• video-shot

  PDF

  జ్ఞానం సంపాదించడంలో మరియు తన జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో ఇస్లాం ధర్మం స్త్రీలకు కూడా పురుషులతో పాటు సమాన హక్కులు ప్రసాదించిందని విషయాన్ని ఈ కరపత్రం చర్చిస్తున్నది. ఇంకా, ప్రతిఫలం మరియు బాధ్యతల విషయంలో స్త్రీపురుషుల మధ్య ఎలాంటి భేదం లేదని స్పష్టంగా తెలుపుతున్నది.

 • video-shot

  PDF

  మానవ జీవితపు కొన్ని పరమార్థాలను ఈ కరపత్రం చక్కగా వివరిస్తున్నది. ప్రారంభంలో, అల్లాహ్ నే ఎందుకు సర్వలోక సృష్టికర్త అని విశ్వసించాలనే దానికి కొన్ని జవాబులు ప్రస్తావించింది. తర్వాత, ఈ ప్రాపంచిక జీవితపు కొన్ని ముఖ్యోద్దేశాలన ప్రస్తావించింది.

 • video-shot

  PDF

  అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని విశ్వసించకుండా దారి తప్పించే షైతాను పన్నాగాలు, ధర్మంలో నూతన కల్పితాలు, పాపకార్యాలు ఆకర్షణీయంగా కనబడేలా చేయడం మొదలైన షైతాను యొక్క కొన్ని ముఖ్య కుతంత్రాల గురించి ఈ కరపత్రం చర్చిస్తున్నది. చివరిగా మనం షైతానును ఎలా ఓడించాలో సూచిస్తున్నది.

 • video-shot

  PDF

  ప్రవక్త జీసస్ (ఈసా అలైహిస్సలాం) గురించిన సత్యం ఏమిటి అనే ముఖ్యాంశాన్ని ఈ కరపత్రం చర్చిస్తున్నది. అనేక మంది ప్రజలు చెబుతున్నట్లుగా ఆయన దేవుడు కాడని, ఆయన అల్లాహ్ పంపిన ఒక ప్రవక్త అని స్పష్టం చేస్తున్నది. ఆయన చూపిన కొన్ని మహిమలను పేర్కొంటూ, సిలువ పైకి ఎక్కిండంలో సత్యాసత్యాల గురించి ప్రస్తావించింది. చివరిగా ఆయన పునరాగమనం గురించి తెలుపుతున్నది.

 • video-shot

  PDF

  ఖుర్ఆన్ - అల్లాహ్ వాక్కు, మానవజాతి కొరకు మార్గదర్శకత్వం, అంతిమ సందేశం మరియు అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఎలా అవతరించిందనే ముఖ్యాంశాలను ఈ కరపత్రం చర్చిస్తున్నది. అంతేగాక, ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేసింది అల్లాహ్ యే ననే సత్యాన్ని మనం ఎలా కనిపెట్టగలమో తెలుపుతున్నది. ఇంకా మానవజాతి కొరకు ఈ ఖుర్ఆన్ గ్రంథం అవతరింపజేయబడటం వెనుక ఉన్న ఉద్దేశాన్ని చర్చిస్తున్నది.

 • video-shot

  PDF

  అల్లాహ్ యొక్క అనంత కారుణ్యం గురించి ఈ కరపత్రం చర్చిస్తున్నది. అల్లాహ్ యొక్క కారుణ్యానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు, సృష్టిపై ఆయన యొక్క దయాదాక్షిణ్యాలు మరియు మనపై అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని ఎలా పెంచుకోగలం అనే కొన్ని ముఖ్యాంశాల గురించి ఇది ప్రస్తావించింది.

 • video-shot

  PDF

  నమాజు యొక్క ప్రాధాన్యత, దాని ప్రయోజనాలు, ఇస్లాం ధర్మ మూలస్థంభం, దానిని నిర్లక్ష్యం చేసిన వారికి పడే కఠిన శిక్ష, ప్రజలు చూపే కొన్ని మామూలు సాకుల గురించి ఈ కరపత్రం చర్చిస్తున్నది.

 • video-shot

  హిజాబ్ - పరదా ఇంగ్లీష్

  PDF

  హిజాబ్ అనేది అల్లాహ్ కు చూపే విధేయతకు చిహ్నం, హిజాబ్ సిగ్గు, లజ్జ, సచ్ఛీలతలకు చిహ్నం, హిజాబ్ చెడు నుండి కాపాడే రక్షణ కవచం, హిజాబ్ హుందాతనం, హిజాబ్ గౌరవం మరియు హిజాబ్ ఆత్మవిశ్వాసం - మొదలైన ముఖ్యాంశాలను ఈ కరపత్రం చర్చిస్తున్నది.

 • video-shot

  PDF

  సాక్ష్యప్రకటన, నమాజు, జకాతు, రమదాన్ పవిత్ర మాస ఉపవాసాలు మరియు హజ్ యాత్ర మొదలైన ఇస్లాం ధర్మం యొక్క ఐదు ప్రధాన మూల సిద్ధాంతాల గురించి ఈ కరపత్రం చర్చిస్తున్నది.

 • video-shot

  PDF

  వడ్డీ కారణంగా మనపై వచ్చి పడే కొన్ని ఘోర కష్టాలు, వడ్డీ నిర్వచనం, ఇస్లాం ధర్మంలో వడ్డీ ఎందుకు నిషేధించబడింది, వడ్డీ నుండి ఎలా తప్పించుకోగలం, తద్వారా ఇహపరలోకాలలో ఎలా సాఫల్యం సాధించాలని - అనే ముఖ్యాంశాలను ఈ కరపత్రం చర్చిస్తున్నది.

 • video-shot

  PDF

  ఇస్లాం ధర్మంలోని దైవభావన, కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి, ఆయనను డైరక్టుగా లేకుండా ఆరాధించాలి, మధ్యలో ఎలాంటి పూజారులు, ముజావర్లు ఉండరాదు, ప్రవక్తలందరూ కేవలం ఆయనను మాత్రమే ఆరాధించమని పిలిచారు, ఈ ప్రాపంచిక జీవిత పరమార్థం కేవలం అల్లాహ్ ను ఆరాధించబడమే, మొదలైన ముఖ్యాంశాలను ఈ కరపత్రం చర్చిస్తున్నది. ఇంకా, అసలు దేవుడు ఉన్నాడా మరియు ఆయన దేవుడు ఎవరు ? రెండు ముఖ్య ప్రశ్నలకు కూడా జవాబిస్తున్నది.

 • video-shot

  PDF

  ప్రజలు బురఖా అంటే ఎందుకు భయపడతారు, ధర్మాచరణలు పాటించే స్వేచ్ఛ మరియు దానిని మాటలలో వ్యక్త పరచే స్వేచ్ఛ, వేర్వేరు ఇస్లామీయ దుస్తులు ... మొదలైన విషయాలను ఈ కరపత్రం స్పష్టంగా చర్చిస్తున్నది. అంతేగాక బురఖా మరియు నిఖాబ్ ల గురించి ప్రచారంలో ఉన్న కొన్ని అపార్థాలను కూడా ఖండిస్తున్నది.

 • video-shot

  PDF

  అంతిమ దివ్యసందేశమైన ఖుర్ఆన్ లో 1400 సంవత్సరాలకు పూర్వమే పేర్కొనబడిన కొన్ని సైంటిఫిక్ వాస్తవాల ద్వారా ఇస్లాం ధర్మం ఒక సత్యమైన ధర్మమని ఈ కరపత్రం నిరూపిస్తున్నది. వాటిలో కొన్ని - జీవితం ఎక్కడ మొదలైంది, మానవ పిండోత్పత్తి ప్రక్రియ, విశ్వం వ్యాపించడం మరియు భూమండలం బయటి నుండి ఇనుమును భూమిపైకి పంపడం మొదలైనవి.

 • video-shot

  PDF

  అసలు ప్రవక్తత్వం అంటే ఏమిటి అనే విషయాన్ని ఈ కరపత్రం చరిస్తున్నది. ప్రవక్తలందరూ అందజేసిన దివ్యసందేశం ఒక్కటే - కేవలం అల్లాహ్ మాత్రమే సకల ఆరాధనలకు అర్హుడు. తమ ప్రవక్తత్వాన్ని నిరూపించుకోవడానికి అల్లాహ్ ఆజ్ఞతో ప్రవక్తలందరూ కొన్ని మహిమలు చేసి చూపారు.

 • video-shot

  PDF

  అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ప్రజలు తప్పకుండా తెలుసుకోవలసిన కొన్ని ప్రత్యేక గుణగణాలను ఈ కరపత్రం తెలుపుతున్నది. ఉదాహరణకు, ఆయన యొక్క దయాగుణం, సచ్ఛీలత, సహనం, క్షమాగుణం, అణుకువ, నమ్రత మరియు హుందాతనం.

 • video-shot

  PDF

  ఇస్లాం గురించి ప్రజలలో వ్యాపించి ఉన్న కొన్ని అపార్థాలు మరియు వాటి సమాధానాలు ఈ కరపత్రంలో ఉన్నాయి. అవి ఏమిటంటే - ముస్లింలు ఒక క్రొత్త దైవాన్ని ఆరాధిస్తారు లేదా ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను దైవంగా ఆరాధిస్తారు, ఇస్లాం ధర్మం ఒక తీవ్రవాద ధర్మం, ముస్లింల స్త్రీలను హిజాబ్ కట్టుబాటు అణగద్రొక్కుతున్నది, తమకు ఇష్టం లేని వారితో పెళ్ళి చేసుకునేలా ఇస్లాం ధర్మం ముస్లిం స్త్రీలను బలవంతం చేస్తుంది, ప్రజలు ముస్లింలుగా మారాలని ఇస్లాం ధర్మం బలవంత పెడుతున్నది ....

 • video-shot

  PDF

  ఇస్లాం ధర్మం ప్రకారం అతి చెడ్డ పాపకార్యం ఏది, ఇస్లాం ధర్మంలో స్త్రీల స్థానం ఏమిటి, జిహాద్ గురించి ఇస్లాం ఏమి చెబుతున్నది, తీవ్రవాదంపై ఇస్లాం అభిప్రాయం ఏమిటి, ఈ జీవిత పరమార్థం గురించి ఇస్లాం ధర్మం ఏమి స్పష్టం చేస్తున్నది, ఇస్లాం ధర్మంలో ప్రవక్త జీసస్ (ఈసా అలైహిస్సలాం) మరియు ఇతర ప్రవక్తల యొక్క ఉన్నత స్థానం, మరణానంతర జీవితం ... మొదలైన విషయాల గురించి ఈ కరపత్రం స్పష్టం చేస్తున్నది.

 • video-shot

  PDF

  ఇస్లాం ధర్మం దృష్టిలో తీవ్రవాదం అంటే ఏమిటి, ఎలా కొందరు ప్రజలు కొన్ని ఖుర్ఆన్ వచనాలను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు మొదలైన విషయాలను ఈ కరపత్రం చర్చిస్తున్నది. అంతేగాక, యుద్ధం అనివార్యం అయ్యే పరిస్థితులు ఏమిటి అనే విషయం గురించి కూడా చర్చిస్తున్నది.

 • video-shot

  PDF

  ఈ కరపత్రంలో మరణం మరియు మరణానంతర జీవితం గురించి చర్చించబడింది. స్వర్గనరకాల గురించి వివరిస్తున్న కొన్ని ఖుర్ఆన్ వచనాలను, ఈ ప్రాపంచిక జీవిత ముఖ్యోద్దేశం మరియు మరణం ఎంతో దూరం లేదు అనే యథార్థం విషయాలు ఇది ప్రస్తావిస్తున్నది. తీర్పుదినంనాడు తూచబడే పాపపుణ్యాల లెక్కల గురించి ధృవీకరిస్తున్నది.

 • video-shot

  PDF

  ఇస్లాం ధర్మం గురించి పరిచయం చేస్తున్న ఒక సంక్షిప్త కరపత్రం ఇది. ఇస్లాం ధర్మ ఐదు మూలసిద్ధాంతాలు, ఇస్లాం ధర్మంలోని ఆరాధనలు మరియు వాటి అసలు ఉద్దేశం, ఇస్లాం ధర్మ విశ్వాసం యొక్క ఆరు మూలసిద్ధాంతాలు మొదలైన వాటిపై దృష్టి సారిస్తున్నది. చాలా సులభరీతిలో, చక్కటి పదాలలో పై విషయాలన్నీ దీనిలో ప్రస్తావించబడినాయి.

ఫీడ్ బ్యాక్