కేటగిరీలు

ఇస్లాంలో మహిళలు

50 కంటే ఎక్కువ భాషలలో ఇస్లాంలో మహిళల గురించి అనేక అంశాలను ఇక్కడ జమచేయడం జరిగింది.

అంశాల సంఖ్య: 4

 • video-shot

  MP4

  ఇస్లాంలో ఎందుకు స్త్రీపురుషుల కోసం వేర్వేరు ధర్మాజ్ఞలు ఉన్నాయనే విషయం గురించి క్లుప్తమైన వివరణ

 • video-shot

  MP4

  పూర్వ కాలంలో స్త్రీ స్థానం ఏమిటి? అమ్మబడే మరియు కొనబడే ఒక వస్తువుగా ఆమెను పరిగణించేవారు, ఆమెకు మానమర్యాదలు ఉండేవి కావు. ఆమె ఒక మామూలు జంతువుగా లేక ఒక గృహోపకరణ సామానుగా అమ్మబడేది; ఆమెను బలవంతంగా పెళ్ళి చేసుకునేవారు లేక వ్యభిచారంలోకి దింపేవారు. ఆమెకు వారసత్వ హక్కు ఉండేది కాదు లేక ఆమెకు స్వంతంగా సంపద ఉంచుకునే హక్కు ఉండేది కాదు; ఒకవేళ ఆమె వద్ద ఏమైనా సంపద ఉంటే దానిని ఆమె అనుమతి లేకుండానే ఆమె భర్త బలవంతంగా లాక్కునేవాడు. కొన్ని అనాగరిక సమాజాలు ఇంకో అడుగు ముందుకు వేసి, ఆమెను అసలు మనస్సు, ఆత్మ కలిగి ఉన్న మనిషిగా పరిగణించాలా లేదా అనే చర్చలు కొనసాగించాయి! ఇంత జరిగినా, కొన్ని సమాజాలు ఇస్లాం ధర్మాన్ని స్త్రీలను హింసిస్తున్నదనీ మరియు అణగద్రొక్కుతున్నదనీ, ఆమెకు అన్యాయం చేస్తున్నదనీ నిందిస్తున్నాయి. ఈ వీడియోలో వీటన్నిటిలోని సత్యాసత్యాలను మేము నిష్పక్షపాతంగా చర్చిస్తున్నాము. ఇస్లాం ధర్మం స్త్రీలకు ఇచ్చిన హక్కులను మరియు భద్రతను గురించి స్పష్టంగా వివరిస్తున్నాము.

 • video-shot

  MP4

  ఉపన్యాసకుడు : యూసుఫ్ ఈస్తసి

  ఈ వీడియోలో ఇస్లాం ధర్మంలో మహిళల స్థానం గురించి షేక్ యూసుప్ ఎస్టేట్ చక్కటి నిదర్శనాలతో వివరించారు.

 • video-shot

  MP4

  అనేక మంది ప్రజల మనస్సులలో మరియు పలుకులలో మాటిమాటికీ వచ్చే "ఇస్లాం ధర్మం మహిళలను అణచి వేస్తున్నది" ఒక ముఖ్యమైన ప్రశ్నగురించి షేఖ్ అబ్దుల్ రహీమ్ గ్రీన్ ఇక్కడ చర్చించినారు. వాస్తవానికి ఇది ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా ప్రచారం చేయబడుతున్న ఒక అపనింద, ఒక అసత్య వాదన మరియు ఒక అభాండము. ఇది ఒక పచ్చి అబద్ధం మరియు అభాండమని గట్టిగా చెప్పడమే కాకుండా అసలు స్త్రీలను అణచి వేస్తున్న ప్రజలు, దేశాలు మరియు సిద్ధాంతాల గురించి ఆయన చక్కటి నిదర్శనాలతో చూపినారు. అసలు అణచివేత అంటే ఏమిటి, ఇస్లాం దాని గురించి ఏమి చెబుతున్నది అనేది కూడా వివరించారు. అభాండాలు వేయడంపై ఒక మంచి శిక్షణా వీడియో ఇది. దీనిని విన్న తర్వాత ఇతరులు అణచివేతగా భావిస్తున్న విషయాలలో ఇస్లాం ధర్మం మహిళలకు ఇస్తున్న అసలు స్వేచ్ఛ గురించి ఆయన తెలిపినారు.

ఫీడ్ బ్యాక్