ముస్లిం మహిళ యొక్క ముస్లిమేతర కుటుంబం ఆవిడ జన్మదిన పండుగను జరుపుతున్నది

వివరణ

నా తల్లిదండ్రులు మరియు ఇద్దరు సోదరులు ఇంకా ఇస్లాం స్వీకరించలేదు. వారు నాస్తికులు. నా పుట్టినరోజు దినానికి వారు ఎంతో ప్రాముఖ్యత నిస్తారు. ఫోను ద్వారా మరియు ఈమెయిల్ ద్వారా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంటారు. నా జన్మదిన పండుగ జరుపుకోవడం నాకు ఇష్టం లేదని, ఇతర దినాల వలే అది కూడా నాకోసం ఒక మామూలు దినమని నేను వారికి ఎన్నో సార్లు చెప్పినా కూడా నా మాట వినరు. నా కుటుంబంలో కేవలం నేను మాత్రమే ముస్లింను. నేను ఒక ముస్లిం వ్యక్తిని పెళ్ళి చేసుకుని, కెనడాలోని వేరే ప్రాంతంలో వారికి దూరంగా నివశిస్తున్నాను. ఈ సంవత్సరం నేను నా జన్మదినం నాడు ఫోను ప్లగ్ తొలగించి వేసాను - వారికి నా జన్మదిన శుభాకాంక్షలు తెలిపే అవకాశం ఇవ్వకూడదని. ఇలాంటి పరిస్థితులలో నేనేమి చేయాలి ?

Download
వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి
ఫీడ్ బ్యాక్