కొందరు ముస్లింలు క్రిస్ట్ మస్ పండుగ జరుపుకోడం మరియు తమ ఇళ్ళను బెలూన్లతో అలంకరించుకోవడంపై ఇస్లామీయ ధర్మాజ్ఞ ఏమిటి

వివరణ

యునైటెడ్ కింగ్ డమ్ లో నివశిస్తున్న కొందరు ముస్లింలు క్రిస్ట్ మస్ పండుగ జరుపుకుంటూ తమ ఇళ్ళల్లో క్రిస్ట్ మస్ రోజున మరియు తర్వాత దినాలలో ఇతర ముస్లిం కుటుంబాల కోసం విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తారు. టర్కీ రోస్ట్ మరియు ఇతర క్రిస్ట్ మస్ పండుగ సంప్రదాయక వంటలు తయారు చేస్తారు. తమ ఇళ్ళను బెలూన్లతో మరియు రంగు రంగుల తోరణాలతో అలంకరించుకుంటారు. రహస్య శాంతా సంప్రదాయాన్ని అంటే ప్రతి ఒక్కరూ అక్కడి బంధువులలో ఒకరికి ఏదో ఒక బహుమతి ఇస్తారు. ఫలానా వ్యక్తికి బహుమానంగా ఇవ్వాలని ముందే నిర్ణయించుకుని మరీ తీసుకువస్తారు. బహుమతి తీసుకున్న వ్యక్తికి దానిని ఎవరు ఇచ్చారో తెలియదు. [“సీక్రెట్ శాంతా” అనేది క్రిస్ట్ మస్ పండుగ జరుపుకునే ముస్లిమేతరులలో కొత్తగా పెరుగుతున్న ఒక సంప్రదాయం. శాంతా క్లాస్ గాథపై వారికున్న విశ్వాసానికి అనుగుణంగా దీనిని
జరుపుకుంటున్నారు. ]. ముస్లింలు ఇలా చేయడం హలాల్ గా పరిగణించబడుతుందా లేక హరామ్ గానా. ఒకవేళ ఇలాంటి పండుగలో కేవలం ముస్లింలు మాత్రమే పాల్గొంటూ ఉంటే, దీనిని జరుపుకునే అనుమతి ఉన్నదా (బంధువులు మరియు కుటుంబ సభ్యులు మాత్రమే)?.

Download
ఫీడ్ బ్యాక్