• ఈ ప్రజెంటేషన్ లో ఇస్లాం అంటే ఏమిటి, అల్లాహ్ అంటే ఎవరు, మానవుడి అంతస్తుకు ఇస్లాం ఇస్తున్న స్థానం ఏమిటి, ఈ సృష్టి ఎందుకు సృష్టించబడింది, ఇస్లాం ధర్మం యొక్క మూల సిద్ధాంతాలు ఏవి, దైవ విశ్వాసం యొక్క మూల సిద్ధాంతాలు ఏవి, కాబహ్ అంటే ఏమిటి, ఇస్లాం ధర్మంలో ప్రవక్త జీసస్ (ఈసా అలైహిస్సలాం) స్థానం ఏమిటి అనే ముఖ్యాంశాలను డాక్టర్ ఖాలిద్ ఇబ్నె ఇబ్రాహీం అద్దోసరీ చక్కగా వివరించారు. చివరిగా ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కొన్ని హదీథులు పేర్కొన్నారు.

  • ఈ ప్రజెంటేషన్ యూదమతం, క్రైస్తవ మతం, ఇస్లాం ధర్మం మరియు ఇతర ధార్మిక విశ్వాసాలను పోల్చి చూపుతున్నది. వాటి వాటి ధార్మిక గ్రంథాల వచనాలను పేర్కొంటూ, పాఠకులు స్వయంగా తీర్మానించుకోవాలని మరియు సత్యాన్ని తెలుసుకోవాలని అడుగు తున్నది. కేవలం ఇస్లాం ధర్మం మాత్రమే మొత్తం మానవజాతికి మార్గదర్శకత్వం వహించగలదని మరియు అదే ఏకైక సత్యధర్మమనీ, అబ్రహాం, మోసెస్, జీసస్ మరియు ముహమ్మద్ ల ప్రభువు అయిన అల్లాహ్ పంపిన ధర్మమనీ శాంతంగా వివరిస్తున్నది.

  • ఇస్లాం, ముస్లిం మరియు ఇస్లాం ధర్మంలోని ఇతర వాస్తవాల గురించి తెలుసుకోవాలని కోరుకునే ముస్లిమేతరుల కోసం ఈ రంగురంగుల ప్రజెంటేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

ఫీడ్ బ్యాక్