కేటగిరీలు

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  బలమైన ఈమాన్ యొక్క చిహ్నాలలో ఒకటి ఏమిటంటే అతడు మెత్తటి మరియు పరిశుద్ధమైన మనస్సు కలిగి ఉంటాడు. అలాగే బలహీనమైన ఈమాన్ యొక్క చిహ్నాలలో ఒకటి ఏమిటంటే అతడు కఠిన మనస్సు కలిగి ఉంటాడు. హృదయం అనేది మన అధ్యాత్మికత మరియు అల్లాహ్ తో కలిగి ఉండవలసిన గట్టి సంబంధంలో ఒక ముఖ్యమైన అవయవం. కఠిన హృదయం యొక్క చిహ్నాలు ఏమిటి, మన హృదయాన్ని కఠినంగా మార్చే కారణాలు ఏవి, కఠిన హృదయాలకు మనం ఎలా చికిత్స చేయగలం మరియు వాటిని మెత్తటి హృదయాలుగా ఎలా మార్చగలం. .. మొదలైన ముఖ్యాంశాలపై షేఖ్ యాసిర్ ఖాదీ ఇచ్చిన ఖుత్బా ప్రసంగం.

 • ఇంగ్లీష్
  video-shot

  MP4

  చాలా అరుదుగా చర్చించబడే ఈ ముఖ్యాంశంపై షేఖ్ యాసిర్ ఖాదీ ఇచ్చిన ఖుత్బా ప్రసంగం ఇది. మీ హృదయ కోరికలకు ప్రశాంతత చేకూరింది. మీ హృదయం పరిశుద్ధమైంది మరియు సృష్టికర్తకు సమర్పించుకోవడంలోని మాధుర్యాన్ని చవి చూసింది. మీ హృదయానికి అవసరమైన ఆరోగ్య పరీక్ష చేయండి. స్వర్గ ప్రయాణానికి మీ హృదయం తయారుగా ఉందా లేదా అనేది పరీక్షించండి. ఆ రోజు మీ సంపద మరియు మీ సంతానం ఎందుకూ పనికి రాదు. పరిశుద్థమైన హృదయం మాత్రమే ఆ రోజున మీకు సహాయపడుతుంది. ఖుర్ఆన్ 26:88-89

 • ఇంగ్లీష్

  PDF

  సత్యం మరియు దయాగుణం - ఇవి రెండూ సమాజ మరియు వ్యక్తిగత సుఖసంతోషాలకు చిహ్నాలు. అలాంటి సుఖసంతోషాలకు చిత్తశుద్ధి మరియు దయాగుణం అనేవి తాళం చెవులు. అయితే, అసత్యం పలకడం మరియు అసూయాద్వేషాలు పెంచుకోవడంతో దుఃఖం మరియు దౌర్భాగ్యం జత కట్టి ఉన్నాయి. ఇస్లాం ధర్మం మొదలైన తర్వాత సత్యం పలకని మరియు దయాగుణం చూపని ఏ వ్యక్తి పైనా అల్లాహ్ అనుగ్రహం చూపలేదు. అలాగే అసత్యం పలికే మరియు అసూయాద్వేషాలతో రగిలే వానితో ఎలాంటి పని తీసుకోలేదు. ఈ ప్రచురణలో అన్ని రకాల అసత్యాలు మరియు అసూయాద్వేషాలు చర్చించబడినాయి. అలాగే మన నిత్యజీవితంలో వాటికి సంబంధించిన ఇస్లామీయ ధర్మాజ్ఞలు కూడా స్పష్టంగా తెలుపబడినాయి.

ఫీడ్ బ్యాక్