కేటగిరీలు

 • అంహరిక్
  video-shot

  MP4

  ఈ జీవిత ఉద్దేశ్యం ఏమిటి ? - 2 అనే అంశంపై అల్ అమ్హారియ్యహ్ భాషలో తయారైన కరపత్రం.

 • అంహరిక్
  video-shot

  MP4

  ఈ జీవిత ఉద్దేశ్యం ఏమిటి ? - 1 అనే అంశంపై అల్ అమ్హారియ్యహ్ భాషలో తయారైన కరపత్రం.

 • తెలుగు

  PDF

  ఈ వ్యాసంలో మన జీవిత అసలు ఉద్దేశ్యం ఏమిటి అనే అంశం గురించి ఇస్లామీయ బోధనలు మరియు లాజికల్ విషయాల ఆధారంగా చర్చించబడింది. దీని ద్వారా నిష్పక్షపాతంగా చదివే పాఠకులు చాలా సులభంగా తమ జీవన ఉద్దేశ్యం గురించి గ్రహించి, ఇస్లాం ధర్మం స్వీకరించే అవకాశం ఉన్నది. ఇది ఇస్లామిక్ పాంప్లెట్స్ అనే సంస్థ ఇంగ్లీషులో తయారు చేసిన ఒక కరపత్రం యొక్క తెలుగు అనువాదం.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  ఈ ఆసక్తికరమైన కార్యక్రమంలో ప్రజల దృష్టిలో నుండి మాయమైపోయిన ఒక ముఖ్యమైన అంశంపై డాక్టర్ జాకిర్ నాయక్ చర్చించారు. ఈ ప్రపంచంలో తమ జీవిత లక్ష్యమేమిటో తెలియని కొందరు ప్రజలతో ఆయన సంబోధించారు. తద్వారా వారికి ఒక సరైన మరియు లాజికల్ పద్ధతిలో ఈ ప్రాపంచిక జీవితం యొక్క ముఖ్యోద్దేశ్యాన్ని చక్కగా వివరించారు.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  ఈ ప్రసంగంలో షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ అసలు తమ జీవిత ముఖ్యోద్దేశాన్నే మరిచిపోయిన ప్రజల గురించి చర్చించారు. ఈ భూలోకంపై తాము ఎందుకు జీవిస్తున్నామనే ముఖ్యాంశం గురించి తెలియని ప్రజలను సంబోధిస్తున్నారు. ఒకవేళ వారు దాని గురించి తెలుసుకోవాలనుకున్నా, వారు షైతాను కుతంత్రాల వలన మరియు అంధ విశ్వాసాల వలన మార్గభ్రష్టులవుతున్నారు. ఈ ప్రసంగం అలాంటి వారి సత్యాన్వేషణలో సహాయ పడుతున్నది మరియు ప్రామాణిక సాక్ష్యాధారాలతో సన్మార్గాన్ని చూపుతున్నది.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  ఈ ఉపన్యాసంలో సృష్టికర్త ఉనికి మరియు మన జీవిత ధ్యేయం గురించి షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ చర్చించినారు. అసలు దేవుడు అంటే ఎవరు అనే నిర్వచనంపై చర్చతో ఈ ఉపన్యాసం ప్రారంభమైంది. సృష్టకర్తను విశ్వసించడం ఎందుకు వివేకమైందో పరిశీలించబడింది.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  ఈ ఆసక్తికరమైన వీడియోలో చాలా ముఖ్యమైన విషయం ప్రజల దృష్టిలో నుండి ఎలా తప్పిపోతున్నది అనే ముఖ్యాంశం గురించి చర్చించబడింది. ఈ ప్రపంచంలో తమ జీవితం యొక్క ముఖ్యోద్దేశం తెలియని ప్రజలను సంభోదిస్తున్నది. ఒకవేళ వారికి అది తెలిసినా, షైతాను కుతంత్రాల వలన మరియు అంధ విశ్వాసాల వలన మార్గభ్రష్టులవుతున్నారు. అలాంటి ప్రజల సత్యాన్వేషణలో ఇది సహాయ పడుతున్నది.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  ఇది ఒక చాలా ఆసక్తికరమైన అంశం. పొగొట్టుకున్న ప్రజల సావధానతను మరలా జ్ఞప్తికి తెస్తున్నది. ఈ ప్రపంచంలో తమ జీవిత లక్ష్యం ఏమిటో తెలియని ప్రజలను సంబోధిస్తున్నది. ఒకవేళ వారు దానిని తెలుసుకోవాలని కోరుకున్నా, వారు ఎలా షైతాను కుతంత్రాల ద్వారా మరియు అంధవిశ్వాసాల వలన దారి తప్పి పోతున్నారు. ఇది వారికి సరైన మరియు హేతువాద పద్ధతిని చూపుతున్నది. దాని ద్వారా చిత్తశుద్ధితో ప్రయత్నించే ప్రతి ఒక్కరూ సత్యమార్గాన్ని కనుగొనగలరు.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  ఈ వీడియోలో జీవిత లక్ష్యాన్ని సాధించుట మరియు అలా సాధించటంలో పనికి వచ్చే కొన్ని ముఖ్యాంశాలను షేఖ్ ఉమర్ సులైమాన్ చర్చించారు.

 • ఇంగ్లీష్
  video-shot

  PDF

  మానవ జీవితపు కొన్ని పరమార్థాలను ఈ కరపత్రం చక్కగా వివరిస్తున్నది. ప్రారంభంలో, అల్లాహ్ నే ఎందుకు సర్వలోక సృష్టికర్త అని విశ్వసించాలనే దానికి కొన్ని జవాబులు ప్రస్తావించింది. తర్వాత, ఈ ప్రాపంచిక జీవితపు కొన్ని ముఖ్యోద్దేశాలన ప్రస్తావించింది.

 • ఇంగ్లీష్
  video-shot

  PDF

  ఈ కరపత్రంలో మరణం మరియు మరణానంతర జీవితం గురించి చర్చించబడింది. స్వర్గనరకాల గురించి వివరిస్తున్న కొన్ని ఖుర్ఆన్ వచనాలను, ఈ ప్రాపంచిక జీవిత ముఖ్యోద్దేశం మరియు మరణం ఎంతో దూరం లేదు అనే యథార్థం విషయాలు ఇది ప్రస్తావిస్తున్నది. తీర్పుదినంనాడు తూచబడే పాపపుణ్యాల లెక్కల గురించి ధృవీకరిస్తున్నది.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  ఈ ఆసక్తికరమైన కార్యక్రమంలో షేఖ్ హంజా ట్జోర్జిస్, దారి తప్పిన ప్రజల దృష్టిని ప్రధాన అంశంగా చేసుకున్నారు. ఈ ప్రపంచంలో తమ జీవిత ధ్యేయం తెలియని ప్రజల గురించి ఆయన చర్చించారు. ఒకవేళ వారు తెలుసుకోవాలని కోరుకున్నా, షైతాను పన్నాగాల వలన మరియు అంధవిశ్వాసాల వలన వారు మార్గభ్రష్టులవుతున్నారు. కాబట్టి, షేఖ్ వారికి సరైన మార్గాన్ని లాజికల్ పద్ధతుల ద్వారా తెలుపుతున్నారు. దీని ద్వారా అల్లాహ్ తలిస్తే, ప్రతి ఒక్కరూ సన్మార్గాన్ని తెలుసుకోగలరు.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  ఈ వీడియోలో విసామ్ షరీఫ్ ఖుర్ఆన్ మరియు ఇస్లాం అంటే ఏమిటో క్లుప్తంగా వివరించారు. మన జీవిత ఉద్దేశ్యం ఏమిటో కనుగొనటం ఎంత ప్రధానమైన విషయమో చర్చించారు.

 • ఇంగ్లీష్

  PDF

  ఈ పుస్తక ఆరంభంలో దీని రచయిత ఇలా పలికారు, "అమెరికాలోని ముస్లింలు ఉత్తమ స్థాయికి చేరుకునేందుకు ఇస్లాం గురించి లోతైన అవగాహన అవసరం. వారిలో అసాధారణమైన సామర్ధ్యం ఉంది. వారిలో తెలివితేటలు, శ్రమించడం మరియు ఇచ్చిన మాటపై నిలబడటం మొదలైన ఉత్తమ లక్షణాలు ఉన్నాయి. అయితే అవి కనుగొనబడని బంగారు మరియు వెండి గనుల మాదిరిగా బహిర్గతం కాలేదు."

 • ఇంగ్లీష్

  PDF

  ఆదం మరియు ఈవ్ ఆది దంపతుల నుండే మొత్తం మానవజాతి ఆరంభమైందని ఖుర్ఆన్ తెలుపుతున్నది.

 • ఇంగ్లీష్

  MP3

  డాక్టర్ లారెన్స్ బ్రౌన్ మానవుల మెదడులో మెలిగే కొన్ని పెద్ద ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు - నన్ను ఎవరు పుట్టించారు, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, నేనొక మంచి వ్యక్తిగా జీవిస్తే సరిపోతుందా, మనం కోరుకున్న విధంగా దేవుడిని ఎందుకు ఆరాధించకూడదు ...

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  ఈ వీడియోలో డాక్టర్ లారెన్స్ బ్రౌన్ మానవుల మెదడులో మెలిగే కొన్ని పెద్ద ప్రశ్నల గురించి చర్చించారు - నన్ను పుట్టించింది ఎవరు, నేనెందుకు ఇక్కడ ఉన్నాను, మంచి వ్యక్తిగా జీవిస్తే సరిపోతుందా, మనకు తోచిన విధంగా మనం దేవుడిని ఎందుకు ఆరాధించకూడదు...

 • తెలుగు
  video-shot

  MP4

  ఈ వీడియోలో మానవ జీవిత లక్ష్యం ఏమిటి అనే ముఖ్య విషయం పై గుంటూర్ పట్టణంలోని సెంటర్ ఫర్ ఫైనస్ మెసేజ్ టు మాన్ కైండ్ అనే ధర్మప్రచార సంస్థకు చెందిన ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ అబ్దుర్రహ్మాన్ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించారు.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  విశ్వసృష్టి మరియు మనం నివశిస్తున్న ఈ మహాద్భుత ప్రపంచం, అది ఎలా ఉనికిలోని వచ్చింది అనే విషయాలపై షేఖ్ ఖాలిద్ యాసన్ లోతుగా చర్చించారు. ఆయన తనదైన ప్రత్యేక శైలిలో చేసిన లాజికల్ ఆర్గుమెంట్లు వీటి గురించి ప్రశ్నించే అనేక మంది ప్రశ్నలకు వివేకవంతమైన సమాధానాలు ఇస్తున్నది.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  మాతృగర్భంలోని పిండం నుండి మొదలై, క్రమక్రమం జరిగిన మహాద్భుత మానవ జీవిత సృష్టి గురించి షేఖ్ ఖాలిద్ యాసిన్ చాలా చక్కగా వివరించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దివ్యఖుర్ఆన్ లో ఈ పిండోత్పత్తి దశలన్నీ ఎంతో ఖచ్చితంగా పేర్కొనబడినాయి. వాటిని ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఈ మధ్యనే కనిపెట్టబడిన ఆధునిక పరికరాల సహాయంతో కనుగొనగలిగింది. సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ ఎంతో ఘనమైనవాడు. మాతృగర్భంలోని పిండోత్పత్తి దశలు, ప్రపంచంలో చివరి శ్వాస పీల్చడం మరియు మరలా భూగర్భలో ప్రవేశించడం అంటే సమాధిలో ఉంచబడటం వరకు సంభవించే అనేక దశలు ఆయన వివరించారు. చావు తర్వాత జరగబోయే సంఘటనలు, పరలోక విషయాలు, ప్రతి ఆత్మ చిట్టచివరికి అంతిమ తీర్పుదినాన్ని ఎదుర్కొనవలసి ఉందనే సత్యం ... ఇవన్నీ ఆయన చక్కగా విశదీకరించారు.

పేజీ : 2 - నుండి : 1
ఫీడ్ బ్యాక్