కేటగిరీలు

 • రష్యన్

  RAR

  ఈ C , రష్యన్ భాషలో అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ లోని సూరతుల్ ఫాతిహా మరియు 30వ భాగపు భావం యొక్క అనువాదపు సంకలనం. ఇది కింగ్ ఫహద్ ప్రింటింగ్ ప్రెస్, మదీనా లో అచ్చయిన ఖుర్ఆన్ గ్రంథం ఆధారంగా తయారు చేయబడినది.

 • రష్యన్

  RAR

  ఈ CDలో విశ్వాసపు మూలస్థంభాలు (అర్కాన్ అల్ ఈమాన్)రష్యన్ భాషలో ప్రోగ్రాం చేయబడినవి. హదీథ్ జిబ్రయీల్ అలైహిస్సలాం లో ఉల్లేఖించబడిన విశ్వాసపు 6 మూలస్థంభాలు ఇక్కడ చర్చింపబడినవి. అవి 1) అల్లాహ్ పై విశ్వాసం 2) దైవదూతల పై విశ్వాసం 3) దైవగ్రంథాల పై విశ్వాసం 4) దైవప్రవక్తల పై విశ్వాసం 5) అంతిమ దినం పై విశ్వాసం 6) మంచి-చెడు, అదృష్టదురదృష్టాలు అల్లాహ్ నుండే సంభవించును అని విశ్వసించటం అంటే అల్ ఖదర్ పై విశ్వాసం ఉంచటం

 • ఇంగ్లీష్

  RAR

  ఇస్లాం గురించి తెలుసుకోగోరిన ముస్లిమేతరుల కోసం ఇంగ్లీషు భాషలో ఇస్లాం ధర్మంలోని అనేక ఉత్తమ విషయాలను ఒకే చోట సంకలనం చేసిన CD ఇది. దీనిలో ఆడియోలు, వీడియోలు, పుస్తకాలు ... ఉన్నాయి. ప్రజలు సులభంగా ఉపయోగించగలిగే విధంగా CD/DVD లో ప్రోగ్రాం చేయబడినది. దీనిని మీరు స్వయంగా తమ కంప్యూటర్ లోనికి డౌన్లోడు చేసుకుని, సిడీలోనికి ఎక్కించి, ఇతరులకు పంచి పెట్టవచ్చును. వెబ్ పేజీలో చూపినట్లుగా మీకు కావలసిన RAR ఫైల్సును ఎన్నుకుని, వాటిని WINRAR ప్రోగ్రాం ఉపయోగించి, ఒక ఫోల్డరులో జమ చేయవలెను. ఆ తర్వాత మీరు చేయవలసినదల్లా వీటిని తమ CD లేక DVD లోనికి ఎక్కించటమే (బర్న్ చేయటమే). దీనిలోనే ఉత్తమ నాణ్యతతో తయారుచేసిన CD కవరు english cover.psd అనే పేరుతో ఉన్నది. దీనిని ఇస్లాం హౌస్. కామ్ వారు తయారు చేసినారు.

 • ఇంగ్లీష్

  RAR

  ఇది మన పిల్లలలో అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అవగాహన పెంచే ప్రోగ్రామ్. ఇందులో ఆయన జీవితంలోని ముఖ్య సంఘటనలన్నీ ప్రస్తావించబడినాయి - పుట్టిన నాటి నుండి చనిపోయే వరకు, ఆయనలోని అత్యద్భుత గుణగణాలు, సచ్ఛీలత, మహోన్నత ప్రవర్తన మొదలైనవి సులభశైలిలో మరియు పిల్లల మనస్తత్వానికి సరిపోయే విధంగా తయారు చేయబడింది. ఆ తర్వాత పర్యావరణం, మహిళలు, పిల్లలు, పశుపక్ష్యాదులు మరియు ధార్మిక సిద్ధాంతాలలో ఆయనతో విభేదించిన వారితో ఆయన యొక్క ఉత్తమ ప్రవర్తన కూడా చర్చించబడింది. చివరిగా, మన పిల్లల కోసం కొన్ని సులభమైన దుఆలు మరియు మంచి ఇస్లామీయ కవితలు సూచించబడినాయి.

 • ఇంగ్లీష్

  ZIP

  ఇది ప్రతిరోజు ఐదుసార్లు ఆటోమేటిక్ గా మనకు అదాన్ పలుకులు వినిపించి, నమాజు సమయమైందని జ్ఞాపకం చేసే అదాన్ సాఫ్ట్ వేర్. ఇందులో మొత్తం ప్రపంచ దేశాలన్నింటి అదాన్ సమయాలు ఉన్నాయి. ఇది మొబైల్ ఫోన్లు, సెల్ ఫోన్లు, విండోస్ ఫోన్లు, పాకెట్ పిసీ, సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్, బ్లాక్ బెర్రీలలో పనిచేస్తుంది. దీనిని సెర్చ్ ట్రూత్ వెబ్సైటు (www.searchtruth.com) తయారు చేసింది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా దీనిని 5 మిలియన్ల కంటే ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్నారు.

ఫీడ్ బ్యాక్