تعريب عناوين المواد

ఇస్లాం పరిచయం

అంశాల సంఖ్య: 109

 • video-shot

  ఈ ఆసక్తికరమైన కార్యక్రమంలో ప్రజల దృష్టిలో నుండి మాయమైపోయిన ఒక ముఖ్యమైన అంశంపై డాక్టర్ జాకిర్ నాయక్ చర్చించారు. ఈ ప్రపంచంలో తమ జీవిత లక్ష్యమేమిటో తెలియని కొందరు ప్రజలతో ఆయన సంబోధించారు. తద్వారా వారికి ఒక సరైన మరియు లాజికల్ పద్ధతిలో ఈ ప్రాపంచిక జీవితం యొక్క ముఖ్యోద్దేశ్యాన్ని చక్కగా వివరించారు.

 • video-shot

  మానవజాతి కొరకు ఇస్లాం ధర్మం పరిష్కారమా అనే చాలా ముఖ్యమైన అంశంపై డాక్టర్ జాకిర్ నాయక్ గారు ఇక్కడ చర్చించారు. దీనిలో ఆయన ఇస్లాం ధర్మం, ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి క్లుప్తంగా వివరించారు. ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో ఇస్లాం ధర్మమే మానవజాతి సమస్యలన్నింటినీ పరిష్కరించగలదని నిరూపించారు.

 • video-shot

  మానవజాతి కొరకు ఇస్లాం ధర్మం పరిష్కారమా అనే చాలా ముఖ్యమైన అంశంపై డాక్టర్ జాకిర్ నాయక్ గారు ఇక్కడ చర్చించారు. దీనిలో ఆయన ఇస్లాం ధర్మం, ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి క్లుప్తంగా వివరించారు. ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో ఇస్లాం ధర్మమే మానవజాతి సమస్యలన్నింటినీ పరిష్కరించగలదని నిరూపించారు.

 • video-shot

  ఈ భాగంలో చాలా ముఖ్యమైన "నేను ఎలా చీకటి నుండి వెలుగులోని వస్తూ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాను" అనే అంశంపై డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ వివరించారు. ఈ గొప్ప ప్రసంగంలో ఆయన ఇస్లాం ధర్మాన్ని ఎలా స్వీకరించారనే ఆసక్తికరమైన గాథ వినండి.

 • ఇస్లాం ధర్మంలోని సౌందర్యాన్ని చక్కగా వివరించే గొప్ప ఆడియో. దీనిని డాక్టర్ నాజీ ఇబ్రాహీం అర్ఫాజ్ తయారు చేసారు. అందరికీ నచ్చే ఒక మంచి ఆడియో ప్రోగ్రాం ఇది.

 • "మొరాకో రాజు అభ్యర్థనపై మస్జిదె నబవీలో నేను ఇచ్చిన ఉపన్యాసం ఇదిగో. దీనిని వ్రాతరూపంలో తీసుకు వస్తే బాగుంటుందని, తద్వారా దీనిని ప్రచురించి, పంపిణీ చేయవచ్చని అపుడు కొందరు సోదరులు నాతో మనవి చేసుకున్నారు. కాబట్టి ఇది ప్రయోజనకరం కాగలదని అల్లాహ్ పై ఆశలు ఉంచుతూ వారి కోరిక మన్నించాను. ఖుర్ఆన్ లో మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చినాడు, 'ఈ రోజు నేను మీకోసం మీ ధర్మాన్ని పరిపూర్ణం చేసాను మరియు మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేసాను మరియు ఇస్లాంను మీ ధర్మంగా చేసాను.' " అనే పలుకులు దీని రచయిత పుస్తక ఉపోద్ఘాతంలో పేర్కొన్నాడు.

 • video-shot

  మనం ఎందుకు ఇస్లాం ధర్మాన్ని ఎంచుకోవాలి అనే విషయంపై కొన్ని ముఖ్యాంశాలను ఈ కరపత్రం చర్చిస్తున్నది. సృష్టికర్త, స్వచ్ఛమైన మరియు స్పష్టమైన దైవభావన, పాపవిమోచన, జవాబుదారీతనం మరియ న్యాయం, సార్వజనిక సందేశం, ప్రాక్టికల్ మరియు సంతులిత జీవన విధానం మొదలైన కొన్ని ముఖ్యాంశాలను వివరిస్తున్నది.

 • video-shot

  ఈ ప్రసంగంలో షేఖ్ అబ్రుర్రహీమ్ గ్రీన్ సత్యధర్మమైన మరియు ఋజుమార్గమైన ఇస్లాం పై ప్రజలలో వ్యాపింపజేయబడిన కొన్ని అపార్థాల గురించి చర్చించారు.

 • video-shot

  ఈ ప్రసంగంలో షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ అసలు తమ జీవిత ముఖ్యోద్దేశాన్నే మరిచిపోయిన ప్రజల గురించి చర్చించారు. ఈ భూలోకంపై తాము ఎందుకు జీవిస్తున్నామనే ముఖ్యాంశం గురించి తెలియని ప్రజలను సంబోధిస్తున్నారు. ఒకవేళ వారు దాని గురించి తెలుసుకోవాలనుకున్నా, వారు షైతాను కుతంత్రాల వలన మరియు అంధ విశ్వాసాల వలన మార్గభ్రష్టులవుతున్నారు. ఈ ప్రసంగం అలాంటి వారి సత్యాన్వేషణలో సహాయ పడుతున్నది మరియు ప్రామాణిక సాక్ష్యాధారాలతో సన్మార్గాన్ని చూపుతున్నది.

 • video-shot

  ఇస్లాం పరిచయం ఇంగ్లీష్

  దైవవిశ్వాస మూలసిద్ధాంతాలు మరియు ఇస్లాం ధర్మం యొక్క మూలసిద్ధాంతాల గురించి ఇక్కడ చర్చించబడింది. ఇస్లామీయ మూలసిధ్దాంతమైన అఖీదహ్ యొక్క లక్ష్యాలను వివరిస్తున్నది. ఖుర్ఆన్ మరియు సున్నతుల నుండి అనేక ఉపమానాలతో నిష్కళంకమైన చిత్తశుద్ధితో అల్లాహ్ ఆరాధించేలా ప్రోత్సహిస్తున్నది.

 • video-shot

  ఈ ఉపన్యాసంలో సృష్టికర్త ఉనికి మరియు మన జీవిత ధ్యేయం గురించి షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ చర్చించినారు. అసలు దేవుడు అంటే ఎవరు అనే నిర్వచనంపై చర్చతో ఈ ఉపన్యాసం ప్రారంభమైంది. సృష్టకర్తను విశ్వసించడం ఎందుకు వివేకమైందో పరిశీలించబడింది.

 • video-shot

  ఈ గొప్ప ప్రసంగంలో ఇస్లాం ధర్మం గురించి షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ చర్చించారు. దీనిలో ఆయన దేవుడి అసలు ధర్మం, ఇస్లాం ధర్మమే దేవుడి అసలు ధర్మమని మనకు ఎలా తెలుస్తుంది, ఇస్లాం ధర్మం సత్యమైనదని మనకు ఎలా తెలుస్తుంది, మీరు ఇస్లాం ధర్మాన్ని మరియు దాని సాక్ష్యాధారాలను విశ్లేషించడానికి తయారుగా ఉన్నారా అనే ముఖ్య విషయాలను చాలా బాగా వివరించారు.

 • video-shot

  ఈ గొప్ప ప్రసంగంలో నేను ఇస్లాం ధర్మంలోనికి ఎలా ప్రవేశించాను అనే చాలా ఆసక్తికరమైన అంశంపై షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ తన స్వీయకథను వివరించారు.

 • video-shot

  ఈ కరపత్రంలో ఇస్లాం గురించి ఒక సమగ్ర రూపంలో చర్చించబడింది. ఇస్లాం ధర్మంలోని ధార్మిక విధులు, ఇస్లామీయ జీవిత విధానం, ఈనాటి సమస్యలకు ఇస్లామీయ పరిష్కారం, ఇస్లామీయ భావనాపరంగా ప్రవక్తత్వం, ఇస్లాం ధర్మం తెలుపుతున్న మరణానంతర జీవితం ... మొదలైన విషయాలు ఇక్కడ చర్చించబడినాయి.

 • video-shot

  ఈ కరపత్రం మొదటి పేజీలో ఇలా ప్రశ్నించబడింది, "ప్రజల, పశుపక్ష్యాదుల, చెట్టుపుట్టల, గ్రహాల, భూమి, నీరు మొదలైన వాటితో పాటు మొత్తం భూమండలం యొక్క ఆరోగ్యం మరియు శ్రేయస్సును కాపాడే నియమనిబంధనలు ఉండాలని మీరు కోరుకుంటున్నారా? అవును - తప్పకుండా ఉండాలి !"

 • video-shot

  ఈ వీడియోలో ఆది మానవుడైన ఆదం అలైహిస్సలాం నుండి ఇస్లాం ధర్మ మూలాల గురించి చర్చించారు. దర్శకుల కోసం ఆయన దీనిని ఇస్లాం అంటే ఏమిటి, దివ్యమార్గదర్శకం ద్వారా మాత్రమే మనశ్శాంతి లభిస్తుందని, ప్రాపంచిక ధనసంపదల ద్వారా కాదని ప్రామాణిక ఆధారాలతో వివరించారు.

 • video-shot

  ఈ ఆసక్తికరమైన వీడియోలో చాలా ముఖ్యమైన విషయం ప్రజల దృష్టిలో నుండి ఎలా తప్పిపోతున్నది అనే ముఖ్యాంశం గురించి చర్చించబడింది. ఈ ప్రపంచంలో తమ జీవితం యొక్క ముఖ్యోద్దేశం తెలియని ప్రజలను సంభోదిస్తున్నది. ఒకవేళ వారికి అది తెలిసినా, షైతాను కుతంత్రాల వలన మరియు అంధ విశ్వాసాల వలన మార్గభ్రష్టులవుతున్నారు. అలాంటి ప్రజల సత్యాన్వేషణలో ఇది సహాయ పడుతున్నది.

 • ఇస్లాం ధర్మం మొత్తాన్ని సమగ్రహంగా నిర్వచించే అత్యుత్తమమైన మరియు మానవ జీవిత అంశాలన్నింటినీ అపూర్వంగా సంబోధించే సాక్ష్యప్రకటన వచనంతో పాటు, తౌహీద్ అనే ఇస్లామీయ ఏకదైవత్వం సిద్ధాంతం, ఇస్లామీయ విశ్వాసం యొక్క ఆరు మూలస్థంభాలు, ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఈ వ్యాసంలో చక్కగా పరిచయం చేయబడింది.ఇస్లాం గురించి ఒక సంక్షిప్త పరిచయం

 • video-shot

  ఇస్లాం అంటే ఏమిటి - ఈ సంక్షిప్త భాగంలో ఇస్లాం ధర్మం యొక్క ప్రాథమిక మూలసిద్ధాంతాలు మరియు ఆచరణల గురించి పరిచయం చేయబడింది. వీలయినంత క్లుప్తంగా దీనిని తయారుచేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఆసక్తిగలవారు ఇస్లాం గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి ఇది ప్రేరేపిస్తుందనే ఆశతో ..

 • video-shot

  ఇది ఒక చాలా ఆసక్తికరమైన అంశం. పొగొట్టుకున్న ప్రజల సావధానతను మరలా జ్ఞప్తికి తెస్తున్నది. ఈ ప్రపంచంలో తమ జీవిత లక్ష్యం ఏమిటో తెలియని ప్రజలను సంబోధిస్తున్నది. ఒకవేళ వారు దానిని తెలుసుకోవాలని కోరుకున్నా, వారు ఎలా షైతాను కుతంత్రాల ద్వారా మరియు అంధవిశ్వాసాల వలన దారి తప్పి పోతున్నారు. ఇది వారికి సరైన మరియు హేతువాద పద్ధతిని చూపుతున్నది. దాని ద్వారా చిత్తశుద్ధితో ప్రయత్నించే ప్రతి ఒక్కరూ సత్యమార్గాన్ని కనుగొనగలరు.

పేజీ : 6 - నుండి : 1
ఫీడ్ బ్యాక్