కేటగిరీలు

 • video-shot

  MP4

  ఈ సంక్షిప్త ఉపన్యాసంలో డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జన్మదిన వేడుకలు ఎందుకు జరుపుకో కూడదో చర్చించారు. ఈ అంశం గురించి ఆయన పూర్తి సమాచారం ఇక్కడ ఇస్తున్నారు.

 • PDF

  ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పవిత్ర రాత్రి ప్రయాణం మరియు ఆయన ఆరంభ జీవితంలోని కొన్ని సంఘటనలు ఇక్కడ ప్రస్తావించబడినాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదె అఖ్సా చేరుకుని, అక్కడ పూర్వ ప్రవక్తలను కలిసారు. అక్కడి నుండి స్వర్గాధిరోహణ మొదలు పెట్టారు. అక్కడ ఆయన ప్రవక్త అబ్రహాం ను కలిసారు. అల్లాహ్ ను ఆరాధిస్తున్న దైవదూతల పంక్తులన్నిచూసారు. అల్లాహ్ యొక్క అర్ష్ దగ్గర ఆయనకు ప్రతిరోజు ఐదు సార్లు చేయమనే ఆదేశం ఇవ్వబడింది. ఈ గొప్ప మహిమ అవిశ్వాసులకు ఇస్లాం ధర్మం పై దాడి చేసే అవకాశాన్నిచ్చింది. విశ్వాసుల కొరకు ధర్మవిశ్వాస పరీక్షగా మారింది.

 • PDF

  సహీహ్ ముస్లిం, అన్నిసాయి, అబూ దాఊద్ హదీథు గ్రంథాలలో పేర్కొనబడిన "సోమవార ఉపవాసం గురించి ఆయనను అడిగినప్పుడు, ఆయన నేను పుట్టినరోజు అదే ..." అనే హదీథు ఆధారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినం నాడు ప్రత్యేకంగా ఉపవాసం పాటించడం సరైన పద్ధతేనా ? అలాగే, ఇదే హదీథు ఆధారంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పలుకులను అనుసరిస్తూ, తను పుట్టిన రోజున ఏ వ్యక్తి అయినా ఉపవాసం ఉండటం సరైనదేనా ? దయచేసి వివరించండి ...

 • PDF

  మిలాదున్నబీ పండుగ జరుపుకోవడమనేది ఇస్లాం ధర్మంలో లేని ఒక నూతన కల్పితమనేది అందరికీ తెలిసిన విషయమే. అనేక మంది ప్రజల వద్ద మౌలీదు పద్దతి ఉన్నది - అయితే అది మిలాదున్నబీ పండుగ జరుపుకోవటం ద్వారా కాదు - అది ఇతరులకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవన విధానాన్ని, ఉపదేశాలను అవకాశం కలిగినప్పుడల్లా బోధించడం ద్వారా వారు మౌలీదు జరుపుకుంటారు. ఒకవేళ మిలాదున్నబీ పండుగ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టిన రోజున కాకుండా వేరే దినాలలో జరుపుకున్నా అది హరాం విషయమేనా ? మౌలీద్ లేదా మిలాదున్నబీ అనే పేరుతో పిలవడం వలన అది హరాం గా పరిగణించబడుతున్నదా ? ఉదాహరణకు, ఒకవేళ నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర గురించి బోధించవలసి వచ్చినపుడు, మౌలీద్ అనే పదాన్ని వాడక పోయినా, అది హరామ్ గా పరిగణించబడుతుందా ? అదే సందర్భంలో ప్రజలకు భోజనం పెట్టడం ... నేను దీనిని ఎందుకు అడుగుతున్నానంటే, రాబోయే వారాంతంలో శనివారం నాడు ఒక వివాహ భోజనం ఉన్నది. చాలా మంది ప్రజలు గుమిగూడతారు గనుక, ఆహ్వానిస్తున్న సోదరుడు భోజనాలైన తర్వాత మస్జిదులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర గురించి ఉపన్యాసం ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నాడు. దానిని వారు మౌలీద్ అనే పేరుతో పేర్కొంటున్నారు. కానీ, అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టున రోజున రావడం లేదు మరియు మిలాదున్నబీ పండుగ జరుపుకునేందుకు కూడా కాదు - కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సీరత్ గురించి బోదించడం మాత్రమే అతని ఉద్దేశ్యం. సాధారణంగా పెళ్ళిళ్ళలో జరిగే గానా బజానాకు బదులుగా ప్రజలకు ప్రయోజనం కలుగుతుందనే ఉద్దేశ్యంతో ఆయన ఈ పని చేయాలని తలుస్తున్నాడు. దయచేసి మీ సలహా ఇవ్వండి. రెండో విషయం ఏమిటంటే, ఒకవేళ నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ప్రజలకు తెలిపే ఉద్దేశ్యంతో మస్జిదులో ఉపన్యాసం ఏర్పాటు చేసి, తర్వాత వారికి భోజనం పెడితే అది హరామ్ గా పరిగణించబడుతుందా ?

 • PDF

  మీలాదున్నబీ రోజున లేదా ఒక రోజు ముందుగానీ, ఒక రోజు తర్వాత గానీ దానిని పండుగగా భావిస్తూ ప్రత్యేకంగా తయారుచేసే స్వీట్లు తినడం హరాం అవుతుందా ? కేవలం మీలాదున్నబీ కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన అలాంటి స్వీట్లు కొనడంపై ఇస్లాం ధర్మం ఏమని ఆజ్ఞాపిస్తున్నది ?

 • PDF

  మీలాదున్నబీ పండుగ సంబర్భంలో పంచి పెట్టే ఆహారం, పానీయాలు స్వీకరించవచ్చా ? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టిన సందర్భంగా అబూ లహబ్ తన బానిస స్త్రీకి స్వేచ్ఛను ప్రసాదించటం వలన అల్లాహ్ అతడి కొరకు పరలోక శిక్షను తగ్గించాడనే ఉదాహరణను కొందరు వ్యక్తులు ప్రస్తావిస్తారు.

 • PDF

  ప్రతి నెల ఆఖరి ఆదివారం నాడు మా పరిచయంలోని దాదాపు 30 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకచోట చేరి, ప్రతి ఒక్కరూ రెండు లేదా అంతకంటే ఎక్కువ ఖుర్ఆన్ భాగాలు పఠిస్తూ, మొత్తం ఖుర్ఆన్ పఠనాన్ని ఒకటిన్నర లేదా రెండు గంటలలో పూర్తి చేస్తాము. తద్వారా మాలోని ప్రతి ఒక్కరూ ఇన్ షాఅ అల్లాహ్ ఒకసారి మొత్తం ఖుర్ఆన్ పఠనం పూర్తి చేసినట్లవుతుందని చెప్పబడింది. అది కరక్టేనా ? ఆ తర్వాత మేమందరూ సామూహికంగా దుఆ చేస్తాము మరియు చనిపోయిన మరియు జీవించిన ఉన్న విశ్వాసులందరికీ దాని పుణ్యాలు ప్రసాదించమని మేము అల్లాహ్ ను వేడుకుంటాము. అయితే ఆ పుణ్యాలు చనిపోయిన వారికి అందుతాయా ? అందుతాయనే వాదనకు ఆధారంగా వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ పలుకులను ప్రస్తావిస్తారు, "ఎవరైనా వ్యక్తి చనిపోయిన తర్వాత, మూడు మార్గాలలో తప్ప అతడికి చేరే పుణ్యాలన్నీ ఆగిపోతాయి - కొనసాగుతున్న అతడి దానధర్మాలు, ప్రయోజనకరమైన జ్ఞానం మరియు అతడి కోసం ప్రార్థించే మంచి సంతానం." మీలాదున్నబీ దినమున వారు రిబాత్ అంటే జాగరణ చేస్తారు. అది ఉదయం 10 గంటలకు ప్రారంభమై రాత్రి 3 గంటల వరకు సాగుతుంది. తమను క్షమించమని అల్లాహ్ ను ప్రార్థిస్తారు, అల్లాహ్ ను స్తుతిస్తారు, తస్బీహ్ మరియు తక్బీర్ ధ్యానం చేస్తారు, నిశ్శబ్దంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అనేక దరూద్ లు పంపుతారు, ఖుర్ఆన్ పఠిస్తారు, కొందరు మహిళలు ఆరోజున ఉపవాసం కూడా పాటిస్తారు. ఈ ఆరాధనలన్నింటి కోసం ఆ రోజును ప్రత్యేకించడం బిదఅ అంటే నూతన కల్పితం క్రిందికి పరిగణించబడదా ? కొందరు ప్రజలు సుహూర్ సమయంలో చేసే సుదీర్ఘమైన దుఆలు కూడా చేస్తారు. దానిని దుఆ అల్ రాబితహ్ అంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పంపడంతో మొదలై, ఆయన సహచరులపై మరియు ఇతర ప్రవక్తలపై, ఆయన భార్యలపై, ఆయన మహిళా సహచరులపై, ఖుల్ఫాయే రాషిదీన్ పై, తాబయీన్ లపై మరియు ఔలియాలపై పేరు పేరునా దీవెనలు పంపడంతో అది పూర్తవుతుంది. ఇలా చేయడం ద్వారా మా దుఆలు మేము పేర్కొంటున వారందరికీ పేరు పేరునా చేరతాయా ? ఇలా దుఆ చేయడం బిదఅ అంటే నూతన కల్పితం కాదా ? నాకు అది బిదఅ చర్య అనిపిస్తున్నది. అయితే, చాలా మంది సోదరీమణులు నాతో ఏకీభవించుట లేదు. ఒకవేళ నా అభిప్రాయం తప్పైతే, అల్లాహ్ నన్ను శిక్షిస్తాడా ? ఒకవేళ నా అభిప్రాయం సరైనదైతే, నేను వారిని ఎలా ఒప్పించాలి ? ఈ ఆలోచన నన్ను నిద్రపోనివ్వడం లేదు. ధర్మంలో కనపెట్టబడే ప్రతి నూతన కల్పితం మార్గభ్రష్టత్వం వైపుకు తీసుకు పోతుంది, ప్రతి మార్గభ్రష్టత్వం నరకాగ్ని వైపుకు తీసుకుపోతుంది అనే హదీథు పలుకులు జ్ఞాపకం రాగానే నా బాధ మరింతగా పెరిగి పోతున్నది.

 • PDF

  మీలాదున్నబీ పండుగ యొక్క ప్రాధాన్యత ఏమిటి మరియు దానిని ఎప్పుడు, ఎలా జరుపుకోవాలి ?

 • PDF

  ముహర్రం నెల 9, 10 మరియు 11వ తేదీలలో ఎవరైనా మహిళ అపరిశుద్ధ స్థితిలో ఉండటం వలన ఉపవాసం పాటించలేకపోతే, ఆమె పరిశుద్ధమైన తర్వాత ఆ ఉపవాసాలను పాటించవచ్చా ?

 • PDF

  నేను మహిళా కళాశాలలో చదువు కుంటున్న ఒక విద్యార్థినిని. మాతో పాటు చాలా ఎక్కువ మంది షియాలు ఉన్నారు.ప్రస్తుతం వారు అషూరహ్ సందర్భంగా నలుపు దుస్తులు ధరిస్తున్నారు. వారిని కించపరిచే విధంగా మేము మంచి మంచి దుస్తులు ధరించడం, అలంకరించుకోవడానికి అనుమతి ఉన్నదా ? వారు మాపై ద్వేషం ప్రదర్శిస్తున్నారని తెలిసిన తర్వాత, వారి గురించి మాలో మేము చర్చించుకోవడానికి మరియు వారికి వ్యతిరేకంగా ప్రార్థించడానికి అనుమతి ఉన్నదా ? వారిలో ఒకరు అర్థం కాని వ్రాతలున్న తావీజు ధరించి ఉండడం నేను చూసాను. ఆమె చేతిలో ఒక చిన్న బెత్తం లాంటిది ఉంది, దానిని ఆమె ఒక విద్యార్థిని వైపు చూపగా, ఆమె అనారోగ్యం పాలైంది. ఇప్పటికీ ఆమె ఆరోగ్యం కుదుట పడలేదు. మీకు అల్లాహ్ అనేక పుణ్యాలు ప్రసాదించు గాక.

 • PDF

  సోదరసోదరీమణులతో కుటుంబ సమేతంగా సమావేశమై, మీలాదున్నబీ మరియు అషూరహ్ పండుగ దినాలలో కలిసిమెలిసి భోజనం చేయడానికి అనుమతి ఉన్నదా ? అలా చేస్తున్న వారి గురించి ఇస్లామీయ ధర్మాజ్ఞ ఏమిటి ? ఎవరైనా ఖుర్ఆన్ కంఠస్థం చేసినప్పుడు లేదా పఠనం పూర్తి చేసినప్పుడు ఏర్పాటు చేసే సమావేశాల గురించి ఏమంటారు ?

 • PDF

  అషూరహ్ దినమున కొందరు ప్రజలు ధరించే కాలుక, గుసుల్ చేయడం, మెహందీ రాసుకోవడం, పరస్పరం షేక్ హ్యాండు చేయడం, హుబూబ్ వంటకం, సంతోషాన్ని వ్యక్తం చేయడం వంటి చర్యలపై ఇస్లామీయ ధర్మాజ్ఞ ఏమిటి ? దీని గురించి తెలిపే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీథు ఏదైనా ఉందా ? మరి, అలాంటి హదీథు ఏదీ లేనప్పుడు, ఇలాంటి చర్యలు బిదఅ అంటే నూతన కల్పితాలుగా పరిగణించబడవా ? అలాగే, మరికొందరు ప్రజలు శోకం వ్యక్తం చేయడం, బాధ పడడం, ఏడ్పులు పెడబొబ్బలు పెట్టడం, ఏమీ తినకుండా త్రాగకుండా బయటికి వెళ్ళడం, తమ బట్టలను చింపుకోవడం మొదలైన చర్యల గురించి ఏమంటారు ? వీటికి ఏమైనా ఆధారం ఉన్నదా ?

 • video-shot

  మేరాజ్ ఇంగ్లీష్

  GIF

  మేరాజ్ - రాత్రి ప్రయాణం. మేరాజ్ రాత్రి, జిబ్రయీల్ దైవదూత వచ్చి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మక్కాలోని మస్జిద్ అల్ హరమ్ నుండి పాలస్తీనాలోని మస్జిద్ అఖ్సాకు తీసుకు వెళ్ళి, అక్కడి ఆకాశాలలో తీసుకువెళ్ళారు. ఈ ప్రయాణంలో జరిగిన అనేక సంఘటనలు ఇందులో ప్రస్తావించబడినాయి.

 • PDF

  సఫర్ (హిజ్రీ సంవత్సరంలోని రెండవ) నెలలోని మూఢాచారాలు మరియు ఇస్లాం ధర్మం

 • PDF

  ముహర్రం(హిజ్రీ సంవత్సరంలోని మొదటి నెల) మరియు అషూరా(ముహర్రం 10వ తేదీ) శుభాలు

ఫీడ్ బ్యాక్