మహిళా ప్రవక్తలు లేక సందేశహరులు ఎందుకు లేరు – దీని వెనుక నున్న వివేకంపై చర్చ

వివరణ

స్త్రీలలో నుండి ప్రవక్తలు మరియు సందేశహరులు ఎందుకు లేరు అనే ప్రశ్నకు షేఖ్ ముహమ్మద్ సాలెహ్ అల్ మునజ్జిద్ ఇక్కడ జవాబిచ్చారు.

Download
వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి

పూర్తి వివరణ

  మహిళా ప్రవక్తలు లేక సందేశహరులు ఎందుకు లేరు – దీని వెనుక నున్న వివేకంపై చర్చ

  ] తెలుగు – Telugu -[ تلغو

  షేఖ్ సాలిహ్ అల్ మునజ్జిద్

  http://islamqa.info

  2012 - 1432

  ليس في النساء نبيِّات ولا رسولات

  وبيان الحِكَم الجليلة في ذلك

  « باللغة تلغو »

  محمد صالح المنجد

  المصدر: موقع الإسلام سؤال وجواب

  2012 - 1432

  మహిళా ప్రవక్తలు లేక సందేశహరులు ఎందుకు లేరు దీని వెనుక నున్న వివేకంపై చర్చ

  యూదమతం, క్రైస్తవం మరియు ఇస్లాం ధర్మాలలో ఎందుకు మగవారే ప్రవక్తలుగా ఎంచుకోబడినారు? ఎందుకు మహిళా ప్రవక్తలు లేరు? ఎందుకు మగవారే ప్రవక్తలుగా ఉండాలి?

  అల్హందులిల్లాహ్ – సకల స్తోత్రములు, కృతజ్ఞతలు అల్లాహ్ కే.

  మొట్టమొదటి విషయం:

  మహోన్నతుడు మరియు పరిపూర్ణుడు, సకల ప్రశంసలకూ మరియు కృతజ్ఞతలకూ ఏకైక అర్హుడైన అల్లాహ్ యొక్క గొప్ప వివేకాన్ని నమ్మటంలో ఒక ముస్లిం ఎంత మాత్రమూ వెనుకాడడు. అల్ హకీమ్ (అత్యంత వివేకవంతుడు) అనేది ఆయన శుభనామాలలోని ఒక శుభనామం మరియు హిక్మా (వివేకం) ఆయన దివ్యలక్షణాలలోని ఒక దివ్యలక్షణం.

  ‘పురుషత్వం’ అనేది సందేశహరుల ఒక లక్షణమని మహోన్నతుడైన అల్లాహ్ నిశ్చయించినాడు. కొందరు పండితుల అభిప్రాయం ప్రకారం ఇది పండితులందరి ఏకాభిప్రాయం. దీని వెనుక గొప్ప వివేకం ఉంది.

  షేఖ్ ఉమర్ అల్ అష్ఖార్ (ఆయనను అల్లాహ్ రక్షించుగాక) ఇలా పలికారు:

  అల్లాహ్ అనుగ్రహించిన పరిపూర్ణత్వం యొక్క మరొక రూపం ఏమిటంటే తన సందేశహరులందరినీ ఆయన పురుషులలో నుండే ఎంచుకున్నాడు. ఏ సందేశహరుడినీ ఆయన స్త్రీలలో నుండి ఎంచుకోలేదు. క్రింది ఆయతులోని అల్లాహ్ పలుకులలో ఈ విశిష్టత సూచించబడింది (ఖుర్ఆన్ ఆయతు భావానువాదం) : (ఓ ముహమ్మద్) నీకు పూర్వం మేము ప్రవక్తలుగా పంపిన వారంతా పురుషులే” [అల్ అంబియా 21:7].

  వారికివ్వబడిన బాధ్యతల స్వభావాన్ని అనుసరించి పురుషులలో నుండి మాత్రమే సందేశహరులు ఎంచుకోబడినారు - స్త్రీలలో నుండి కాదు. ఉదాహరణకు:

  1. సందేశహరుని పాత్ర అనేక గొప్ప పనులు చేయవలసి ఉంటుంది: స్త్రీపురుషులను సంబోధించుట, రహస్యంగా మరియు బహిరంగంగా ప్రజలను కలవటం, మొత్తం భూమిపై సంచరించుట, అసత్యవాదులను ఎదుర్కొనుట మరియు వారికి (అసత్యాలకు) విరుద్ధంగా నిదర్శనాలను చూపుట మరియు వారితో వాదోపవాదాలు చేయుట, సైన్యాలను తయారు చేయుట మరియు వాటికి నాయకత్వం వహించుట, యుద్ధ బాధల గుండా ముందుకు సాగుట. ఇవన్నీ పురుషులకు తగును గానీ స్త్రీలకు కాదు.

  2. తనను అనుసరించే వారి బాధ్యత తప్పకుండా వహించవలెనని సందేశహరుని పదవి డిమాండు చేస్తుంది. కాబట్టి అతను తన సహచరులకు ఆదేశాలు మరియు నిషేధాజ్ఞలు జారీ చేస్తాడు, పరిపాలిస్తాడు మరియు వారి మధ్య తీర్పు చెబుతాడు. ఒకవేళ ఎవరైనా మహిళకు అలాంటి సందేశహరుని బాధ్యత అప్పగిస్తే, దానిని ఆమె సరిగ్గా నిర్వహంచలేక పోవచ్చు, ఆమె ఆదేశాలను అనుసరించకుండా తిరస్కరించే ప్రజలు ముందుకు రావచ్చు మరియు ఆమెకు విధేయత చూపక పోవచ్చు.

  3. పురుషత్వం ఎక్కువ పరిపూర్ణమైంది. కాబట్టి సందేశహరుల బాధ్యతను అల్లాహ్ స్త్రీలకు ఇవ్వకుండా, పురుషులకే అప్పగించినాడు:

  “పురుషులు స్త్రీల సంరక్షకులు మరియు పోషణకర్తలు”[అన్నిసాయి 4:34].

  స్త్రీలలో వివేకం మరియు ధార్మిక నిబద్ధత కొరత ఉంటుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలికి ఉన్నారు.

  4. బహిష్టు, గర్భధారణము, పిల్లలను కనడం మరియు పురుటి రక్తస్రావం మొదలైన వాటి వలన స్త్రీలు మానసిక ఒత్తిడికి మరియు బాధలకు గురవుతారు. అంతేగాక పసిపిల్లల బాధ్యత కూడా వహించ వలసి ఉంటుంది. ఇవన్నీ వారిని సందేశహరుని బాధ్యతలలోని అనేక పనులు చేయకుండా అడ్డుకుంటాయి. (p. 84-85)

  రెండవది:

  ఇక ప్రవక్తత్వం విషయంలో – మర్యం బిన్తె ఇమ్రాన్ తో కలుపుకొని కొందరు మహిళా ప్రవక్తలు ఎంచుకోబడినారని అబుల్ హసన్ అల్ అషరీ, అల్ ఖుర్తుబీ మరియు ఇబ్నె హజమ్ మొదలైన కొందరు పండితుల అభిప్రాయం! మూసా అలైహిస్సలాం తల్లి వద్దకు దివ్యావతరణ (వహీ) పంపానని అల్లాహ్ తెలిపిన ఖుర్ఆన్ వచనాన్ని, దైవదూతలు మర్యంతో జరిగిన సంభాషణను తెలిపే ఖుర్ఆన్ వచనాలన్ని మరియు ప్రపంచ స్త్రీలందరిలోకెల్లా శ్రేష్ఠమైనదానిగా ఆమెను ఎంచుకున్నట్లు తెలిపే వచనాల్ని వారు తమ వాదనకు సాక్ష్యంగా చూపుతారు.

  వారి వాదన సరైనది కాకపోవచ్చని తెలుస్తుంది.

  షేఖ్ ఉమర్ అల్ అష్కర్ (హఫిజహుల్లాహ్) ఇలా తెలిపారు:

  వారి వాదనలను స్త్రీల ప్రవక్తత్వానికి సాక్ష్యంగా తీసుకోలేము. వారి వాదనలను అనేక విధాలుగా ఖండించవచ్చు:

  1. దివ్యసందేశాన్ని అందజేయటం, బోధించడం మరియు ప్రజలలో కలిసిమెలిసి ఉండటం వంటివి ప్రవక్తలకు ఆదేశించబడలేదనే వారి వాదనను మేము అంగీకరించము. మా అభిప్రాయం ఏమిటంటే, ఈ విషయాలలో ఒక ప్రవక్తకూ మరియు ఒక సందేశహరునికీ మధ్య ఎలాంటి భేదమూ లేదు. అయితే వారి మధ్య భేదం ఏమిటంటే, ప్రవక్తలు తమ కంటే ముందు పంపబడిన సందేశహరుని ధర్మశాసనంతోనే పంపబడతారు.

  ఒకవేళ ఇదే అసలు విషయమైతే, ఎందుకని మహిళా సందేశహరులు పంపబడలేరు అనే దానికి గల కారణాలే ఎందుకని మహిళా ప్రవక్తలు పంపబడలేరు అనే దానికి కూడా వర్తిస్తాయి. ప్రవక్త పదవిని నిర్వహించడం మహిళలకు సాధ్యం కాదని తెలిపే అనేక కారణాలు ఉన్నాయి.

  2. మూసా అలైహిస్సలాం తల్లికి మరియు (ఫిరౌను భార్య) ఆసియాకు అల్లాహ్ పంపిన దివ్యావతరణ (వహీ) స్వప్నరూపంలో ఉండింది. స్వప్నాలు దివ్యావతరణలోని ఒక భాగం కాగలవని మరియు ఇలాంటి దివ్యస్వప్నాలు ప్రవక్తలకే కాకుండా ఇతరులకు కూడా రావచ్చని మాకు తెలుసు.

  3. దైవదూతలు సంభోదించిన ప్రతి ఒక్కరూ ప్రవక్తలేననే వారి వాదనతో మేము అంగీకరించం. మరో పట్టణంలో ఉన్న తన ధార్మిక సోదరుడిని చూడటానికి వెళ్ళుచున్న ఒక వ్యక్తి వద్దకు ఒక దైవదూతను పంపటం జరిగిందని ఒక హదీథులో తెలుపబడింది. ఎందుకు అతనిని చూడటానికి వెళ్ళుచున్నావని దైవదూత ప్రశ్నించగా, అల్లాహ్ కోసం తాను అతనిని ప్రేమిస్తున్నానని ఆ వ్యక్తి జవాబిచ్చాడు. దీని కారణంగా ఆ ప్రయాణికుడిని తాను ప్రేమిస్తున్నానని తెలిపేందుకు అల్లాహ్ ఒక దైవదూతను అతని వద్దకు పంపినాడు. అలాగే బట్టతలవాడి, కుష్ఠురోగి మరియు అంధుడి కథ మనందరికీ తెలుసు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రశ్నిస్తూ, జిబ్రయీల్ అలైహిస్సలాం సహాబాలకు వారి ధర్మం గురించి బోధించేందుకు రావటాన్ని సహాబాలు కళ్ళారా చూసారు మరియు ఆయన మాటలు స్పష్టంగా విన్నారు కూడా.

  4. అల్లాహ్ మర్యంను ఎంచుకున్నాడనే వచనాలను వారు సాక్ష్యంగా ఉదహరించలేరు. ఎందుకంటే ప్రవక్తలనే కాకుండా ప్రజలను కూడా ఎంచుకున్నట్లు అల్లాహ్ స్పష్టంగా పేర్కొని ఉన్నాడు.:

  “తరువాత మా దాసులలో మేము ఎన్నుకున్న వారిని (ఈ) గ్రంథానికి వారసులుగా చేశాము. మరి వారిలో కొందరు తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగడుతున్నారు. వారిలో మరికొందరు మధ్యస్థంగా ఉన్నారు. వారిలో మరికొందరు అల్లాహ్ అనుమతితో సత్కార్యాలలో ముందంజ వేస్తున్నారు. …” [Faatir 35:32].

  ఆయన మానవులపై మరియు జిన్నాతులపై ఇబ్రాహీం అలైహిస్సలాం కుటుంబాన్ని మరియు ఇమ్రాన్ కుటుంబాన్ని ఎంచుకున్నాడు. మరి నిశ్చయంగా మొత్తం వారి కుటుంబానికి కుటుంబం ప్రవక్తలు కాదు గదా!

  “నిశ్చయంగా అల్లాహ్ ఆదమును, నూహ్ ను, ఇబ్రాహీమ్ వంశస్థులను మరియు ఇమ్రాన్ వంశస్థులను సర్వలోకాల ప్రజలపై (ప్రాధాన్యతనిచ్చి) ఎన్నుకున్నాడు..” [ఆలే ఇమ్రాన్ 3:33].

  5. వారు సాక్ష్యంగా వాడుతున్న హదీథులో పేర్కొనబడిన పరిపూర్ణత్వం అనే పదం ఖచ్ఛితంగా ప్రవక్తత్వానికే వర్తిస్తుందని చెప్పలేము. ఎందుకంటే, అది ఏదైనా పనిని పూర్తి చేయడంలోని, ఏదైనా విషయంలో మహోన్నత స్థానాన్ని చేరుకోవడంలోని పరిపూర్ణత్వానికి కూడా వర్తించవచ్చు. మహిళలకు సంబంధించిన అంశాలన్నింటిలో పరిపూర్ణత్వాన్ని సాధించిన మహిళ అని దీని అర్థం: కాబట్టి ఇక్కడ పేర్కొనబడిన పరిపూర్ణత్వం ప్రవక్తత్వానికి సంబంధించిన పరిపూర్ణత్వం కాదు.

  6. కొన్ని హదీథులలో ఖదీజా రదియల్లాహు అన్హా ఒక పరిపూర్ణ మహిళ అని స్పష్టంగా పేర్కొనబడింది. ఇక్కడ పేర్కొనబడిన పరిపూర్ణత్వం ప్రవక్తత్వానికి సంబంధించినది కాదని స్పష్టంగా తెలుపుతున్నది.

  దీనికి సంబంధించిన మరికొన్ని హదీథులు మరియు వాటి వివరణ చూడగలరు.

  7. ఇమ్రాన్ కుమార్తె మర్యం తోపాటు ఫాతిమహ్ బిన్తె ముహమ్మద్ కూడా స్వర్గంలోని మహిళలకు నాయకురాలుగా ఉంటుందని కొన్ని హదీథులలో స్పష్టంగా తెలుపబడింది. మర్యం కాకుండా మూసా అలైహిస్సలాం తల్లి మరియు ఆసియా మొదలైన ఇతర మహిళల ప్రవక్తత్వాన్ని ఈ హదీథు స్పష్టంగా నామరూపాలు లేకుండా చేస్తున్నది ఎందుకంటే ఫాతిమహ్ బిన్తె ముహమ్మద్ ప్రవక్త కాదనే విషయం మనందరికీ ఖచ్చితంగా తెలుసు. అయితే ఆమె ఇతర మహిళల కంటే ఉత్తమురాలని ఈ హదీథు స్పష్టంగా తెలుపు తున్నది. మరి ఒకవేళ మూసా అలైహిస్సలాం తల్లి మరియు ఆసియాలు ప్రవక్తలైతే, తప్పకుండా వారు ఆమె కంటే ఉత్తమురాళ్ళై ఉండాలి కదా!

  8. ఆమె ఉత్తమ గుణాల వివరణ మరియు పెంపకం గురించి ప్రస్తావిస్తూ మర్యంను సిద్ధీఖా (సత్యవంతురాలు) అని పేర్కొనడం జరిగింది. అల్లాహ్ పలుకులు (ఖుర్ఆన్ వచన భావార్థం):

  “మరియం కుమారుడైన మసీహ్ (ఏసుక్రీస్తు) కేవలం అల్లాహ్ సందేశహరుడు తప్ప మరింకేమీ కాదు. నిజానికి ఆయనకు పూర్వం ఎందరో సందేశహరులు గతించినారు. మరియు ఆయన తల్లి ఒక సత్యవంతురాలైన స్త్రీమూర్తి. వారిద్దరూ (ఇతరుల మాదిరిగానే) అన్నం తినేవారు.…” [అల్ మాఇదహ్ 5:75].

  ఒకవేళ అంతకంటే ఉత్తమ వివరణ ఉంటే తప్పకుండా అది ప్రస్తావించబడేది. కానీ, ఖుర్ఆన్ లో గానీ లేదా సహీహ్ హదీథులలో గానీ ఎక్కడా ప్రవక్తగా ఏ ఒక్క మహిళా ఎంచుకోబడిందనే విషయం ప్రస్తావించబడలేదు.

  మర్యం ప్రవక్త కాదని ఒక పండితుల సమూహం నుండి అల్ ఖాదీ అయ్యాద్ ఉల్లేఖించారు. మర్యం ప్రవక్త కాదనే విషయంపై పండితులందరి మధ్యా ఏకాభిప్రాయం ఉందని అల్ అద్కార్ అనే పుస్తకంలో ఇమాం నవవీ తెలిపారు. మానవులలో మరియు జిన్నాతులలో మహిళా ప్రవక్తలు లేరని షరహ్ అల్ ముహద్దబ్ లో కొందరు పండితులు తెలిపినట్టు మరియు అల్ హసన్ అల్ బస్రీ పలికినట్టు పేర్కొనబడింది.

  రిఫరెన్సు అర్రుసుల్ వర్రిసాలాత్ (The Messengers and the Messages in the Light of the Qur’aan and Sunnah, by ‘Umar S. al-Ashqar)

  అసలైన అల్లాహ్ కే తెలుసు.