• ఇంగ్లీష్

  కొందరు ముస్లింలనబడే వారి ఆచరణలే ఇస్లాం ధర్మం అనే అభిప్రాయం ప్రజలలో కలిగేటట్లు మీడియా ప్రయత్నిస్తున్నది. తద్వారా మొత్తం ధర్మాన్నే సమాజానికి నష్టం కలిగించే ధర్మంగా చిత్రీకరిస్తున్నది. అసలు ఇస్లాం ధర్మం అంటే ఏమిటి, దాని మూలసిద్ధాంతాలు ఏవి అనే విషయాలపై దర్శకులకు సరైన అవగాహన కలిగేటట్లు షేఖ్ ఖాలిద్ యాసిన్ ప్రయత్నించారు. దీనిని చూసిన దర్శకులు ఇస్లాం ధర్మంపై మోపబడుతున్న అపవాదులను పూర్తిగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇస్లాం ధర్మం గురించి సరిగ్గా అర్థం చేసుకోవాలని ప్రయత్నించే ముస్లిమేతరుల కోసం ఇది ఎంతో ప్రయోజనకరమైన ఉపన్యాసం.

 • ఇంగ్లీష్

  విశ్వసృష్టి మరియు మనం నివశిస్తున్న ఈ మహాద్భుత ప్రపంచం, అది ఎలా ఉనికిలోని వచ్చింది అనే విషయాలపై షేఖ్ ఖాలిద్ యాసన్ లోతుగా చర్చించారు. ఆయన తనదైన ప్రత్యేక శైలిలో చేసిన లాజికల్ ఆర్గుమెంట్లు వీటి గురించి ప్రశ్నించే అనేక మంది ప్రశ్నలకు వివేకవంతమైన సమాధానాలు ఇస్తున్నది.

 • ఇంగ్లీష్

  ప్రతి కట్టడానికి దాని నిర్మాత ఉన్నాడు. కాబట్టి కామన్ సెన్స్ మరియు లాజిక్ ద్వారా, ఈ మొత్తం సృష్టి కూడా తప్పకుండా ఒక సృష్టికర్తను కలిగి ఉండాలి. మహాద్భుత డిజైన్ లేకుండా ఈ విశాల విశ్వం మరియు అందులోని ప్రతిదీ ఏదోలా ఉనికిలోనికి రాలేదు. దీని గురించి ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు, "నిశ్చయంగా, భూమ్యాకాశాల సృష్టిలో మరియు రాత్రింబవళ్ళు ఒకదాని వెంట మరొకటి రావడంలో పరిశీలించే వారి కోసం ఎన్నో సూచనలు ఉన్నాయి" ఖుర్ఆన్ 4:190

 • ఇంగ్లీష్

  ముస్లింలు మరియు క్రైస్తవులు ఎంతో గౌరవించే మహాపురుషుడు జీసస్. షేఖ్ అబ్దుల్ రహీమ్ గ్రీన్ అనేక సంవత్సరాలుగా జీసస్ గురించి అసలు సత్యం ఏమిటి అనే విషయంపై క్షుణ్ణంగా పరిశోధించారు. ఈ ప్రజెంటేషన్ లో ఆయన చాలా చక్కగా జీసస్ గురించి ప్రచారంలో ఉన్న అనేక అపోహలను, అపార్థాలను స్పష్టంగా వివరించారు.

 • ఇంగ్లీష్

  మీ ధర్మప్రచార అమ్ముల పొదిలో చేరగలిగే అర్హత గల మరో మంచి బాణం. ముస్లిమేతరుల సమావేశంలో అబ్దుల్ రహీమ్ గ్రీన్ ఇస్లాం ధర్మంలోని సౌందర్యం మరియు అద్భుతాల గురించి చాలా చక్కగా వివరించారు.

 • ఇంగ్లీష్

  ఈ ఉపన్యాసంలో షేఖ్ అబ్దుల్ రహీమ్ గ్రీన్ ప్రజలలో అనేక మంది అపార్థం చేసుకుంటున్న ఇస్లాం ధర్మం గురించి చర్చించారు - అసలు అల్లాహ్ ఎవరు, ఇస్లాం ధర్మం అంటే ఏమిటి, ముహమ్మద్ ఎవరు ... మొదలైన విషయాలను ఆయన చాలా చక్కగా వివరించారు. ముగింపులో ఆయన శ్రోతల ప్రశ్నలకు జవాబు ఇచ్చినారు.

 • ఇంగ్లీష్

  ప్రపంచం వైపు పంపబడిన చివరి ముగ్గురు ప్రవక్తల గురించి ఈ ఉపన్యాసంలో చర్చించబడింది. వారు ముగ్గురు ఎవరు? వారి ముగ్గురు వేర్వేరు సందేశాలు ఇచ్చారా లేక ఒకే సందేశం ఇచ్చారా ? వారు ముగ్గురూ ఒకే ధర్మాన్ని బోధించారా లేక వేర్వేరు ధర్మాలనా ? ఈనాడు ప్రపంచంలో మూడు ప్రధాన ఏకదైవారాధన ధర్మాలున్నాయి - అవి ఇస్లాం, క్రైస్తవ మతం మరియు యూద మతం. ఇవి మూడూ తమ తమ ప్రవక్తలను, సందేశహరులను నమ్ముతాయి - వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రవక్త ఈసా అలైహిస్సలాం మరియు ప్రవక్త మూసా అలైహిస్సలాం. ఈ ఉపన్యాసంలో ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం పై కూడా మనం దృష్టి సారిస్తున్నాము.

 • ఇంగ్లీష్

  ఈ ఉపన్యాసంలో నమాజు ఎలా చేయాలో చాలా వివరంగా చర్చించబడింది.

 • ఇంగ్లీష్

  నీ కోసం నమాజు చేయబడక ముందే నీవు నమాజు చేయి అనే చాలా ముఖ్యమైన మరియు ప్రయోజనకరమైన అంశంపై షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ ఈ వీడియోలో మాట్లాడినారు.

 • ఇంగ్లీష్

  అంతిమ దినాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాజం యొక్క బాధ్యతలు, కర్తవ్యాలు అనే ఈ అంశం గురించి షేఖ్ అబ్దుల్లాహ్ హాకిమ్ ఉపన్యసించారు. ఇందులో ఆయన అల్లాహ్ యొక్క సందేశాన్ని అత్యంత ఖచ్చితమైన మరియు సరైన పద్ధతిలో ఇతరులకు అందజేయవలసిన మన బాధ్యతను గురించి వివరించారు.

 • ఇంగ్లీష్

  అల్లాహ్ మెప్పును ఎలా పొందాలి అనే ఈ ఆసక్తికరమైన ప్రసంగాన్ని షేఖ్ యుషా ఇవాన్స్ ఇచ్చినారు.

 • ఇంగ్లీష్

  ఈ ముఖ్యమైన ప్రసంగంలో స్వర్గం గురించి మరియు అందులోని ఎలా ప్రవేశించగలం అనే అంశం గురించి వివరించబడింది. ఖుర్ఆన్ మరియు సున్నతులలో వివరించబడినట్లుగా స్వర్గం ఎలా ఉంటుందో తెలుపడింది.

 • ఇంగ్లీష్

  ఈ వీడియోను తప్పకుండా మీ స్నేహితులతో పంచుకోండి. మరణానంతర జీవితం గురించి నిజంగా తెలుసుకోవాలని కోరుకునే వారు స్వయంగా ఇలా ప్రశ్నించుకోవాలి - "నేను చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుంది?" తర్వాత ఈ వీడియో చూడాలి. స్వర్గ ప్రవేశం కోసం మనం తప్పకుండా శ్రమించవలసి ఉంది.

 • ఇంగ్లీష్

  ఈ ఉపన్యాసంలో మీ జీవిత ప్రాధాన్యతలు ఏమిటి అనే అంశంపై షేఖ్ బిలాల్ అసద్ చర్చించారు. దీనిలో ఆయన ఈ ప్రాపంచిక జీవితం మరియు మరణానంతర జీవితం యొక్క ప్రాధాన్యతల గురించి వివరించారు. ఈ ప్రాపంచిక జీవితం మన కోసం ఒక స్వప్నం. పరలోక జీవితం వాస్తవం. ఈ జీవితంలోని మన ప్రాధ్యాన్యతలు ఏమిటంటే మనం కేవలం మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుట.

 • ఇంగ్లీష్

  అల్లాహ్ మనల్ని ప్రేమిస్తున్నాడా, అల్లాహ్ మెప్పు కోసం మనం చేయవలసిన ఆచరణలు గురించి షేఖ్ ముహమ్మద్ అల్ షరీఫ్ ఇక్కడ చర్చించారు.

 • ఇంగ్లీష్

  ఈ ఉపన్యాసంలో షేఖ్ ఉమర్ స్వర్గానికి దారి అనే అంశంపై చర్చించారు. ఇది స్వర్గానికి చేర్చే మార్గాన్ని మనకు గుర్తు చేస్తున్నది. ఒకవేళ ప్రజలు ఈ మార్గాన్ని అనుసరిస్తే అల్లాహ్ అనుజ్ఞతో వారు విజయవంతంగా స్వర్గానికి చేరుకోగలరు.

 • ఇంగ్లీష్

  ఈ ఉపన్యాసంలో అంతిమ సందేశం యొక్క ప్రాధాన్యత, మన జీవితంలో మనం విధిగా, తప్పనిసరిగా చేయవలసిన పనులు ఏమిటి, ఈ సందేశాన్ని మనం ఎలా ఆచరణలో పెట్టగలం మరియు దీనిని ఇతరులకు ఎలా అందజేయగలం అనే ముఖ్య విషయాల గురించి షేఖ్ బిలాల్ అసద్ చర్చించారు.

 • ఇంగ్లీష్

  ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దయాగుణాన్ని వివరించే గొప్ప చర్చ. ఆయన దయాగుణంలో మానవులందరినీ అధిగమించారు. అదే సమయంలో ఆయన ధైర్యం మరియు సాహసం చూపడంలో కూడా. ఆయన అత్యంత దయార్ద్రహృదయుడు మరియు మానవుల ఏ కొద్ది అమానషత్వం ఆయన దృష్టిలో పడినా, వెంటనే ఆయన కళ్ళు నీళ్ళతో నిండిపోయేవి.

 • ఇంగ్లీష్

  తల్లిదండ్రుల హక్కులు మరియు బాధ్యత గురించి వివరించే ఒక గొప్చప మరియు ముఖ్యమైన ఉపన్యాసం. వయసు మళ్ళిన వారితో మనం ఎంత ఉత్తమంగా ప్రవర్తించాలో ఇది తెలుపుతున్నది. మన తల్లిదండ్రులకు విధేయత చూపటం మరియు స్వర్గంలో ప్రవేశించేందుకు ప్రయత్నించడం ప్రతి ముస్లిం తప్పనిసరిగా చేయవలసిన పనులు. ఈ బంధుత్వాలు పరస్పరం ప్రేమానురాగాలు ఇచ్చిపుచ్చుకునే అన్యోన్య బంధుత్వాలు. ఒకవైపు వారి బాధ్యతలే మరో వైపు వారి హక్కులవుతాయి. కాబట్టి తల్లిదండ్రులు - సంతానం సంబంధంలో తల్లిదండ్రుల హక్కులు పిల్లల బాధ్యత, కర్తవ్యాలుగా మారతాయి అలాగే పిల్లల హక్కులు తల్లిదండ్రుల కర్తవ్యాలుగా మారతాయి.

 • ఇంగ్లీష్

  నిజమైన, నిజాయితీపరుడైన మరియు స్వచ్ఛమైన ముస్లిం గురించి షేఖ్ బిలాల్ అసద్ వివరిస్తున్న చాలా ముఖ్యమైన ఉపన్యాసం. ప్రతి ముస్లిం తప్పకుండా నిజమైన ముస్లింగా మారాలి. నిజమైన, ప్రామాణిక ఇస్లామీయ బోధనలను మాత్రమే అనుసరించమని ఇస్లాం ధర్మం మనల్ని ఆదేశిస్తున్నది.

పేజీ : 3 - నుండి : 1
ఫీడ్ బ్యాక్