ఆదం పిల్లల వివాహాలు

వివరణ

ప్రశ్న – ఆది మానవులైన ఆదం మరియు హవ్వాలకు పిల్లలు పుట్టిన తర్వాత, వారి పిల్లలు తమలో తామే వివాహం చేసుకుని ఉంటారని నేను భావిస్తున్నాను. మరి ఖుర్ఆన్ లో సోదర సోదరీమణుల మధ్య వివాహం చేసుకోవటమనేది నిషేధింప బడినది (హరాం చేయబడినది) కదా?

Download
వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి

పూర్తి వివరణ

  ఆదం పిల్లల వివాహాలు

  ﴿ زواج أبناء آدم ﴾

  ] తెలుగు – Telugu – التلغو [

  الشيخ محمد صالح المنجد

  అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్

  పునర్విమర్శ : షేఖ్ నజీర్ అహ్మద్

  2009 - 1430

  ﴿ زواج أبناء آدم ﴾

  « باللغة التلغو »

  الشيخ محمد صالح المنجد

  ترجمة: محمد كريم الله

  مراجعة: شيخ نزير أحمد

  2009 - 1430

  ఆదం పిల్లల వివాహాలు

  అస్సలాము అలైకుమ్!

  ఏదేమైనా నాకు ఎటువంటి సందేహం లేదు, కాని ఇటువంటి విషయాలు మెదడులో వస్తుంటాయి. ఆదం మరియు హవ్వా లకు పిల్లలు పుట్టిన తర్వాత, వారి పిల్లలు తమలో తామే వివాహం చేసుకుని ఉంటారని నేను భావిస్తున్నాను. మరి ఖుర్ఆన్ లో సోదర సోదరీమణుల మధ్య వివాహం చేసుకోవటమనేది నిషేధింపబడినది (హరాం చేయబడినది) కదా? మన జీవితపు ప్రతి ఆచరణను వివరించే ఇస్లామీయ ధర్మాదేశాల గ్రంథాలను సూచించగలరా? అల్లాహ్ కోసం చేస్తున్న ఈ మంచిపనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

  వఆలేకుముస్సలామ్ వ రహ్మతుల్లాహి వ బరకాతహు!

  అల్హందులిల్లాహ్ – సకల స్తోత్రములు అల్లాహ్ కే,

  మీ విశ్వాసం గురించి మీ హృదయం దృఢంగా ఉన్నంత వరకు, ఇన్షాఅల్లాహ్ – అల్లాహ్ తలిస్తే అటువంటి ఏ సందేహాలు మీకు ఏ విధమైన నష్టాన్నీ కలుగ జేయలేవు. ఒకవేళ మీకు ఏవైనా విషయాల గురించి షరిఅహ్ (ఇస్లామీయ జీవన విధానం) మూలగ్రంథాల మధ్య పరస్పర విరుద్ధం ఉన్నట్లు అనిపిస్తే, అలాంటి వాటికి నిజమైన సమాధానాలు తప్పకుండా ఉన్నాయని మీరు దృఢంగా నమ్మవలెను. ఆ సమయంలో మీకు ఆ సమాధానాలు తెలుసుకోలేక పోవచ్చు లేదా వాటికి సరైన సమాధానాన్ని స్వయంగా కనిపెట్టలేకపోవచ్చు. ఏదేమైనా, ముందుకు వచ్చిన ప్రతి సందేహానికీ తమ మనస్సులో స్థానం ఇవ్వకూడదు, దానిలోని చిక్కుల గురించి చింత పడకూడదు మరియు ఆ సందేహాల కారణంగా లాభదాయకమైన విద్యార్జనను ప్రక్కన పెట్టకూడదు. షరిఅహ్ (ఇస్లామీయ జీనవ విధానం) లో స్పష్టంగా వివరింపబడిన విషయాల (ధ్రర్మాదేశాల – ముహ్కమాత్ ల) గురించి నేర్చుకోవటం మరియు తెలుసుకోవటం ప్రతి ముస్లింపై ఉన్న తప్పని సరి బాధ్యత. దీని ద్వారా తమకు కలిగే సందేహాలను సులభంగా పారద్రోలవచ్చును.

  మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం – ధర్మాజ్ఞల విషయంలో ఒక షరిఅహ్, మరొక షరిఅహ్ కు భిన్నంగా ఉండవచ్చు. అంటే ఒక రసూల్ (అల్లాహ్ యొక్క సందేశహరుడు, ప్రవక్త) బోధించిన జీవన విధానపు ధర్మాజ్ఞలకు (షరిఅహ్ కు) మరియు మరొక రసూల్ బోధించిన జీవన విధానపు ధర్మాజ్ఞలకు (షరిఅహ్ కు) మధ్య భిన్నత్వం ఉండవచ్చు. కాని వారందరూ బోధించిన మూలవిశ్వాసాలు మరియు మూలసిద్ధాంతాలు మాత్రం ఒక్కటిగానే ఉంటాయి. ఉదాహరణకు, కేవలం అల్లాహ్ నే ఆరాధించమని, ఇతరులను అల్లాహ్ కు సాటి కల్పించ వద్దని వారందరూ ఒకే మూలవిశ్వాసాన్ని ఉపదేశించారు. అయితే వారికి ఇవ్వబడిన షరిఅహ్ అంటే జీవనవిధానం ఆయా కాలాలకు మరియు పరిస్థితులకు అనుగుణంగా ఇవ్వబడినది. వేర్వేరు ప్రవక్తలకు ఇవ్వబడిన షరిఅహ్ లన్నీ ఒకే విధంగా ఉండక, వాటిలో (జీవన విధానాలలో) భిన్నత్వం ఉండవచ్చు. సులైమాన్ అలైహిస్సలాం జీవన విధానంలో (షరిఅహ్ లో) వర్ణచిత్ర లేఖనం అనుమతింపబడినది, కాని మన జీవన విధానంలో అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం షరిఅహ్ లో నిషేధింపబడినది. అలాగే, యూసుఫ్ అలైహిస్సలాం జీవన విధానంలో (షరిఅహ్ లో) గౌరవార్థం సాష్టాంగపడటం అనుమతింపబడినది, కాని అది మనకు నిషేధింపబడినది. పూర్వసమాజాల చట్టాలలో యుద్ధసంపత్తి నిషేధింపబడినది, కాని మన చట్టంలో అది పూర్తిగా అనుమతింపబడినది. పాలస్తీన్ దేశంలోని బైతుల్ మఖ్దిస్ అంతకు ముందు ప్రజల కోసం ఖిబ్లా (నమాజు చేసే) దిశగా ప్రకటింపబడినది, కాని మన సమాజానికి కాబాగృహం ఖిబ్లాగా ప్రకటింపబడినది. అలాగే, సోదరసోదరీమణుల మధ్య వివాహం జరుపుకోవటమనేది ఆదం అలైహిస్సలాం షరిఅహ్ (జీవనవిధానం) లో అనుమతింపబడగా, తర్వాతి తరాలకు అది నిషేధింపబడినది. ప్రఖ్యాత ఖుర్ఆన్ వ్యాఖ్యానకర్త హాఫిద్ ఇబ్నె కథీర్ దీనిని ఇలా స్పష్టపరిచారు:

  ఆ ఆవశ్యకతకు అనుగుణంగా అల్లాహ్ ఆజ్ఞతోనే ఆదం అలైహిస్సలాం తన కుమార్తెల పెళ్ళిళ్ళను తన కుమారులతో జరిపించెను. ప్రతి కాన్పులో కవలలు పుట్టేవారు – తప్పని సరిగా ఒక ఆడపిల్ల మరియు ఒక మగ పిల్లవాడు. కాబట్టి, ఒక కవలల జంటలో పుట్టిన ఆడపిల్లను వేరొక కవలల జంటలో పుట్టిన మగపల్లవాడితో ఆయన పెళ్ళి జరిపించే వారు. దీని గురించి ఇబ్నె మస్ఊద్, ఇతర సహాబాల (రదియల్లాహు అన్హుమ్) నుండి ముర్రాహ్ మరియు ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా నుండి అబు సాలెహ్ మరియు అబు మాలిక్ ల ద్వారా 'సుద్ది' అనే పండితుడు ఇలా తెలిపినారు – ఆదం అలైహిస్సలాంకు ఒక ఆడపిల్ల మరియు ఒక మగపిల్లవాడి తో కూడిన కవలల జంటలుగా మాత్రమే పిల్లలు పుట్టేవారు. అంటే ప్రతి కాన్పులోను కవలలే పుట్టేవారు. ఆ కవలలో ఒక ఆడపిల్ల మరియు ఒక మగపిల్లవాడు తప్పకుండా పుట్టేవారు. కాబట్టి ఆయన ఒక కవలల జంటలోని అమ్మాయిని మరొక కవలల జంటలోని అబ్బాయితో మరియు అదే కవల జంటలోని అబ్బాయిని మరొక కవలల జంటలోని అమ్మాయితో వివాహం జరిపించేవారు. అంటే మొదటి కవల జంటలోని అమ్మాయికి, అబ్బాయికి వేరొక కవల జంటలోని అబ్బాయికి, అమ్మాయికి పెళ్ళి జరిపించేవారు. తఫ్సీర్ ఇబ్నె కథీర్ సూరహ్ అల్ మాయిదా 5:27

  కేటగిరీలు: