• video-shot

  JPG

  నేనొక ముస్లింను - నేను జీసస్ (ఈసా అలైహిస్సలాం) మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంలను ఎంతో ప్రేమిస్తాను, గౌరవిస్తాను, అభిమానిస్తాను.

 • video-shot

  JPG

  అల్లాహ్ ఎల్లప్పుడూ మీతో ఉంటాడు, ఆయన మీరు చేసే ప్రతి పనీ కనిపెడుతున్నాడు అనే ఆలోచన ద్వారా మనం పాపాలకు దూరంగా ఉండి, నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా, ఆత్మహత్య చేసుకోకుండా అసలైన జీవితం గడపగలం.

 • video-shot

  PDF

  అనేకమంది ప్రజలు ఈనాటి హద్దులు దాటిన వేడుకలు, వినోదాలు మరియు అనవసరం ఖర్చుల కాలంలో, హాలిడే సీజన్లనే వ్యాపకంలో చాలా సులభంగా చిక్కిపోతున్నారు. వీటి ప్రాధాన్యతను గుర్తించి ఈ మితిమీరిన వినోద కార్యక్రమాలను కట్టడి చేసే ప్రయత్నం జరగటం లేదు. నేను ఇలా ఎందుకు చెబుతున్నానంటే హాలిడే అనే పదం అసలు హోలీ మరియు డే అనే రెండు పదాల కలయిక నుండి పుట్టింది. అయితే లోతుగా పరిశోధిస్తే యూద, క్రైస్తవ మరియు ఇస్లామీయ దృష్టికోణంలో, ఈ పర్వదినాలు చాలా పవిత్ర దినాలని గుర్తిస్తారు. ఈష్టర్, క్రిష్టమస్, ఆల్ సెయింట్స్ డే, హాల్లోయీన్ మొదలైన వాటి మూలాలు ప్రవక్తలకు విరుద్ధమైన బహుదైవారాధ సంప్రదాయాలలో కనబడతాయి. దీని సాక్ష్యాధారాలు పరిశీలిస్తే, చరిత్రలో ఎన్నడూ ఏ ప్రవక్తా తమ పుట్టినరోజు పండుగ జరుపుకోవడం, గ్రుడ్లను అలంకరించడం, చెట్లపై ఆభరణాలు ఉంచడం లేదా ఆకర్షణీయమైన దుస్తులలో అలంకరించుకోడం మొదలైనవి చేయలేదు. జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ హాలిడే కథలన్నీ ధర్మంలో చేర్చబడిన నూతన పోకడలు, కల్పితాలు తప్ప మరేమీ కావని తెలుస్తుంది. ఇలాంటి తప్పుడు సంప్రదాయాలలో మునిగి సర్వలోక సృష్టికర్త ఆగ్రహానికి గురి కావద్దని మరియు వాటి చెడు పర్యవసానాల నుండి కాపాడుకోమని ఈ చిరు కరపత్రం హెచ్చరిస్తున్నది.

 • video-shot

  PDF

  జాదు, మంత్రవిద్యలు మరియు చేతబడులపై ఇస్లాం ధర్మాదేశాలు ఏమిటి అనే ప్రశ్నకు షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ రహిమహుల్లాహ్ ఇచ్చిన జవాబు ఈ కరపత్రంలో ఉన్నది.

 • video-shot

  PDF

  మీ మానసిక పరిస్థితిని ఒక్కసారి స్వయంగా పరిశీలించుకున్నారా? దానిలోని మంచి - చెడులపై సమీక్ష చేసుకున్నారా ? దానిలోని ఏకదైవత్వం మరియు బహుదైవత్వాలపై ఎప్పుడైనా దృష్టి సారించారా ? దానిలోని కృతజ్ఞత మరియు కృతఘ్నతలు మీ దృష్టికి వచ్చాయా ? దానిలోని దైవ భయభక్తులు మరియు దైవ తిరస్కణలపై ఎప్పుడైనా ఆలోచించారా ? ఇంకా ఇలాంటి అనేక ఆత్మ పరిశీలన అంశాలు ఈ కరపత్రంలో ప్రస్తావించబడినాయి.

 • video-shot

  PDF

  ఈ కరపత్రంలో ప్రజలు నిర్లక్ష్యం చేసే అవకాశం ఉన్న ఫజ్ర్ మరియు అస్ర్ నమాజుల విలువ గురించి ప్రస్తావించబడింది.

 • video-shot

  PDF

  ఈ కరపత్రంలో అల్లాహ్ ను మనం ఎలా వేడుకోవాలి, అర్థించాలి, అల్లాహ్ తో వేడుకుంటున్నపుడు మధ్యలో ఏమైనా లేదా ఎవరైనా సిఫారసుల అవసరం ఉందా అనే ముఖ్య విషయాలను షేఖ్ నాసర్ బిన్ అబ్దుల్ కరీమ్ హఫిజహుల్లాహ్ తగిన ప్రామాణిక ఆధారాలతో చక్కగా చర్చించారు.

 • video-shot

  PDF

  అల్లాహ్ వద్ద పశ్చాత్తాప పడుతూ, క్షమాపణ వేడుకునే కొందరు స్త్రీల గురించి ఈ కరపత్రంలో వివరించబడింది.

 • video-shot

  PDF

  ముస్లిం మహిళలు ఇహపరలోకాలలో సంతోషంగా జీవితం గడపాలంటే ఏమి చేయాలనే అనేక మంచి పనులు, అలవాట్ల గురించి ఈ కరపత్రం వివరిస్తున్నది.

 • video-shot

  PDF

  ఒక మంచి మనసు ఎలా ఉండాలో ఈ కరపత్రం తెలుపుతున్నది. దానిలోనికి చెడు ఆలోచనలు దూరకుండా ఎలా కాపాడుకోవాలి, దానిని ఎల్లప్పుడూ అల్లాహ్ ధ్యానంలో ఎలా ఉంచాలి మొదలైన అనేక ముఖ్యాంశాలను ఈ కరపత్రం చక్కగా వివరిస్తున్నది.

 • video-shot

  PDF

  అల్లాహ్ యొక్క అత్యుత్తమ దివ్యనామాల గురించి ఈ కరపత్రం వివరిస్తున్నది.

 • video-shot

  PDF

  అల్లాహ్ మరియు ఆయన అంతిమ సందేశహరుడైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమించే, ఇష్టపడే వ్యక్తి ఎవరు, అతనిలో ఎలాంటి అలవాట్లు గుణగణాలు ఉంటాయి అనే ముఖ్యాంశాలను ఈ కరపత్రం చర్చిస్తున్నది.

 • video-shot

  PDF

  మన ఇళ్ళలోకి చొరబడిన అసలు ప్రమాదాల గురించి ఇక్కడ చర్చించబడింది. మన ఇళ్ళు సుఖసంతోషాలతో ఆనంద నిలయాలుగా మారాలంటే ఏమి చేయాలనే చాలా ముఖ్యమైన అంశంపై ఇది దృష్టి సారిస్తున్నది.

 • video-shot

  PDF

  వ్యాధితో ఉన్న ఒక రోగస్థుడు ఎలా పరిశుభ్రం కావాలి, ఎలా నమాజు చేయాలి అనే విషయాలు ఇక్కడ చర్చించబడినాయి.

 • video-shot

  PDF

  మీపై అల్లాహ్ అనేక అనుగ్రహాలు కురిపిస్తున్నాడు. మరి ఆయనకు మీరు ఎప్పుడైనా కృతజ్ఞతలు తెలుపుకున్నారా, అసలు ఆయనకు కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలి అనే విషయాలు ఇక్కడ చర్చించబడినాయి.

 • video-shot

  PDF

  ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉత్తమ సహచరులలో అబూ ఉబైదహ్ రదియల్లాహు అన్హు ఒకరు. నిజాయితీకి మారుపేరుగా ప్రసిద్ధి చెందారు. ఆయనలోని ఈ నిజాయితీ గుణాన్ని ప్రజలకు ఉదాహరణగా తెలుపుతూ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనను ఈ సమాజం యొక్క నిజాయితీపరుడు అని పేర్కొన్నారు. రోమన్లతో జరిగిన కీలక యుద్ధంలో ఆయన ముస్లిం సైన్యానికి అధ్యక్షత వహించారు.

 • video-shot

  PDF

  స్వర్గవాసులని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రకటించిన పది మంది ఉత్తమ సహాబాలలో అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు పేరు కూడా ఉంది. ఆయన మక్కాలో ప్రసిద్ధి చెందిన వ్యాపారవేత్త. ఇస్లాం ధర్మం స్వీకరించిన తర్వాత, కట్టుబట్టలతో ఆయన మదీనా పట్టణానికి వలస వెళ్ళవలసి వచ్చింది. అయినా త్వరలోనే నిజాయితీగా వ్యాపారం చేస్తూ మరలా ధనవంతుడై పోయినారు. తన సంపదలో ఎక్కువ భాగం పేదసాదల కొరకు దానధర్మాలలో వెచ్చించేవారు.

 • video-shot

  PDF

  ప్రవక్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా నమాజు చేసేవారు అనే ముఖ్యాంశాలను ఈ కరపత్రం క్లుప్తంగా వివరిస్తున్నది. అంతేగాక ఒకవేళ నమాజులో పొరపాటు జరిగితే దానిని ఎలా సరిదిద్దుకోవాలి, జనాజా నమాజు ఎలా చేయాలి మొదలైన వన్నీ ఇంగ్లీషు భాషలో ఈ కరపత్రం వివరిస్తున్నది.

 • video-shot

  JPG

  ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కొందరు గొప్ప సహచరుల గురించి మరియు వారి ఔన్నత్యం గురించి వివరిస్తున్న ఒక మంచి కరపత్రం ఇది. స్వర్గ శుభవార్త అందుకున్న పది మంది ఉత్తమ సహచరుల గురించి కూడా ఇందులో పేర్కొనబడింది. రదియల్లాహు అన్హుమ్.

 • video-shot

  GIF

  దీనిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అంతిమ హజ్ యాత్ర గురించి, అందులో ఆయన చేసిన గొప్ప ప్రసంగం గురించి వివరించబడింది.

ఫీడ్ బ్యాక్