? మన జీవిత కాలంలో అసలు మనం ఇమాం మహదీను చూడగలమా

వివరణ

ఇమాం మహదీ, దజ్జాల్ ఆవిర్భావం మరియు ఈసా అలైహిస్సలాం పునరాగమనం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన భవిష్యవాణులలో నేను ఎన్నో సూచనలను చదివాను. ఈ సూచనలు నన్నెంతో ఆశ్చర్యపరిచినాయి. ఎందుకంటే, అవన్నీ నిజమవుతూ కనబడుతున్నాయి, ప్రస్తుత కాలంలో జరుగుతున్నాయి. సమయం త్వరత్వరగా గడిచిపోవడం, మధ్యపానం ఎక్కువై పోవడం, వ్యభిచారం పెరిగిపోవడం, పాటలు సర్వసామాన్యమై పోవడం ... మొదలైనవి ఎన్నో. నా ప్రశ్న ఏమిటంటే, పైన పేర్కొన్న ముగ్గురిలో ఎవరైనా త్వరలోనే వచ్చే అవకాశం ఉందా మరియు మన జీవిత కాలంలో సంభవించే అవకాశం ఉందా ? ధన్యవాదాలు.

Download
ఫీడ్ బ్యాక్