కేటగిరీలు

ఖుర్ఆన్ విద్యల ప్రసరణ

ఖుర్ఆన్ విద్యల ప్రసరణలోని ప్రయోజనం మరియు అప్రయోజనాల గురించి భేదాభిప్రాయాలున్నాయి. అయితే మేము చదివిన కొన్ని పుస్తకాలలో చాలా ఆసక్తికరమైన విషయాలు కనబడినాయి. ఆ పుస్తకాలను ఇక్కడ పొందుపరిచినాము.

అంశాల సంఖ్య: 193

 • తెలుగు

  MP4

  ఈ వీడియోలో అద్భుతాలకే అద్భుతం పవిత్ర ఖుర్ఆన్ గ్రంథం అనే ముఖ్య విషయంపై హైదరాబాద్ లోని జి.సి.పి సంస్థ ఏర్పాటు చేసిన గొప్ప కార్యక్రమంలో ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ రబ్బానీ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించారు.

 • ఇంగ్లీష్

  MP4

  సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ మనకు మెదడు ఇచ్చినాడు - ఆలోచించడానికి మరియు దీర్ఘాలోచన చేయడానికి. దీని కోసం ఆయన తను సృష్టించిన అనేక గొప్ప సంపూర్ణమైన సృష్టితాల జ్ఞానాన్ని మనకు అందుబాటులో ఉంచాడు. ఈ వీడియోలో మానవుడి సృష్టి మరియు ఖుర్ఆన్ లో దాని ప్రస్తావన గురించి చర్చించబడింది.

 • ఇంగ్లీష్

  MP4

  మొత్తం మానవజాతి మార్గదర్శకత్వం కొరకు ఈ భూమిపై పంపబడిన అంతిమ సందేశం ఖుర్ఆన్ సత్యమైనది మరియు వాస్తవమైనదీను. ఖుర్ఆన్ అల్లాహ్ తరుఫు నుండి పంపబడిన ఒక అద్భుతం. కొందరు ప్రజలు లేవనెత్తుతున్న ఇస్లాం మరియు సైన్సుల మధ్య వ్యతిరేకత ఉందనే అపార్థాలను, అపనిందలను ఇది సరైన సాక్ష్యాధారాలతో ఖండిస్తున్నది.

 • ఇంగ్లీష్

  MP4

  అల్లాహ్ యొక్క ప్రతి ప్రవక్త (అలైహిస్సలాం)కు కొన్ని మహిమలు ఇవ్వబడినాయి. దీనికి కారణం ఆ యా ప్రవక్తల ప్రజలకు వారిలో నమ్మకం కలగాలని. అయితే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇవ్వబడిన అతి గొప్ప మహిమ ఖుర్ఆన్ మహిమ. ఖుర్ఆన్ మహిమ ఎంత శక్తివంతమైనదంటే, అది మిగిలిన అన్ని మహిమలను ఆవరించేసింది. షేఖ్ డాక్టర్ యాసిర్ ఖాదీ తన ఖుత్బా ప్రసంగంలో ఖుర్ఆన్ మహిమల గురించి వివరించారు. తప్పకుండా వినవలసిన మంచి ఉపన్యాసం.

పేజీ : 10 - నుండి : 1
ఫీడ్ బ్యాక్