కేటగిరీలు

సున్నతు నమాజులు

ఫర్ద్ నమాజులకు ముందు లేదా తర్వాత మరియు ఇతర సమాయాలలో చేసే సున్నతు నమాజులు. వాటిలో : కొన్ని నిర్ణీత సమయాలలో చేయవలసి ఉన్నది. మరికొన్ని ఏ సమయంలోనైనా చేయవచ్చు. కొన్ని ఉదాహరణలు - అల్ కుసూఫ్, అల్ ఇస్తస్ఖాఅ, తరావీహ్, ఫర్ద్ నమాజుల తర్వాత ఉత్తమమైన నమాజైన విత్ర్ నమాజు. మోమిన్లు వీలయినంత ఎక్కువగా సున్నతు నమాజు చేయడం మంచిది. ఇక్కడ సున్నతు నమాజులకు సంబంధించిన అనేక అంశాలు చేర్చబడినాయి. 1) సునన్ రవాతిబ్, 2) సలాతుల్ తహజ్జుద్, 3) సలాతుల్ విత్ర్, 4) సలాతుల్ తరావీహ్, 5) సలాతుల్ ఈదైన్, 6) సలాతుల్ కుసూఫ్ మరియు ఖుసూఫ్, 7) సలాతుల్ ఇస్తస్ఖాఅ, 8) సలాతుల్ దుహా, 9) సలాతుల్ ఇస్తిఖారహ్.

అంశాల సంఖ్య: 2

  • PDF

    ఈ పుస్తకంలో మేము తరావీహ్ నమాజులో 20 రకాతులు చదివే పద్ధతి చాలా బలహీనమైన హదీథులపై ఆధారపడి ఉందని, దానిని ధృవీకరించే ఒక్క సహీహ్ హదీథు లేదా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా అలా 20 రకాతులు తరావీహ్ నమాజు చేసినట్లుగానీ, సహాబాలలు అలా చేసినట్లుగానీ లేదా వారి తర్వాతి తరం వారు చేసినట్లుగానీ ఎలాంటి ఋజువులు లేవని అహ్లె సున్నహ్ వల్ జమఅహ్ పండితుల వచనాలు మరియు అవగాహనల ఆధారంగా నిరూపించాము. ఆ పండితులలో సలఫ్ సాలెహీన్ (ముందుతరం ముస్లిం) ల ఇమాములు, పూర్వ మరియు వర్తమాన హదీథు పండితులు, 1424హి సంవత్సరం వరకు జీవించిన ధర్మవేత్తలు ఉన్నారు.

  • PDF

    రమదాన్ లోని ఖయాముల్ లైల్ (రాత్రి ఐచ్ఛిక నమాజులు) నియమాలు మరియు సున్నతుల సారాంశం

ఫీడ్ బ్యాక్