నూతన సంవత్సర ప్రారంభ సందర్భంగా ఒకచోట సమావేశమై, అల్లాహ్ ను ధ్యానించుట, దుఆలు చేయుట మరియు ఖుర్ఆన్ పఠించుటపై ఇస్లామీయ ధర్మాజ్ఞలు ఏమిటి

వివరణ

ఈ మెసేజీ ఇంటర్నెట్ లో అనేక చోట్ల కనబడుతుంది. కానీ, నేను దీనిని ఎవ్వరికీ పంపలేదు. ఎందుకంటే ఇది బిదఅ అంటే ధర్మంలో నూతన కల్పితం క్రిందికి వస్తుందా రాదా అనే విషయం నాకు తెలీదు. దీనిని వ్యాపింపజేయవచ్చా మరియు అలా చేయడం వలన మాకు పుణ్యాలు ప్రసాదించబడునా ? లేదా ధర్మంలో లేని విషయాన్ని నూతనంగా మొదలుపెట్టడం వలన ఇలా చేయడం అనుమతించబడలేదా ?
“ఇన్ షాఅ అల్లాహ్, జనవరి ఒకటవ తేదీ అర్థరాత్రి 12 గంటలకు మేము రెండు రకాతులు నమాజు చేస్తాము లేదా ఖుర్ఆన్ పఠిస్తాము లేదా అల్లాహ్ యొక్క ధిక్ర్ చేస్తాము లేదా దుఆలు చేస్తాము - ఎందుకంటే, ప్రజలలో అధిక శాతం అల్లాహ్ కు అవిధేయత చూపుతున్న ఆ సమయంలో ఒకవేళ అల్లాహ్ ఈ ప్రపంచంవైపు చూస్తే, ముస్లింలు ఆయనకు విధేయత చూపుతూ, ఆయన ఆరాధనలలో మునిగి ఉండడం, ఆయనకు కనబడుతుంది. అల్లాహ్ సాక్షిగా, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికీ మీరు ఈ సందేశాన్ని పంపవలెను. ఎందుకంటే, మన సంఖ్య పెరిగిన కొద్దీ, మన ప్రభువు మనతో సంతుష్టపడతాడు." దయచేసి నాకు సలహా ఇవ్వండి. అల్లాహ్ మీపై కరుణించుగాక.

Download
ఫీడ్ బ్యాక్