• ఇంగ్లీష్

  నిజమైన, నిజాయితీపరుడైన మరియు స్వచ్ఛమైన ముస్లిం గురించి షేఖ్ బిలాల్ అసద్ వివరిస్తున్న చాలా ముఖ్యమైన ఉపన్యాసం. ప్రతి ముస్లిం తప్పకుండా నిజమైన ముస్లింగా మారాలి. నిజమైన, ప్రామాణిక ఇస్లామీయ బోధనలను మాత్రమే అనుసరించమని ఇస్లాం ధర్మం మనల్ని ఆదేశిస్తున్నది.

 • ఇంగ్లీష్

  ఈ ఉపన్యాసంలో ఖాలిద్ యాసిన్ చారిత్రక జీసస్ మరియు నిజమైన జీసస్ అలైహిస్సలాం ల గురించి చక్కగా వివరించారు.

 • ఇంగ్లీష్

  తల్లిగా, భార్యగా మరియు సమాజంలోని స్త్రీలుగా ముస్లిం మహిళలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొనే అనేక అంశాల గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ఖాలిద్ యాసిన్ చర్చించారు. ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో వాటిని విజయవంతంగా ఎలా ఎదుర్కొనాలి అనే దానిపై మంచి సలహాలు ఇచ్చారు.

 • ఇంగ్లీష్

  ఈ ఉపన్యాసంలో అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తపై ప్రేమాభిమానాలు, విధేయత చూపిన అనేక గొప్ప సహాబాలు, పుణ్యపురుషుల ఉపమానాలను షేఖ్ ఖాలిద్ యాసిన్ ఉదహరించారు. తమ స్వంత జీవితం, కుటుంబం లేదా సంపదల రూపంలో వారు చేసిన త్యాగం ఎంతో ఆశ్చర్యకరమైనది. మనం అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై చూపే ప్రేమాభిమానాలు, విధేయతల గురించి దర్శకులను ఆలోచనలలో పడవేస్తుంది.

 • ఇంగ్లీష్

  నీవెన్నడూ చావును తప్పించుకోలేవు. ఏదో ఒక రోజున నీవు చనిపోవలసిందే. చావు గురించి షేఖ్ ఖాలిద్ యాసిన్ ఇచ్చిన చాలా గొప్ప ప్రసంగం ఇది.

 • ఇంగ్లీష్

  మాతృగర్భంలోని పిండం నుండి మొదలై, క్రమక్రమం జరిగిన మహాద్భుత మానవ జీవిత సృష్టి గురించి షేఖ్ ఖాలిద్ యాసిన్ చాలా చక్కగా వివరించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దివ్యఖుర్ఆన్ లో ఈ పిండోత్పత్తి దశలన్నీ ఎంతో ఖచ్చితంగా పేర్కొనబడినాయి. వాటిని ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఈ మధ్యనే కనిపెట్టబడిన ఆధునిక పరికరాల సహాయంతో కనుగొనగలిగింది. సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ ఎంతో ఘనమైనవాడు. మాతృగర్భంలోని పిండోత్పత్తి దశలు, ప్రపంచంలో చివరి శ్వాస పీల్చడం మరియు మరలా భూగర్భలో ప్రవేశించడం అంటే సమాధిలో ఉంచబడటం వరకు సంభవించే అనేక దశలు ఆయన వివరించారు. చావు తర్వాత జరగబోయే సంఘటనలు, పరలోక విషయాలు, ప్రతి ఆత్మ చిట్టచివరికి అంతిమ తీర్పుదినాన్ని ఎదుర్కొనవలసి ఉందనే సత్యం ... ఇవన్నీ ఆయన చక్కగా విశదీకరించారు.

 • ఇంగ్లీష్

  షేఖ్ ఖాలిద్ యాసిన్ ఇచ్చిన చాలా ఆసక్తికరమైన ఉపన్యాసం. ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో ఆయన ముస్లిం మహిళలకు అనేక సలహాలు ఇచ్చినారు.

 • ఇంగ్లీష్

  పౌరాణిక మరియు చారిత్రక జీసస్ అలైహిస్సలాం గురించి అబ్దుల్ రహీమ్ గ్రీన్ ఇచ్చిన ఒక అద్భుత ఉపన్యాసం. ఎలా పౌరాణిక, కల్పిత జీసస్, ట్రినిటీ సిద్ధాంతాలు, ఒరిజినల్ పాపం మొదలైన విషయాలు ప్రచారంలోనికి వచ్చాయి మరియు తొలికాలపు క్రైస్తవులు ఎలా జీసస్ యొక్క మరణం మరియు పునరుత్థానం గురించి పట్టించుకోలేదు అనే వాటి గురించి కూడా వివరించారు. ఈ ఉపన్యాసంలో పేర్కొన్న సమాచారం ఎక్కువగా క్రైస్తవ పండితుల నుండి మరియు చరిత్రకారుల నుండి సేకరించబడింది.

 • ఇంగ్లీష్

  మనమందరమూ పాపాలు చేస్తూనే ఉంటాము. అయితే తమకు తెలియకుండా ఘోరమైన పాపాలు చేసేవారు ఎందరు ? ఈ ఉపన్యాసంలో షేఖ్ అబ్దుల్ రహీమ్ గ్రీన్ కొన్ని ఘోరపాపాల గురించి మనకు వివరిస్తున్నారు. వాటిలో సరైన జ్ఞానం లేకుండా అల్లాహ్ గురించి మరియు ఆయన ధర్మం గురించి మాట్లాడటం కూడా ఒకటి. ఇది షిర్క్ కంటే ఘోరమైన పాపమని కొందరు పండితుల అభిప్రాయం. ఈ అభిప్రాయం వెనుకనున్న కారణాలను షేఖ్ అబ్దుల్ రహీమ్ గ్రీన్ చర్చించారు. తరుచుగా నిర్లక్ష్యం చేయబడే ఇతర ఘోరపాపాలలో అహంకారం, గర్వం, దైవవిశ్వాసులకు విరుద్ధంగా అవిశ్వాసులకు సహాయం చేయడం, మ్యాజిక్ మరియు భవిష్యత్ గురించి జాతకం, సోది వంటివి చెప్పడం, షో ఆఫ్ మరియు ధర్మంలో నూతన కల్పితాలు మొదలైనవి కూడా ఉన్నాయి.

 • ఇంగ్లీష్

  అనేక మంది ప్రజల మనస్సులలో మరియు పలుకులలో మాటిమాటికీ వచ్చే "ఇస్లాం ధర్మం మహిళలను అణచి వేస్తున్నది" ఒక ముఖ్యమైన ప్రశ్నగురించి షేఖ్ అబ్దుల్ రహీమ్ గ్రీన్ ఇక్కడ చర్చించినారు. వాస్తవానికి ఇది ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా ప్రచారం చేయబడుతున్న ఒక అపనింద, ఒక అసత్య వాదన మరియు ఒక అభాండము. ఇది ఒక పచ్చి అబద్ధం మరియు అభాండమని గట్టిగా చెప్పడమే కాకుండా అసలు స్త్రీలను అణచి వేస్తున్న ప్రజలు, దేశాలు మరియు సిద్ధాంతాల గురించి ఆయన చక్కటి నిదర్శనాలతో చూపినారు. అసలు అణచివేత అంటే ఏమిటి, ఇస్లాం దాని గురించి ఏమి చెబుతున్నది అనేది కూడా వివరించారు. అభాండాలు వేయడంపై ఒక మంచి శిక్షణా వీడియో ఇది. దీనిని విన్న తర్వాత ఇతరులు అణచివేతగా భావిస్తున్న విషయాలలో ఇస్లాం ధర్మం మహిళలకు ఇస్తున్న అసలు స్వేచ్ఛ గురించి ఆయన తెలిపినారు.

 • ఇంగ్లీష్

  గ్రహించే మార్గాలు తెరువు అనే ఈ వీడియోలో చాలా ముఖ్యమైన మరియు ప్రయోజనకరమైన విషయాలపై షేఖ్ యాసిర్ ఖాదీ మాట్లాడినారు.

 • ఇంగ్లీష్

  సాఫల్యవంతమైన వివాహబంధం యొక్క తాళపుచెవులు అనే ఈ ఆసక్తికరమైన ఉపన్యాసాన్ని షేఖ్ అబూ హంజా ఇచ్చినారు.

 • ఇంగ్లీష్

  ముస్లింల ఐకమత్యం యొక్క బేసిస్ మరియు ప్రాముఖ్యత అనే అంశంపై షేఖ్ యాసిర్ ఖాదీ చక్కగా ప్రసంగించారు.

 • ఇంగ్లీష్

  ఈ మిలియనియమ్ లో ముస్లిం యువకులు ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి షేఖ్ అబ్దుల్లాహ్ హాకిమ్ ఆసక్తికరమైన ఉపన్యాసం ఇచ్చినారు.

 • ఇంగ్లీష్

  ఈ వీడియోలో మన బంగారు గతం మరియు ప్రకాశవంతమైన భవిష్యత్తు అనే ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన అంశంపై షేఖ్ అబ్దుల్లాహ్ హాకిమ్ చర్చించినారు. ఇది ప్రతి ఒక్కరూ చూడదగిన వీడియో.

 • ఇంగ్లీష్

  చివరి దినాలలో నిగర్వంతో కూడిన చక్కటి హృదయం కలిగి ఉండుట అనే ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన అంశంపై షేఖ్ అబ్దుల్లాహ్ హాకిమ్ ఇచ్చిన ఒక మంచి ఉపన్యాసం.

 • ఇంగ్లీష్

  నిరాశ, నిస్పృహల వేదనలే ఈ ఆసక్తికరమైన ఉపన్యాసాన్ని షేఖ్ అబూ హంజా ఇచ్చినారు.

 • ఇంగ్లీష్

  మోసం, వంచనలలోని ప్రమాదాలు అనే ముఖ్యమైన ఉపన్యాసాన్ని షేఖ్ అబ్దుల్లాహ్ హాకిమ్ ఇచ్చినారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన కార్యక్రమం.

 • ఇంగ్లీష్

  షైతాను చేసే మోసం అనే అంశం గురించి షేఖ్ అబ్దుల్లాహ్ హాకిమ్ ఇక్కడ చర్చించారు.

 • ఇంగ్లీష్

  బద్ధకస్తుడైన ముస్లింకు మేలుకొలుపు అనే ఈ ఆసక్తికరమైన ఉపన్యాసాన్ని షేఖ్ అబ్దుల్లాహ్ హాకిమ్ ఇచ్చినారు.

ఫీడ్ బ్యాక్