మన ఆద్యంతం

వివరణ

మాతృగర్భంలోని పిండం నుండి మొదలై, క్రమక్రమం జరిగిన మహాద్భుత మానవ జీవిత సృష్టి గురించి షేఖ్ ఖాలిద్ యాసిన్ చాలా చక్కగా వివరించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దివ్యఖుర్ఆన్ లో ఈ పిండోత్పత్తి దశలన్నీ ఎంతో ఖచ్చితంగా పేర్కొనబడినాయి. వాటిని ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఈ మధ్యనే కనిపెట్టబడిన ఆధునిక పరికరాల సహాయంతో కనుగొనగలిగింది. సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ ఎంతో ఘనమైనవాడు. మాతృగర్భంలోని పిండోత్పత్తి దశలు, ప్రపంచంలో చివరి శ్వాస పీల్చడం మరియు మరలా భూగర్భలో ప్రవేశించడం అంటే సమాధిలో ఉంచబడటం వరకు సంభవించే అనేక దశలు ఆయన వివరించారు. చావు తర్వాత జరగబోయే సంఘటనలు, పరలోక విషయాలు, ప్రతి ఆత్మ చిట్టచివరికి అంతిమ తీర్పుదినాన్ని ఎదుర్కొనవలసి ఉందనే సత్యం ... ఇవన్నీ ఆయన చక్కగా విశదీకరించారు.

ఫీడ్ బ్యాక్