కేటగిరీలు

ఇస్లాం ధర్మం లోని మానవహక్కులు

ఇస్లాం ధర్మంలోని మానవ హక్కుల గురించి ఇక్కడ చర్చించబడింది. తీవ్రవాదం, ఉగ్రవాదానికి ఇస్లాం ధర్మంలో ఎలాంటి స్థానం లేదనే విషయ కూడా తగిన ప్రామాణిక ఆధారాలతో నిరూపించబడింది. ఇక్కడ 35 కంటే ఎక్కువ భాషలలో ఈ అంశాలు ఉన్నాయి.

అంశాల సంఖ్య: 10

 • తెలుగు

  PDF

  ఇస్లాం మరియు ముస్లింల గురించి అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే కొన్ని ప్రశ్నోత్తరాలు.

 • ఇంగ్లీష్

  PDF

  1-ఈ వ్యాసంలో మూడు ప్రధాన అంశాలు చర్చించబడినాయి. అ) యూదక్రైస్తవ ధర్మాలలో బానిసత్వం. ఆ) స్వాతంత్ర యుద్ధానికి పూర్వం అమెరికాలో బానిసత్వం. ఇ) ఆధునిక బానిసత్వం. 2-ముస్లిం దేశాలన్నింటిలో బానిసత్వం నిషేధం. ఒకవేళ బానిసత్వం మిగిలిన ఉన్న సమాజాలలో అనుసరించవలసిన షరిఅహ్ నియమాలు. ఖుర్ఆన్ మరియు సున్నతుల ఆధారంగా వివరించబడింది. అంతేగాక కొన్ని చారిత్రక పరిశీలనలపై కూడా దృష్టి సారించబడింది.

 • ఇంగ్లీష్

  PDF

  ఇస్లాం ధర్మంలో మానవహక్కుల కోసం వేయబడిన పునాదులపై ఒక చూపు.

 • ఇంగ్లీష్

  PDF

  1- మనపై మరియు మన జీవితంపై మనకు ఎంత స్వేచ్ఛ ఉన్నది. 2- విధిపై ఇస్లామీయ దృక్పథం మరియు ఈ భావనను ముస్లింలు ప్రాక్టికల్ గా తమ జీవితాలలో ఎలా ఆచరణలో పెడుతున్నారు

 • ఇంగ్లీష్

  DOC

  కుల, మత, జాతి, రంగు, లింగ, అంతస్థులకు అతీతంగా ఇస్లాం ధర్మం బోధిస్తున్న సౌభ్రాతృత్వ సందేశం మరియు చరిత్రలో నుండి సజీవ ఉదాహరణలు.

 • అరబిక్

  PDF

  మానవహక్కుల రేఖలు - ఇస్లామీయ రాజ్యాలలో మానవ హక్కుల గురించి ఈ వ్యాసం స్పష్టం చేస్తున్నది. ఇస్లామీయ అఖీదహ్ మరియు షరిఅతుల ఛాయలో ప్రతి ఒక్కరికి వారి వారి అసలు హక్కు ఇవ్వబడుతున్నది. ఇక్కడి చట్టం ప్రజలందరికీ సమ్మతమైన, నిస్పక్షపాతమైన ధార్మిక ఆదేశాలపై ఆధారపడి ఉన్నది.

 • అరబిక్

  PDF

  ఇస్లాం ధర్మంలో స్వేచ్ఛ, స్వాతంత్ర్యం - షేఖ్ సఊద్ అష్షరీమ్ హఫిజహుల్లాహ్ మక్కాలోని మస్జిద్ అల్ హరామ్ లో 2-11-1432హి శుక్రవారం నాడు ఇచ్చిన ఖుత్బహ్ ప్రసంగంలో ఇస్లాం ధర్మంలో స్వేచ్ఛ మరియు స్వాతంత్ర్యం యొక్క అవగాహన గురించి చక్కగా వివరించారు. స్వేచ్ఛ మరియు స్వాతంత్ర్యం అనే పదాల అసలు అవగాహన ఏమిటి, ఎలా ప్రజలు దానిని దుర్వినియోగం చేస్తున్నారు, స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు సరైన హద్దులలో ఉండక పోతే ఎంత నష్టమో అనే ముఖ్యాంశాన్ని ఇస్లాం ధర్మం ఎలా స్పష్టం చేస్తున్నదో వివరించారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపుతూ సరైన పద్ధతిలో స్వేచ్ఛా, స్వాతంత్ర్ల్యాలను ఎలా వ్యక్తిగతంగా మరియు సామాజికంగా ఉపయోగించుకోవచ్చో చర్చించారు.

 • అరబిక్

  PDF

  ముస్లిం రక్తం చిందించడం నిషిద్ధం - షేక్ సాలెహ్ బిన్ ముహమ్మద్ ఆలే తాలిబ్ హఫిజహుల్లాహ్. 17-2-1432హి శుక్రవారం మక్కాలోని మస్జిద్ అల్ హరామ్ లో చేసిన ఖుత్బహ్ ప్రసంగంలో ముస్లింల రక్తం చిందించడం నిషిద్ధమని ఉపదేశించారు. ఆత్మహత్యల ద్వారా ముస్లింల మరియు అమాయకులైన ముస్లిమేతరుల ప్రాణాలు తీయడం, వారి రక్తం చిందించడం ఇస్లాం ధర్మంలో నిషిద్ధం అని ఆయన బోధించారు. పరలోకంలో తీర్పుదినాన అలాంటి ఆత్మహత్యలకు పడబోయే తీవ్రమైన కఠినశిక్షల గురించి ప్రస్తావించి, ముస్లిం యువకులు అలాంటి తప్పులకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

 • అరబిక్

  PDF

  అమాయకుల రక్తం చిందించడం నిషిద్ధం - షేఖ్ సలాహ్ అల్ బుదీర్ హఫిజహుల్లాహ్. మస్జిద్ నబవీలో 3-2-143హి నాడు ఇచ్చిన ఖుత్బహ్ ప్రసంగం. ఇస్లామీయ షరిఅతులో రక్తం మరియు దాని ఉన్నత స్థానం - అది ముస్లిందైనా లేక ముస్లిమేతర అమాయకులదైనా. ముస్లింతో ఒడంబడిక చేసుకున్న ముస్లిమేతరుల రక్తం చిందించడం ఇస్లాంలో నిషిద్ధం. ఈజిప్టు దేశంలోని అలేగ్జాండ్రియా పట్టణంలోని ఒక చర్చీలో జరిగిన సంఘటన వైపు ఆయన తన ఉపన్యాసంలో సంజ్ఞ చేసినారు. అలాంటి సంఘటన అల్లాహ్ యొక్క ధర్మానికి మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీథులకు వ్యతిరేకమైందని తీవ్రంగా ఖండించారు.

 • తెలుగు

  PDF

  మానవులంతా సమానమే అనే ఇస్లాం ధర్మపు ఉన్నతమైన వాస్తవాలను ఈ వ్యాసం స్పష్టంగా వివరిస్తున్నది.

ఫీడ్ బ్యాక్