ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి మస్జిదులలో ప్రసంగాలు చేయడానికి వారు ఒకరోజును ఎంచుకున్నారు - దానినే వారు మౌలీద్ అంటే మిలాదున్నబీ అనే పేరు పెట్టారు

వివరణ

మిలాదున్నబీ పండుగ జరుపుకోవడమనేది ఇస్లాం ధర్మంలో లేని ఒక నూతన కల్పితమనేది అందరికీ తెలిసిన విషయమే. అనేక మంది ప్రజల వద్ద మౌలీదు పద్దతి ఉన్నది - అయితే అది మిలాదున్నబీ పండుగ జరుపుకోవటం ద్వారా కాదు - అది ఇతరులకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవన విధానాన్ని, ఉపదేశాలను అవకాశం కలిగినప్పుడల్లా బోధించడం ద్వారా వారు మౌలీదు జరుపుకుంటారు. ఒకవేళ మిలాదున్నబీ పండుగ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టిన రోజున కాకుండా వేరే దినాలలో జరుపుకున్నా అది హరాం విషయమేనా ? మౌలీద్ లేదా మిలాదున్నబీ అనే పేరుతో పిలవడం వలన అది హరాం గా పరిగణించబడుతున్నదా ? ఉదాహరణకు, ఒకవేళ నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర గురించి బోధించవలసి వచ్చినపుడు, మౌలీద్ అనే పదాన్ని వాడక పోయినా, అది హరామ్ గా పరిగణించబడుతుందా ? అదే సందర్భంలో ప్రజలకు భోజనం పెట్టడం ... నేను దీనిని ఎందుకు అడుగుతున్నానంటే, రాబోయే వారాంతంలో శనివారం నాడు ఒక వివాహ భోజనం ఉన్నది. చాలా మంది ప్రజలు గుమిగూడతారు గనుక, ఆహ్వానిస్తున్న సోదరుడు భోజనాలైన తర్వాత మస్జిదులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర గురించి ఉపన్యాసం ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నాడు. దానిని వారు మౌలీద్ అనే పేరుతో పేర్కొంటున్నారు. కానీ, అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టున రోజున రావడం లేదు మరియు మిలాదున్నబీ పండుగ జరుపుకునేందుకు కూడా కాదు - కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సీరత్ గురించి బోదించడం మాత్రమే అతని ఉద్దేశ్యం. సాధారణంగా పెళ్ళిళ్ళలో జరిగే గానా బజానాకు బదులుగా ప్రజలకు ప్రయోజనం కలుగుతుందనే ఉద్దేశ్యంతో ఆయన ఈ పని చేయాలని తలుస్తున్నాడు. దయచేసి మీ సలహా ఇవ్వండి.
రెండో విషయం ఏమిటంటే, ఒకవేళ నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ప్రజలకు తెలిపే ఉద్దేశ్యంతో మస్జిదులో ఉపన్యాసం ఏర్పాటు చేసి, తర్వాత వారికి భోజనం పెడితే అది హరామ్ గా పరిగణించబడుతుందా ?

Download
వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి
ఫీడ్ బ్యాక్