సూరహ్ దఖాన్ లో పేర్కొనబడిన ఆ ప్రత్యేక రాత్రి ఏది?

వివరణ

షాబాన్ నెల 15వ తేదీ ప్రత్యేకత ఏమిటి, జరగబోయే సంవత్సరంలోని ప్రతి ఒక్కరి విధి నిర్దేశించబడేది ఈ రాత్రిలోనేనా? సూరహ్ దఖాన్ లో పేర్కొనబడిన ప్రత్యేక రాత్రి ఏది? అది షాబాన్ రాత్రా లేక ఖదర్ రాత్రా?అనే అంశాల్ని ఈ వ్యాసం చాలా చక్కగా చర్చించినది.

Download
వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి

పూర్తి వివరణ

  సూరహ్ దుఖాన్ లో పేర్కొనబడిన ప్రత్యేక రాత్రి?

  ﴿ ما هو المقصود بالليلة الخاصة الواردة في سورة الدخان ﴾

  ] తెలుగు – Telugu –تلغو [

  Muhammad Salih Al-Munajjid

  అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్

  రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్

  2011 - 1432

  ﴿ ما هو المقصود بالليلة الخاصة الواردة في سورة الدخان ﴾

  « باللغة تلغو »

  الشيخ محمد صالح المنجد

  ترجمة: محمد كريم الله

  مراجعة: شيخ نذير أحمد

  2011 - 1432

  సూరహ్ దఖాన్ లో పేర్కొనబడిన ప్రత్యేక రాత్రి ఏది? అది షాబాన్ రాత్రా లేక ఖదర్ రాత్రా?

  షాబాన్ నెల 15వ తేదీ ప్రత్యేకత ఏమిటి, జరగబోయే సంవత్సరంలోని ప్రతి ఒక్కరి విధి నిర్దేశించబడేది ఈ రాత్రిలోనేనా? సూరహ్ దఖాన్ లో పేర్కొనబడిన ప్రత్యేక రాత్రి ఏది? అది షాబాన్ రాత్రా లేక ఖదర్ రాత్రా?

  అల్హందులిల్లాహ్ – సకల స్తోత్రములూ, కృతజ్ఞతలూ అల్లాహ్ కే

  లైలతుల్ నుస్ఫ్ మిన్ షాబాన్ అంటే షాబాన్ నెల 15వ తేదీ రాత్రి సంవత్సరంలోని ఇతర రాత్రుల వంటిదే. ఈ రాత్రి ప్రజల విధిరాత లిఖించబడుతుందని గాని లేదా ప్రజల గమ్యం నిర్ణయించబడుతుందని గాని సూచించే ప్రామాణికమైన హదీథు ఏదీ లేదు.

  ఇక క్రింది వచనంలో తెలుబడిన రాత్రి గురించి:

  “నిశ్చయంగా మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) శుభవంతమైన రాత్రిలో అవతరింజేశాము. నిశ్చయంగా మేము ఎల్లప్పుడూ (ప్రజలను) హెచ్చరిస్తూ వచ్చాము.

  దానిలో (ఆ రాత్రిలో) ప్రతి విషయం వివేకంతో విశదీకరించబడుతుంది.”

  [అద్దుఖాన్ 44:3-4]

  ఇబ్నె జరీర్ అత్తబారీ (అల్లాహ్ ఆయనపై దయ చూపుగాక) ఇలా అన్నారు: “వివరణకర్తలు ఆ రాత్రి గురించి అంటే సంవత్సరంలో ఆ రాత్రి ఏది అనే విషయంలో విభేదించినారు. అది లైలతుల్ ఖదర్ రాత్రి అని కొందరు అభిప్రాయపడినారు మరియు అది లైలతుల్ ఖదర్ రాత్రేనని ఖుతాదాహ్ ద్వారా ఉల్లేఖించ బడినది కూడా. అది షాబాన్ నెల 15వ తేదీ రాత్రని ఇతరులు అభిప్రాయపడినారు. అది లైలతుల్ ఖదర్ రాత్రనే వారి అభిప్రాయమే సరైన అభిప్రాయం. ఎందుకంటే అల్లాహ్ ‘నిశ్చయంగా మేము ప్రజలను హెచ్చరిస్తూ వచ్చాము’(44:3) అని చెప్పటం ద్వారా, అల్లాహ్ దీని గురించి మనకు తెలుపుతున్నాడు.”

  (తఫ్సీర్ అత్తబారీ, 11/221)

  “దానిలో (ఆ రాత్రిలో) ప్రతి విషయం వివేకంతో విశదీకరించబడుతుంది”అనే పదసమూహం గురించి: తన సహీహ్ బుఖారీ వివరణలో ఇబ్నె హజర్ ఇలా అన్నారు: “దీని అర్థం ఏమిటంటే, ఆ సంవత్సరపు ఆజ్ఞలు ఆ రాత్రి నిర్ణయించబడతాయి, ఎందుకంటే అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: ‘దానిలో (ఆ రాత్రిలో) ప్రతి విషయం వివేకంతో విశదీకరించబడుతుంది’. మరియు అన్నవావి ఇలా అన్నారు: దీనికి లైలతుల్ ఖదర్ అని పండితులు పేరు పెట్టినారు, ఎందుకంటే ఆ రాత్రి దైవదూతలు విధిరాతను (ఖదర్ ను) వ్రాస్తారు; ఎందుకంటే అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు ‘దానిలో (ఆ రాత్రిలో) ప్రతి విషయం వివేకంతో విశదీకరించ బడుతుంది’. ముజాహిద్, ఇక్రిమాహ్, ఖుతాదాహ్ మరియు ఇతరుల నుండి ప్రామాణిక ఉల్లేఖకుల పరంపరల ఆధారాన్ని చూపుతూ అబ్దుర్రజాక్ మరియు ఇతర వివరణకర్తలు కూడా దీనినే పేర్కొన్నారు. ఖుర్ఆన్ లో పేర్కొనబడిన పదం ‘ఖదర్’ అంటే విధివ్రాత; ఖదర్ అనే పదం విధివ్రాతకు సంబంధించిన ప్రతి విషయాన్ని సూచిస్తుందని అల్ తూర్బష్తి అన్నారు.

  ఎవరైతే ఆ రాత్రి మంచి పనులు చేస్తారో మరియు ఆరాధనలు చేయటానికి శాయశక్తులా ప్రయత్నిస్తారో, అలాంటి వారి కొరకు లైలతుల్ ఖదర్ గొప్ప ప్రతిఫలాన్ని తీసుకు వస్తుంది.

  అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు (ఖుర్ఆన్ ఆయతు భావం యొక్క అనువాదం):

  “నిశ్చయంగా, మేము దీనిని (ఖుర్ఆన్) ఘనత గల ఆ రాత్రి (లైలతుల్ ఖదర్)లో అవతరింపజేశాము.

  మరియు ఆ ఘనత గల రాత్రి (లైలతుల్ ఖదర్) అంటే నీకేమి తెలుసు?

  ఆ ఘనత గల రాత్రి వేయి నెలల కంటే శ్రేష్ఠమైనది.

  ఆ రాత్రిలో దేవదూతలు మరియు ఆత్మ (జిబ్రీల్) తమ ప్రభువు అనుమతితో ప్రతి (విషయానికి సంబంధించిన) ఆజ్ఞలు తీసుకుని దిగివస్తారు.

  ఆ రాత్రిలో తెల్లవారే వరకు శాంతి వర్ధిల్లుతుంది.” [అల్ ఖదర్ 97:1-5]

  ఆ రాత్రి ఘనత గురించే తెలిపే హదీథులు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు అబూ హురైరహ్ రదియల్లాహు ఉల్లేఖించిన సహీహ్ బుఖారీలోని ఈ హదీథు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: (అల్లాహ్ ను) విశ్వసించి మరియు ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఎవరైతే లైలతుల్ ఖదర్ రాత్రిని ఆరాధనలలో గుడుపుతాడో, అతని పూర్వపు పాపాలన్నీ క్షమించివేయ బడతాయి. మరియు ఎవరైతే (అల్లాహ్ ను) విశ్వసించి మరియు ప్రతిఫలాన్ని ఆశిస్తూ రమదాన్ నెల ఉపవాసాలు పాటిస్తాడో, అతని పూర్వు పాపాలన్నీ క్షమించివేయబడతాయి.” (సహీహ్ బుఖారీ, అల్ సౌమ్, 1768).

  అసలు విషయం అల్లాహ్ కే తెలుసు.