి ఒడంబడికను పునరుద్ధరించడానికి మక్కా ముష్రికులకు నాలుగు నెలల సమయం ఇవ్వబడిందనీ, వారలా చేయని యెడల వారిపై యుద్ధం ప్రకటించబడు తుందనీ దీనికి ముందు వచ్చిన వచనాలు తెలుపు తున్నాయి. సూరహ్ తౌబాలోని 5వ వచనం ఇలా ప్రకటిస్తున్నది: "కానీ, నిషిద్ధమైన నెలలు దాటి పోయిన తర్వాత, బహుదైవారాధకులు ఎక్కడ కనబడితే అక్కడ వారిని వధించండి, మరియు వారిని ఖైదీలుగా బంధించండి, వారిని ఇబ్బంది పెట్టండి, మరియు అవకాశం ఉన్న ప్రతి చోటా వారి గురించి కాపు కాయండి; అయితే ఒకవేళ వారు క్షమాపణ వేడుకుని, రెగ్యులర్ గా నమాజు చేస్తుంటే మరియు రెగ్యులర్ దానధర్మాలు చేస్తుంటే, వారి కొరకు దారి తెరవండి: అల్లాహ్ అత్యంత క్షమించేవాడు, అత్యంత దయామయుడు." [దివ్యఖుర్ఆన్ 9:5]

3. యుద్ధ సమయంలో ఈ వచనం అవతరించింది:

ఉదాహరణకు - అమెరికా మరియు వియత్నాం మధ్య జరిగిన యుద్ధం

ఒకసారి అమెరికా వియత్నాంతో యుద్ధం చేసిందనే విషయం మనకు తెలుసు. ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు లేదా అమెరికన్ ఆర్మీ జనరల్ ఇలా ప్రకటించాడని అనుకుందాము: "ఎక్కడ మీకు వియత్నామీయులు కనబడితే అక్కడ వారిని చంపండి". సందర్భం చెప్పకుండా అమెరికన్ అధ్యక్షుడు, "ఎక్కడ మీకు వియత్నామీయులు కనబడితే అక్కడ వారిని చంపండి" అని చెప్పారని ఈరోజు నేనంటే ఆయన ఒక కసాయివాడనే అభిప్రాయం మీకు కలుగుతుంది. కానీ నేను సందర్భం చెప్పి, ఆ తర్వాత ఆయన పలుకులు మీకు వినిపిస్తే, ఆయన మాటలు చాలా లాజికల్ గా కనబడతాయి. ఎందుకంటే ఆ యుద్ధసమయంలో ఆయన అమెరికన్ సైన్యం యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు, వారిలో ధైర్యాన్ని నూరి పోసేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రహించగలరు.

4. యుద్ధరంగంలోని ముస్లిం సైనికుల ధైర్యం పెంచేందుకు ఈ వచనం 9:5 అవతరించింది

అలాగే సూరహ్ తౌబాలోని 5వ వచనం, "మీకు ముష్రికులు ఎక్కడ కనబడితే అక్కడ వారిని చంపండి", అనే వచనం యుద్ధభూమిలోని ముస్లింల ధైర్యాన్ని పెంచేందుకు అవతరించింది. యుద్ధంలో భయపడ వద్దని, శత్రువు ఎక్కడ కనబడితే అక్కడ అతడిని చంపమని ముస్లిం సైనికులకు ఇక్కడ ఖుర్ఆన్ చెబుతున్నది.

5. అరుణ్ శౌరీ ఈ అధ్యాయంలోని 6వ వచనాన్ని వదిలి పెట్టి, తిన్నగా 5వ వచనం నుండి 7వ వచనం పైకి దూకినాడు

భారతదేశంలోని ఇస్లాం ధర్మ తీవ్రవిమర్శకులలో ఒకడు అరుణ్ శౌరీ.  ‘The World of Fatwahs’ అనే తన పుస్తకంలోని 572వ పేజీలో అతడు ఖుర్ఆన్ లోని సూరహ్ తౌబాలోని 5వ మరియు 7వ వచనాల్ని పేర్కొన్నాడు. కొంచెమైనా తెలివి ఉన్న వారెవరైనా అతడు 6వ వచనాన్ని వదిలి వేసాడనే విషయాన్ని తేలిగ్గా గ్రహించగలరు.

6. సూరహ్ తౌబాలోని 6వ వచనం దాని సమాధానం ఇస్తున్నది.

ఇస్లాం ధర్మం హింస, రక్తపాతం మరియు క్రూరత్వాన్ని ప్రోత్సహిస్తుందనే అసత్య ఆరోపణకు సూరహ్ తౌబాలోని 6వ వచనం ఇలా సమాధానం ఇస్తున్నది: "ఒకవేళ బహుదైవారాధకులలో ఎవరైనా శరణు అడిగితే, వెంటనే వారికి శరణు ప్రసాదించండి. తద్వారా అతడు అల్లాహ్ యొక్క వచనాలు వినవచ్చు; మరియ అతడిని సురక్షిత ప్రాంతం వరకు స్వయంగా చేర్చండి ఎందుకంటే వారు సరైన జ్ఞానం లేనివారు."   [ఖుర్ఆన్ 9:6]  

యుద్ధరంగంలో శరణు కోరిన ముష్రికు (బహుదైవారధకుడు) కు శరణు ప్రసాదించాలి, అంతేగాక అతడిని సురక్షిత ప్రాంతానికి స్వయంగా తీసుకు వెళ్ళి వదలాలి అని ఖుర్ఆన్ తెలుపుతున్నది. ఈనాటి అంతర్జాతీయ రణరంగంలో, ఒక శాంతికాముకుడైన ఆర్మీ జనరల్ యుద్ధ సమయంలో శత్రు సైనికులు ఒకవేళ శాంతిని కోరుకుంటే, వారిని అక్కడి నుండి వెళ్ళిపోనిస్తాడే గానీ, వారిని సురక్షిత స్థానానికి చేర్చమని తన సైనికులను ఆదేశిస్తాడా?   

ప్రపంచంలో శాంతిని స్థాపించేందుకే అల్లాహ్ ఖుర్ఆన్ లో దీనిని ఆదేశించాడు.

2.    ఒకవేళ అల్లాహ్ యే స్వయంగా అవిశ్వాసుల హృదయాలపై సీలు వేసేసినాడని పేర్కొన్నప్పుడు, ఇస్లాం స్వీకరించటం లేదని వారిని ఎందుకు నిందించాలి? 

జవాబు: నిరంతరం సత్యాన్ని తిరస్కరిస్తున్న వారి హృదయాలపై అల్లాహ్ ముద్ర వేసేసినాడని ఖుర్ఆన్ లోని రెండవ అధ్యాయమైన సూరహ్ అల్ బఖరహ్ లోని 6 మరియు 7 వ వచనాలలో ఇలా పేర్కొనబడింది: "ఎవరైతే సత్యాన్ని తిరస్కరించారో, వారిని నీవు హెచ్చరించినా , హెచ్చరించక పోయినా ఒకటే; వారు విశ్వసించరు. వారి హృదయాలపై అల్లాహ్ సీలు వేసినాడు మరియు వారి చెవులపై. వారి కళ్ళపై పరదా ఉంది; వారి కొరకు కఠినశిక్ష ఉంది" [2:6-7]

ఈ వచనాలు సత్యాన్ని తిరస్కరిస్తున్న సామాన్య అవిశ్వాసుల గురించి కాదు. ఇక్కడ వాడబడిన అరబీ పదాలు ‘అల్లదీన కఫరూ’ అంటే ఎవరైతే సత్యాన్ని తిరస్కరించే వైపు మొగ్గినారో అని అర్థం. అలాంటి వారిని మీరు హెచ్చరించినా లేక హెచ్చరించక పోయినా ఒకటే, ఎందుకంటే వారు విశ్వసించరు. అల్లాహ్ వారి హృదయాలను మరియు వారి చెవులను సీలు చేసేసినాడు, వారి చూపులపై పరదా వేసేసినాడు. వారు విశ్వసించక పోవటానికి, అర్థం చేసుకోక పోవటానికి కారణం వారి హృదయాలపై సీలు వేయబడటం కాదు. దీనికి విరుద్ధంగా వాస్తవానికి వారి అవిశ్వాసం వలన మరియు అర్థం చేసుకోక పోవటం వలన వారి హృదయాలపై మరియు చెవులపై సీలు వేయబడింది. ఈ అవిశ్వాసులు సత్యతిరస్కారం వైపు పోవటానికి ముందుగానే నిర్ణయించుకుని ఉండటం వలన వారిని హెచ్చరించినా,  హెచ్చరించకపోయినా వారు విశ్వసించరు అనే కారణం వలన అల్లాహ్ వారి హృదయాలను సీలు చేసినాడు. కాబట్టి సత్యతిరస్కారం వైపు వంగిపోయిన ఈ అవిశ్వాసులే దీనికి స్వయంగా బాధ్యులని నిందించాలే గానీ, అల్లాహ్ ను కాదు. 

ఉదాహరణ - తన క్లాసులోని ఒక విద్యార్థి పరీక్ష తప్పుతాడనే ఒక టీచర్ జోస్యం చెప్పడం. 

ఉదాహరణకు ఫైనల్ పరీక్షల ముందు సరిగ్గా క్లాసులలో ఏకాగ్రత చూపకపోవటం, హోమ్ వర్క్ సరిగ్గా చేయకపోవడం, దురలవాట్లు కలిగి ఉండటం మొదలైన కారణాల వలన ఫలానా విద్యార్థి  పరీక్షలలో తప్పుతాడని ఒక అనుభవజ్ఞుడైన టీచర్ జోస్యం చెప్పాడని అనుకుందాము. పరీక్షలు వ్రాసిన తర్వాత ఆ విద్యార్థి ఒకవేళ టీచర్ చెప్పినట్లుగానే ఫెయిల్ అయితే ఎవరిని నిందించాలి – టీచరునా లేక స్టూడెంటునా? కేవలం టీచర్ జోస్యం చెప్పడం వలననే ఆ విద్యార్థి తప్పాడని టీచర్ ను నిందించడం సమంజసం కాదు గదా! పరీక్ష తప్పడానికి స్వయంగా ఆ విద్యార్థియే కారణం అనేది ఎవ్వరూ తిరస్కరించలేని సత్యం.  

అలాగే సత్యతిరస్కారం వైపు మొగ్గుచూపే కొందరు వ్యక్తుల గురించి అల్లాహ్ కు ముందుగానే తెలుసు. అందువలన ఆయన వారి హృదయాలపై ముద్ర వేసినాడు. కాబట్టి సత్యాన్ని తిరస్కరించటానికి మరియు అల్లాహ్ ను విశ్వసించక పోవటానికి అసలు బాధ్యులు స్వయంగా ఈ అవిశ్వాసులే.

3.    ఇస్లాం ధర్మం సోమరితనం మరియు అజ్ఞానంతో కూడిన సమాజాన్ని తయారు చేస్తుందా? ఎందుకంటే:

Ø  ప్రతిదీ అల్లాహ్ నుండే వస్తుంది కాబట్టి అన్నింటికీ కర్మవాదం, అదృష్టం, విధివ్రాత మొదలైనవి కారణమనే వాదనలపై ఆధారపడటం

Ø  ఆధునిక టెక్నాలజీ మరియు సైన్సులను ఖండించడం.

జవాబు: ఈ అపోహకు ఇవ్వబడిన కారణాలు అసత్యమైనవి. వాస్తవానికి ఖుర్ఆన్ మరియు సున్నతులు స్వయంగా తిన్నగా ఈ భ్రమనే ఖండించాయి. మా కొరకు సృష్టికర్తే అన్నింటికీ మూలం అనేది నిజమే అయినప్పటికీ, ఈ క్రింది ఖుర్ఆన్ వచనాలలో పేర్కొనబడినట్లుగా వెనక దాక్కోటానికి దీనిని ఒక కారణంగా మానవజాతి వాడుకోవచ్చనటంలో ఏ మాత్రం నిజం లేదు,

 • [16:35] అసత్య దేవుళ్ళ ఆరాధకులు ఇలా పలుకుతారు: "ఒకవేళ అల్లాహ్ తలిస్తే, మేము అల్లాహ్ ను కాకుండా ఇతరులెవ్వరినీ ఆరాధించేవారము కాదు – మేమే కాదు మా తండ్రులు కూడా – ఆయన నిషేధించిన వాటి నుండి దూరంగా ఉండేవారము కూడా." తర్వాత వారు తమకు పూర్వం వచ్చిన వారినే అనుసరించారు. మరి, వారికి స్పష్టమైన సందేశం బోధించటం తప్ప ప్రవక్తల పని మరేమిటి ?
 • [43:20] వారు (బహుదైవారాధకులు) ఇలా అన్నారు, "ఒకవేళ అత్యంత దయామయుడైన అల్లాహ్ తలిస్తే, మేము అలాంటి వాటిని ఆరాధించేవారము కాము!" వాటి గురించి వారికేమీ తెలియదు: వారి చెప్పేది అబద్ధం తప్ప మరేమీ కాదు!

మానవులందరూ నిర్ణీత ప్రమాణంలో స్వేచ్ఛ కలిగి ఉన్నట్లు ఖుర్ఆన్ మరియు సున్నతుల ద్వారా అల్లాహ్ మనకు బోధించినాడు. ఖుర్ఆన్ మరియు సున్నతుల పద్ధతిని అనుసరిస్తూ మన సృష్టికర్తను ప్రసన్నం చేసుకునేందుకు ఈ పరిమిత స్వేచ్ఛను తప్పకుండా వాడుకోవాలి. ముస్లిములందరూ జ్ఞానవంతులుగా, ప్రభావశీలులైన ముస్లింలుగా మారటానికి ఆవశ్యకమైనంత ప్రేరణ ఇందులో ఉంది. ఈనాడు ముస్లిం సమాజాలు తమ అసలు ఔన్నత్యానికి చేరుకోలేక పోతున్నాయంటే దానికి కారణం ఖచ్ఛితంగా వారి ఇస్లామీయ జ్ఞాన లోపం కాదు. ఇలాంటి జీవన విధానం గురించి వారు గ్రహించక పోవటమే అసలు కారణం. సున్నతులలో జ్ఞానాన్ని సంపాదించటం మరియు కష్టపడి పనిచేయడం యొక్క ప్రాముఖ్యతల గురించి స్పష్టంగా తెలుపబడింది.

ప్రత్యేకంగా సునన్ అబూ దాఊద్ లో పేర్కొనబడిన ఈ క్రింది హదీథును శ్రద్ధగా పరిశీలించండి: [9:1637] 

అనస్ బిన్ మాలిక్ ఇలా ఉల్లేఖించారు: ఒక అన్సారీ సహాబీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, ఏదైనా ఇవ్వమని ఆయనను యాచించారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని ఇలా అడిగారు: నీ ఇంట్లో ఏమీ లేదా? దానికి అతడిలా జవాబిచ్చాడు: ఉంది, ఒక వస్త్రం ముక్క ఉంది - దానిలోని కొంత భాగాన్ని మేము కప్పుకుంటాము, మరికొంత భాగాన్ని నేలపై పరుస్తాము, మరియు ఒక చెక్క గిన్నె ఉంది – దానిలో మేము నీళ్ళు త్రాగుతాము. ఆయన అతడితో ఇలా అన్నారు: వాటిని నా వద్దకు తీసుకురా. అపుడు అతడు వాటిని ఆయన వద్దకు తీసుకురాగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాటిని తన చేతుల్లో తీసుకుని ప్రజల వైపు తిరిగి ఇలా పలికారు: వీటిని ఎవరు కొంటారు? అది విని ఒక వ్యక్తి ఇలా అన్నాడు: నేను వాటిని ఒక దిర్హమ్ ధరకు కొంటాను. ఆయన రెండు మూడు సార్లు ప్రజలను ఇలా అడిగారు: ఒక దిర్హమ్ కంటే ఎక్కువ ధర ఎవరు ఇస్తారు? అపుడు మరో వ్యక్తి ఇలా అన్నాడు: నేను వాటిని రెండు దిర్హమ్ లకు కొంటాను.

ఆయన వాటిని అతడికిచ్చి, రెండు దిర్హమ్ లు తీసుకున్నారు. వాటిని ఆ అన్సారీ సహాబీకు ఇచ్చి, ఇలా పలికారు: ఒక దిర్హమ్ తో తినే పదార్థాలు కొని ఇంట్లో ఇవ్వు, మరో దిర్హమ్ తో ఒక గొడ్డలి కొని నా దగ్గరకు తీసుకురా. అలాగే అతడు గొడ్డలి కొని ఆయన వద్దకు తీసుకు వచ్చాడు. అపుడు అల్లాహ్ యొక్క ప్రవక్త స్వయంగా తన చేతితో ఆ గొడ్డలిపై చేతిపిడి బిగించి, అతడితో ఇలా అన్నారు: వెళ్ళు, కట్టెలు కొట్టి, వాటిని అమ్ముకో. పదిహేను రోజుల వరకు నా కంటికి కనబడకు. అతడు చెట్లు కొట్టి, వంట చెరుకు అమ్మసాగాడు. పది దిర్హమ్ లు సంపాదించి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు చూపాడు. తర్వాత కొన్ని దిర్హమ్ లతో దుస్తులు మరియు మరికొన్ని దిర్హమ్ లతో ఆహారపదార్థాలు కొన్నాడు.

అపుడు అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: నీ కోసం ఇది అడుక్కోవడం కంటే మంచిది. ఎందుకంటే అడుక్కోవడమనేది తీర్పుదినాన నీ ముఖంపై ఒక మచ్చగా కనబడుతుంది. అడుక్కోవడం కేవలం ముగ్గురి కోసమే తగును: కటిక దరిద్రంలో ఉన్నవాడు, పీకల దాకా అప్పుల్లో కూరుకు పోయి ఉన్నవాడు మరియు వాపసు చేయవలసిన అమానతు ధనం లేక ఇబ్బంది పడుతున్నవాడు.

అలాగే ‘జ్ఞానం సంపాదించడమనేది ప్రతి ముస్లింపై ఉన్న బాధ్యత’ అనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పలుకులను సునన్ ఇబ్నె మాజాహ్ లోని హదీథు ఉల్లేఖిస్తున్నది.

ఖుర్ఆన్ మరియు సున్నతుల జ్ఞానం స్పష్టంగా అన్నింటి కంటే అత్యంత ఉత్తమమైన జ్ఞానం మరియు మానవజాతికి ఎక్కువ ప్రయోజనం కలుగజేసే జ్ఞానం. ఖుర్ఆన్ మరియు సున్నతులు ఈ భూమండలం గురించి పరిశోధించ వద్దని నిరోధించడం లేదు.

వాస్తవానికి, క్రింది ఖుర్ఆన్ వచనం ప్రకారం, మనం జీవిస్తున్న ఈ సువిశాల ప్రపంచం గురించి క్షుణ్ణంగా పరిశోధించమని సృష్టికర్త మనల్ని ప్రోత్సహిస్తున్నాడు,

 “జాగ్రత్త! భూమ్యాకాశాల సృష్టిలో మరియు రాత్రింబవళ్ళ మార్పులో, తప్పకుండా అర్థం చేసుకునే ప్రజల కొరకు చిహ్నాలు ఉన్నాయి. ప్రజలలో ఎవరైతే నిలుచుని, కూర్చొని, ప్రక్కలపై పడుకుని అల్లాహ్ ను కొనియాడుతూ ఉంటారో, భూమ్యాకాశాల సృష్టిలోని అబ్బురాల గురించి దీర్ఘంగా ఆలోచిస్తారో అలాంటి వారు ఇలా వేడుకుంటారు: "మా ప్రభూ! నీవు వీటన్నింటినీ వృథాగా సృష్టించలేదు! నీవు ఎంతో ఘనమైన వాడివి! నరకాగ్ని నుండి మమ్మల్ని కాపాడు.” [3:190-191] 

4.    ఇస్లాం ధర్మం ఖడ్గం ద్వారా వ్యాపించిందా ?

జవాబు: ఇస్లాం ధర్మం సైనిక బలం ద్వారా వ్యాపించి ఉండకపోతే, నేడు ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అవలంబీకులను కలిగి ఉండేది కాదని కొందరు ముస్లిమేతరులు సర్వసాధారణంగా చేసే ఒక ఫిర్యాదు. ఖడ్గ బలం ద్వారా వ్యాపించింది అనటంలో ఏ మాత్రం నిజం లేదనీ, వాస్తవానికి దాని సహజసిద్ధమైన, స్వాభావికమైన, అంతర్గతమైన ‘సత్యబలం’, హేతువు (REASON) మరియు తర్కం (LOGIC) మొదలైనవే దాని శీఘ్ర వ్యాప్తికి అసలు కారణాలని క్రింది అంశాలు స్పష్టంగా ఋజువు చేస్తున్నాయి.

1.   ఇస్లాం అంటే శాంతి, సమర్పణ.

ఇస్లాం అనే పదం సలామ్ అనే మూలపదం నుండి వచ్చింది. సలామ్ అంటే శాంతి అని అర్థం. దీని మరో అర్థం స్వయంగా తన ఇష్టాన్ని అల్లాహ్ కు సమర్పించుకోవడం. కాబట్టి, ఇస్లాం ధర్మం అంటే స్వయంగా తన ఇష్టాన్ని సర్వలోక సృష్టికర్త, ప్రభువైన అల్లాహ్ కు సమర్పించుకోవడం ద్వారా పొందగలిగే ఒక శాంతియుత ధర్మం.

2.   కొన్ని సందర్భాలలో శాంతిని కాపాడేందుకు బలాన్ని ఉపయోగించటం తప్పనిసరి అవుతుంది.

ఈ ప్రపంచ ప్రజలలో మొత్తం అందరూ శాంతి మరియు సామరస్యాలు కొనసాగాలని కోరుకోరు. స్వార్థప్రయోజనాల కోసం అనేకమంది వాటిని చిన్నాభిన్నం చేయాలని ప్రయత్నిస్తుంటారు. కాబట్టి కొన్ని సందర్భాలలో శాంతి సామరస్యాలను కొన సాగించేందుకు బలాన్ని ఉపయోగించవలసి వస్తుంది. ఖచ్ఛితంగా ఈ కారణం వలననే మన వద్ద పోలీసు వ్యవస్థ స్థాపించబడింది. వారు క్రిమినల్స్ మరియు సంఘ విద్రోహులను తమ బలంతో అణిచి వేసి, దేశంలో శాంతిని పునరుద్ధరిస్తారు. ఇస్లాం ధర్మం శాంతిని సమర్ధిస్తుంది. అలాగే, హింస, అన్యాయం, అక్రమం, అరాచకం మొదలైన వాటికి వ్యతిరేకంగా పోరాడి, అక్కడ శాంతిని, న్యాయాన్ని స్థాపించమని తన సహచరులను ప్రోత్సహిస్తుంది. ఒక్కోసారి ఇలాంటి సందర్భాలలో బలాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. కేవలం శాంతి మరియు న్యాయ స్థాపనలో మాత్రమే బలాన్ని ఉపయోగించవచ్చని ఇస్లాం ధర్మం అనుమతి ఇస్తున్నది.

3.   సుప్రసిద్ధ చరిత్రకారుడు డి లేసీ ఓలియరీ (De Lacy O’Leary) .

ఇస్లాం ధర్మం ఖడ్గం ద్వారా వ్యాపించింది అనే అపార్థానికి ఉత్తమ జవాబు సుప్రసిద్ధ చరిత్రకారుడు డి లేసీ ఓలియరీ, తన పుస్తకం "Islam at the cross road (ఇస్లాం ఎట్ ద క్రాస్ రోడ్)" (Page 8) లో ఇచ్చినాడు:

"తీవ్రవాద ముస్లింలు ప్రపంచ దేశాలను జయిస్తూ, తాము ఆక్రమించుకున్న ప్రజలను బలవంతంగా ఇస్లాం ధర్మం స్వీకరించేలా చేసారనేది చరిత్రకారులు చరిత్రలో ఎన్నడూ ఏ విషయంలోనూ మాటిమాటికీ రిపీట్ చేయని అత్యంత అర్థ రహితమైన మరియు న్యాయవిరుద్ధమైన విచిత్ర విషయం."

4.   స్పెయిన్ దేశాన్ని ముస్లింలు 800 సంవత్సరాలు పరిపాలించారు.

ముస్లింలు స్పెయిన్ దేశాన్ని దాదాపు 800 ఏళ్ళు పరిపాలించారు. స్పెయిన్ ప్రజలు తమ ధర్మాన్ని వదిలి, ఇస్లాం ధర్మాన్ని బలవంతంగా స్వీకరించేలా ముస్లింలు ఎన్నడూ ఖడ్గాన్ని ఉపయోగించలేదు. అయితే, తర్వాత కాలంలో అక్కడ క్రైస్తవ క్రూసేడర్లు వచ్చారు మరియు ముస్లింల ఉనికి లేకుండా చేసారు. ఆ కాలంలో బహిరంగంగా అదాన్ పిలుపు ఇవ్వగలిగే ఒక్క ముస్లిం కూడా లేకపోయాడు.

5.  అరబ్బు దేశాలలో 14 మిలియన్ల అరబ్బులు కోప్టిక్ క్రైస్తవులు.

అరేబియా ద్వీపకల్పం 1400 ఏళ్ళ నుండి ముస్లింల పరిపాలనలో ఉంది. అక్కడి కొంత భాగాన్ని మాత్రమే కొన్నేళ్ళు పాటు బ్రిటీష్ మరియు ఫ్రెంచ్ ప్రభుత్వాలు పరిపాలించాయి. మొత్తం మీద అరేబియా ప్రాంతాన్ని ముస్లింలు 1400 ఏళ్ళ నుండి పరిపాలిస్తున్నారు. అయినా ఈనాటికీ అక్కడ దాదాపు 14 మిలియన్ల మంది కోప్టిక్ క్రైస్తవులు తరతరాల నుండి జీవిస్తున్నారు. ఒకవేళ ముస్లింలే గనుక ఖడ్గాన్ని ఉపయోగించి ఉన్నట్లయితే, అక్కడ ఈనాడు తన క్రైస్తవ ధర్మంలో కొనసాగుతున్న ఒక్క కోప్టిక్ క్రైస్తవ అరబ్బు కూడా మిగిలి ఉండేవాడు కాదు.

6.   భారతదేశంలో 80% కంటే ఎక్కువ మంది ప్రజలు ముస్లిమేతరులు.

భారతదేశాన్ని ముస్లింలు దాదాపు వెయ్యి సంవత్సరాలు పరిపాలించారు. భారతదేశంలోని ప్రతి ముస్లిమేతరుడిని ఇస్లాం స్వీకరించేలా ఒత్తిడి రాగలిగేటంత బలమైన స్థితిలో ఉండటం వలన ఒకవేళ వారలా చేయదలుచుకుంటే, దాని నుండి వారి నెవరూ ఆపలేక పోయేవారు. ఈనాడు భారతదేశంలో 80% కంటే ఎక్కువ మంది ముస్లిమేతరులు నివసిస్తున్నారు. ఇస్లాం ధర్మం ఖడ్గం ద్వారా వ్యాపించ లేదనడానికి ఈనాడు ఈ భారతీయ ముస్లిమేతరులందరూ సాక్ష్యంగా ఉన్నారు.

7.  ఇండోనేషియా మరియు మలేషియా.

ఇండోనేషియా ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగి ఉన్న దేశం. మలేషియా దేశంలో అత్యధిక ప్రజలు ముస్లింలే. మరి ఎవరినైనా ఈ ప్రశ్న అడగవచ్చా, "ఇండోనేషియా మరియు మలేషియా దేశాలపై ఏ ముస్లిం సైన్యం దండెత్తింది?"

8. ఆఫ్రికా ఖండపు తూర్పు తీరం.

అలాగే, ఆఫ్రికా ఖండపు తూర్పు తీరంలో కూడా ఇస్లాం ధర్మం చాలా వేగంగా వ్యాపించింది. ఒకవేళ ఇస్లాం ధర్మం ఖడ్గ బలం వలన వ్యాపించింది అనుకుంటే, ఎవరైనా ఈ ప్రశ్న అడగవచ్చు కదా, "ఆఫ్రికా ఖండపు తూర్పు తీరంపై ఏ ముస్లిం సైన్యం దండెత్తింది?"

 9. థామస్ కార్లయిల్ (Thomas Carlyle).

సుప్రసిద్ధ చరిత్రకారడు థామస్ కార్లయిల్  తన పుస్తకం "Heroes and Hero worship హీరోస్ అండ్ హీరో వర్షిప్", లో ఇస్లాం ధర్మం ఖడ్గబలం ద్వారా వ్యాపించింది అనే అపార్థాన్ని ఖండిస్తూ ఇలా వ్రాసినాడు: "అవును ఖచ్ఛితంగా ఖడ్గమే, కానీ మీ ఖడ్గాన్ని ఎక్కడ నుండి పొందుతారు? ప్రతి నూతన ఆలోచన ఆరంభంలో ఖచ్ఛితంగా మైనారిటీ దశలోనే ప్రారంభ మవుతుంది – కేవలం ఎవరో ఒక వ్యక్తి మెదడులో మాత్రమే ప్రారంభ మవుతుంది. ఒక్కడి మెదడులోనే అయినా అది అక్కడ నిలదొక్కు కుంటుంది. మొత్తం ప్రపంచంలో కేవలం ఒకే ఒక్కడు దానిని విశ్వసిస్తాడు, మొత్తం ప్రపంచ ప్రజలందరికి వ్యతిరేకంగా ఒకే ఒక్కడు నిలబడి ఉంటాడు. ఆ స్థితిలో అతడు ఖడ్గాన్ని తీసుకుని బలవంతంగా తన ఆలోచనను ఇతర ప్రజలలో వ్యాపింప జేయాలని చూస్తే, అది అతడికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు. తప్పకుండా నీవు (ప్రచార) కత్తిని తీసుకోవాలి! ఆ తర్వాత అది స్వయంగా తనకు తోచిన విధంగా వ్యాపిస్తూ పోతుంది."

10. ధర్మంలో ఎలాంటి బలవంతం ఉండరాదు.

ఏ ఖడ్గబలంతో ఇస్లాం ధర్మం వ్యాపించింది? ముస్లింల చేతిలో పదునైన ఖడ్గం ఉన్నా దానిని వారు ఇస్లాం ధర్మ వ్యాప్తి కోసం వాడలేరు ఎందుకంటే క్రింది ఖుర్ఆన్ వచనం వారిని ఇలా ఆదేశిస్తున్నది:

"ధర్మంలో ఎలాంటి బలవంతం ఉండరాదు: అసత్యం నుండి సత్యం చాలా స్పష్టంగా నిలదొక్కుకుంటుంది" [ఖుర్ఆన్ 2:256]

11. తెలివిగలవారి ఖడ్గం.

ఇది తెలివిగలవారి ఖడ్గం. ప్రజల హృదయాలను మరియు మనస్సులను జయించే ఖడ్గం ఇది. ఖుర్ఆన్ లోని 16వ అధ్యాయమైన సూరతున్నహల్ లోని 125వ వచనం ఇలా ప్రకటిస్తున్నది:

"వివేకం మరియు ఉత్తమ సందేశం ద్వారా ప్రభువు వైపునకు ఆహ్వానించండి. ఇంకా అత్యుత్తమమైన మరియు అత్యంత ఉదారమైన రీతిలో వారితో వాదించండి." ఖుర్ఆన్ 16:125

12. ప్రపంచ ధర్మాలలో 1934 నుండి అభివృద్ధి చెందున్న ధర్మం.

1986వ సంవత్సరపు రీడర్స్ డైజెష్ట్ అల్ మనాక్ (‘Almanac’) లో 1934 నుండి 1984 వరకు గడిచిన అర్థ శతాబ్ద కాలంలో ప్రపంచంలో అభివృద్ధి చెందిన ప్రధాన ధర్మాల గణాంక వివరాల గురించి ఒక వ్యాసం ప్రచురించబడింది. ఇదే వ్యాసం ది ప్లెయిన్ ట్రూథ్ (The Plain Truth) అనే మ్యాగజైనులో కూడా ప్రచురితమైంది. వాటన్నింటిలో ఇస్లాం ధర్మం 235% అభివృద్ధి శాతంతో మొట్ట మొదటి స్థానంలో ఉన్నది. దాని తర్వాత 47% అభివృద్ధి శాతంతో క్రైస్తవ ధర్మం రెండో స్థానంలో ఉంది. మరి, ఈ శతాబ్దంలో ఇస్లాం ధర్మ వ్యాప్తి కొరకు ఏ యుద్ధం జరిగింది మరియు ఇన్ని మిలియన్ల ప్రజలను ముస్లింలుగా మార్చిందని ఎవరైనా ప్రశ్నించవచ్చు కదా?

13. అమెరికా మరియు యూరోపు దేశాలలో అన్నిధర్మాల కంటే అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ధర్మం ఇస్లాం ధర్మం.

ఈనాడు అమెరికాలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ధర్మం ఇస్లాం ధర్మం. అలాగే యూరోపులో కూడా అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ధర్మం ఇస్లాం ధర్మమే. మరి, ఈ పాశ్చాత్య దేశాలలో ఏ ఖడ్గం ప్రజలను అంత ఎక్కువ సంఖ్యలో ఇస్లాం ధర్మం స్వీకరించేలా బలవంత పెడుతున్నది?

14.   డాక్టర్ జోసెఫ్ ఆదమ్ పీర్సన్ (Dr. Joseph Adam Pearson).

డాక్టర్ జోసెఫ్ ఆదమ్ పీర్సన్ ఈ నిజమైన పలుకులు పలికారు, "ఏదో ఒకరోజు న్యూక్లియర్ ఆయుధాలు అరబ్బుల చేతికి చిక్కుతాయని భయపడుతున్న ప్రజలు, ఇప్పటికే ఇస్లామీయ బాంబు పేల్చి వేయ బడిందనే యదార్థాన్ని గ్రహించ లేకపోతున్నారు. ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పుట్టిన రోజునే అది పేల్చబడింది".

5.    ఎందుకు అనేకమంది ముస్లింలు ఫండమెంటలిష్టులుగా మరియు ఉగ్రవాదులుగా పేర్కొనబడు తున్నారు?

జవాబు: ధార్మిక లేదా ప్రాపంచిక వ్యవహారాలపై జరిగే ప్రతి చర్చలో మామూలుగా ఈ ప్రశ్న ముస్లింలపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎక్కు పెట్టబడుతుంది. అన్ని రకాల మీడియాలలో ముస్లింలకు మరియు ఇస్లాం ధర్మానికి సంబంధించిన సమాచారంలో అనేక అపార్థాలు స్థిరంగా పాతుకు పోయాయి. వాస్తవానికి, అలాంటి అపార్థాలు మరియు తప్పుడు ప్రచారాలు తరుచుగా ముస్లింలపై దౌర్జన్యానికి మరియు పక్షపాతానికి దారి తీస్తున్నాయి. ఉదాహరణకు, అమెరికాలోని ఓక్లహామా బాంబు ప్రేలుడు జరిగిన తర్వాత అక్కడి మీడియా ప్రవర్తన గురించి తీసుకుందాము – బాంబు ప్రేలుడు జరిగిన వెంటనే అక్కడి మీడియా ఆ సంఘటన వెనుక మధ్యేసియా దేశాల కుట్ర (‘Middle Eastern conspiracy’) ఉన్నట్లు ప్రకటించింది. అయితే తర్వాత జరిగిన నేర పరిశోధనలలో ఆ బాంబు ప్రేలుళ్ళ వెనుక అమెరికన్ ఆర్మడ్ ఫోర్సెస్ కు చెందిన ఒక సైనికుడు ఉన్నట్లు గుర్తించబడింది.  

ఇక ఇప్పుడు ఛాందసవాదం (‘fundamentalism’) మరియు ఉగ్రవాదం (‘terrorism’) గురించి చర్చించుదాం:

1. ఫండమెంటలిశమ్, మౌలికవాదం (‘fundamentalist’) అనే పదం యొక్క నిర్వచనం:

ఫండమెంటలిష్టు అంటే తను నమ్మిన వాదం, సిద్ధాంతం లేదా ధర్మంలోని మౌలికాంశం, మూలాధారం, ప్రాతిపదిక, మూలసిద్ధాంతం మొదలైన ప్రధానమైన మరియు ఆవశ్యకమైన అంశాలను చిత్తశుద్ధితో అనుసరించేవాడు మరియు తు.చ. తప్పక పాటించేవాడు. ఒక వ్యక్తి మంచి డాక్టరుగా మారాలంటే, తప్పకుండా వైద్యశాస్త్రంలోని మూలసిద్ధాంతాలను, మౌలికాంశాలను, మూలా ధారాలను, ప్రాతిపదికలను అతడు క్షుణ్ణంగా తెలుసుకోవాలి, అనుసరించాలి మరియు ప్రాక్టీసు చేయాలి. మరో మాటలో, అతడు వైద్యశాస్త్రంలో ఫండమెంటలిష్టుగా (fundamentalist) మారాలి. అలాగే, ఒక మంచి గణితశాస్త్రజ్ఞుడిగా మారడానికి, తప్పకుండా గణితశాస్త్రంలోని మూలసిద్ధాంతాలను, మౌలికాంశాలను, మూలా ధారాలను, ప్రాతిపదికలను, అతడు క్షుణ్ణంగా తెలుసుకోవాలి, అనుసరించాలి మరియు ప్రాక్టీసు చేయాలి. అంటే అతడు గణితశాస్త్రంలో ఫండమెంటలిష్టుగా (fundamentalist) మారాలి. అలాగే, ఒక మంచి సైంటిష్టుగా మారాలంటే అతడు తప్పకుండా వైజ్ఞానిక శాస్త్రంలోని మౌలికాంశాలను, మూలాధారాలను, ప్రాతిపదికలను, మూలసిద్ధాంతాలను క్షుణ్ణంగా తెలుసు కోవాలి, అనుసరించాలి మరియు ప్రాక్టీసు చేయాలి. అంటే అతడు వైజ్ఞానిక శాస్త్రంలో ఫండమెంటలిష్టుగా (fundamentalist) మారాలి.

2.   ఫండమెంటలిష్టులందరూ సమానం కాదు.

ఎవరైనా ఫండమెంటలిష్టులందరినీ ఒకే బ్రష్ తో రంగు పులమలేరు. అంటే ఫండమెంటలిష్టులందరూ మంచివారని గానీ లేదా చెడువారని గానీ వర్గీకరించటం ఎవరికీ సాధ్యం కాదు. వారు దృష్టి కేంద్రీకరించిన విభాగం లేదా అంశంపై మాత్రమే అలాంటి వర్గీకరణ ఆధారపడి ఉంటుంది. ఒక ఫండమెంటల్ దోపిడీ దొంగ లేదా బందిపోటు దొంగ సమాజానికి హాని కలిగిస్తాడు. కాబట్టి అతడిని ఎవ్వరూ ఇష్టపడరు. మరో వైపు ఒక ఫండమెంటల్ డాక్టర్, సమాజానికి మేలు కలుగజేస్తాడు. కాబట్టి అతడిని అందరూ గౌరవిస్తారు.

3.   ఒక ముస్లిం ఫండమెంటలిష్టుగా పేర్కొనబడటం నాకెంతో గొప్పగా కనబడుతుంది.

నేనొక ముస్లిం ఫండమెండలిష్టును. అల్లాహ్ దయ వలన, ఇస్లాం ధర్మం యొక్క మౌలిక, మూలాధార, మూలసైద్ధాంతిక, ప్రాతిపదిక అంశాలను నేను గ్రహించడానికి, అనుసరించడానికి మరియు ప్రాక్టీసు చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. ఒక నిజమైన ముస్లిం తనొక ఫండమెంటలిష్టునని ఒప్పుకోవడానికి సిగ్గు పడడు. నేను ఒక ఫండమెంటలిష్టు ముస్లింను అని చెప్పడాన్ని ఎంతో గర్వంగా భావిస్తున్నాను. ఎందుకంటే, ఇస్లామీయ ధర్మం యొక్క ఫండమెంటల్సు అంటే మూల సిద్ధాంతాలు మానవజాతికి మరియు మొత్తం ప్రపంచానికి ఎంతో ప్రయోజనాన్ని కలుగజేస్తాయి. మొత్తం మీద మానవజాతికి హాని కలిగించే లేదా మానవజాతి ప్రయోజనాలకు నష్టం కలిగించే ఒక్క మూలసిద్ధాంతం కూడా ఇస్లాం ధర్మంలో లేదు. అనేక మంది ప్రజలు ఇస్లాం ధర్మం గురించి అపార్థాలు పుట్టిస్తూ ఉంటారు మరియు అనేక ఇస్లామీయ బోధనలు అసంపూర్ణమైనవిగా మరియు అనుచితమైనవిగా పరిగణిస్తారు. దీనికి కారణం వారికి ఇస్లాం ధర్మం గురించి సరైన మరియు తగినంత జ్ఞానం లేకపోవడం. ఒకవేళ ఎవరైనా ఇస్లాం ధర్మ బోధనలను నిష్పక్షపాతంగా విమర్శనాత్మకమైన దృష్టితో పరిశీలిస్తే, వ్యక్తిగత స్థాయిలోనూ మరియు సామాజిక స్థాయిలోనూ పనికి వచ్చే మొత్తం ప్రయోజనాలన్నింటినీ ఇస్లాం ధర్మం కలిగి ఉందనే వాస్తవాన్ని ఒప్పుకోకుండా ఉండలేరు.

4.   ఫండమెంటలిష్టు (fundamentalist) అనే పదం యొక్క డిక్షనరీ అర్థం:

వెబ్ స్టర్ నిఘంటువు (Webster’s dictionary) ప్రకారం 20వ శతాబ్దపు ఆరంభంలో మొదలైన అమెరికన్ ప్రొటెష్టనిశమ్ ఉద్యమమే ఫండమెంటలిశమ్. అది ఆధునిక వాదానికి భిన్నంగా వచ్చిన ప్రతిస్పందన. దైవవిశ్వాస మరియు నైతిక అంశాలలోనే కాకుండా చారిత్రక సాహిత్య పరంగా కూడా బైబిల్ లో ఎలాంటి పొరపాట్లు లేవనీ అది నొక్కి వక్కాణించింది. కాబట్టి ఫండమెంటలిశమ్ అనేది బైబిల్ ఎలాంటి తప్పులు మరియు పొరపాట్లు లేని ఒక స్వచ్ఛమైన దైవవచనం అని విశ్వసించే క్రైస్తవ బృందాన్ని సూచించే ఒక పదంగా ఆరంభంలో వాడబడింది.

ఆక్స్ ఫర్డ్ నిఘంటువు (Oxford dictionary) ప్రకారం, ఫండమెంటలిశమ్ అంటే ఏ ధర్మంలోనైనా ప్రత్యేకంగా ఇస్లాం ధర్మంలో ప్రాచీన లేక మౌలిక సిద్ధాంతాలను ఖచ్ఛితంగా కొనసాగించడం.

ఈనాడు ఫండమెంటలిష్టు అనే పదం వినగానే ఎవరికైనా మీడియా దుష్ప్రచారం చేస్తున్న ఒక ముస్లిం టెర్రరిష్టు రూపం గుర్తుకు వస్తుంది.

5.   ప్రతి ముస్లిం ఒక టెర్రరిష్టుగా మారాలి

ప్రతి ముస్లిం ఒక టెర్రరిష్టుగా మారాలి. టెర్రరిష్టు అంటే టెర్రర్ పుట్టించేవాడు. ఎప్పుడైతే ఒక దొంగ ఒక పోలీసు ఆఫీసరును చూస్తాడో, వెంటనే అతడిలో టెర్రర్ పుట్టుకు వస్తుంది. ఇక్కడ దొంగ కొరకు పోలీసు ఆఫీసరు ఒక టెర్రరిష్టు. అలాగే సమాజంలోని దొంగలు, దోపిడీదార్లు, రేపిష్టులు వంటి సంఘవిద్రోహశక్తుల కొరకు ప్రతి ముస్లిం ఒక టెర్రరిష్టుగా మారాలి. అలాంటి సంఘ విద్రోహశక్తులు ఒక ముస్లింను చూడగానే, వారిలో టెర్రర్ పుట్టుకు రావాలి. మామూలుగా టెర్రరిష్టు పదం సామాన్య ప్రజలలో టెర్రర్ పుట్టించే వ్యక్తిని సూచించే విధంగా వాడబడుతుండటం నిజమైన విషయమే. అయితే ఒక నిజమైన ముస్లిం కేవలం సంఘ విద్రోహ శక్తుల కొరకు మాత్రమే టెర్రరిష్టుగా మారతాడు గానీ అమాయక ప్రజల కొరకు ఎంతమాత్రం కాదు. వాస్తవానికి అమాయక ప్రజల కొరకు అతడు శాంతి, సామరస్యాల మూలంగా మారాలి.

6.  ఎవరైనా చేసిన ఒకే పనికి పరస్పర విరుద్ధమైన పేర్లు పెట్టడం అంటే టెర్రరిష్టనీ మరియు దేశభక్తుడనీ (‘patriot’).

బ్రిటీష్ పరిపాలన నుండి స్వాతంత్ర్యం పొందక ముందు, అహింసా సిద్ధాంతాన్ని నమ్మని కొందరు భారతీయ స్వాతంత్ర్య యోధులను బ్రిటీష్ ప్రభుత్వం టెర్రరిష్టులుగా ప్రకటించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వారే దేశభక్తులుగా కొనియాడబడినారు. అంటే వారు చేసిన ఒకే పనికి రెండు విభిన్నమైన పేర్లు ఇవ్వబడినాయి. ఒకరు వారిని టెర్రరిష్టులని ఆరోపిస్తే, మరొకరు వారిని దేశభక్తులని కొనియాడారు. భారత దేశాన్ని పరిపాలించే హక్కు బ్రిటీష్ సామ్రాజ్యానికి ఉందని నమ్మే ప్రజలు వారిని టెర్రరిష్టులని అన్నారు. మరి, భారత దేశాన్ని పరిపాలించే హక్కు బ్రిటీష్ సామ్రాజ్యానికి లేదని నమ్మే ప్రజలు వారిని దేశభక్తులని, స్వాతంత్ర్య సమర యోధులనీ పిలిచారు.

కాబట్టి ఎవరైనా వ్యక్తి గురించి తీర్పు ఇచ్చే ముందు, అతడికి తన వాదనను వినిపించే పూర్తి అవకాశాన్ని ఇవ్వాలి. ఇరువైపుల వాదనలు వినాలి, విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి మరియు వ్యక్తి యొక్క తర్కం మరియు ఉద్దేశ్యాన్ని పరిగణలోనికి తీసుకోవాలి, చివరిగా ఆ వ్యక్తి గురించి తీర్పు చెప్పాలి.

7.   ఇస్లాం అంటే శాంతి, సమర్పణ

ఇస్లాం అనే అరబీ పదానికి మూలం సలామ్ అనే పదం. దీని అర్థం శాంతి మరియు సమర్పణ. ఇదొక శాంతియుత ధర్మం. ప్రపంచ వ్యాప్తంగా శాంతి స్థాపించాలని మరియు శాంతిని ప్రోత్సహించాలని దీని మూలసిద్ధాంతాలు తన సహచరులను బోధిస్తున్నాయి.

కాబట్టి ప్రతి ముస్లిం ఒక ఫండమెంటలిష్టుగా మారాలి అంటే అతడు శాంతియుత ధర్మమైన ఇస్లాం బోధనలను అతడు అనుసరించాలి: సమాజంలో శాంతిని మరియు న్యాయాన్ని స్థాపించడం కోసం అతడు సంఘ విద్రోహశక్తుల పాలిట ఒక టెర్రరిష్టుగా మారాలి.

6.    ఎందుకు ముస్లిమేతరులను కాఫిర్లని పిలుస్తూ ముస్లింలు వారిని దూషిస్తున్నారు?

జవాబు: ‘కాఫిర్’ అంటే తిరస్కరించేవాడు అని అర్థం.

‘కాఫిర్’ అనే పదం కుఫ్ర్ అనే పదం నుండి గ్రహించబడింది. దీని అర్థం దాచటం లేదా తిరస్కరించడం. ఇస్లామీయ పరిభాష ప్రకారం, కాఫిర్ అంటే ఇస్లాం ధర్మం యొక్క సత్యాన్ని దాచే లేదా తిరస్కరించే వ్యక్తి. ఇంగ్లీషులో ఇస్లాం ధర్మాన్ని తిరస్కరించే వ్యక్తిని నాన్ ముస్లిం అని పిలుస్తారు.

ఒకవేళ ముస్లిమేతరులకు బాధ కలిగితే, వారు వెంటనే ఇస్లాం స్వీకరించాలి.

ఒకవేళ ఎవరైనా ముస్లిమేతరుడికి కాఫిర్ లేదా ముస్లిమేతరుడు అనే పదం దూషణగా అనిపిస్తే, అతడు ఇస్లాం ధర్మం స్వీకరించడాన్ని ఎంచుకోవాలి. అప్పుడు మేము అతడిని కాఫిర్ లేదా ముస్లిమేతరుడు అని పిలవటం ఆపివేస్తాము.

 ఇస్లామీయ మూలసిద్ధాంతంపై కొన్ని ప్రశ్నోత్తరాలు

1.    ముస్లింల మూలవిశ్వాసం ఏమిటి?

జవాబు: ఏకైక, అద్వితీయ, సాటిలేని దేవుడైన అల్లాహ్, ఆయన సృష్టించిన దైవదూతలను, ఆయన పంపిన దివ్యావతరణలను, దివ్యసందేశాన్ని ప్రజలకు అందజేయటం కొరకు ఆయన ఎంచుకొన్న ప్రవక్తలను, అంతిమ తీర్పుదినాన్ని, తమ తమ ఆచరణలకు వహించవలసిన వ్యక్తిగత బాధ్యతను, మానవుడి విధివ్రాతపై అల్లాహ్ కు ఉన్న ఆధిపత్యాన్ని మరియు పరలోక జీవితాన్ని ముస్లింలు విశ్వసిస్తారు. ఆదం నుండి మొదలై నోవా, అబ్రహాం, ఇష్మాయీల్, ఇసాక్, జాకోబ్, జోసేఫ్, మోసెస్, ఆరోన్, డేవిడ్, సోలోమాన్, ఎలియాస్, జోనాహ్, జాన్ ది బాప్టిస్ట్ మరియు జీసస్ (వారందరిపై శాంతి కురుయుగాక) ప్రవక్తల పరంపరను ముస్లింలు విశ్వసిస్తారు. అయితే ప్రళయదినం వరకు పుట్టబోయే మొత్తం మానవాళి కొరకు అంతకు పూర్వం పంపబడిన దివ్యసందేశాలన్నింటినీ మరలా ధృవీకరిస్తూ మరియు క్లుప్తంగా వాటి సారాంశాన్ని తెలుపుతూ అంతిమ దివ్యసందేశం రూపంలో  జిబ్రయీల్ దైవదూత ద్వారా అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై దివ్యఖుర్ఆన్ అవతరించబడింది.

2.    ఇస్లాం మరియు క్రైస్తవ ధర్మాల ఆరంభం విభిన్నమైనదా?

జవాబు: లేదు. యూద ధర్మంతో సహా క్రైస్తవ మరియు ఇస్లాం ధర్మాలు మూడూ ప్రవక్త అబ్రహాం అలైహిస్సలాంతోనే మొదలవు తున్నాయి. మరియు వాటి ముగ్గురు ప్రవక్తలు తిన్నగా ప్రవక్త అబ్రహాం కుమారుల సంతతికే చెందుతారు – ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త అబ్రహాం పెద్దకుమారుడైన ఇస్మాయీల్ (అ) సంతతిలోని వారు. మోసెస్ మరియు జీసస్ అలైహిస్సలాంలు ప్రవక్త అబ్రహాం రెండో కుమారుడైన ఇసాక్ సంతతిలోని వారు.  

ప్రవక్త అబ్రహాం మక్కాలో జనావాసాన్ని ఏర్పరచి, ముస్లింలు ప్రతిరోజు చేసే నమాజు కొరకు ఖిబ్లా దిక్కుగా (దిశగా) గౌరవించే పవిత్ర కాబాగృహాన్ని పునఃనిర్మించారు.

3.    ఇతర ధర్మాలను ఇస్లాం సహిస్తుందా ?

జవాబు: ఖుర్ఆన్ ఇలా ప్రకటిస్తున్నది: ధర్మం విషయంలో మీపై కాలు దువ్వకుండా, మిమ్మల్ని మీ ఇల్లూ వాకిలి నుండి వెళ్ళగొట్టకుండా ఉన్న వారితో మీరు సద్వ్యవహారం చేయడాన్ని, వారికి న్యాయం చేయడాన్ని అల్లాహ్ ఎంత మాత్రం నిరోధించడు. పైగా అల్లాహ్ న్యాయం చేసేవారిని ప్రేమిస్తాడు. (ఖుర్ఆన్, 60:8).

4.    జీసస్ అలైహిస్సలాం గురించి ముస్లింల అభిప్రాయం ఏమిటి ?

జవాబు: ముస్లింలు ప్రవక్త జీసస్ అలైహిస్సలాంను ఎంతో గౌరవిస్తారు మరియు ఆదరిస్తారు, ఆయన పునరాగమనం కొరకు ఎదురు చూస్తారు. మానవాళి వైపు పంపబడిన అల్లాహ్ యొక్క మహోన్నత ప్రవక్తలలో ఆయన కూడా ఒకరని విశ్వసిస్తారు. ఏ ముస్లిం వ్యక్తీ ఆయనను కేవలం జీసస్ అని ఎన్నడూ సంభోదించడు, ఆయన పేరు ప్రస్తావించినపుడల్లా అలైహిస్సలాం అంటే ఆయనపై శాంతి కురుయుగాక అనే పదాలతో ఆయన పేరును ప్రస్తావిస్తాడు. కన్యమేరీకి ఆయన జన్మించడాన్ని ఖుర్ఆన్ గ్రంథం ధృవీకరిస్తున్నది. ఖుర్ఆన్ గ్రంథం మర్యమ్ పేరుతో ఒక పూర్తి అధ్యాయాన్ని కలిగి ఉంది. మొత్తం సృష్టిలో అత్యంత పవిత్రురాలైన మహిళ మర్యమ్ అని ఇస్లాం ప్రకటిస్తున్నది.

5.    ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఆరాధిస్తారనేది నిజమేనా?

జవాబు: కాదు, ముమ్మాటికీ కానే కాదు. క్రైస్తవులు ఏసుక్రీస్తును ఆరాధిస్తారు. కాబట్టి వారు క్రైస్తవులని పిలవబడుతున్నారు. ముస్లింలు ఏకైకుడు, అద్వితీయుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తారు. అంతే గానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఆరాధించరు. అందువలన వారు ముహమ్మదీయులని పిలవబడరు. ముస్లింలు అల్లాహ్ ఆజ్ఞలను పూర్తిగా పాటిస్తారు. అల్లాహ్ ఆదేశాలకు అనుగుణంగా, అల్లాహ్ కు విధేయత చూపుతూ, అల్లాహ్ అభీష్టానికి మనస్పూర్తిగా తమ ఇచ్ఛను సమర్పించుకుని జీవితపు ప్రతి అడుగూ వేస్తారు. కాబట్టి వారు ముస్లింలని పిలవబడతారు. (భాషాపరంగా ముస్లింలంటే సమర్పించుకున్న వారు)

6.    ముస్లింలు కేవలం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మాత్రమే తమ ప్రవక్తగా నమ్ముతారనేది నిజమేనా ?

జవాబు: వాస్తవానికి ముస్లింలు మొట్టమొదటి ప్రవక్త అయిన ఆదం అలైహిస్సలాం నుండి చిట్టచివరి ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు సర్వోన్నతుడైన అల్లాహ్ మానవాళి వైపు పంపిన ప్రవక్తలందరినీ మరియు సందేశహరులందరినీ విశ్వసిస్తారు. ప్రవక్తల సంఖ్య వేలల్లో లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉంది. ఏదేమైనా ఖుర్ఆన్ లో అల్లాహ్ కేవలం 25 మంది ప్రవక్తల పేర్లు మాత్రమే పేర్కొన్నాడు. వారిలో ఐదుగురిని అత్యంత ప్రబలమైన మరియు అత్యంత శక్తిమంతమైన ప్రవక్తలు గా పేర్కొన్నాడు – వారు నూహ్, అబ్రహాం, మోసెస్, జీసస్ మరియు ముహమ్మద్ (వారందరిపై అల్లాహ్ యొక్క శాంతి కురుయుగాక).

ముస్లింలు ప్రవక్తలందరినీ ఆదరిస్తారు. ఎప్పుడు ఏ ప్రవక్త పేరు ప్రస్తావించబడినా, “అలైహిస్సలాం” అంటే అల్లాహ్ యొక్క శాంతి వారిపై కురుయుగాక అని ముస్లింలు పలుకుతారు.

7.    జీసస్ అలైహిస్సలాం మరియు మేరీలను ముస్లింలు అసహ్యించుకునే బదులు ఎంతో ఇష్టపడతారనేది నిజమేనా ?

జవాబు: ముస్లింలు జీసస్ (అలైహిస్సలాం) మరియు మేరీలను విశ్వసిస్తారు, ఎంతో గౌరవిస్తారు మరియు ఆదరిస్తారు. అంతేగాక జీసస్ అలైహిస్సలాం అల్లాహ్ యొక్క అత్యంత ప్రబలమైన మరియు శక్తిమంతమైన ప్రవక్తలలో ఒకరని, ఆయన తల్లి మర్యమ్ ను మొత్తం స్త్రీలందరిలో అత్యున్నత స్థానం కొరకు అల్లాహ్ ఎంచుకున్నాడని ముస్లింలు మనస్పూర్తిగా నమ్ముతారు. జీసస్ అలైహిస్సలాం అల్లాహ్ యొక్క ఆజ్ఞ ద్వారా కన్య మేరీకి అపూర్వంగా జన్మించారని కూడా ముస్లింలు నమ్ముతారు.

అంతిమ దివ్యసందేశమైన ఖుర్ఆన్ గ్రంథంలో స్వయంగా మర్యమ్ పేరుతో ఒక పూర్తి అధ్యాయం ఉన్నది – అంత ఎక్కువ ప్రత్యేకంగా ఏ స్త్రీ పేరూ గౌరవించబడలేదు. కాబట్టి, ముస్లింల గురించి కొందరు ముస్లిమేతరులు నమ్ముతున్నట్లు కాకుండా, ముస్లింలు నిస్సందేహంగా మేరీను ఎంతో ఆత్మీయంగా గౌరవిస్తారు మరియు ఆదరిస్తారు. ఇక జీసస్ అలైహిస్సలాం విషయానికి వస్తే, అల్లాహ్ కు ఎంతో ప్రియమైన ప్రవక్తలలో ఆయన కూడా ఒకరు అని ముస్లింలు విశ్వసిస్తారు.

8.    మోసెస్ అలైహిస్సలాం యూదుల ప్రవక్త అయినా, ముస్లింలు కూడా మోసెస్ అలైహిస్సలాంను నమ్ముతారనేది ఆశ్చర్యకరమైన విషయం. ఇది నిజమేనా ?

జవాబు: మోసెస్ అలైహిస్సలాం యూదుల ప్రవక్త కాదు. ఆయన ఇస్రాయీలు సంతతి కొరకు పంపబడిన అల్లాహ్ యొక్క ప్రవక్త. ఇస్రాయీలు సంతతిని ఈజిప్టు రాజైన ఫిరౌను యొక్క అత్యాచారాల నుండి కాపాడడానికి ఆయన పంపబడినారు. అయితే, ప్రవక్త మోసెస్ అలైహిస్సలాం కూడా ఒక ముస్లిమే. ఎందుకంటే ఆయన కూడా అల్లాహ్ యొక్క దివ్యసందేశాన్నే ప్రజలకు అందజేసారు; సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ ను మాత్రమే విశ్వసించమని ఆయన బోధించారు. అల్లాహ్ ను ఆరాధించమని, ఉపవాసం పాటించమని మరియు జకాతు దానం ఇవ్వమని ఆయన ప్రజలను ఆదేశించారు.

ఎలాంటి భేదభావం లేకుండా ఇతర ప్రవక్తలందరినీ మరియు సందేశహరులందరినీ నమ్ముతున్నంత త్రికరణశుద్ధితో ముస్లింలు ప్రవక్త మోసెస్ అలైహిస్సలాంను కూడా అల్లాహ్ యొక్క మహాప్రవక్తగా విశ్వసిస్తారు.

9.    ఇస్లాం బహుదైవాలను విశ్వసిస్తుందా? ఎందుకంటే ఖుర్ఆన్ లో సంభోదించేటపుడు, ‘మేము’ అనే పదాన్ని అల్లాహ్ వాడుతున్నాడు కదా!

జవాబు: ఇస్లాం ధర్మం నిష్కర్షగా, ఖచ్చితంగా ఒక ఏకదైవత్వ ధర్మం (strictly monotheistic religion). ఎలాంటి సర్దుబాటులకు తావివ్వని, రాజీపడని స్వచ్ఛమైన ఏకదైవత్వంలో తన పూర్తి విశ్వాసాన్ని ఉంచుతున్నది. సృష్టికర్త తన దివ్యలక్షణాలలో మరియు గుణగణాలలో సాటిలేని ఏకైకుడు, అద్వితీయుడని నమ్ముతుంది. ఖుర్ఆన్ లో అనేక చోట్ల అల్లాహ్ స్వయంగా ‘మేము’ అనే పదంతో సూచించుకున్నాడు. అయితే దీని అర్థం ఒకరి కంటే ఎక్కువ దైవాలను ఇస్లాం ధర్మం విశ్వసిస్తున్నదని కాదు. 

రెండు రకాల బహువచనాలు:

అనేక భాషలలో రెండు రకాల బహువచనాలు ఉంటాయి – ఒక రకం బహువచనం, సంఖ్యాపరంగా ఒకటి కంటే ఎక్కువ వాటిని, ఎక్కువ సార్లను మరియు అనేకవారిని సూచిస్తుంది. మరోరకమైన బహువచనం గౌరవార్థకంగా బహవచనంలో దేనినైనా, ఏ వ్యక్తినైనా, ఏ శక్తినైనా సూచించే పదం.  

a. ఇంగ్లీషు భాషలో, ఇంగ్లండు మహారాణి స్వయంగా తనను తాను ‘మేము’ అని ప్రస్తావిస్తుందే గానీ ‘నేను’ అని పేర్కొనదు. ఇది ‘రాజసాన్ని’ సూచించే బహువచనంగా గుర్తించబడింది.  

b. భారతదేశ మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ హిందీ భాషలో "హమ్ దేఖ్నా చాహ్తే హై" అంటే "మేము చూడాలని అనుకుంటున్నాము." అని పలికేవారు. ఇక్కడ ‘హమ్’అంటే ‘మేము’  అని అర్థం. ఇది కూడా హిందీ భాషలో రాజసాన్ని సూచించే మరొక బహువచన పదంగా గుర్తించబడింది. 

c. అలాగే, అరబీ భాషలో, ఖుర్ఆన్ లో అల్లాహ్ తన గురించి స్వయంగా ప్రస్తావించినపుడు, తరచుగా ‘నహ్ను’ అంటే ‘మేము’ అని పేర్కొనడం జరిగింది. పైవిధంగానే ఇక్కడ కూడా దానిని రాజసాన్ని అంటే అల్లాహ్ యొక్క సార్వభౌమత్వాన్ని సూచించే ఒక గౌరవార్థక బహువచన పదంగా మాత్రమే గుర్తించాలి. అంతేగానీ సంఖ్యాపరమైన బహువచన పదంగా తీసుకోకూడదు. 

తౌహీద్  లేక ఏకదైవత్వం అనేది ఇస్లాం ధర్మం యొక్క మూలసిద్ధాంతాల్లోని అతి ముఖ్యమైన మూలసిద్ధాంతం. ఖుర్ఆన్ లో అనేకచోట్ల సాటిలేని ఏకైకుడు మరియు అద్వితీయుడైన సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ గురించి ప్రస్తావించబడింది.

ఉదాహరణకు, సూరతుల్ ఇఖ్లాస్ లో ఇలా పేర్కొనబడింది: "ప్రకటించు, సాటిలేని ఏకైకుడు, అద్వితీయుడైన ఆయనే అల్లాహ్"  [ఖుర్ఆన్ 112: 1]

10. పరలోక జీవితం ఉందని మీరెలా నిరూపించగలరు ?

1. పరలోక జీవితాన్ని నమ్మడమనేది ఒక అంధవిశ్వాసమా? ఒక మూఢనమ్మకమా ?

జవాబు: శాస్త్రీయమైన మరియు హేతుబద్ధమైన తార్కిక ఆధునిక భావాలు కలిగిన ఏ నాగరికుడైనా పరలోక జీవితాన్ని గురించి తెలిపే వచనాలను ఎలా నమ్మాలని అనేకమంది ప్రజలు ఆశ్చర్య పడుతున్నారు. తమ అంధ విశ్వాసాల, మూఢనమ్మకాలపై  ఆధారపడి వారు పరలోక జీవితాన్ని విశ్వసిస్తున్నారని కొందరు ప్రజలు భావిస్తున్నారు.

అయితే పరలోక జీవితాన్ని ఎందుకు విశ్వసించాలనేది లాజికల్ గా కూడా ఋజువు అయింది.

2.   పరలోక జీవితాన్ని విశ్వసించడమనేది ఒక హేతుబద్ధమైన విశ్వాసం

దివ్యఖుర్ఆన్ లో వైజ్ఞానిక విషయాలను సూచించే వచనాలు వెయ్యి కంటే ఎక్కువ ఉన్నాయి. ("ఖుర్ఆన్ మరియు సైన్సు" అనే పుస్తకాన్ని చదవండి). 14 శతాబ్దాలకు పూర్వమే ఖుర్ఆన్ లో పేర్కొనబడిన అనేక వైజ్ఞానిక విషయాలను కేవలం కొన్ని శతాబ్దాల క్రితమే శాస్త్రజ్ఞులు కనిపెట్టగలిగారు మరియు ధృవీకరించగలిగారు. కానీ, నేటికీ ఖుర్ఆన్ లోని ప్రతి వచనాన్ని నిరూపించగలిగే మరియు ధృవీకరించగలిగేటంత ఆధునిక స్థాయికి సైన్సు చేరుకోలేక పోయింది.

ఉదాహరణకు ఖుర్ఆన్ లో పేర్కొనబడిన వాటిలో దాదాపు 80% విషయాలు నూటికి నూరు శాతం వాస్తవమైన విషయాలేనని సైన్సు ధృవీకరించిందని  భావిద్దాం. మిగిలిన 20% గురించి, సైన్సు ఎలాంటి ప్రకటన చేయలేక పోయింది. ఎందుకంటే వాటి సత్యాసత్యాలు ధృవీకరించ గలిగేటంత ఆధునిక స్థాయికి అదింకా చేరుకోలేదు. నిజానికి ఈనాడు మనకున్న పరిమిత జ్ఞానంతో, ఈ 20% వచనాలలో ఒక్క శాతం వచనాలను కూడా అవి తప్పని లేదా వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని చెప్పలేము. కాబట్టి ఖుర్ఆన్ యొక్క 80% వచనాలు నూటికి నూరు శాతం కరక్టు అయి, మిగిలిన 20% వచనాలు తిరస్కరించబడక పోయినపుడు, ఆ 20% వచనాలు కూడా కరక్టే అవ్వచ్చని లాజిక్ అంటే హేతువు చెబుతున్నది. పరలోక జీవిత ఉనికి గురించి తెలుపబడిన వచనాలు ఈ 20% సందిగ్ద వచనాల భాగంలో ఉన్నాయి. అవి కూడా నిజమే కావచ్చని లాజిక్ కూడా చెబుతున్నది.

3.   పరలోక భావన లేకుండా శాంతి మరియు మానవ నైతిక విలువల భావనకు అర్థం పర్థం లేదు.

దొంగతనం ఒక మంచి పనా లేక చెడు పనా ? ఒక మామూలు వ్యక్తి అదొక చెడు పని అంటాడు. పరలోక జీవితాన్ని నమ్మని ఎవరైనా వ్యక్తి ఒక బలవంతుడైన మరియు ప్రబలుడైన నేరస్థుడిని దొంగతనమనేది ఒక చెడుపని అని ఎలా ఒప్పించగలడు?

ఒకవేళ నేను ఈ ప్రపంచంలో ఒక బలమైన మరియు ప్రబలమైన నేరస్థుడిని. అదే సమయంలో నేను మంచి తెలివితేటలు గలవాడిని మరియు లాజికల్ మనిషిని. దొందతనం ఒక మంచి పని అని నేనంటాను. ఎందుకంటే విలాసవంతమైన జీవితం గడపడంలో అది నాకు సహాయపడుతున్నది. అలా దొంగతనం నా కొరకు మంచి పనే.

“ఒకవేళ ఎవరైనా దొంగతనం నా కొరకు ఎందుకు చెడు పనో తెలిపే ఒక్క లాజికల్ వాదననైనా నా ముందు పెట్టగలిగితే నేను వెంటనే దానిని వదిలి వేస్తాను” అని అన్నపుడు ప్రజలు సాధారణంగా ఈ క్రింది వాదనలను అతడి ముందు పెడతారు:

a. దొంగతనానికి గురైన వ్యక్తి కష్టాలు ఎదుర్కొంటాడు

దోచుకోబడిన వ్యక్తి కష్టాలు ఎదుర్కోవలసి వస్తుందని కొందరు అంటారు. దానికి నేను తప్పకుండా అంగీకరిస్తున్నాను. కానీ, నా కొరకైతే అది లాభదాయకమే కదా! ఒకవేళ నేను వెయ్యి రూపాయలు దోచుకోగలిగితే, ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో కమ్మని భోజనం తినగలను.

b. నిన్నే ఎవరైనా దోచుకోవచ్చు.

ఏదో ఒకరోజు నన్నే ఎవరైనా దోచుకోవచ్చని కొందరు ప్రజలు అంటారు. నన్నెవరూ దోచుకోలేరు, ఎందుకంటే నేను చాలా బలమైన రౌడీని మరియు నా వద్ద వందల కొద్దీ బాడీగార్డులు ఉన్నారు. నేను ఎవరిని తలిస్తే వారిని దోచుకోగలను కానీ, నన్నెవరూ దోచుకోలేరు. దోచుకోవడమనేది ఎవరైనా సామాన్య వ్యక్తి కొరకు రిస్క్ తో కూడిన వృత్తి కావచ్చేమో గానీ నాలాంటి ఆరితేరిన బలమైన వ్యక్తి కొరకు ఎంత మాత్రమూ కాదు.

c.  పోలీసులు నిన్ను అరెష్టు చేయవచ్చు

ఒకవేళ నీవు ప్రజలను దోచుకుంటే పోలీసులు నిన్ను అరెష్టు చేస్తారని కొందరు అంటారు. కానీ వారో విషయం తెలుసుకోవాలి. పోలీసులు నన్ను అరెష్టు చేయలేరు ఎందుకంటే కొందరు పోలీసులు నా జీతం పై బ్రతుకుతున్నారు. కొందరు మంత్రులకూ నా జీతం అందుతుంది. ఒకవేళ ఎవరైనా సామాన్య వ్యక్తి దోపిడీ చేస్తే, అతడు అరెష్టు చేయబడతాడని, అది అతడి కొరకు కష్టాలకు గురిచేస్తుందని, అతని కొరకు చెడు అవుతుందనే మాటకు నేను అంగీకరిస్తున్నాను. కానీ నేను అసాధారణమైన శక్తిమంతుడిని మరియు నా పేరు వింటేనే ప్రజలు వణికే ప్రబలమైన దాదాను కదా!

దోపిడి నా కోసం ఎందుకు చెడుపనో తెలిపే కనీసం ఒక్క లాజికల్ కారణం నాకు చూపండి, నేను దొంగతనాన్ని వదిలివేస్తాను.

d. సులభంగా సంపాదించిన ధనం

దోపిడి ద్వారా సంపాదించిన ధనం సులభంగా సంపాదించే ధనమని, అది కష్టపడి సంపాదించే ధనం కాదని కొందరు అంటారు. నేను వారితో పూర్తిగా అంగీకరిస్తాను, అది తేలిగ్గా సంపాదించే ధనమే. అందుకనే నేను దొంగతనాన్ని ఎంచుకున్నాను. ఒకవేళ ఎవరైనా వ్యక్తి వద్ద సులభంగా సంపాదించే మరియు కష్టపడి సంపాదించే అవకాశాలు రెండూ ఉంటే, ఎవరైనా వివేకవంతుడైన వ్యక్తి సులభంగా సంపాదించే అవకాశం ఉన్న మార్గాన్నే ఎంచుకుంటాడు కదా!

e.  అది మానవత్వానికి వ్యతిరేకం

దోపిడీ, దొంగతనాలు మానవత్వానికి విరుద్ధమని, ఒక వ్యక్తి తోటి వ్యక్తి మంచిచెడుల గురించి పట్టించుకోవాలని కొందరు అంటారు. నేను వారి మాటలను ఖండిస్తూ, ‘మానవత్వం’ అనే ఈ చట్టాన్ని ఎవరు వ్రాసారు మరియు నేను ఎందుకు దానిని అనుసరించాలి? అని ప్రశ్నిస్తున్నాను.

ఈ మానవత్వ చట్టం భావావేశం కలిగిన మరియు అభిమానం కలిగిన వ్యక్తుల కొరకు మంచిదేమో గానీ నేను ఒక లాజికల్ వ్యక్తిని మరియు ఇతరుల బాగోగుల పట్టించుకోవడంలో నాకు ఎలాంటి ప్రయోజనం కనబడటం లేదు.

 f.  అదొక స్వార్థపూరితమైన చర్య

దోపిడీ, దొంగతనం అనేది పరుల క్షేమము గురించి పట్టించుకోని ఒక స్వార్థపూరిత చర్య అని కొందరు అంటారు. నిజమే, దొందతనమనేది ఒక స్వార్థపూరిత చర్యే. అయితే, నేనెందుకు స్వార్థపరుడిని కాకూడదు? నా జీవితాన్ని ఎంజాయ్ చేయడంలో అది నాకు సహాయపడుతుంది.

1.  దోపిడీ, దొంగతనమనేది ఒక చెడు పని అనడానికి ఎలాంటి లాజికల్ కారణమూ దొరకదు:

కాబట్టి దోపిడీ, దొంగతమనేది ఒక చెడు పని అని నిరూపించడానికి చేసే వాదలన్నీ వీగి పోతాయి, నిష్ఫలమైపోతాయి. ఒక సామాన్య వ్యక్తికి ఈ వాదనలు సంతృప్తి కలిగించవచ్చేమో గానీ ఒక బలవంతుడైన మరియు ప్రబలమైన నా వంటి గజదొంగకు కాదు. నా వాదనలోని లాజిక్ మరియు హేతువాదం ముందు ఏ వాదనా నిలబడలేదు. ఈ ప్రపంచంలో అనేకమంది నేరస్థులు ఉన్నారనేది ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు.

అలాగే, మానభంగం, మోసం, దగా మొదలైనవి కూడా నా కొరకు మంచి పనులే. అవి చెడు పనులని నన్ను అంగీకరింపజేసే ఏ లాజికల్ వాదనా మిగలదు.

2.  ఒక బలవంతుడైన మరియు ప్రబలమైన నేరస్థుడిని అతడు చేసేది చెడు పని అని ఒక ముస్లిం మాత్రమే ఒప్పించగలడు

ఇప్పుడు నాణానికి మరోవైపు దృష్టిసారించుదాం. ఇపుడు మీరు పోలీసులకు మరియు మంత్రులకు జీతాలు అందజేస్తున్న ఈ ప్రపంచంలోని ఒక అత్యంత బలవంతుడైన మరియు ప్రబలమైన నేరస్థుడని భావించుదాం. మిమ్మల్ని రక్షించడానికి బారులు తీరిన బాడీగార్డులు ఉన్నారు. దొంగతనం, దోపిడీ, మానభంగం, మోసం, దగా మొదలైనవి చెడు పనులని మిమ్మల్ని ఒప్పించే ఒక ముస్లింను నేను.

ఒకవేళ నేను కూడా దోపిడీ, దొంగతనాలనేవి చెడు పనులని నిరూపించడానికి లాజికల్ గా ప్రయత్నిస్తే, ఇంతకు ముందు వలే వ్యర్థమై పోతుంది.

నేరస్థుడు లాజికల్ వ్యక్తి అంటే హేతువాది అని మరియు ఆతడు ఒక అత్యంత బలమైన మరియు ప్రబలమైన గజదొంగ అయినప్పుడే అతడి వాదలన్నీ కరక్టు అవుతాయని నేను అంగీకరిస్తున్నాను.

3.  ప్రతి మనిషి న్యాయాన్ని కోరుకుంటాడు

ప్రతి ఒక్క మానవుడు న్యాయాన్నే కోరుకుంటాడు. ఒకవేళ అతడు ఇతరుల కొరకు న్యాయాన్ని అభిలషింకపోయినా, స్వయంగా తన కోసం మాత్రం తప్పకుండా న్యాయం జరగాలని కోరుకుంటాడు. కొందరు ప్రజలు అధికారం మరియు అంతస్తు మత్తులో పడి, ఇతరులకు బాధ మరియు కష్టం కలిగిస్తారు. కానీ, ఒకవేళ వారికి ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం అస్సలు ఊరుకోరు. ఇతరుల బాధలను, కష్టాలను వారు పట్టించుకోక పోవడానికి ఒక కారణం ఏమిటంటే, వారు అధికారాన్ని మరియు పరపతి ఇచ్చే అంతస్తులను ఆరాధిస్తున్నారు. ఆ అధికారం మరియు అంతస్తుల అహంకారం ఇతరులకు అన్యాయం చేసేందుకు వారిని అనుమతించడమే కాకుండా దానికి వ్యతిరేక దిశలో అలాంటి అన్యాయమే ఇతరులు తమకు చేయకుండా నిరోధిస్తుంది.

4. అల్లాహ్ అందరి కంటే అత్యంత శక్తిమంతుడు మరియు న్యాయవంతుడు

ఒక ముస్లింగా నేను ఆ నేరస్థుడిని అల్లాహ్ యొక్క ఉనికిని గురించి ముందుగా ఒప్పిస్తాను. (అల్లాహ్ యొక్క ఉనికిని ఋజువు చేయమని అడగబడిన ప్రశ్నకు ఇవ్వబడిన జవాబు చూడండి). అల్లాహ్ మీ కంటే ఎక్కువ శక్తిమంతుడు. అంతేగాక ఆయన అత్యంత న్యాయవంతుడు కూడా. దివ్యఖుర్ఆన్ ఇలా ప్రకటిస్తున్నది:

"అతి తక్కువ పరిమాణంలో కూడా అల్లాహ్ ఎన్నడూ అన్యాయం చేయడు" [ఖుర్ఆన్ 4:40]

5.  అల్లాహ్ నన్నెందుకు శిక్షిస్తాడు ?

ఖుర్ఆన్ లోని వైజ్ఞానిక వాస్తవాలు చూపబడిన తర్వాత, లాజికల్ మరియు సైంటిఫిక్ మనిషి కావడం ఆ నేరస్థుడు అల్లాహ్ యొక్క ఉనికిని ఒప్పుకుంటాడు. అల్లాహ్ ఎంతో శక్తిమంతుడు మరియు న్యాయవంతుడు కావడం వలన అతడిని ఎందుకు శిక్షించకుండా వదిలి పెడతాడని వాదించవచ్చు.

6. అన్యాయం చేసే దోషులు శిక్షించబడాలి

అన్యాయానికి గురైన ప్రతి వ్యక్తీ ఆర్థిక మరియు సామాజిక స్థాయిల ప్రమేయం లేకుండా, తనకు అన్యాయం చేసినవాడు తప్పకుండా శిక్షించబడాలని కోరుకుంటాడు. దొంగలకు మరియు రేపిష్టులకు గుణపాఠం నేర్పబడటాన్ని ప్రతి సామాన్య వ్యక్తీ ఇష్టపడతాడు. అనేక మంది నేరస్థులు శిక్షించబడినా, ఇంకా అనేక మంది నేరస్థులు పట్టుబడకుండా స్వతంత్రులుగా తిరుగుతూ, భోగభాగ్యాలతో కూడిన విలాసజీవితాన్ని గడపుతున్నారు. ఒకవేళ ఎవరైనా శక్తిమంతుడు మరియు ప్రబలుడైన వ్యక్తికి అతని కంటే బలమైన మరియు ప్రబలమైన వ్యక్తి అన్యాయం చేస్తే, ఆ శక్తిమంతుడు కూడా ఆ అన్యాయం చేసిన బలవంతుడికి కఠినశిక్ష పడాలనే కోరుకుంటాడు.

7. పరలోక జీవితం కోసం ఈ ఇహలోక జీవితం ఒక పరీక్ష

పరలోక జీవితం కోసం ఈ ఇహలోక జీవితం ఒక పరీక్ష. ఖుర్ఆన్  ఇలా ప్రకటిస్తున్నది:

"చావు బ్రతుకులను సృష్టించిన ఆయనే మీలో ఎవరు ఉత్తములో పరీక్షిస్తాడు; ఆయనే అత్యంత శక్తిమంతుడు, క్షమించేవాడూను" [67:2]

8. తీర్పుదినాన చేయబడే అంతిమ న్యాయం

ఖుర్ఆన్ ఇలా ప్రకటిస్తున్నది:

"ప్రతి ఆత్మా చావు రుచి చూడవలసిందే: కేవలం తీర్పుదినాన మాత్రమే మీకు పూర్తి ప్రతిఫలం ప్రసాదించబడుతుంది. నరకాగ్ని నుండి కాపాడబడి స్వర్గంలో ప్రవేశ పెట్టబడినవాడు మాత్రమే సాఫల్యవంతుడు: ఈ ఇహలోక జీవితపు ఆకర్షణలు కేవలం మిథ్యా మరియు వంచన మాత్రమే." [3:185]

తీర్పుదినాన అంతిమ న్యాయం చేయబడుతుంది. ఎవరైనా వ్యక్తి చనిపోయిన తర్వాత, తీర్పుదినాన అతడు ఇతర మానవులతో పాటు మరలా తిరిగి లేపబడతాడు. ఎవరైనా వ్యక్తి అతడి నేరాల శిక్షలో కొంత భాగాన్ని ఈ ప్రపంచంలోనే అనుభవించే అవకాశం ఉంది. అయితే పరలోకంలోనే అసలు అంతిమ ప్రతిఫలం ప్రసాదించబడుతుంది మరియు అంతిమ శిక్ష విధించబడుతుంది. సర్వోన్నతుడైన అల్లాహ్ ఒక దొంగను లేదా ఒక రేపిష్టును ఈలోకంలో శిక్షించడు. కానీ తప్పకుండా అంతిమ తీర్పుదినాన ఆ నేరస్థుడు జవాబు ఇవ్వవలసి ఉంటుంది మరియు పరలోకంలో అతడు చేసిన నేరానికి కఠినంగా శిక్షించబడతాడు. దాని నుండి ఏ నేరస్థుడూ తప్పించుకోలేడు.

9.  హిట్లర్ కు మానవ చట్టం ఏ శిక్ష విధించగలదు ?

ఆరు మిలియన్ల యూదులను హిట్లర్ తన నియంకృత పరిపాలనలో గ్యాస్ ఛేంబర్లలో భస్మం చేసి వేసినాడు. ఒకవేళ అతడిని ఎవరైనా పోలీసు అరెష్టు చేసినా, న్యాయం చేయడానికి మానవులచే తయారు చేయబడిన చట్టం హిట్లర్ కు ఏ శిక్ష విధించ గలదు ? అతడిని కూడా గ్యాస్ ఛెంబరుకు పంపించడం కంటే మించి ఇంకేమైనా కఠినశిక్ష విధించగలరా ? కానీ అది ఒక యూదుడిని హత్య చేసిన దానికి మాత్రమే సరిపోయే శిక్ష. మరి, మిగిలిన ఐదు మిలియన్ల, తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేల, తొమ్మిది వందల తొంభై మంది యూదుల హత్యకు బదులుగా అతడికి వేయబడ వలసిన శిక్ష మాటేమిటి?

10.  ఆరు మిలియన్ల కంటే ఎక్కువ సార్లు హిట్లర్ ను అల్లాహ్ నరకాగ్నిలో కాల్చుతాడు

ఖుర్ఆన్ లో అల్లాహ్ ప్రకటన ఇలా ఉంది: "ఎవరైతే మా చిహ్నాలను తిరస్కరించారో, త్వరలోనే మేము వారిని నరకాగ్నిలో పడవేస్తాము; వారి చర్మాలు కాలిపోగానే మేము క్రొత్త చర్మాలు

తొడిగిస్తాము - మాటిమాటికీ కాలడానికి, అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, వివేకవంతుడూను" [ఖుర్ఆన్ 4:56]

ఒకవేళ అల్లాహ్ తలిస్తే, పరలోకంలో హిట్లర్ ను ఆరు మిలియన్ల సార్లు నరకాగ్నిలో కాల్చి అతడి నేరానికి సరైన శిక్ష విధిస్తాడు.

11. పరలోక జీవిత భావన లేకుండా మానవ నైతిక విలువల లేదా మంచిచెడుల భావన లేదు

ఎవరినైనా పరలోక జీవితం గురించి ఒప్పించకుండా అతడిలో నైతిక విలువల మరియు మంచి చెడుల భావనలు కలుగజేయడం అసాధ్యం. ముఖ్యంగా ఈ ప్రపంచంలో బలవంతుడు మరియు ప్రబలుడై ఉండి ఇతరులకు అన్యాయం చేస్తున్న వ్యక్తిని పరలోక భావన లేకుండా అతడు చేస్తున్న నేరం గురించి ఒప్పించడం మరీ కష్టం.

11. ఒకవేళ కాఫిర్ల (ముస్లిమేతరుల) హృదయాలపై అల్లాహ్ సీలు వేసేసి ఉంటే, ఇస్లాం స్వీకరించటం లేదని ఎందుకు వారిపై ఆరోపణలు చేయాలి ?

జవాబు:

1.    నిరంతరం సత్యాన్ని తిరస్కరిస్తున్న వారి హృదయాలపై అల్లాహ్ సీలు వేసినాడని ఖుర్ఆన్ లోని రెండవ అధ్యాయమైన సూరతుల్ బఖరహ్ లోని 6 మరియు 7 వ వచనాలలో అల్లాహ్ ప్రకటించినాడు: "ఇక సత్యాన్ని తిరస్కరించిన వారి విషయంలో,  వారు హెచ్చరించబడినా హెచ్చరించబడక పోయినా ఒకటే; వారు విశ్వసించరు. వారి హృదయాలపై అల్లాహ్ సీలు వేసినాడు మరియు వారి చెవులపై, కళ్ళపై పరదా; వారికి లభించే శిక్ష కడు కఠినమైంది." [ఖుర్ఆన్ 2:6-7]

సత్యాన్ని తిరస్కరించే మామూలు కాఫిర్ల (సత్యతిరస్కారుల) గురించి ఈ వచనాలు తెలుపడం లేదు. ఇక్కడ వాడబడిన అరబీ భాషా పదాలు అల్లదీన కఫరూ అంటే సత్యతిరస్కారం వైపు నిరంతరం మ్రొగ్గు చూపేవారని అర్థం. అలాంటి వారిని నీవు హెచ్చరించినా, హెచ్చరింకపోయినా తేడా లేదు. ఎందుకంటే వారు విశ్వసించరు. అల్లాహ్ వారి హృదయాలపై సీలు వేసినాడు. ఇంకా వారి చెవులపై మరియు కళ్ళపై పరదా కప్పినాడు. అల్లాహ్ వారి హృదయాలపై సీలు వేయడం వలన కాదు ఈ కాఫిర్లు అంటే సత్యతిరస్కారులు అర్థం చేసుకోకపోవడం మరియు నమ్మకపోవడం, కానీ వాస్తవం దీనికి విభిన్నంగా ఉంది. కాఫిర్లు అంటే సత్యతిరస్కారులు సత్యతిస్కారం వైపు నిరంతరం మ్రొగ్గు చూపడం వలన, వారిని హెచ్చరించినా హెచ్చరించక పోయినా వారు అల్లాహ్ ను నమ్మరు. అందువలన అల్లాహ్ వారి హృదయాలపై సీలు వేసినాడు. కాబట్టి అల్లాహ్ ను కాదు నిందించవలసింది, సత్యాన్ని నిరంతరం తిరస్కరిస్తున్న ఆ సత్యతిరస్కారులను నిందించాలి.

2.    ఉదాహరణ: పరీక్షలో ఫెయిల్ అవుతాడని టీచర్ భావిస్తున్న ఒక విద్యార్థి  

ఫైనల్ పరీక్షలకు ముందు ఒక అనుభవజ్ఞుడైన ఒక టీచర్ హద్దుమీరిన తుంటరితనం, క్లాసులో శ్రద్ధగా పాఠాలు వినకపోవడం మరియు అతడికి ఇవ్వబడిన హోమ్ వర్కు సరిగ్గా పూర్తిచేయకపోవడం వంటి కారణాల వలన ప్రత్యేకంగా ఒక విద్యార్థి ఆ పరీక్షలలో తప్పుతాడని ఊహించాడు. ఒకవేళ పరీక్షలు వ్రాసిన తర్వాత ఆ విద్యార్థి నిజంగా తప్పితే, ఆ విద్యార్థి ఫెయిల్ కావడానికి ఎవరిని నిందించాలి: తప్పుతాడని ఊహించిన టీచరునా లేక కష్టబడి చదవని విద్యార్థినా? ఫెయిల్ అవుతాడని ముందుగానే టీచర్ ఊహించడం వలన ఆ విద్యార్థి తప్పాడని నిందించడం సముచితం కాదు కదా. పరీక్ష తప్పడానికి స్వయంగా విద్యార్థే కారకుడు గానీ టీచర్ ఊహించడం అతడి తప్పడానికి కారణం కాజాలదు.  

అలాగే, కొందరు సత్యాన్ని నిరంతరం తిరస్కరించే వైపే మ్రొగ్గుతారనే విషయం ముందుగానే అల్లాహ్ కు తెలుసు మరియు దాని వలన అల్లాహ్ వారి హృదయాలపై సీలు వేసినాడు. అందువలన సత్యతిరస్కారులైన ఆ ముస్లిమేతరులే స్వ యంగా సత్యాన్ని తిరస్కరించడానికి కారకులు. అంతేగాని వారి సత్యతిరస్కారానికి అల్లాహ్ వారి హృదయాలపై వేసిన సీలు కాదు.

 ఇస్లాం మరియు ముస్లింలపై కొన్ని ప్రశ్నోత్తరాలు

1.    ఇస్లాం ధర్మం అంటే ఏమి?

జవాబు: ఇస్లాం ధర్మం అనేది ఒక నూతన ధర్మం ఎంతమాత్రమూ కాదు. ఆరంభం నుండి తన ప్రవక్తలందరి ద్వారా ప్రతి ఒక్క సమాజానికి సర్వలోక సృష్టికర్త పంపిన అదే సత్యవాణి చిట్టచివరిగా మొత్తం మానవజాతి కొరకు ఈ అంతిమ రూపంలో పంపబడింది. ఇస్లాం ధర్మం ప్రపంచ జనాభాలోని ఐదవ వంతు ప్రజలు స్వంత ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడే ధర్మమూ మరియు సంపూర్ణ జీవన విధానమూను. శాంతి, దయ మరియు క్షమాగుణాల్ని ప్రోత్సహించే ఉత్తమ ధర్మమే ముస్లింల ఈ ధర్మం. అయితే, ఇస్లాం ధర్మంతో సంబంధం ఉందని తరచుగా ఆరోపించబడుతున్న తీవ్రవాద సంఘటనలతో ముస్లిం సమాజంలోని అత్యధిక ప్రజలకు ఎలాంటి సంబంధమూ లేదు.

2.    ముస్లింలు అంటే ఎవరు ?

జవాబు: ప్రపంచ వ్యాప్తంగా దక్షిణ ఫిలిఫ్ఫీన్స్ నుండి నైజీరియా వరకు కేవలం వారి కామన్ ఇస్లామీయ విశ్వాసంపై ఏకమైన వివిధ జాతులకు, దేశాలకు, వర్ణాలకు, సాంప్రదాయాలకు చెందిన ఒక బిలియన్ కంటే ఎక్కువ ప్రజలు. దాదాపు 18% అరబ్బు ప్రాంతంలో నివశిస్తున్నారు; మొత్తం ప్రపంచంలో అత్యధిక ముస్లింలున్న దేశం ఇండోనేషియా; ఆసియా మరియు ఆఫ్రికాలలో ఎక్కువ భూభాగంలో ముస్లింలు ఉన్నారు, సోవియట్ యూనియన్ దేశాలలో, చైనా, ఉత్తర – దక్షిణ అమెరికా మరియు యూరోపు దేశాలలో వారి మైనారిటీ ఉనికి ప్రభావపూరితంగా ఉన్నది.

3.    ఎవరైనా ముస్లింగా మారాలంటే ఏమి చేయాలి ?

జవాబు: చాలా సులభంగా ‘అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడెవరూ లేరు మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త’ అని మనస్ఫూర్తిగా సాక్ష్యం పలకడం ద్వారా ఇస్లాం ధర్మంలోనికి ప్రవేశించవచ్చు. ఈ డిక్లరేషన్ ద్వారా ఒక విశ్వాసి అల్లాహ్ యొక్క ప్రవక్తలందరిపై మరియు వారిపై అవతరించబడిన దివ్యవాణులపై తన విశ్వాసాన్ని ప్రకటించినవాడు అవుతాడు.

4.    ‘ఇస్లాం’ అంటే అర్థం ఏమిటి ?

జవాబు: 'ఇస్లాం' అనేది అరబీ భాషకు చెందిన పదం. తెలుగులో దీని అర్థం 'సమర్పణ'. అరబీ భాషలో 'శాంతి' అనే అర్థాన్నిచ్చే పదం నుండి ఇది గ్రహించబడింది. ధార్మికంగా, ఇస్లాం అంటే అల్లాహ్ యొక్క అభీష్టానికి పూర్తిగా సమర్పించుకోవడం. 'ముహమ్మదీయ మతం' అనేది కొన్ని చోట్ల వాడుకలో ఉన్న ఒక తప్పుడు పదం. ఎందుకంటే ముస్లింలు అల్లాహ్ ను కాకుండా ముహమ్మద్ ను ఆరాధిస్తారనే అర్థాన్ని ఆ పదం సూచిస్తున్నది.

5.    అల్లాహ్ అంటే ఎవరు ?

జవాబు: 'అల్లాహ్' అనేది అరబీ భాషలో ముస్లింలు మరియు అరబ్బు క్రైస్తవులు పిలిచే దేవుడి పేరు. అల్లాహ్ అనే పదం దేవుడి ఏకదైవత్వాన్ని, అద్వితీయతను సూచించినంత స్పష్టంగా, సూటీగా ఏ పదమూ సూచించలేదు – ఎందుకంటే అల్లాహ్ అనే పదానికి అస్సలు బహువచనమూ, స్త్రీలింగ పదమూ లేవు. ఉదా, తెలుగులో దేవుడు అనే పదానికి దేవుళ్ళు అనే బహువచన పదం, దేవత అనే స్త్రీలింగపదం ఉన్నాయి, అలాగే ఇంగ్లీష్టులో గాడ్స్ మరియు గాడ్డెస్ అనే బహువచన, స్త్రీలింగ పదాలు ఉన్నాయి. అల్లాహ్ అనే పదానికి భాషాపరంగా కూడా బహువచన పదం గానీ, స్త్రీలింగ పదం గానీ లేకుండా భాషాపరంగా కూడా ఆ సర్వలోకాల సృష్టికర్త ఏకత్వాన్ని, అద్వితీయత్వాన్నీ ప్రకటిస్తున్నది.

6.    తరచుగా ఇస్లాం ధర్మం అపరిచిత ధర్మంగా ఎందుకు కనబడుతుంది ?

జవాబు: ఆధునిక ప్రపంచంలో ఇస్లాం ధర్మం అసామాన్య ధర్మంగా లేదా తీవ్రవాద ధర్మంగా కనబడవచ్చు. ఎందుకంటే బహుశా ఈనాడు పాశ్చాత్య దేశాలలోని ప్రజల అనుదిన జీవితాన్ని ధర్మం శాసించక పోవడం మరియు ముస్లింలు లౌకిక, ప్రాపంచిక, మతరహిత జీవితానికీ మరియు ధార్మిక, దైవసంబంధిత, పావన జీవితాల మధ్య విభజన చూపకుండా తమ జీవితంలో ధర్మమునకే అత్యంత ఉన్నత స్థానం ఇవ్వడం కావచ్చేమో. అంతిమ దైవశాసనమైన షరిఅహ్ ను గంభీరంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా విశ్వసించడం వలన వారి జీవితంలో ధర్మానికి సంబంధించిన అంశాలు ఇప్పటికీ ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి.

7.    ఇస్లాం వ్యాప్తి ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేసింది ?

జవాబు: శీఘ్రంగా మరియు శాంతియుతంగా ఇస్లాం ధర్మం వ్యాపించడానికి ఒక ముఖ్య కారణం ఏమిటంటే దాని మూలసిద్ధాంత నిష్కాపట్యం, నిరాడంబరత, సాధరణత్వం, సరళత, స్పష్టత – అది ఆరాధింపబడే అర్హత గల ఏకైక దైవాన్ని మాత్రమే విశ్వసించమనే ఇస్లాం పిలుపు. ఇంకా తనకు ప్రసాదించబడిన బుద్ధిని సరిగ్గా ఉపయోగించి, సత్యాన్వేషణ చేయమని అది మాటిమాటికీ మానవుడిని ఆదేశించడం. కొన్నేళ్ళ లోపలే ‘ప్రతి ముస్లిం పురుషుడిపై మరియు స్త్రీపై జ్ఞానం సంపాదించడం తప్పనిసరి విధి అయి ఉన్నది’ అనే ప్రవక్త ముహ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాన్ని అనుసరించి గొప్ప గొప్ప నాగరికతలు మరియు విశ్వవిద్యాలయాలు వర్ధిల్లాయి. తూర్పు – పడమర ఆలోచనల సంయోగం, పాతవాటిలో నుండి పుట్టుకొచ్చిన క్రొత్త ఆలోచనలు వైద్య శాస్త్రంలో, గణితశాస్త్రంలో, భౌతిక శాస్త్రంలో, ఖగోళ శాస్త్రంలో, భూగోళ శాస్త్రంలో, భవన నిర్మాణ శాస్త్రంలో, కళలలో, సాహిత్యంలో మరియు చరిత్రలో ఘనమైన అభివృద్ధిని తీసుకు వచ్చాయి. అల్జిబ్రా, అరబిక్ సంఖ్యలు మరియు గణితశాస్త్రం ముందుకు దూసువెళ్ళడానికి ముఖ్యకారణమైన సున్న యొక్క భావన (the concept of the zero) వంటి అనేక క్లిష్టమైన సిద్ధాంతాలు ముస్లింల నుండి మధ్యయుగ యూరోపు ప్రాంతానికి చేరుకున్నాయి. వాటి సహాయంతో యూరోపు ఖండవాసుల డిస్కవరీ సముద్ర యానాలు సాధ్యపడేలా చేసిన అష్ట్రోలోబ్ (astrolabe),  వృత్త చతుర్భాగం (quadrant) మరియు మంచి నౌకాయాన పటాలు మొదలైన అధునాతన పరికరాలు తయారు చేయబడినాయి.

8.    కాబహ్ అంటే ఏమిటి ?

జవాబు: అల్లాహ్ ఆదేశాలను అనుసరించి ప్రవక్త అబ్రహాం మరియు ప్రవక్త ఇస్మాయీల్ (అలైహిస్సలాం) లు పునః నిర్మించిన అల్లాహ్ యొక్క పవిత్ర ఆరాధనాలయమే కాబాగృహం. ఆదిమానవుడైన ప్రవక్త ఆదం (అలైహిస్సలాం) కట్టిన పవిత్రస్థలంపైనే అది నిర్మించబడిందని చాలా మంది విశ్వసిస్తారు. ఆ పవిత్ర కాబాగృహ సందర్శనకు తరలి రమ్మని ప్రజలను ఆహ్వానించవలసిందిగా అల్లాహ్ ప్రవక్త అబ్రహాం (అలైహిస్సలాం)ను ఆజ్ఞాపించినాడు. ఈనాటికీ ప్రజలు అక్కడికి చేరుకోగానే, లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ అంటే హాజరయ్యాము ఓ ప్రభూ, హాజరయ్యాము అని బిగ్గరగా గొంతెత్తి పలుకుతూ, ప్రవక్త అబ్రహాం (అలైహిస్సలాం) పిలుపుకు బదులుగా అక్కడ హాజరవుతున్నారు.

9.    ఇస్లాం ధర్మమే సత్యమైనదని మనమెలా తెలుసుకోగలం ?

జవాబు:

 1. అల్లాహ్ అంటే ఏకైకుడు, అద్వితీయుడు, అసమానుడు, అపూర్వుడు మరియు పరమ సంపూర్ణుడని ప్రకటిస్తున్న ధర్మం కేవలం ఇదొక్కటే.
 2. జీసస్ లేదా విగ్రహాలు లేదా దైవదూతల ఆరాధనను అణువంత కూడా విశ్వసించకుండా కేవలం మరియు కేవలం అల్లాహ్ యొక్క ఆరాధనను మాత్రమే విశ్వసించే ధర్మం ఇదొక్కటే.
 3. ఖుర్ఆన్ లో ఎలాంటి పరస్పర వైరుధ్యాలు, వ్యత్యాసాలు, అసంగతులు, అసంబద్ధాలు ... లేవు.
 4. వారి కాలం కంటే 13 శతాబ్దాలకు ముందరగానే తెలుపబడిన వైజ్ఞానిక వాస్తవాలు ఖుర్ఆన్ లో ఉన్నాయి. 1400 సంవత్సరాలకు పూర్వం అవతరించిన ఖుర్ఆన్ గ్రంథంలో ఉన్న అనేక వైజ్ఞానిక వాస్తవాలను ఈమధ్యనే శాస్త్రజ్ఞులు కనిపెట్ట గలిగారు. ఖుర్ఆన్ ఎక్కడా సైన్సుతో విభేదించడం లేదు.  
 5. ఖుర్ఆన్ వంటి గ్రంథాన్ని తయారు చేయమని అల్లాహ్ సవాలు చేసినాడు. మరియు అలా ఎవ్వరూ తయారు చేయలేరని ఆయన స్పష్టంగా ప్రకటించాడు కూడా.
 6. చరిత్రలో అత్యంత ప్రబలమైన పలుకుబడిగల మానవుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మైకెల్ హెచ్. హార్ట్ అనే ఒక ముస్లిమేతరుడి "The 100 most influential men in History" పుస్తకంలో, మొట్టమొదటి స్థానం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇవ్వబడింది మరియు మూడవ స్థానం ప్రవక్త జీసస్ అలైహిస్సలాంకు ఇవ్వబడింది. ఇక్కడ గుర్తించవలసిన విషయం ఏమిటంటే జీసస్ (అలైహిస్సలాం) కూడా అల్లాహ్ పంపిన ప్రవక్తే. మరి ఏ అసత్య ప్రవక్తనైనా దైవం అంత ఎక్కువ సాఫల్యవంతుడిని ఎలా చేస్తాడు? ముమ్మాటికీ కాదు. ఇదే విషయం బైబిల్ లోని ద్వితీయోపదేశకాండం 18:19 లో కూడా పేర్కొనబడింది. అసత్య ప్రవక్త చనిపోతాడు! కానీ అల్లాహ్ యొక్క ధర్మాన్ని ప్రజలకు పూర్తిగా అందజేయకుండా మరియు బోధించకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోలేదు కదా!
 7. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేక భవిష్యవాణులు ప్రవచించారు. వాటిలో అనేకం ఇప్పటికే నిజంగా సంభవించాయి మరియు మరికొన్ని నిజం కాబోతున్నాయి.

10. ఇస్లాం ధర్మాన్ని ముహమ్మదీయ మతమని పిలవడం సరైనదేనా ?

జవాబు: లేదు, ఇస్లాం ధర్మాన్ని ముహమ్మదీయ మతం అని పిలవడం తప్పు. దీనిని ఇస్లాం ధర్మం అని మాత్రమే పిలవాలి.

11. ముస్లింలను ముహమ్మదీయులు అని పిలవడం సరైనదేనా ?

జవాబు: ఇస్లాం ధర్మావలంబీకుడిని (భాషాపరంగా ఇస్లాం అంటే “సమర్పణ”) ముస్లిం అని మాత్రమే పిలవాలి (భాషాపరంగా ముస్లిం అంటే “సమర్పించుకున్నవాడు” లేదా “ఒప్పగించుకున్నవాడు”).  ముస్లింలు కేవలం ఏకైకుడు, అద్వితీయుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తారు. ముస్లింలు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అస్సలు ఆరాధించరు. ఇస్లాం ధర్మ స్థాపకుడు అల్లాహ్ యే గానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత మాత్రమూ కాదు. అంతేగాక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవికమైన లేక దివ్యమైనవారు కాదు, దైవికం లేదా దివ్యత్వం కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందును. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిత్యులు, అమరులు, శాశ్వతంగా ఉండేవారు కాదు, కేవలం అల్లాహ్ మాత్రమే నిత్యుడు, అమరుడు, శాశ్వతమైనవాడూను.

ఎవరైతే మనస్ఫూర్తిగా, శాంతియుతంగా తమకు తాము అల్లాహ్ కు సమర్పించుకుంటారో, ఒప్పగించుకుంటారో, అలాంటివారే ముస్లింలు. అనుదినం వారు తమ అధీనత, విశ్వాసం, ప్రభుభక్తినీ ఖరారు చేస్తూ అల్లాహ్ కు వాగ్దానం చేస్తారు.

12. ముస్లింలందరూ అరబ్బులు మరియు అరబ్బులందరూ ముస్లింలు – ఇది కరక్టేనా ?

జవాబు: కాదు, ముమ్మాటికీ కాదు. అరబీ భాష చదవగలిగే, వ్రాయగలిగే మరియు మాట్లాడగలిగే ఏ వ్యక్తి అయినా అరబ్బు అని పిలవబడతాడు. ప్రపంచంలో దాదాపు 1.6 బిలియన్ల ముస్లింలు ఉన్నారు. అందులో కేవలం 20% మాత్రమే అరబ్బులు ఉండగా, మిగిలిన వారందరూ అరబ్బేతరులే.

అరబ్బు ప్రజలలో దాదాపు 8% క్రైస్తవులు, యూదులు, అస్సిరియన్లు, నాస్తికులు,  దేవుడు ఉన్నదీ లేనిదీ చెప్పడం సాధ్యం కాదని భావించే అజ్ఞతావాదులు మొదలైన ముస్లిమేతరులు ఉన్నారు.

ఏదేమైనా ప్రతి ముస్లిం కొరకు అరబీ భాష అభ్యసించడం మరియు నేర్చుకోవడం చాలా ముఖ్యం. తద్వారా అతను/ఆమె ప్రతిరోజూ ఐదు పూటలా నమాజు చేయగలుగుతారు, ఖుర్ఆన్ చదవగలుగుతారు మరియు దానిని అర్థం చేసుకోగలుగుతారు.

13. ఇస్లాం ధర్మాన్ని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) స్థాపించారని అనడం కరక్టేనా ?

జవాబు: కాదు, ముమ్మాటికీ కానే కాదు. ఇస్లాం ధర్మ స్థాపకుడు సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ అని ముస్లింలు విశ్వసిస్తారు. భాషాపరంగా ఇస్లాం అంటే ‘సమర్పించుకోవడం’: కాబట్టి ఇస్లాం అనేది అల్లాహ్ కు విధేయతా పూర్వకంగా సమర్పించుకునే ధర్మం. అల్లాహ్ యొక్క అభీష్టానికి సమర్పించుకోవడమనే దివ్యసందేశాన్నే అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు పూర్వం వచ్చిన జీసస్, మోసెస్ మరియు ఇతర ప్రవక్తలు (అలైహిస్సలాం) కూడా బోధించారు.

14. ముస్లింలు వేర్వేరు గ్రూపులుగా, వర్గాలుగా ఎందుకు విడిపోయారు ?

1. ముస్లింలు ఒక్కటి కావాలి, ఐక్యమవాలి:

జవాబు: ఈనాడు ముస్లింలు తమలో తాము విభజింపబడి, వేర్వేరు వర్గాలలో చీలిపోయి ఉన్నారనేది ఒక వాస్తవం. ఒక ట్రాజెడీ ఏమిటంటే అలాంటి విభజనలను ఇస్లాం ధర్మం అస్సలు సమ్మతించదు, ఆమోదించదు. తన అనుచరులలో ఐకమత్యం వృద్ధి చెందుతుందని ఇస్లాం ధర్మం విశ్వసిస్తుంది.

ఖుర్ఆన్ ఇలా ప్రకటిస్తున్నది: "గట్టిగా పట్టుకోండి, అందరూ కలిసి కట్టుగా, (మీ కోసం పంపబడిన)అల్లాహ్ యొక్క త్రాడును, మరియు మీలో మీరు వేరుపడిపోవద్దు;" [3:103]

ఈ వచనంలో పేర్కొనబడిన అల్లాహ్ యొక్క త్రాడు ఏది? అదియే దివ్యమైన ఖుర్ఆన్. కలిసికట్టుగా ముస్లిములందరూ గట్టిగా పట్టుకోవలసిన అల్లాహ్ యొక్క త్రాడు దివ్యఖుర్ఆనే. ఈ వచనంలో రెండు సార్లు నొక్కి చెప్పబడింది. ‘కలిసికట్టుగా దృఢంగా అందరూ కలిసి పట్టుకోండి’ అని చెప్పడమే కాకుండా ‘విభజింపబడ వద్దు’ అని కూడా చెప్పబడింది.

ఇంకా ఖుర్ఆన్ ఇలా ప్రకటిస్తున్నది, "అల్లాహ్ కు విధేయత చూపండి, మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తకు విధేయత చూపండి "[ఖుర్ఆన్ 4:59]

ముస్లిములందరూ ఖుర్ఆన్ ను మరియు ప్రామాణికమైన హదీథులను తప్పనిసరిగా అనుసరించాలి మరియు తమలో తాము వేర్వేరు వర్గాలుగా విడిపోకూడదు.

2.  వేర్వేరు గ్రూపులు మరియు వర్గాలుగా విడిపోవడం ఇస్లాం ధర్మంలో నిషేధించబడింది

దివ్యఖుర్ఆన్ ఇలా తెలుపుతున్నది: "ఎవరైతే తమ ధర్మాన్ని విభజిస్తారో, మరియు వర్గాలుగా విడగొడతారో, వారితో నీకే సంబంధమూ లేదు: వారి విషయం అల్లాహ్ వద్ద ఉంటుంది: అతడు పతన స్థితిలో ఉంటాడు. వారు ఏమి చేసినా దానిలోని నిజాలన్నింటినీ ఆయన వారికి చెపుతాడు." [ఖుర్ఆన్ 6:159]

ఎవరైతే తమ ధర్మాన్ని విభజిస్తూ వివిధ గ్రూపులుగా విడదీస్తారో, అలాంటి వారికి దూరంగా ఉండమని అల్లాహ్ ఈ వచనంలో ఆదేశిస్తున్నాడు.

కానీ ఎవరైనా ఒక ముస్లింను, "నీవు ఎవరివి?" అని అడిగినపుడు, మామూలుగా వచ్చే జవాబు ఏమిటంటే ‘సున్నీ’ లేదా ‘షియా’. కొంతమంది తమను తాము ‘హనఫీ’ లేదా ‘షాఫయీ’ లేదా ‘మాలికీ’ లేదా ‘హంబలీ’ అని కూడా చెప్పుకుంటారు. మరికొంతమంది ‘నేను దేవ్ బందీ’ అనీ, మరికొంతమంది ‘నేను బరేల్వీ’ అనీ చెప్పుకుంటారు.  

3.   మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ముస్లిం

ఎవరైనా అలాంటి ముస్లింలను, "మన ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు? ఆయన హనఫీయా లేక షాఫయీయా లేక మలికీయా లేక హంబలీయా?"  అని అడిగితే, లేదు! ఆయనకు పూర్వం వచ్చిన అల్లాహ్ యొక్క ఇతర ప్రవక్తల మరియు సందేశహరుల వలే ఆయన కూడా ఒక ముస్లిం అని జవాబిస్తారు.

దివ్యఖుర్ఆన్ లోని మూడవ అధ్యాయం, 52వ వచనంలో ప్రవక్త జీసస్ అలైహిస్సలాం ‘ముస్లిం’ అని పేర్కొనబడింది.

ఇంకా, దివ్యఖుర్ఆన్ లోని మూడవ అధ్యాయం, 67వ వచనంలో ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం యూదుడూ కాదు, క్రైస్తవుడూ కాదు, కానీ ఆయన ఒక ముస్లిం అని అల్లాహ్ పేర్కొన్నాడు.

4. మిమ్మల్ని మీరు ముస్లిం అని పిలుచుకోవాలని ఖుర్ఆన్ గ్రంథం చెబుతున్నది

 1. ఒకవేళ ఎవరైనా ఒక ముస్లింను నీవు ఎవరివి అని అడిగితే అతను "నేను ఒక ముస్లింను, హనఫీను కాదు లేక షాఫయీను కాదు లేక మలికీను కాదు లేక హంబలీను కాదు" అని జవాబివ్వాలి. దివ్యఖుర్ఆన్ లోని 41వ అధ్యాయం అయిన సూరహ్ ఫుస్సిలత్ లోని 33వ వచనం ఇలా చెబుతున్నది, "అల్లాహ్ వైపు పిలిస్తూ, మంచి పనులు చేస్తూ, ‘నేను ముస్లింలలోని వాడిని’ అని  పలికేవాని మాటకంటే ఎవరి మాట ఉత్తమమైంది కాగలదు " [ఖుర్ఆన్ 41:33]

     మరోచోట ఖుర్ఆన్ ఇలా చెబుతున్నది "ఇస్లాం ధర్మంలో రుకూ చేసేవారిలోని వాడినని చెప్పు". మరోమాటలో "నేను ఒక ముస్లింను" అని చెప్పు.

 1. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టుప్రక్కల ఉన్న ముస్లిమేతర రాజులకు మరియు పాలకులకు ఇస్లాం స్వీకరించమని ఆహ్వానిస్తూ లేఖలు పంపారు. ఆ ఉత్తరాలలో ఆయన దివ్యఖుర్ఆన్ లోని మూడవ అధ్యాయమైన సూరహ్ ఆలె ఇమ్రాన్ లోని ఈ 64వ వచనాన్ని పేర్కొన్నారు:

ప్రకటించు: "సాక్ష్యంగా ఉండండి - మేము ముస్లింలని ప్రకటిస్తున్న మా పలుకులకు."  [ఖుర్ఆన్ 3:64]

5. ఇస్లాం ధర్మంలోని గొప్ప పండితులందరినీ గౌరవించాలి

మనం తప్పకుండా నలుగురు ఇమాములైన ఇమామ్ అబూ హనీఫా, ఇమామ్ షాఫయీ, ఇమామ్ మాలిక్, ఇమామ్ ఇబ్నె హంబల్ (అల్లాహ్ వారందరినీ స్వీకరించుగాక) లతో సహా ఇస్లాం ధర్మంలోని గొప్ప పండితులందరినీ గౌరవించాలి. వారందరూ గొప్ప పండితులు మరియు వారి నిశిత పరిశోధనలకు మరియు పడిన ప్రయాసలకు బదులుగా అల్లాహ్ అనేక పుణ్యాలు ప్రసాదించుగాక! ఒకవేళ ఎవరైనా ఇమామ్ అబూ హనీఫా లేదా ఇమామ్ షాఫయీ లేదా ఇమామ్ మాలిక్ లేదా ఇమామ్ ఇబ్నె హంబల్ లలో ఎవరో ఒకరి అభిప్రాయాలను మరియు పరిశోధనలను ఇష్టపడితే, ఎవరికైనా ఎలాంటి అభ్యంతరమూ ఉండరాదు. అయితే, ‘నీవు ఎవరివి?’అని ప్రశ్నింపబడినపుడు, ‘నేను ఒక ముస్లింను’ అని మాత్రమే జవాబివ్వాలి.

సునన్ అబూ దాఊద్ లోని హదీథు నెం 4579 ను ఉదహరిస్తూ ఈ హదీథులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం "నా సమాజం డెబ్బై మూడు వర్గాలలో విడిపోతుందని" చెప్పారని కొందరు వాదించవచ్చు.

డెబ్బై మూడు వర్గాలు ఏర్పడతాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భవిష్యవాణి తెలిపారని ఈ హదీథు తెలుపుతున్నది. అంతేగానీ వివిధ వర్గాలుగా విడిపోవడంలో ముస్లింలు చురుకుగా పాల్గొనాలని ఆయన చెప్పలేదు. గ్రూపులను సృష్టించవద్దని దివ్యఖుర్ఆన్ మనల్ని ఆజ్ఞాపిస్తున్నది. ఎవరైతే ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీథుల బోధనలను అనుసరిస్తూ, గ్రూపులను సృష్టించరో, అలాంటివారే ఋజుమార్గం పై ఉన్నవారు.

తిర్మిథీ హదీథు గ్రంథంలోని 171వ హదీథులో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారని నమోదు చేయబడింది, "నా సమాజం డెబ్బై మూడు వర్గాలుగా విడిపోతుంది. వాటిలో ఒక్క వర్గం తప్ప మిగిలినవన్నీ నరకంలో పడవేయబడతాయి." అది విని సహచరులు ‘ఆ వర్గం ఏదై ఉంటుంది?” అని ప్రశ్నించగా, ఆయన ఇలా జవాబిచ్చారు, "ఆ వర్గం అదే దేనికైతే నేనూ మరియు నా సహచరులూ చెందుతారో."

దివ్యఖుర్ఆన్ అనేక వచనాలలో, "అల్లాహ్ కు విధేయత చూపండి మరియు ఆయన ప్రవక్తకు" అని ఆదేశించింది. ఒక నిజమైన ముస్లిం కేవలం దివ్యఖుర్ఆన్ ను మరియు సహీహ్ హదీథులను మాత్రమే అనుసరించాలి. ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీథుల బోధనలకు అనుగుణంగా ఉన్నంత వరకు ఏ పండితుడి అభిప్రాయాలనైనా అతడు ఇష్టపడవచ్చు. ఒకవేళ ఆ అభిప్రాయాలు అల్లాహ్ యొక్క దివ్యవచనానికి అంటే ఖుర్ఆన్ కు లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతులకు విరుద్ధంగా ఉంటే ఆ అభిప్రాయాలకు ఎలాంటి బరువూ ఉండదు – ఆ పండితుడు ఎంతటి జ్ఞానవంతుడైనా సరే.

ఒకవేళ ముస్లిములందరూ అర్థం చేసుకుంటూ ఖుర్ఆన్ చదివితే మరియు సహీహ్ హదీథులను అనుసరిస్తే, ఇన్షా అల్లాహ్ ఈ వ్యత్యాసాలలో అనేక వ్యత్యాసాలు సమసి పోతాయి మరియు మనం ఒక్క ముస్లిం సమాజంగా ఏకమైపోతాము.

15. సహజంగా మతాలన్నీ మంచి పనులు చేయమనే తమ తమ అనుచరులను ఆదేశిస్తాయి. మరి అలాంటప్పుడు ఎవరైనా ఇస్లాంనే ఎందుకు అనుసరించాలి ? ఇతర ధర్మాల్ని అనుసరించకూడదా ?

జవాబు:

 1. ఇస్లాం ధర్మానికీ మరియు అనేక ఇతర ధర్మాలకూ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం

ప్రధానంగా ధర్మాలన్నీ మంచి పనులు చేయమని ప్రోత్సహిస్తాయి మరియు చెడు పనుల నుండి దూరంగా ఉండమని ఆజ్ఞాపిస్తాయి. అయితే ఈ విషయంలో ఇస్లాం ధర్మం మిగిలిన ధర్మాలన్నింటి కంటే ఎంతో ముందున్నది. ధర్మబద్ధత, నైతికత సాధించే ప్రాక్టికల్ పద్ధతుల వైపు ఇస్లాం ధర్మం మార్గదర్శకత్వం వహిస్తున్నది. అంతటితో ఆగక మన వ్యక్తిగత మరియు సామూహిక జీవితాలలో నుండి చెడును, దుష్టత్వాన్ని తొలగించే ఖచ్చితమైన మార్గం చూపుతున్నది. మానవ సహజ గుణగణాలను మరియు మానవ సమాజ చిక్కు సమస్యలను అది పరిగణలోనికి తీసుకుంటోంది. సృష్టికర్త స్వయంగా చూపుతున్న సన్మార్గమే ఇస్లాం ధర్మం. కాబట్టి, దీనుల్ ఫిత్రహ్ (సహజ సిద్ధమైన ధర్మం) అనే పేరుతో కూడా ఇస్లాం ధర్మం పిలవబడుతోంది.

 1. ఉదాహరణ – దొంగతనాన్ని ఇస్లాం ధర్మం నిషేధించడమే కాకుండా దానిని నిర్మూలించే పద్దతిని కూడా నిర్దేశించింది.

a. దొంగతనాన్ని నిర్మాలించే పద్ధతిని ఇస్లాం ధర్మం నిర్దేశించింది:

     దొంగతనం ఒక చెడు పని అని దాదాపు మతాలన్నీ బోధిస్తాయి. ఇస్లాం కూడా ఇదే విషయాన్ని బోధిస్తుంది. మరి ఇస్లాం ధర్మానికి మరియు ఇతర ధర్మాలలో తేడా ఎక్కడ ఉంది? ఎక్కడ తేడా ఉందంటే – దొంగతనం ఒక చెడు పని అని బోధించడమే కాకుండా ఇస్లాం ధర్మం ప్రజల్ని దొంగతనం చేయకుండా ఆపే ఒక సామాజిక వ్యవస్థను ఎలా సృష్టించాలో చక్కటి ప్రాక్టికల్ దారిని చూపుతున్నది. 

     b. జకాతు విధిదానాన్ని ఇస్లాం ధర్మం నిర్దేశించింది:

జకాతు విధి దాన వ్యవస్థను (వార్షిక తప్పనిసరి దాన పద్ధతి) ఇస్లాం ధర్మం నిర్దేశించింది. ప్రతి వ్యక్తి నిర్ణీత స్థాయి కంటే ఎక్కువ అంటే 85 గ్రాముల బంగారం విలువ కంటే ఎక్కువ మిగులు సంపదలో నుండి ప్రతి చాంద్రమాన సంపత్సరం 2.5% దానం చేయ వలసి ఉంటుంది. ఒకవేళ ప్రపంచంలోని ప్రతి ధనవంతుడు త్రికరణశుద్ధిగా జకాతు విధి దానం చేస్తే, ఈ ప్రపంచంలో నుండి పూర్తిగా బీదరికాన్ని మాయం చేయవచ్చు. ఒక్క మనిషి కూడా ఆకలిలో చావడు.

 1. దొంగతానానికి శిక్షగా చేతులు నరకడం :

దొంగతనం చేసినట్లు ఋజువైన దొంగల చేతులు నరకమని ఇస్లాం ధర్మం  నిర్దేశిస్తున్నది. దివ్య ఖుర్ఆన్ లోని సూరతుల్ మాయిదహ్ అధ్యాయంలో అల్లాహ్ ఆజ్ఞ ఇలా ఉన్నది:

"ఇక దొంగ విషయానికి వస్తే – మగ దొంగైనా లేక ఆడ దొంగైనా, అతని / ఆమె చేతులు నరకాలి. వారు చేసిన నేరానికి అల్లాహ్ విధించిన కఠిన శిక్షకు ఉపమానంగా: అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, సంపూర్ణ వివేక వంతుడూను." [దివ్యఖుర్ఆన్ 5:38]

ముస్లిమేతరులు, "ఈ నాగరిక 20వ శతాబ్దంలో చేతులు నరకడమా! ఇస్లాం అంత అనాగరక మరియు క్రూర ధర్మం మరొకరటి లేదు." అంటారు. అలా అనేవారు దొంగతనాన్ని పూర్తిగా నిర్మూలించగలిగే ఈ పద్ధతి కంటే మరేదైనా ఉత్తమ పద్దతిని కనిపెట్టగలిగారా ?

 1. ఇస్లామీయ షరిఅహ్ అమలు చేస్తే వచ్చే ఫలితాలు:

ప్రపంచంలోని ఆధునిక దేశాలలో అమెరికా ఒక అత్యాధునిక దేశంగా మరియు అత్యంత ధనిక దేశంగా గుర్తించబడింది. కానీ, అది దురదృష్టవశాత్తు దోపిడీదొంగతనాలలో అత్యధిక క్రైమ్ రేటుతో అన్ని దేశాల కంటే ముందున్నది. ఒకవేళ అమెరికాలో ఇస్లామీయ షరిఅహ్ ధర్మ చట్టాన్ని ఆచరణలో పెడితే, అంటే ప్రతి ధనవంతుడు తప్పకుండా జకాతు విధి దానం చేస్తే అంటే ప్రతి చాంద్రమాన సంవత్సరం 85 గ్రాముల కంటే ఎక్కువ మిగులు సంపదలో నుండి 2.5% బీద ప్రజలలో దానం చేస్తే మరియు దొంగతనం చేసినట్లు ఋజువైన ప్రతి నేరస్థుడికి చేతులు నరికి వేసే శిక్ష విధిస్తే, అమెరికాలో క్రైమ్ రేట్ పెరుగుతుందా లేక తగ్గుతుందా ? సహజంగానే అది తగ్గిపోతుంది కదా! అంతేగాక అలాంటి కఠిన చట్టం దొంగతనం చేయాలనే ఆలోచనతో ఉన్న వారిని కూడా నిరుత్సాహ పరుస్తుంది.

ప్రపంచంలో ఈనాడు జరుగుతున్న దొంగతనాల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడం వలన ఒకవేళ దొంగల చేతులు నరికే శిక్ష ఆచరణలో పెడితే చేతులు నరకబడే నేరస్థుల సంఖ్య వందలో వేలలో ఉంటుందేమో అనే మాటతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఇక్కడ గుర్తించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, ఎప్పుడైతే ఈ కఠినశిక్ష ఆచరణలో పెట్టడం ప్రారంభమైన క్షణం నుండే దొంగతనాల సంఖ్య ఆటోమేటిక్ గా తగ్గిపోవడం మొదలవుతుంది. తన చేతులు పోగొట్టుకోవలసి వస్తుందనే భయంతో దొంగతనం చేయాలని ఆలోచిస్తున్న నేరస్థులు అడుగు ముందుకు వేసే ముందు పునరాలోచనలో పడిపోతారు. కేవలం కఠినశిక్ష పడుతుందనే ఆలోచనే అనేకమంది దొంగలను ఆ చెడు పని చేయకుండా ఆపుతుంది. చివరికి అట్టి పరిస్థితిలో కూడా దొంగతనానికి పాల్బడే నేరస్థులు అతి కొద్ది మంది మాత్రమే మిగులుతారు. కాబట్టి, దొంగతనం చేసిన నేరానికి చేతులు నరకబడే వారి సంఖ్య నామమాత్రం అయిపోతుంది మరియు మిలియన్ల కొద్దీ ప్రజలు దొంగతనాల భయం లేకుండా ప్రశాంతంగా జీవిస్తారు.

కాబట్టి ఇస్లామీయ షరిఅహ్ ఆచరణాత్మకమైనది మరియు చిత్తశుద్ధితో అమలు చేస్తే అద్భుత ఫలితాలు సాధించగలదు.

 1. మహిళలపై అత్యాచారాలను మరియు మానభంగాలను ఇస్లాం ధర్మం నిషేధిస్తున్నది : పరదా చేయాలని   ఆదేశిస్తున్నది మరియు రేప్ చేసిన నేరస్థులకు మరణశిక్ష విధిస్తున్నది:
 1. మానభంగాలను మరియు అత్యాచారాలను నిర్మూలించే పద్ధతిని ఇస్లాం ధర్మం నిర్దేశిస్తున్నది:

మహిళలపై అత్యాచారాలు మరియు మానభంగాలు ఘోరమైన పాపాలను మతాలన్నీ ఘోషిస్తున్నాయి. ఇస్లాం ధర్మం కూడా ఇదే బోధిస్తున్నది. మరి, ఇస్లాం ధర్మానికి మరియు ఇతర ధర్మాలకూ మధ్య ఉన్న తేడా ఏమిటి ? ఆ వ్యత్యాసం ఏమిటంటే, మహిళలను గౌరవించాలని బోధిస్తూ మరియు వారిపై మానభంగం మరియు అత్యాచారం చేయడమనేది గంభీరమైన పాపంగా అసహ్యించుకోవడంతోటే ఇస్లాం ధర్మం ఆగిపోవడం లేదు. అలాంటి నేరాలను సమాజంలో నుండి ఎలా నిర్మూలించాలో ఖచ్చితంగా చూపుతున్నది. 

 1. పురుషుల హిజాబ్ అంటే పరదా:

ఇస్లాం ధర్మం పరదా వ్యవస్థను నిర్దేశిస్తున్నది. దివ్యఖుర్ఆన్ లో ముందుగా పురుషుల కొరకు పరదా పేర్కొనబడింది, ఆ తర్వాత మహిళల పరదా గురించి పేర్కొనబడింది. క్రింది ఖుర్ఆన్ వచనంలో పురుషుల కొరకు పరదా గురించి ప్రసావించబడింది.:

"(ఓ ప్రవక్తా) ముస్లిం పురుషులు తమ చూపులను క్రిందికి ఉంచాలనీ, వారు తమ మర్మస్థానాలను కాపాడుకోవాలనీ, అది వారి కొరకు పవిత్రమైనదనీ వారితో చెప్పు. వారు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు." [ఖుర్ఆన్ 24:30]

ఒక వ్యక్తి చూపు ఒక మహిళపై పడగానే, ఒకవేళ అతని మనస్సులో ఏదైనా సిగ్గుమాలిన చెడు ఆలోచన వస్తే, వెంటనే అతడు తన చూపును క్రిందికి దించుకోవలెను. ఇంకోమాటలో, ఆకస్మాత్తుగా పడే చూపును వెంటనే మరల్చుకోవాలి మరియు కావాలని మరలా ఆమె వైపు చూడకూడదు.

 1. మహిళల హిజాబ్ అంటే పరదా:

క్రింది ఖుర్ఆన్ వచనంలో మహిళల కొరకు ఆదేశించబడిన పరదా గురించి ప్రస్తావించబడింది :

"(ఓ ప్రవక్తా) ముస్లిం స్త్రీలు తమ చూపులను క్రిందికి ఉంచాలనీ, తమ మర్మస్థానాలను రక్షించుకోవాలనీ, బయటికి కనబడే వాటిని తప్ప – తమ అలంకరణను బహిర్గతం చేయరాదనీ, తమ వక్షస్థలాలపై ఓణీలు కప్పుకోవాలనీ, తమ భర్త లేక తమ తండ్రి లేక తమ మామగారు లేక తమ కొడుకులు లేక తమ సోదరులు లేక తమ సోదరుల కుమారులు లేక తమ అక్కాచెల్లెళ్ళ కొడుకులు లేక తమతో కలిసి మెలిసి ఉండే స్త్రీలు, లేక తమ బానిసలు లేక ఇతరత్రా ఉద్దేశాలు లేకుండా లోబడి ఉండే పురుష సేవకులు లేక స్త్రీల గుప్త విషయాల గురించి ఇంకా ఎరుగని బాలురు – వీళ్ళ ఎదుట తప్ప ఇతరుల ఎదుట తమ అలంకరణలను (అందచందాలను) కనబడకూడనివ్వకూడదనీ, దాగి వున్న తమ అలంకరణ ఇతరులకు తెలిసిపోయేలా తమ కాళ్ళను నేలపై కొడుతూ నడవరాదని వారితో చెప్పు....." [ఖుర్ఆన్ 24:31]

మహిళల కొరకు నిర్దేశించబడిన పరదాలో ఆమె మొత్తం శరీరం వస్తుంది. అంటే ఆమె తన మొత్తం శరీరాన్ని కప్పుకోవాలి. కొందరు పండితులు ఆమె ముఖానికి మరియు మణికట్టు వరకు చేతులకు మినహాయింపు ఉందని అభిప్రాయపడినారు. అయితే, వాటిని కూడా కప్పుకోవడం ఉత్తమం. కొందరు పండితులు తప్పనిసరిగా ముఖం కూడా కప్పుకోవాలని అభిప్రాయపడినారు.

 1. హిజాబ్ అంటే పరదా వ్యవస్థ అత్యాచారాలను నివారిస్తుంది :

మహిళలపై హిజాబ్ అంటే పరదా వ్యవస్థను అల్లాహ్ ఎందుకు నిర్దేశించాడు అనే ప్రశ్నకు ఖుర్ఆన్ లోని క్రింది వచనంలో జవాబు ఇవ్వబడింది:

"ఓ ప్రవక్తా! తమపై నుంచి తమ దుప్పట్లను (క్రిందికి) వ్రేలాడేలా కప్పుకోమని నీ భార్యలకు, నీ కుమార్తెలకు, విశ్వాసులైన స్త్రీలకు చెప్పు. తద్వారా వారు చాలా తొందరగా (మర్యాదస్తులుగా) గుర్తించబడి, వేధింపులకు గురికాకుండా ఉంటారు. అల్లాహ్ క్షమించేవాడూ, కనికరించే వాడూను." [ఖుర్ఆన్ 33:59]

శీలవంతులుగా గుర్తించబడేందుకు, తద్వారా అత్యాచారాలకు గురికాకుండా కాపాడబడేందుకు గాను హిజాబ్ అంటే పరదా మహిళలపై ఆదేశించ బడిందని ఖుర్ఆన్ చెబుతున్నది.

 1. ఇద్దరు కవల సోదరీమణుల ఉపమానం :

ఉదాహరణకు ఎంతో అందంగా ఉన్న ఇద్దరు సోదరీమణులు ఒక రోడ్డుపై నడిచి వెళ్ళుచున్నారు. ఇద్దరిలో ఒకామె ఇస్లామీయ పద్ధతిలో హిజాబ్ అంటే పరదా ధరించింది, రెండో ఆమె మిని స్కర్ట్ ధరించింది. వీధి చివరిలో ఒక పోకిరీ వెధవ అమ్మాయిలను వేధించే అవకాశం కోసం కాచుకుని ఉన్నాడు. వీరిద్దరిలో అతడు ఎవరి వెంటపడతాడు? హిజాబ్ అంటే పరదా ధరించి ఉన్న అమ్మాయినా లేక మినీ స్కర్ట్ ధరించిన అమ్మాయినా? ధరించటం వలన శరీరాన్ని దాచటం కంటే మరింత ఎక్కువగా బయట పెడుతున్న దుస్తులు ఎదుటి మగవారిలో దుర్భుద్ధి పుట్టించి, ఆమె వెంటపడి వేధించేలా, ఆమెపై అత్యాచారం మరియు మానభంగం చేసేలా ప్రేరేపిస్తాయి. కాబట్టి, హిజాబ్ అంటే పరదా స్త్రీలను అత్యాచారం నుండి కాపాడుతుందనే ఖుర్ఆన్ వాక్కు నిజమైనదేనని ఋజువు అవుతున్నది.

 1. మానభంగం చేసిన నేరస్థుడిని మరణశిక్ష విధించాలి :

మానభంగం చేసినట్లు ఋజువైన నేరస్థుడికి మరణశిక్ష విధించాలని ఇస్లామీయ షరిఅహ్ నిర్దేశిస్తున్నది. ఈ ఆధునిక కాలంలో అలాంటి దారుణ శిక్షలేమిటని ముస్లిమేతరులు ఆందోళన చెందవచ్చు. ఇస్లాం ధర్మం కనికరం లేనిదని, క్రూరమైందని మరియు అనాగరికమైందని అనేక మంది ఆరోపిస్తూ ఉంటారు. అనేక మంది ముస్లిమేతరులను ఈ ప్రశ్న అడగడం జరిగింది – ఉదాహరణకు, (అల్లాహ్  కాపాడుగాక), ఒకవేళ ఎవరైనా మీ భార్యను లేదా మీ తల్లిని లేదా మీ సోదరిని మానభంగం చేసారు మరియు మీరే ఆ కేసులో జడ్జిగా నియమించబడినారు. మానభంగం చేసిన నేరస్థుడు మీ ముందుకు తీసుకురాబడ్డాడు. మీరు అతడికి ఏ శిక్ష విధిస్తారు? దానికి వారందరూ, "మేము అతడికి మరణశిక్ష విధిస్తాము." అని జవాబిచ్చారు.  కొంతమంది మరికొంచెం ముందుకు పోయి, "చనిపోయేవరకూ మేము అతడిని హింసిస్తాము" అని ఆవేశంతో ఊగిపోతూ జవాబిచ్చారు. ఒకవేళ మీ భార్య లేక తల్లి లేక సోదరి మానభంగానికి గురైతే నేరస్థుడికి మరణశిక్ష విధించాలని మీరు కోరుకుంటున్నారే, మరి ఇంకొకరి భార్య లేదా తల్లి లేదా సోదరి మానభంగానికి గురైతే ఆ నేరస్థుడికి విధించబడే మరణశిక్ష దారుణమైంది, క్రూరమైంది మరియు అనాగరికమైందని మీరెలా అంటున్నారు?  ఎందుకీ డబుల్ స్టాండర్డ్స్ అంటే ద్వంద్వప్రమాణాలు?

 1. అమెరికా అత్యంత ఎక్కువ మానభంగ నేరాల సంఖ్య కలిగుంది:

అమెరికా ప్రపంచంలోని అత్యాధునిక దేశాలలో ఒకటి. అయితే అక్కడ 1,02,555 రేప్ కేసులు నమోదు చేయబడినట్లు 1990వ సంవత్సరపు F.B.I రిపోర్టు తెలుపుతున్నది. అంతేగాక జరిగిన మానభంగాలలో కేవలం 16% కేసులు మాత్రమే నమోదు చేయబడినట్లు కూడా పేర్కొన్నది. కాబట్టి 1990లో జరిగిన అసలు మానభంగాల సంఖ్య తెలుసుకోవటానికి, నమోదు చేయబడిన సంఖ్యను 6.25తో హెచ్చించగా, 1990లో 6,40,968 రేప్ కేసులు జరిగినట్లు తెలుస్తున్నది. ఒకవేళ ఆ మొత్తాన్ని 365 సంఖ్యతో విభజిస్తే, ప్రతిరోజు దాదాపు 1,756 రేప్ కేసులు జరిగినట్లు గుర్తించగలము.

తర్వాత మరో రిపోర్టులో ప్రతిరోజు అమెరికాలో దాదాపు 1900 కేసులు జరుగుతున్నట్లు తెలుపబడింది. నేషనల్ క్రైమ్ విక్టిమైజేజషన్ సర్వే బ్యూరో ఆఫ్ జస్టిస్ స్టాటిస్టిక్స్ (National Crime Victimization Survey Bureau of Justice Statistics (ﷻ‬. S. Dept. of Justice)) ప్రకారం కేవలం 1996లోనే 3,07,000 రేప్ కేసులు జరిగినట్లు నమోదు అయింది. అసలు జరిగిన రేప్ కేసులలో కేవలం 31% మాత్రమే నమోదు అయ్యాయి. అంటే 1996లో 3,07,000 X 3.226 = 9,90,322 రేప్ కేసులు జరిగాయి. దీనిని బట్టి 1996లో అమెరికాలో ప్రతిరోజు దాదాపు 2,713 రేప్ కేసులు జరిగాయి. అంటే అమెరికాలో ప్రతి 32 సెకన్లకు ఒక రేప్ కేసు జరిగింది. బహశా అమెరికన్ రేపిస్టులు చాలా ధైర్యవంతులేమో! 1990వ సంత్సరపు FBI రిపోర్టులో ఇంకా ఇలా ఉన్నది – నమోదు చేయబడిన రేప్ కేసులలో కేవలం  10%  రేపిస్టులు మాత్రమే అంటే అసలు రేపిస్టుల సంఖ్యలో కేవలం 1.6% మాత్రమే అరెష్టు చేయబడినారు. అలా అరెష్టు చేయబడిన వారిలో కూడా 50% మంది కోర్టులో విచారణ ప్రారంభం కాకముందే విడుదలై పోయారు. అంటే కేవలం 0.8% రేపిస్టులు మాత్రమే కోర్టులో విచారించ బడినారు. ఇంకో మాటలో, ఒకవేళ ఎవరైనా 125 మానభంగాలు చేస్తే అతడు కేవలం ఒక్క రేప్ కేసులో మాత్రమే శిక్షించబడతాడు. అనేక మంది దీనిని లాభదాయకమైన జూదంగా పరిగణిస్తున్నారు. ఇంకా ఆ రిపోర్టు ఇలా తెలుపుతున్నది – అమెరికా దేశ చట్టం ప్రకారం రేపిస్టులకు 7 ఏళ్ళ జైలు శిక్ష విధించబడే అవకాశం ఉన్నా, కోర్టులో విచారించబడిన వారిలో 50% నేరస్థులకు సంవత్సరం కంటే తక్కువ జైలు శిక్ష మాత్రమే విధించబడింది. మొదటిసారి రేప్ కేసులలో పట్టుబడిన వారి విషయంలో జడ్డిగారు చాలా ఉదారంగా వ్యవహరించారు.

ఒక్కసారి ఆలోచించండి – ఎవరైనా వ్యక్తి 125 మానభంగాలు చేస్తే, అతడికి శిక్షబడే అవకాశం కేవలం ఒక్కసారి మాత్రమే మరియు వారిలో కూడా 50% నేరస్థులపై జడ్జిగారు ఉదారంగా వ్యవహరించి, సంవత్సరం కంటే తక్కువ జైలుశిక్ష విధించే అవకాశం  ఎక్కువగా ఉంది! ఇది న్యాయమేనా?

 1. ఇస్లామీయ షరిఅహ్ ఆచరణలో పెట్టబడితే వచ్చే ఫలితాలు:

ఒకవేళ అమెరికాలో ఇస్లామీయ షరిఅహ్ ఆచరణలో పెట్టబడిందని అనుకుందాం. ఎవరైనా వ్యక్తి చూపు పరస్త్రీ పై పడగానే, ఒకవేళ అతని మనస్సులో ఏదైనా చెడు ఆలోచన వస్తే, వెంటనే అతడు తన చూపు క్రిందికి దించుకుంటాడు. ప్రతి మహిళ హిజాబ్ అంటే పరదా ధరిస్తుంది. ఈ ముందు జాగ్రతలు తీసుకున్న తర్వాత కూడా ఒకవేళ ఎవరైనా వ్యక్తి మానభంగం చేస్తే, అతడికి మరణశిక్ష విధించబడుతుంది. మరి ఇలా చేసిన తర్వాత, అమెరికాలో మానభంగాల సంఖ్య పెరుగుతుందా, హెచ్చుతగ్గులు లేకుండా అలాగే నిలకడగా ఉంటుందా లేక తగ్గుతుందా? సహజంగానే అది తగ్గిపోతుంది. అంటే ఇస్లామీయ షరిఅహ్ మంచి ఫలితాల్ని సాధిస్తుంది.

 1. ఇస్లాం ధర్మంలో మానవజాతి సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలు ఉన్నాయి.

ఇస్లామీయ జీవితం అత్యుత్తమమైన జీవన విధానం. ఎందుకంటే దాని బోధనలు కేవలం సిద్ధాంతాలు మాత్రమే కాదు. అవి మానవజాతి సమస్యలకు అసలైన ఆచరణాత్మక పరిష్కారాలు. వ్యక్తిగత మరియు సామాజిక స్థాయిలు రెండింటిలో కూడా ఇస్లాం ధర్మం మంచి ఫలితాల్ని ఇస్తుంది. ఇస్లాం ధర్మం అత్యుత్తమమైన జీవన విధానం ఎందుకంటే అది ఆచరణాత్మకమైన, సర్వసామాన్యమైన, విశ్వవ్యాప్తమైన మరియు సార్వజనికమైన ధర్మం. అది ఏదో ఒక నిర్దిష్ట జాతికి, తెగకు, వర్గానికి లేదా ఒక దేశానికి మాత్రమే పరిమితమైంది కాదు.

16. ఒకవేళ ఇస్లాం ధర్మం అత్యుత్తమ మైనదే అయితే, మరి అనేకమంది ముస్లింలు నమ్మదగనివారుగా, నిజాయితీ లేనివారుగా ఎందుకు పేర్కొనబడుతున్నారు మరియు మోసం, దగా, వంచన, లంచాలు ఇచ్చిపుచ్చుకోవడం, మత్తుపదార్థాల వ్యాపారం చేయడం మొదలైన వాటిలో ఎందుకు మునిగి ఉన్నారు ?

జవాబు:

1.   ఇస్లాం ధర్మాన్ని మీడియా అపఖ్యాతి పాలు చేస్తున్నది

 1. నిస్సందేహంగా ఇస్లాం ధర్మం అత్యుత్తమమైన ధర్మం. కానీ మీడియా ఇస్లాం ధర్మానికి భయపడే పాశ్చాత్యుల చేతుల్లో ఉంది. ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా మీడియా నిరంతరం సమాచారాన్ని ప్రసారం చేస్తున్నది మరియు ప్రచురిస్తున్నది. అది ఇస్లాం గురించి తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నది, తప్పుగా ఉదహరిస్తుంది లేదా ఏదైనా అంశాన్ని అసందర్భరూపంలో చూపుతుంది.
 2. ఎక్కడైనా బాంబు పేలినపుడు, ఎలాంటి ఋజువు లేకుండా ముందుగా నేరారోపణ చేయబడేది ముస్లింల పైనే. ముస్లిం టెర్రిరిష్టులే ఈ పని చేసారనే నిరాధారమైన ఆరోపణలు వార్తాపత్రికల హెడ్ లైన్లలో వస్తాయి. కానీ, ఎపుడైతే ఆ బాంబు పేలుళ్ళకు బాధ్యులు ముస్లింలు కాదని, ఎవరో ముస్లిమేతరులని బయటపడినపుడు, పత్రికలలోని లోపల పేజీలలో ఒక మారుమూల ఎలాంటి ప్రాధాన్యత లేని ఒక చిన్న వార్తగా ప్రచురించబడుతుంది – స్వచ్ఛమైన, శాంతియుతమైన ఇస్లాం ధర్మంపై మీడియా ఎందుకు ఈ పక్షపాతం చూపుతున్నది? ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చి, పెడదారి పట్టిస్తున్నది ?
 3. ఒకవేళ ఎవరైనా 50 ఏళ్ళ ముస్లిం వ్యక్తి, 15 ఏళ్ళ యువతిని ఆమె అనుమతితో పెళ్ళాడితే, అది ముందు పేజీలో హెడ్ లైన్లలో ప్రచురించ బడుతుంది. కానీ ఎవరైనా 50 ఏళ్ళ ముస్లిమేతరుడు ఆరేళ్ళ బాలికను మానభంగం చేస్తే, అది లోపల పేజీలలో ‘సంక్షిప్తవార్త’గా ప్రచురించ బడుతుంది. అమెరికాలో ప్రతిరోజూ దాదాపు 2,713 మానభంగాలు జరుగుతున్నాయి, కానీ అవి వార్తలలో కనబడవు. ఎందుకంటే అది అమెరికన్ల జీవితాలలో ఒక సామాన్య విషయమై పోయింది.

2.   ప్రతి సమాజంలో ఉండే కొందరు ధర్మభ్రష్టులు:

ప్రతి సమాజంలో వలే ముస్లింలలో కూడా కొందరు వంచకులు, రౌడీలు, మోసగాళ్ళు, నమ్మకద్రోహులు, నేరస్థులు ఉన్నారనేది వాస్తవమే. కానీ, కేవలం ముస్లింలు మాత్రమే అలాంటి చెడు పనులు చేస్తారన్నట్లుగా మీడియా వారిని వేలెత్తి చూపుతున్నది. ప్రతి సమాజంలో ధర్మభ్రష్టులు ఉంటారు. ముస్లింలలో మద్యపానం సేవించే వారున్నారు మరియు ఇతరులలో కూడా రహస్యంగా మద్యపానం సేవించేవారు ఉన్నారు.

3.   సగటున ఎక్కువ శాతం ముస్లింలు సజ్జనులు:

ముస్లిం సమాజంలో కొందరు ధర్మభ్రష్టులున్నా, సగటున చూసినట్లయితే, ప్రపంచంలో అత్యుత్తమ సమాజం ముస్లిం సమాజమే అనే విషయాన్ని ఎవరైనా తేలిగ్గా గుర్తించగలరు. అది మద్యపానానికి దూరంగా ఉన్న అతి పెద్ద సమాజం, ప్రపంచం మొత్తంలో సామూహికంగా అత్యధిక దానధర్మాలు చేసే సమాజం. ఇక నైతిక విలువల విషయంలో, మత్తుపదార్థాల విషయంలో, మానవజాతి విలువల విషయంలో ఇస్లాం ధర్మంపై నడిచే ముస్లింలకు దారి చూపగలిగే వాడు ప్రపంచంలో ఒక్కడు కూడా కనబడడు.

4.   డ్రైవరు ను చూసి కారు గురించి తీర్మానించుకోవద్దు:

లేటెష్టు మెర్సిడెస్ మోడల్ కారు మంచిగా ఉందో లేదో కనుక్కోవటానికి మీరు ప్రయత్నిస్తుండగా, నడపడం చేతకాని ఒక డ్రైవరు దాని స్టీరింగు వెనుక కూర్చుని, వంకర టింకరగా నడుపుతూ దేనికో గుద్ది వేయడం మీ కళ్ళపడుతుంది. అది చూసిన మీరు, ఆ ఏక్సిడెంటుకు ఎవరిని కారకులుగా తీర్మానిస్తారు? ఆ కారునా లేక కారు నడపడం చేతకాని ఆ డ్రైవరునా? సహజంగా ఆ డ్రైవరునే కదా! కారు గురించి తెలుసుకోవటానికి ఎవరైనా దానిని నడిపే డ్రైవరు వైపు చూడడు - ఆ కారు యొక్క సమర్థత మరియు అది ఎంత వేగంగా పోతుంది, దాని సరాసరి ఇంధన వినియోగం ఎంత, దానిలో భద్రత ఎలా ఉంది మొదలైన ప్రత్యేకతల వైపు చూస్తాడు, క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. వాదన కోసం ముస్లింలు దుష్టులని ఒకవేళ అంగీకరించినా, ఇస్లాం ధర్మాన్ని దాని అనుచరుల ప్రవర్తనను బట్టి నిర్ణయించటం న్యాయమేనా? ఒకవేళ మీరు ఇస్లాం ధర్మం ఎంత మంచిదో కనుక్కోవాలి అనుకుంటే, దాని ప్రామాణిక మూలగ్రంథాలైన ఖుర్ఆన్ మరియు హదీథుల ఆధారంగా దాని గురించి కనుక్కోండి మరియు నిర్ణయించండి.

5.   ఇస్లాం ధర్మాన్ని దాని అత్యుత్తమ అనుచరుని ఆధారంగా అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆధారంగా పరిశోధించండి:

ఒకవేళ మీరు కారు ఆచరణాత్మకంగా ఎంత మంచిదో తెలుసు కోవాలి అనుకుంటే, ఒక మంచి నిపుణిడిని డ్రైవింగ్ సీటుపై కూర్చోపెడతారు. అదే విధంగా ఇస్లాం యొక్క అత్యుత్తమ మరియు అత్యున్నత అనుచరుడైన అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గుణగణాలను పరిశీలించడం ద్వారా ఇస్లాం ఎంత మంచిదో కనుక్కోవచ్చు. ముస్లింలే కాకుండే, నిష్పక్షపాత మరియు నిజాయితీపరులైన ముస్లిమేతరులు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అత్యుత్తమ మానవుడని ప్రకటించారు. ‘చరిత్రలో అత్యంత ప్రబలమైన వందమంది వ్యక్తులు’ (The Hundred Most Influential Men in History) అనే తన పుస్తకంలో మైకెల్ హెచ్. హార్ట్ (Michael H. Hart), ఇస్లాం ధర్మం యొక్క అంతిమ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ప్రపంచ ప్రఖ్యాత మానవులందరిలో మొట్టమొదటి స్థానం ఇచ్చారు. అంతేగాక, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ముస్లిమేతరులు ప్రశంసించిన సందర్భాలు లెక్కకు మించి ఉన్నాయి. ఉదాహరణకు థామస్ కార్లయిల్ (Thomas Carlyle), లా మార్టిన్ (La-Martine), etc.

16 రమదాన్  సాంస్కృతిక  క్విజ్ షరతులు  - 1435హి /2014, రబ్వహ్ జాలియాత్, రియాద్, సౌదీ అరేబియా.

1.    క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు ఈ పుస్తకంలో నుండే సరైన జవాబు ఎంచుకోవలెను.

2.    మీ సమాధానములను రబ్వహ్ ఆఫీసులో స్వయంగా లేదా, [email protected] ఈమెయిల్ ద్వారా, p.o.box 29465, Riyadh 11457 ఉత్తరం ద్వారా 29/11/1435 హిజ్రీ –24/9/2014 లోపుగా చేర్చవలెను.

3.    సమాధానములతో పాటు మీ ఇఖామా లేదా పాస్ పోర్టు లేదా మరేదైనా ఐడెంటిటీ కార్డు ఫోటో కాపీ జతపర్చవలెను.

4.    మీ పేరు ఖచ్చితంగా మీ ఇఖామా లేదా మీ పాస్ పోర్టు లేదా మీ ఇతర ఐడెంటిటీ కార్డులో వ్రాయబడిన విధంగానే వ్రాయాలి ఒకవేళ విజేత పేరు మరియు ఐడెంటిటీ కార్డులోని పేరులో తేడా ఉంటే, అతనికి బహుమతి ఇవ్వబడదు. 

5.    మీ పేరు, ఈమెయిలు, ఇంటర్నేషనల్ డయల్ కోడ్ తో సహా మీ సెల్ నెం/ఫోన్ నెం స్పష్టంగా వ్రాయవలెను.

6.    విజేతలకు ఫోన్ నెంబరుల ద్వారానే ఫలితాలు తెలుపబడును.

7.    ఇన్షాఅల్లాహ్ విజేతల పేర్లు 1436హి ముహర్రం (నవంబరు 2014) నెలలో రబ్వహ్ ప్రచార కేంద్రంలో ప్రకటింపబడును. అన్నిభాషల ఫలితాలు www.islamhouse.com లో కూడా చూసుకోవచ్చును. 

8.    మీ సమాధానములను స్పష్టమైన చేతివ్రాతలో లేక నీటుగా టైపు చేసి పంపవలెను. ప్రతి ప్రశ్న యొక్క క్రమసంఖ్య మరియు దాని జవాబు (a,b,c,d,e లలో సరైన జవాబు) సూచిస్తే సరిపోతుంది. ఉదా: 1– a, 2 – b,

9.    చీటింగ్ ఇస్లాంలో నిషేధించబడినది. కాబట్టి ఇతరుల నుండి కాపీ చేయవద్దు. ఒకటి కంటే ఎక్కువ సార్లు వేర్వేరు పేర్లతో జవాబులు పంపటం నిషేధం.

10. విజేతలు బహుమతులు తీసుకోవటానికి 29/2/1436హి i.e., 21/12/2014 ఆఖరి రోజు. (కారణాలేమైనాసరే) దీని తర్వాత విజేతలు  బహుమతి పొందే హక్కును కోల్పోతారు.

11. పోటీలో పాల్గొనటానికి రమదాన్ 1435 హి. నాటికి అంటే 28 జూన్ 2014 నాటికి కనీసం 10 ఏళ్ళ వయస్సు ఉండవలెను.

బహుమతులు

1.    మొదటి బహుమతి : 1,500 సౌదీ రియాల్స్

2.    రెండవ బహుమతి : 1,250 సౌదీ రియాల్స్

3.    మూడవ బహుమతి : 1,000 సౌదీ రియాల్స్

4.    నాలుగువ బహుమతి : నాలుగు నుండి పదవ విజేత వరకు – ప్రతి ఒక్కరికి 300 సౌదీ రియాల్స్ i.e., 7x300SR

5.    ఐదో బహుమతి : పదకొండు నుండి ఇరవైవ విజేత వరకు – ప్రతి ఒక్కరికి 200 సౌదీ రియాల్స్ i.e., 10x200SR

 క్విజ్ ప్రశ్నలు

1.   దొంగతనం చేసినట్లు ఋజువైన దొంగల చేతులు నరకమని ఇస్లాం ధర్మం  నిర్దేశిస్తున్నది :  

a)    ఇస్లాం ధర్మం అంత అనాగరక మరియు క్రూర ధర్మం మరొకటి లేదు.

b)    సమాజంలో నుండి దొంగతనం సమస్యను సమూలంగా తుడిచి పెట్టే ఖచ్చితమైన పరిష్కారం ఇస్లాం ధర్మం చూపుతున్నది.

c)    ఇస్లాం ధర్మం చూపుతున్న పరిష్కారం కంటే ఉత్తమమైన పరిష్కారం మరేదీ లేదు.

d)    పై వాటిలో b మరియు c రెండు సరైన జవాబులే

2.   మానభంగాల శాతం తగ్గించడానికి ఒకవేళ అమెరికాలో ఇస్లామీయ షరిఅహ్ ఆచరణలో పెట్టబడితే,

a)       ఎవరైనా వ్యక్తి చూపు పరస్త్రీ పై పడగానే, ఒకవేళ అతని మనస్సులో ఏదైనా చెడు ఆలోచన వస్తే, వెంటనే అతడు తన చూపు క్రిందికి దించుకుంటాడు.

b)      ప్రతి మహిళ హిజాబ్ అంటే పరదా ధరిస్తుంది.

c)       ఒకవేళ ఎవరైనా వ్యక్తి మానభంగం చేస్తే, అతడికి మరణశిక్ష విధించబడుతుంది.

d)      అమెరికాలో మానభంగాల సంఖ్య తగ్గిపోతుంది.

e)       పైవన్నీ సరైనవే.

3.   ఇస్లాం ధర్మం యొక్క మూలసిద్ధాంతాల్లోని అతి ముఖ్యమైన మూలసిద్ధాంతం.

a)       తౌహీద్  లేక ఏకదైవత్వం

b)    బహుదైవారాధన

c)    ట్రినిటీ

d)    అసలు దేవుడే లేడనే నాస్తికత్వం

4.   పరలోక జీవితాన్ని నమ్మడమనేది

a)    ఒక అంధవిశ్వాసం

b)    ఒక మూఢనమ్మకం  

c)    ఒక హేతుబద్ధమైన విశ్వాసం

d)    సైన్సుకు వ్యతిరేకం 

5.   ఇస్లాం అనే అరబీ పదానికి అర్థం

a)    శాంతి

b)    సమర్పణ

c)    పై రెండూ సరైనవే

d)    పై రెండూ తప్పు

6.   అమెరికా మరియు యూరోపు దేశాలలో అన్నిధర్మాల కంటే అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ధర్మం

a)    క్రైస్తవ ధర్మం

b)    హిందూ ధర్మం

c)    బౌద్ధ ధర్మం  

d)    ఇస్లాం ధర్మం

7.   మొత్తం మానవజాతి కొరకు పంపబడిన అంతిమ దివ్యసందేశం మరియు చిట్టచివరి ప్రవక్త ?

a)       బైబిలు - ఏసుక్రీస్తు

b)      తౌరాత్ - మోసెస్

c)       సూక్తులు - అబ్రహాం

d)      ఖుర్ఆన్ - ముహమ్మద్ (స)

8.   ఏ ధర్మమైనా అత్యుత్తమమైన ధర్మంగా పరిగణించబడాలంటే,

a)      మానవజాతి సమస్యలన్నింటికీ సరైన పరిష్కారం చూపాలి

b)      సత్యమైన మరియు స్వచ్ఛమైన ధర్మమై ఉండాలి

c)      ఆది నుండి అంతం వరకు, అన్ని కాలాలకూ వర్తించేలా ఉండాలి

d)      ప్రామాణిక ఆధారాలు కలిగి ఉండాలి

e)      పై వన్నీ సరైన జవాబులే

9.    క్రింది వాటిలో ఏది సరైన జవాబు ?

a)    అత్యంత ప్రాచీన ధర్మమే అత్యంత స్వచ్ఛమైన మరియు అత్యంత ప్రామాణికమైన ధర్మం

b)    అత్యంత ఆధునాతన ధర్మమే అత్యంత స్వచ్ఛమైన మరియు ప్రామాణికమైన ధర్మం

c)    అత్యంత ప్రాచీన ధర్మమే అత్యంత ఉత్తమమైన ధర్మం

d)    అత్యంత అధునాతన ధర్మమే అత్యంత ఉత్తమమైన ధర్మం

e)    పై వాటిలో ఏదీ సరైన జవాబు కాదు

10. దైవత్వ సిద్ధాంతపు గీటురాయి అంటే దైవం గురించిన స్వచ్ఛమైన నిర్వచనం:

a)    ఆయనే అల్లాహ్, ఏకైకుడు మరియు అద్వితీయుడు

b)    స్వయం సమృద్ధుడు

c)    ఆయన ఎవరికీ పుట్టలేదు మరియు ఆయనకు ఎవ్వరూ పుట్టలేదు

d)    ఆయనను పోలినదేదీ లేదు

e)    పై వన్నీ