ఈసా అలైహిస్సలాం జీవితం గురించి వివరించే ఖుర్ఆన్ వచనాలపై అడిగిన ప్రశ్నలకు జవాబులు

వివరణ

ఈ వెబ్సైట్ అంటే నాకు చాలా ఇష్టం మరియు నేను తరుచుగా ఈ వెబ్సైటును సందర్శిస్తూ ఉంటాను. మీపై నాకు ఎంతో గౌరవం ఉన్నది. నా ప్రశ్న వైపు వెళ్ళే ముందు, నాకు ఖుర్ఆన్ పై ఎలాంటి సందేహమూ లేదు మరియు ఖుర్ఆన్ లోని ఒక్క అక్షరం కూడా మార్చబడలేదని నేను పూర్తిగా నమ్ముతున్నాను. కానీ, ఈ రెండు ఖుర్ఆన్ వచనాల విషయంలో నేను సరిగ్గా అర్థం చేసుకోలేక పోతున్నను, "నేను పుట్టిన రోజున నాపై శాంతి ఉంది మరియు నేను మరణించే రోజున. అలాగే నా పునరాగమనం రోజున. "! (సూరహ్ మర్యం 33). నేను మరణించే రోజున; అంటే అర్థం ఏమిటి ? అలాగే మరో ఖుర్ఆన్ వచనం : ఆయన మరణించక ముందు, గ్రంథ ప్రజలలో ఆయనను విశ్వసించని వారెవరూ మిగిలి ఉండరు; మరియు అంతిమ తీర్పుదినాన వారికి వ్యతిరేకంగా ఆయన సాక్ష్యమిస్తారు;- (అన్నిసా 159). ఆయన మరణించక ముందు; అంటే అర్థం ఏమిటి? మరి ఈ ఖుర్ఆన్ వచనాల సంగతి ఏమిటి: "మరి వారిలా అన్నారు, " అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు మర్యం కుమారుడైన జీసస్ ను మేము వధించాము";- కానీ వారు ఆయనను వధించనూ లేదు, శిలువ వేయనూ లేదు, అయితే వారికి అలా కనబడేట్లు చేయబడింది. మరియు ఈ విషయంలో విభేదించే వారందరూ దాని గురించి ఖచ్చితమైన జ్ఞానం లేకుండా పూర్తిగా సందేహాలలో పడి ఉన్న వారే, కేవలం వారు ఊహలను మాత్రమే అనుసరిస్తున్నారు. ఖచ్చితంగా వారు ఆయనను వధించలేదు:- (అన్నిసా 157) " నిజంగా, అల్లాహ్ ఆయనను తన వద్దకు లేపుకున్నాడు; అల్లాహ్ అత్యంత శక్తిమంతుడు మరియు వివేకవంతుడూను;- (అన్నిసా 158). ప్రస్తుతం నేను చైనాలో చదువు కుంటున్నాను. వివిధ ధర్మాలకు చెందిన అనేక మంది స్నేహితులు నన్ను ఖుర్ఆన్ గురించి మరియు ఇస్లాంలో జీసస్ గురించి ప్రశ్నిస్తున్నారు. వారికి సరైన సమాధానం ఇవ్వడానికి నేను శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను.

Download
వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి
ఫీడ్ బ్యాక్