10 - Yunus ()

|

(1) సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యంపై చర్చ జరిగింది.ఈ సూరహ్ లో పఠించబడిన ఈ ఆయతులు వివేకముతో,ఆదేశాలతో కూడిన సుస్పష్టమైన,సంపూర్ణమైన ఖుర్ఆన్ ఆయతులు.

(2) ఏమీ మేము వారిలో నుంచి ఒక వ్యక్తి పై అల్లాహ్ శిక్ష నుండి వారిని భయపెట్టమని అతనికి ఆదేశమిస్తూ దైవ వాణిని అవతరింపజేయటం ప్రజలను ఆశ్ఛర్యానికి లోను చేసినదా ?.ఓ ప్రవక్తా అల్లాహ్ పై విశ్వాసమును కనబరచిన వారిని వారికి సంతోషమును కలిగించే వారు చేసుకున్నసత్కర్మలకు ప్రతిఫలంగా పరిశుద్ధుడైన తమ ప్రభవు వద్ద ఉన్నత స్థానము వారి కొరకు ఉన్నదన్న వార్తను తెలియజేయండి.అవిశ్వాసపరులు ఇలా పలికారు : నిశ్చయంగా ఈ ఆయతులను తీసుకుని వచ్చిన ఈ వ్యక్తి మంత్రజాలమును ప్రధర్శించే మాంత్రికుడు.

(3) ఓ ఆశ్ఛర్యపోయేవారా నిశ్చయంగా మీ ప్రభువు అతడే అల్లాహ్ ఎవరైతే ఆకాశములను అవి పెద్దవిగా ఉన్నా కూడా,భూమిని అది వెడల్పుగా ఉన్నా కూడా ఆరు దినముల్లో సృష్టించాడో.ఆ పిదప ఆయన లేచి సింహాసనమును అధీష్టించినాడు.అయితే మీరు ఎలా మీలోనుండే ఒక వ్యక్తిని ఆయన ప్రవక్తగా పంపించటం నుండి ఆశ్చర్యపోతున్నారు ?.వాస్తవానికి ఆయన ఒక్కడే తన విశాలమైన సామ్రాజ్యములో నడిపించేవాడు,నిర్ణయించేవాడు.మరియు ఆయన వద్ద ఏదైన విషయంలో ఆయన ఇష్టపడిన సిఫారసు చేసే వ్యక్తిని ఆయన అనుమతి ఇస్తే తప్ప ఇంకెవరికి సిఫారసు చేసే అధికారము లేదు.ఈ గుణాలు కలిగిన అతడే అల్లాహ్ మీ ప్రభువు.ఆరాధనను మీరు ఆయన కొరకే ప్రత్యేకించండి.అయితే మీరు ఆయన ఏకత్వమును నిరూపించే ఈ ఆధారాలు,వాదనలన్నింటి ద్వారా మీరు హితోపదేశం గ్రహించరా ?.ఎవరికైనా కొద్దిపాటి హితోపదేశం కలిగినా అతడు దాన్ని గుర్తిస్తాడు మరియు ఆయన పై విశ్వాసమును కనబరుస్తాడు.

(4) ఆయన ఒక్కడి వైపే ప్రళయదినాన మీ కర్మలకు ఆయన ప్రతిఫలం ప్రసాదించటానికి మీ మరలటం ఉంటుంది.దీని ద్వారా అల్లాహ్ ప్రజలకు సత్యవాగ్దానం చేశాడు దానికి ఆయన విరుద్ధంగా చేయడు.నిశ్చయంగా ఆయన అలా చేయటంపై సమర్ధుడు.ఆయన మునుపటి నమూనా లేకుండానే సృష్టితాల సృష్టిని ప్రారంభించాడు.ఆ పిదప పరిశుద్ధుడైన ఆయన అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి సత్కార్యాలను చేసిన వారికి న్యాయపూరితంగా ప్రతిఫలమును ప్రసాదించటానికి అతని మరణం తరువాత అతన్ని మరలింపజేస్తాడు (జీవింపజేస్తాడు).అయితే ఆయన వారి పుణ్యాల్లోంచి వేటినీ తగ్గించడు మరియు వారి పాపాలనూ పెంచడు.ఎవరైతే అల్లాహ్ ను తిరస్కరించి ఆయన ప్రవక్తలను తిరస్కరిస్తారో వారికొరకు త్రాగటానికి అత్యంత తీవ్రమైన వేడి నీళ్ళు ఉంటాయి.అవి వారి పేగులని కోసివేస్తాయి.మరియు అల్లాహ్ పై ఆయన ప్రవక్తల పై వారి అవిశ్వాసం వలన వారి కొరకు బాధాకరమైన శిక్ష ఉన్నది.

(5) ఆయనే సూర్యుడి కాంతిని వెదజెల్లి దాన్ని వ్యాపింపజేసేటట్లుగా సృష్టించాడు.మరియు చంద్రుడిని కాంతివంతంగా దాని ద్వారా వెలుగుని గ్రహించేవిధంగా సృష్టించాడు.మరియు దాని ప్రకాశమును దాని దశల లెక్కన ఇరవై ఎనిమిదిగా అంచనా వేశాడు.మరియు ఒక దశ ప్రతి ఒక రోజు,రాత్రి దాని దూరాన్ని ఛేదిస్తుంది (అంటే ఒక దశలో చంద్రుడు ప్రకాశించటానికి ఇరవై నాలుగు దినములు పడుతుంది ).ఓ ప్రజలారా సూర్యుడి ద్వారా దినముల లెక్క,చంద్రుని ద్వారా నెలల,సంవత్సరాల లెక్క అని మీరు తెలుసుకోవాలని (అంచనా వేశాడు).అల్లాహ్ భూమ్యాకాశములను,ఆ రెండింటిలో ఉన్న వాటిని తన సామర్ధ్యమును,తన గొప్పతనమును ప్రజలకు వ్యక్త పరచటానికి సత్యముతో సృష్టించినాడు.ఈ స్పష్టమైన ఆధారాలు,ప్రకాశవంతమైన ఋజువులను అల్లాహ్ తన ఏకత్వముపై తెలియపరుస్తున్నాడు.వాటి ద్వారా దానిపై ఆధారమును ఇవ్వటమును తెలుసుకునే వారి కొరకు.

(6) దాసులపై రేయింబవళ్ళు ఒక దాని తరువాత ఒకటి రావటంలో,దానితోపాటు చీకటి,వెలుగు తోడవటం,వాటిలోంచి ఒక దాని చిన్నదవటం,దాని పొడుగవటం,భూమ్యాకాశాల్లో ఉన్నటువంటి సృష్టిరాసులు ఇవన్నీ అల్లాహ్ ఆదేశాలను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా అల్లాహ్ తో భయపడేవారి కొరకు అల్లాహ్ సామర్ధ్యమును నిరూపించే సూచనలు.

(7) నిశ్చయంగా అల్లాహ్ తో కలుసుకోవటంతో భయపడటానికి లేదా దానిలో ఆశ కలిగి ఉండటానికి అల్లాహ్ తో కలుసుకోవటంపై నమ్మకం లేని అవిశ్వాసపరులు,ఎల్లప్పుడు ఉండిపోయే పరలోక జీవితానికి బదులుగా అంతమైపోయే ఇహలోక జీవితాన్ని ఇష్టపడ్డారు.వారి మనస్సులు అందులో నివాసం ఉండటంపై ఆనందపడ్డాయి.మరియు ఎవరైతే అల్లాహ్ సూచనల నుండి,ఆయన ఆయతుల నుండి విముఖత చూపుతారో వారు వాటి నుండి పరధ్యానంలో ఉన్నారు.

(8) ఈ లక్షణాలు కలిగిన వారందరు చేసుకున్న అవిశ్వాసము,తిరస్కారము వలన ప్రళయ దినాన వారు శరణం తీసుకునే ఆశ్రయం నరకాగ్ని.

(9) నిశ్చయంగా అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి సత్కార్యములు చేసిన వారికి వారి విశ్వాసము వలన అల్లాహ్ తన ప్రేమ వరకు చేరవేసే సత్కార్యము వైపునకు మార్గదర్శకత్వమును ప్రసాదిస్తాడు.ఆ తరువాత ప్రళయదినాన అల్లాహ్ వారందరిని శాస్వత సుఖాలు ఉన్న స్వర్గవనాల్లో ప్రవేశింపజేస్తాడు.వారి క్రింది నుండి సలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి.

(10) స్వర్గములో అల్లాహ్ ను స్థుతించటం,ఆయన పరిశుద్ధతను పలకటం వారి ప్రార్ధన.వారికొరకు అల్లాహ్ అభివందనం,దైవదూతల అభివందనం,వారి పరస్పర అభివందనం సలాం అవుతుంది.సకల సృష్టిరాసుల ప్రభువైన అల్లాహ్ గొప్పతనమును కొనియాడటం వారి ప్రార్ధన ముగింపు అవుతుంది.

(11) మరియు ఒకవేళ పరిశుద్ధుడైన అల్లాహ్ ప్రజలు కోపసమయములో తమపై,తమ సంతానముపై,తమ సంపదలపై కీడు కలగాలని శపించుకున్న దాన్ని స్వీకరించటమును వారి కొరకు మేలు కలగాలని చేసుకున్న వారి ప్రార్ధనను స్వీకరించినట్లు తొందర చేస్తే వారు నాశనం చేయబడేవారు.కానీ అల్లాహ్ వారికి గడువు ఇస్తాడు.ఆయనతో కలవటము గురించి నిరీక్షించని వారిని ఆయన వదిలివేస్తాడు.ఎందుకంటే వారు ఏ శిక్ష నుండి భయపడరు,ఏ పుణ్యమును ఆశించరు.వారిని ఆయన లెక్కతీసుకునే దినం విషయంలో సందేహములో,సంకోచములో పడిపోయినట్లుగా మరలిపోయినట్లు వదిలివేస్తాడు.

(12) మితిమీరిన మనిషికి ఏదైన అనారోగ్యము లేదా దుస్థితి కలిగినప్పుడు అతడు అణుకువతో,నిమమ్రతతో తన ప్రక్కపై పడుకొని లేదా కూర్చొని లేదా నిలబడి తనకు ఉన్న కష్టము తొలగించబడుతుందని ఆశిస్తూ మమ్మల్ని వేడుకుంటాడు.ఎప్పుడైతే మేము అతని వేడుకోవటమును స్వీకరించి అతనిపై ఉన్న కష్టమును తొలగిస్తామో అతను తనకు కలిగిన కష్టమును తొలగించటము కొరకు మమ్మల్ని ఎప్పుడు వేడుకోనట్లుగా వెళ్ళిపోయాడు.తన మార్గభ్రష్టతలో కొనసాగుతూ ఈ విముఖత చూపే వాడి కొరకు ఆకర్షణీయంగా చేయబడినట్లే తమ అవిశ్వాసము ద్వారా హద్దులను అతిక్రమించే వారి కొరకు వారు పాల్పడిన అవిశ్వాసము,పాపకార్యాలు ఆకర్షణీయంగా చేయబడినవి.వారు వాటిని విడనాడరు.

(13) మరియు ఓ ముష్రికులారా నిశ్చయంగా మేము మీకన్నా పూర్వ జాతులను వారు అల్లాహ్ ప్రవక్తలను తిరస్కరించటం వలన,వారు పాప కార్యములకు పాల్పడటం వలన హతమార్చాము.వాస్తవానికి మేము వారి వైపునకు పంపించిన ప్రవక్తలు తమ ప్రభువు వద్ద నుండి తీసుకుని వచ్చిన వాటిలో సత్యవంతులని నిరూపించే స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి.వారు విశ్వసించటానికి సిద్ధంగా లేనందు వలన వారు విశ్వసించటం వారికొరకు సరైనది కాదు.అయితే అల్లాహ్ వారిని పరాభవమునకు లోను చేశాడు.వారికి దాని అనుగ్రహం కలిగించలేదు.ఆ దుర్మార్గులైన జాతులకు మేము ప్రతిఫలం ప్రసాదించినట్లే ప్రతీ కాలములో ప్రతీ చోటా ఇలాంటి వారికి ప్రతిఫలమును ప్రసాదిస్తాము.

(14) ఓ ప్రజలారా మీరు ఎలా ఆచరిస్తారో మేము చూడటానికి మేము హతమార్చిన ఈ తిరస్కార జాతుల వారికి మిమ్మల్ని ప్రతినిదులుగా చేశాము.మీరు మంచి చేసి దానికి పుణ్యం పొందుతారా లేదా చెడు చేసి శిక్షను అనుభవిస్తారా ?.

(15) అల్లాహ్ ఏకత్వమును నిరూపించే స్పష్టమైన ఖుర్ఆన్ ఆయతులను వారి ముందట పఠించబడినప్పుడు మరణాంతరం లేపబడటమును నిరాకరించిన వారు,ఎవరైతే పుణ్యాన్ని ఆశించరో,శిక్ష నుండి భయపడరో వారు ఇలా పలికారు : ఓ ముహమ్మద్ మీరు ఈ ఖుర్ఆన్ ఏదైతే విగ్రహారాధనను దూషిస్తుందో అది కాకుండా వేరే ఖుర్ఆన్ ను లేదా వేరేది ఇందులో ఉన్న కొన్నింటిని లేదా పూర్తి వాటిని రద్దు పరచి మా కోరికలకు అణుగుణంగా ఉండేది తీసుకుని రా.ఓ ప్రవక్తా వారికి ఇలా తెలియపరచండి : నేను దాన్ని మార్చటం సరికాదు.మరియు మొదటి దాన్ని కాకుండా వేరే దానిని నేను తీసుకుని రాలేను.కాని ఒక్కడైన అల్లాహ్ ఆయనే అందులో నుంచి తాను తలచుకున్న దాన్ని మార్చి వేస్తాడు.అల్లాహ్ నా వైపు అవతరింపజేసిన దైవవాణి ని మాత్రమే నేను అనుసరిస్తాను.ఒక వేళ నేను మీరు కోరిన దాన్ని స్వీకరించి అల్లాహ్ కు అవిధేయత చూపితే నేను గొప్ప దిన శిక్ష నుండి భయపడుతున్నాను.అది ప్రళయదినము.

(16) ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఒక వేళ అల్లాహ్ నేను మీపై ఖుర్ఆన్ చదివి వినిపించకూడదని అనుకుంటే నేను దాన్ని మీ ముందు చదివే వాడిని కాదు.మరియు దానిని మీకు చేరవేసే వాడిని కాదు.మరియు ఒక వేళ అల్లాహ్ తలచుకుంటే నా నాలిక (నోటి) ద్వారా మీకు ఖుర్ఆన్ తెలియపరచేవాడు కాదు.వాస్తవానికి నేను మీ మధ్యన చాలా కాలం నివాసమున్నాను.అది నలభై సంవత్సరములు.నేను చదవలేను,వ్రాయలేను.మరియు దీన్ని నేను కోరలేదు,దాని గురించి వెతకలేదు.నేను మీ వద్దకు తీసుకుని వచ్చినది అల్లాహ్ వద్ద నుండి అని దానిలో (దానిని తీసుకుని రావటంలో) నాకు ఎటువంటి సంబంధం లేదని మీ బుద్ధులు అంగీకరించవా ?.

(17) అల్లాహ్ పై అబద్దమును కల్పించేవాడి కంటే పెద్ద దుర్మార్గుడు ఎవడూ ఉండడు.అలాంటప్పుడు ఆయనపై అబద్దమును కల్పిస్తూ నాకు ఖుర్ఆన్ ను మార్చటం ఎలా కుదురుతుంది.నిశ్చయంగా అల్లాహ్ పై అబద్దమును కల్పిస్తూ ఆయన హద్దులను అతిక్రమించే వారు తాము కోరుకున్నదాన్ని పొందటంలో సాఫల్యం చెందలేరు.

(18) ముష్రికులు లాభం చేయలేని,నష్టం కలిగించలేని ఆరోపిత దైవాలను అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్నారు.సత్య ఆరాధ్యదైవము తాను కోరుకున్నప్పుడు లాభం చేకూరుస్తాడు,నష్టం కలిగిస్తాడు.మరియు వారు తమ ఆరాధ్య దైవాల గురించి ఇలా పలికేవారు : వీరందరూ అల్లాహ్ వద్ద మన గురించి సిఫారసు చేసే మధ్యవర్తులు.వీరు మా పాపముల వలన మమ్మల్ని శిక్షించరు.ఓ ప్రవక్త వారితో ఇలా పలకండి : ఏమీ మీరు అంతా తెలిసిన అల్లాహ్ కి ఆయనకు సాటి ఉన్నారని తెలియపరుస్తున్నారా ?.మరియు ఆయన కొరకు ఆకాశముల్లో,భూమిలో సాటి ఉన్నారని ఆయనకు తెలియదా.ముష్రికులు పలుకుతున్న అవాస్తవాలు,అసత్యాల నుండి ఆయన అతీతుడు,పరిశుద్ధుడు.

(19) ప్రజలందరూ మువహ్హిదులై (ఒకే దైవ ఆరాధకులుగా) విశ్వాసపరులై ఒకే వర్గముగా ఉండేవారు.వారిలోంచి కొందరు విశ్వాసపరులుగా ఉండిపోయారు,వారిలోంచి కొందరు అవిశ్వాసపరులైపోయారు.అల్లాహ్ వారు విభేదించుకున్న విషయాల గురించి ఇహలోకములో వారి మధ్యన తీర్పు ఇవ్వడని ప్రళయదినాన ఆ విషయంలో వారి మధ్యన తీర్పు ఇస్తాడని అల్లాహ్ నిర్ణయం అయిపోకుండా ఉంటే ఇహలోకములోనే వారు విభేధించుకున్న విషయంలో వారి మధ్యన తీర్పు ఇచ్చేవాడు.అప్పుడు మార్గభ్రష్టుడు నుండి సన్మార్గముపై ఉన్న వాడు స్పష్టమయ్యేవాడు.

(20) ముష్రికులు ఇలా అనేవారు : ఎందుకని ముహమ్మద్ పై ఆయన నిజాయితీని నిరూపించే ఏదైన వాఖ్యము (ఆయతు) ఆయన ప్రభువు తరపు నుండి అవతరింపబడలేదు ?.ఓ ప్రవక్తా వారితో ఇలా పలకండి : ఆయతుల అవతరణ అగోచరము అల్లాహ్ తన జ్ఞానముతో ప్రత్యేకించుకున్నాడు.కాబట్టి మీరు సూచించిన ఆలోచనాపరమైన ఆయతుల కోసం మీరు నిరీక్షించండి.నిశ్చయంగా నేను కూడా మీతోపాటు వాటి కోసం నిరీక్షించే వారిలోంచి అవుతాను.

(21) మేము ముష్రికులకు వారికి కలిగిన అనావృష్టి,కష్టాల తరువాత వర్షము ద్వారా,సస్యశామలం తో అనుగ్రహమును ప్రసాధించినప్పుడు వారు వెంటనే మా ఆయతుల పట్ల ఎగతాళి చేయటం,తిరస్కరించటం జరుగుతుంది.ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : అల్లాహ్ ఎత్తులు వేయటంలో శీఘ్రుడు,మిమ్మల్ని క్రమక్రమంగా తీసుకుని వెళ్ళటంలో,శిక్షించటంలో వేగవంతుడు.నిశ్చయంగా సంరక్షకులైన దైవదూతలు మీరు వేసే కుయుక్తులను వ్రాస్తున్నారు.వాటిలోంచి ఏవీ వారి నుండి తప్పించుకోవు. అలాంటప్పుడు వారి సృష్టి కర్త నుండి ఎలా తప్పించుకోగలరు ?.మరియు అల్లాహ్ మీరు వేసిన ఎత్తులకు తొందరలోనే ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.

(22) ఓ ప్రజలారా అల్లాహ్ ఆయనే ఎవరైతే మిమ్మల్ని మీ కాళ్ళపై,మీ పశువులపై, భూమి పై నడిపింపజేస్తున్నాడు.మరియు ఎవరైతే మిమ్మల్ని ఓడల్లో సముద్రంలో నడిపింపజేస్తున్నాడో.మీరు సముద్రం లో ఓడల్లో ఉన్నప్పుడు అవి మీతోపాటు అనుకూలమైన గాలిని తీసుకుని నడవసాగాయి.అప్పుడు ఈ అనుకూలమైన గాలితో ప్రయాణికులు సంతోషపడ్డారు.వారు తమ సంతోషములో ఉన్నప్పుడు వారిపై బలమైన గాలి వీసినది.మరియు నలుమూలల నుండి సముద్రపు అల వారిపై వచ్చిపడినది.వారందరూ నాశనం అయిపోయారే అనుకుని తాము ఆయనతోపాటు వేరే ఇతరులని సాటికల్పించని ఒక్కడైన అల్లాహ్ ను ఇలా పలుకుతూ వేడుకున్నారు : ఒకవేళ నీవు వినాశనమును చేసే ఈ ముప్పు నుండి మమ్మల్ని రక్షిస్తే మేము తప్పకుండా నీవు మాకు ప్రసాదించిన అనుగ్రహాలపై నీకు కృతజ్ఞతలు తెలుపుకునేవారిలోంచి అయిపోతాము.

(23) ఎప్పుడైతే ఆయన వారి అర్ధనను స్వీకరించి వారిని ఈ ముప్పు నుండి రక్షించాడో అప్పుడు వారందరూ అవిశ్వాసము,అవిధేయకార్యములు,పాపములకు పాల్పడి భూమిలో ఉపద్రవాలను రేకెత్తిస్తున్నారు.ఓ ప్రజలారా మీరు మేలుకోండి మీ దౌర్జన్యాల దుష్పరిణామము మీపైనే ఉంటుంది.మీ దుర్మార్గము అల్లాహ్ కు నష్టం కలిగించదు.దానితో మీరు ఇహలోకములోనే ప్రయోజనం చెందుతారు.అది కూడా అంతం అయిపోతుంది.ఆ తరువాత ప్రళయదినాన మీ మరలటం మా వైపునే అవుతుంది.అప్పుడు మేము మీరు పాల్పడిన పాపముల గురించి మీకు సమాచారమిస్తాము.మరియు వాటి పరంగానే మేము మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము.

(24) మీరు ప్రయోజనం చెందుతున్న ఇహలోక జీవితం అది వేగముగా అంతం అయిపోవటంలో ఉపమానం ఆ వర్షం మాదిరిగా ఉన్నది దేని ద్వారానైతే ప్రజలు తినే ధాన్యాలు,ఫలాలు,పశువులు తినే గడ్డి,మొదలగున్నవి కలిసి పెరుగుతున్నాయి.చివరికి నేల తన రంగును కాంతివంతంగా చేసుకుని తన రకరకాల మొక్కల ద్వారా అందంగా తయారవుతుంది.దాని వాసులు అది మొలకెత్తించిన వాటిని కోయటంలో,తృంచటంలో సామర్ధ్యం కలవారని భావిస్తారు.మా తీర్పు దానిని వినాశనం చేస్తూ వస్తుంది.మేము దాన్ని అది దగ్గరి కాలంలో చెట్లను,మొక్కలను మొలకెత్తించలేనట్లుగా కోసివేస్తాము.మేము ప్రాపంచిక స్థితిని,వేగముగా అంతం అయిపోవటాన్ని మీకు స్పష్టపరచినట్లు ఆధారాలను,ఋజువులను యోచన చేసే వారి కొరకు గుణపాఠం నేర్చుకునే వారి కొరకు స్పష్టపరుస్తున్నాము.

(25) మరియు అల్లాహ్ ప్రజలందరిని శాంతి నిలయమైన తన స్వర్గము వైపునకు పిలుస్తున్నాడు.అందులో ప్రజలు ఆపదల నుండి,దుఃఖముల నుండి భద్రంగా ఉంటారు.మరియు వారు మరణం నుండి భద్రంగా ఉంటారు.మరియు అల్లాహ్ తన దాసుల్లోంచి తాను తలచుకున్న వారిని ఈ శాంతి నిలయమునకు చేరవేసే ఇస్లాం ధర్మమును అనుగ్రహిస్తాడు.

(26) అల్లాహ్ తమ పై విధిగావించిన వాటిని మంచిగా చేసి,తమపై ఆయన నిషేదించిన అవిధేయ కార్యాలను విడనాడే వారి కొరకు మంచి పుణ్యము కలదు.అది స్వర్గము.మరియు వారి కొరకు దాని కన్నా అధికమే లభించును.అది ఉదారమైన అల్లాహ్ ముఖ దర్శనము.మరియు వారి ముఖములపై దుమ్ము చేరి ఉండదు.మరియు వాటిపై దుఃఖము,అవమానము చేరదు.దాతృత్వం ఉన్న వీరందరూ స్వర్గవాసులు,వారే అందులో నివాసం ఉంటారు.

(27) మరియు ఎవరైతే అవిశ్వాసము,అవిధేయ కార్యాలైన పాప కార్యాలకు పాల్పడుతారో వారి కొరకు వారు పాల్పడిన దుష్కార్యమునకు ప్రతిఫలము దాని లాంటి అల్లాహ్ శిక్షపరలోకములో ఉండును.మరియు వారి ముఖములపై అవమానము,పరాభవము కప్పబడి ఉంటాయి.అల్లాహ్ వారిపై శిక్షను అవతరింపజేసినప్పుడు వారి కొరకు అల్లాహ్ శిక్షనుండి ఆపేవాడు ఎవడూ ఉండడు.నరకము యొక్క పొగ,దాని నల్లదనం వారి ముఖములపై ఎక్కువగా కప్పుకోవటం వలన వారి ముఖములు చీకటి రాత్రి యొక్క నల్లని తెరను తొడిగినట్లు ఉంటాయి.ఈ గుణాలను కలిగిన వీరందరూ నరక వాసులు.వీరే అందులో శాస్వతంగా ఉంటారు.

(28) ఓ ప్రవక్తా మీరు ప్రళయదినమును గుర్తు చేసుకోండి అప్పుడు మేము సృష్టిరాసులందరిని సమీకరిస్తాము.ఆ తరువాత ఇహలోకములో అల్లాహ్ తోపాటు సాటి కల్పించిన వారితో ఇలా పలుకుతాము : ఓ ముష్రికులారా మీరూ మరియు మీ ఆ ఆరాధ్య దైవాలు వేటినైతే మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధించేవారో వారు మీ స్థానమును అట్టిపెట్టుకుని ఉండండి.అయితే మేము ఆరాధించబడే వారిని,ఆరాధించే వారిని వేరుపరుస్తాము.మరియు ఆరాధించబడేవారు ఇలా పలుకుతూ ఆరాధించేవారితో సంభంధం లేదని చూపుతారు : ఇహలోకములో మీరు మమ్మల్ని ఆరాధించేవారు కాదు .

(29) అక్కడ వారు పూజించే వారి ఆరాధ్య దైవాలు వారితో సంభందములేదని ఇలా పలుకుతారు : అల్లాహ్ యే సాక్ష్యం .దానికి ఆయన చాలు.నిశ్చయంగా మీరు మా ఆరాధన చేయటమును మేము ఇష్టపడలేదు.దాని గురించి మేము మీకు ఆదేశించనూ లేదు.మరియు మేము మీ ఆరాధనను గ్రహించనూ లేదు.

(30) ఆ మహోత్తర సంధర్భములో ప్రతి మనిషి తాను ఇహలోకములో చేసుకున్న కర్మలను పరీక్షించుకుంటాడు.మరియు ముష్రికులు తమ సత్య ప్రభువైన అల్లాహ్ ఎవరైతే వారి లెక్క తీసుకుంటాడో ఆయన వైపునకు మరలించబడుతారు.వారు కల్పించుకున్న తమ విగ్రహాల సిఫారసు వారి నుండి వైదొలిగిపోతుంది.

(31) ఓ ప్రవక్తా అల్లాహ్ తోపాటు సాటికల్పిస్తున్న వీరందరితో ఇలా అడగండి : మీపై వర్షమును కురిపించటం ద్వారా ఆకాశము నుండి మీకు ఆహారోపాదిని కల్పిస్తున్నవాడెవడు ?.మరియు భూమి నుండి మొలకెత్తే మొక్కల ద్వారా,అది సమీకరించే ఖనిజాల ద్వారా మీకు భూమి నుండి ఆహారోపాదిని కల్పిస్తున్నవాడెవడు ?.వీర్యపు బిందువు నుండి మనిషిలా,గ్రుడ్డు నుండి పక్షి లా మృత్యువు నుండి జీవమును తీస్తున్నది ఎవడు ?.మరియు జంతువు నుండి వీర్యము లా,పక్షి నుండి గ్రుడ్డు లా జీవము నుండి మృత్యువు ను తీస్తున్నది ఎవడు ?.భూమ్యాకాశాలు,వాటిలో ఉన్న సృష్టి రాసుల విషయంలో పర్యాలోచన చేస్తున్నది ఎవడు ?.అప్పుడు ఇదంతా చేస్తున్న వాడు అతడే అల్లాహ్ అని వారు సమాధానమిస్తారు .అయితే మీరు వారితో ఇలా అనండి : అయితే మీరు అల్లాహ్ ఆదేశాలను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా అల్లాహ్ కు భయపడటానికి ఇది మీకు తెలియదా ?.

(32) ఓ ప్రజలారా ఇదంతా చేస్తున్నవాడు ఆయనే సత్యమైన అల్లాహ్ మీ ప్రభువు,మీ వ్యవహారాల పర్యాలోచన చేసేవాడు.కాబట్టి సత్యం తెలిసిన తరువాత దాని నుండి దూరంగా ఉండకుండా దాన్ని కోల్పోకుండా ఉండటానికి ఏమి చేయాలి ?.ఈ స్పష్టమైన సత్యము నుండి మీ బుద్ధులు ఎటు మరలిపోతున్నాయి ?.

(33) ఓ ప్రవక్తా నిజమైన దైవత్వము అల్లాహ్ కొరకు నిరూపితమయినట్లు మొండితనముతో సత్యము నుండి వైదొలగిన వారు విశ్వసించరని మీ ప్రభువు యొక్క విధి మాట అనివార్యమైనది.

(34) ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా అడగండి : ఏమి మీరు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే ఆరాధించి మీరు సాటి కల్పించుకున్న వారిలోంచి పూర్వ నమూనా లేకుండా సృష్టిని సృష్టించటమును ఆరంభించి ఆ పిదప దాని మరణం తరువాత దాన్ని మరల లేపగలిగేవాడు ఎవరైనా ఉన్నాడా ?.మీరు వారితో అనండి అల్లాహ్ పూర్వ నమూనా లేకుండా సృష్టిని ఆరంభించి ఆ పిదప దాని మరణం తరువాత దాన్ని మరల లేపే వాడు.అయితే ఓ ముష్రికులారా మీరు ఎలా సత్యము నుండి అసత్యము వైపునకు మరలించబడుతున్నారు!?.

(35) ఓ ప్రవక్తా వారితో ఇలా అనండి : ఏమి మీరు అల్లాహ్ ను వదిలి మీరు ఆరాధించి సాటి కల్పించుకున్న వారిలోంచి సత్యం వైపునకు మార్గదర్శకత్వం వహించే వాడు ఎవరైనా ఉన్నాడా ?.మీరు వారితో అనండి : ఒక్కడైన అల్లాహ్ సత్యం వైపునకు మార్గదర్శకత్వం వహించేవాడు.అయితే ప్రజలను సత్యం వైపునకు మార్గదర్శకత్వం వహించి దాని వైపునకు పిలిచే వాడు అనుసరించబడటానికి ఎక్కువ హక్కుదారుడా ? లేదా మీ ఆ ఆరాధ్యదైవాలు ఏవైతే ఇతరులు వారికి మార్గదర్శకత్వం వహిస్తే గాని సన్మార్గం పొందలేరు వారు ఎక్కువ హక్కుదారులా ?.మీకు ఏమయింది వాటిని అల్లాహ్ కొరకు సాటి అని వాదించినప్పుడు మీరు ఎలా అసత్యము ద్వారా నిర్ణయాలు తీసుకుంటున్నారు ?.అల్లాహ్ మీరు పలుకుతున్న మాటల నుండి మహోన్నతుడు.

(36) ముష్రికుల్లో చాలామంది తమకు జ్ఞానం లేని వాటిని మాత్రమే అనుసరిస్తున్నారు.అయితే వారు కేవలం ఊహలను,భ్రమలను మాత్రమే అనుసరిస్తున్నారు.నిశ్చయంగా భ్రమ జ్ఞానము స్థానములో నిలబడలేదు.మరియు దానికి ఎటువంటి ప్రయోజనం చేయదు.నిశ్ఛయంగా అల్లాహ్ వారు పాల్పడే చర్యలను తెలిసిన వాడు.వారి కార్యాల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.ఆయన తొందరలోనే వాటిపరంగా వారికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.

(37) ఈ ఖుర్ఆన్ కల్పించబడి అల్లాహేతరులకు దీన్ని అంటగట్టడం సరికాదు.ఎందుకంటే ప్రజలు దానిలాంటి దాన్ని తీసుకుని రావటంలో అశక్తులు.కాని అది దానికన్న మనుపు అవతరించిన గ్రంధములను దృవీకరిస్తుంది.మరియు వాటిలో ఉన్న మంచి ఆదేశాలను స్పష్టపరుస్తుంది.అయితే అది పరిశుద్ధుడైన,మహోన్నతుడైన సృష్టితాల ప్రభువు వద్ద నుండి అవతరించబడనదని అనటంలో ఎటువంటి సందేహము లేదు.

(38) అంతేకాక వారందరు ఇలా అంటున్నారా : నిశ్చయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఖుర్ఆన్ ను స్వయంగా కల్పించుకుని దాన్ని అల్లాహ్ వైపు సంబంధం కలుపుతున్నాడు.ఓ ప్రవక్తా వారిని ఖండిస్తూ మీరు ఇలా సమాధానమివ్వండి : ఒక వేళ నేను మీ వంటి మనషినే అయి ఉండి దీన్ని నా వద్ద నుండి తీసుకుని వస్తే మీరు కూడా దాని లాంటి ఒక సూరాహ్ ని తీసుకుని రండి.మరియు ఖుర్ఆను కల్పించబడినది,అసత్యము అన్న మీ వాదనలో మీరు సత్యవంతులే అయితే మీరు పిలువ గలిగే వారందరిని మీ సహాయం కొరకు పిలుచుకోండి.మీరు అలా అస్సలు చేయలేరు.మరియు మీ అసమర్ధత.మరియు మీరు(అదే) భాష వారు,వాగ్ధాటి యొక్క ప్రావీణ్యులై ఉండటం ఖుర్ఆన్ అల్లాహ్ వద్ద నుండి వచ్చినట్లు సూచిస్తుంది.

(39) వారు స్వీకరించలేదు కాని వారు ఖుర్ఆన్ ను అర్ధం చేసుకోవటం,దానిలో యోచన చేయటం కన్నా ముందే,శిక్ష నుండి వారిని హెచ్చరించే దాన్ని పొందక ముందే ఖుర్ఆన్ ను తిరస్కరించటం ద్వారా త్వరపడ్డారు.వాస్తవానికి అది రావటం దగ్గరపడింది.ఈ తిరస్కారము వంటిదే పూర్వ జాతులు తిరస్కరించారు.అయితే వారిపై అవతరించవలసిన శిక్షే అవతరించినది.అయితే ఓ ప్రవక్తా తిరస్కార జాతుల వారి ముగింపు ఎలా జరిగిందో మీరు దీర్ఘంగా చూడండి.అల్లాహ్ వారిని తుదిముట్టించాడు.

(40) మరియు ముష్రికుల్లోంచి తమ మరణం కన్న మునుపు తొందరలోనే ఖుర్ఆన్ పై విశ్వాసమును కనబరిచేవారు ఉన్నారు,వారిలోంచి అహంకారముతో,మొండితనముతో దానిపై విశ్వాసమును కనబరచకుండా చివరికి మరణించినవారూ ఉన్నారు.ఓ ప్రవక్తా మీ ప్రభువు తమ అవిశ్వాసము పై మొండితనమును కనబరిచేవారి గురించి బాగా తెలిసినవాడు.మరియు ఆయన త్వరలోనే వారి అవిశ్వాసపరంగా వారికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.

(41) ఓ ప్రవక్తా మీ జాతివారు ఒక వేళ మిమ్మల్ని తిరస్కరిస్తే వారితో ఇలా అనండి : నా కర్మల ప్రతిఫలం నాకు.మరియు నా కర్మల బరువును నేనే మోస్తాను, మీకు మీ కర్మల ప్రతిఫలం ఉన్నది,మీపై దాని శిక్ష ఉన్నది.మరియు మీరు నేను చేసిన కర్మల శిక్ష నుండి నిర్దోషులు.మరియు నేను మీరు చేసుకున్న కర్మల శిక్ష నుండి నిర్దోషిని.

(42) ఓ ప్రవక్తా మీరు ఖుర్ఆన్ చదివినప్పుడు ముష్రికుల్లోంచి స్వీకరించటం,విధేయత చూపటమును అంగీకరించకుండా మిమ్మల్ని వినేవారు ఉన్నారు.అయితే వినికిడి శక్తిని కోల్పోయిన వారికి వినిపించగలరా ?.అలాగే సత్యమును వినటం నుండి చెవిటివారై,దాన్ని అర్ధం చేసుకోలేరో వారందరికీ మీరు సన్మార్గం చూపలేరు.

(43) మరియు ఓ ప్రవక్తా ముష్రికుల్లోంచి మీ వైపునకు అంతర్ దృష్టితో కాకుండా బాహ్య దృష్టితో చూసేవారు ఉన్నారు.అయితే ఏమి మీరు తమ దృష్టిని కోల్పోయిన వారికి చూపించగలరా ?.నిశ్చయంగా మీరు దాన్ని చేయలేరు.మరియు అలాగే మీరు అంతర్ దృష్టిని కోల్పోయిన వారికి సన్మార్గం చూపలేరు.

(44) నిశ్చయంగా అల్లాహ్ తన దాసులకి అన్యాయం చేయటం నుండి పరిశుద్దుడు.ఆయన వారికి అణుమాత్రం కూడా అన్యాయం చేయడు.కాని వారందరు అసత్యానికి మద్దతివ్వటం వలన,అహంకారము వలన,మొండితనము వలన తమ స్వయం నిర్ణయంతో వినాశనమునకు గురై తమకే అన్యాయం చేసుకుంటారు.

(45) అల్లాహ్ ప్రళయదినాన ప్రజలందరిని వారి లెక్క తీసుకోవటం కొరకు సమీకరించిన రోజున వారు తమ ఇహలోక జీవితంలో,తమ సమాధి జీవితములో ఒక దినపు ఒక ఘడియ కంటే ఎక్కువ కాలం గడపలేదని భావిస్తారు.వారు ఒకరినొకరు గుర్తుపడతారు.ఆ తరువాత వారు ప్రళయదిన భయానక స్థితులను చూసినప్పడు దాని తీవ్రత వలన వారి పరిచయం అంతమైపోతుంది.ప్రళయ దినాన తమ ప్రభువును కలుసుకోవటమును తిరస్కరించిన వారు నష్టమును చవిచూశారు.మరియు వారు నష్టము నుండి పరిరక్షించబడే వరకు ఇహలోకములో పునరుత్థాన దినము పై విశ్వాసమును కనబరచరు.

(46) ఓ ప్రవక్తా ఒక వేళ మేము వారికి వాగ్దానం చేసిన శిక్షల్లోంచి కొన్నింటిని మీ మరణం కన్న మునుపు మీకు మేము చూపించినా లేదా వాటికన్న ముందు మేము మిమ్మల్ని మరణింపజేసినా ఈ రెండు స్థితుల్లోను ప్రళయదినాన మన వైపు వారి మరలటం ఉంటుంది.ఆ తరువాత అల్లాహ్ వారు చేసే కర్మలను తెలుసుకుంటాడు.వాటిలోంచి ఏదీను ఆయనపై గోప్యంగా ఉండదు.మరియు ఆయన తొందరలోనే వారి కర్మలపరంగా వారికి ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.

(47) గతించిన జాతివారిలోంచి ప్రతీ జాతి కొరకు ఒక ప్రవక్త వారి వైపునకు పంపించబడ్డాడు.అతనికి ఏ సందేశాలను చేరవేయమని ఆదేశమైనదో అతను వాటిని వారికి చేరవేసినప్పుడు వారు అతనిని తిరస్కరించారు.వారికి అతనికి మధ్య న్యాయపూరితంగా తీర్పునివ్వబడింది.అయితే అల్లాహ్ అతన్ని తన అనుగ్రహంతో విముక్తిని కలిగించాడు.మరియు వారిని న్యాయంగా తుదిముట్టించాడు.వారి కర్మల ప్రతిఫలం విషయంలో వారికి ఏమాత్రం అన్యాయం చేయబడదు.

(48) ఈ సత్యతిరస్కారులందరు వ్యతిరేకిస్తూ,చాలెంజ్ చేస్తూ ఇలా పలుకుతారు : ఒకవేళ మీరు వాగ్ధానం చేస్తున్న విషయంలో మీరు నీతిమంతులేనైతే మీరు మాకు వాగ్దానం చేసిన శిక్ష ఎప్పుడు ?.

(49) ఓ ప్రవక్తా వారితో ఇలా పలకండి : నేను నా స్వయం కొరకు నష్టం కలిగించుకోవటానికి లేదా దాన్ని దాని నుండి దూరం చేయటానికి మరియు దానికి (మనస్సునకు) నేను ఎటువంటి లాభం చేయటమునకు గాని శక్తి లేదు అటువంటప్పుడు నేను ఎలా ఇతరులకు ప్రయోజనం చేయగలను లేదా హాని చేయగలను ?.కాని దాన్ని అల్లాహ్ తలచుకుంటే చేయగలడు.అయితే నేను ఎలా దాని ఆగోచరమును తెలుసుకోగలను .జాతుల్లోంచి ప్రతి జాతికి వినాశనము గురించి దాన్ని హెచ్చరించాడు దాని వినాశనమునకు సమయును నిర్ధారించాడు.అది అల్లాహ్ కి తప్ప ఇంకొకరికి తెలియదు.దాని వినాశన సమయం ఆసన్నమైతే దాని నుండి కొంచం సమయం కూడా వెనుకకు జరుగదు,ముందుకు నెట్టబడదు.

(50) ఓ ప్రవక్తా శిక్ష గురించి తొందర చేసే వీరందరితో ఇలా పలకండి : మీరు నాకు తెలుపండి అల్లాహ్ శిక్ష ఒక వేళ మీ వద్దకు రాత్రి లేదా పగటి యొక్క ఏదైన సమయంలో వస్తే (మీరు ఏమి చేయగలరు) ఈ శిక్ష నుండి మీరు దేని గురించి తొందర చేస్తున్నారు ?.

(51) ఏమీ మీతో వాగ్దానం చేయబడిన శిక్ష మీపై వచ్చిపడిన తరువాత మీరు విశ్వసిస్తారా ? ఆ సమయంలో ఏ వ్యక్తికి అతని విశ్వాసం అతను ముందు నుంచి విశ్వసించనందు వలన ప్రయోజనం చేకూర్చదు.ఏమీ మీరు ఇప్పుడు విశ్వాసమును కనబరుస్తారా ?, వాస్తవానికి మీరు ముందు నుంచే శిక్షను తిరస్కరించే వైనముతో దాన్ని తొందరపడేవారు.

(52) వారిని శిక్షలో పడవేసి,వారు దాని నుండి బయటకు రావటానకి కోరిన తరువాత వారితో ఇలా అనబడుతుంది : పరలోకములో మీరు శాస్వతమైన శిక్షను అనుభవించండి.మీరు చేసుకున్న అవిశ్వాస,అవిధేయ కార్యాల ప్రతిఫలం తప్ప వేరేది మీరు ఇవ్వబడ్డారా ?!.

(53) ఓ ప్రవక్తా మేము వాగ్దానం చేయబడిన ఈ శిక్ష సత్యమా ? అని ముష్రికులు మీతో అడుగుతారు.అయితే మీరు వారికి ఇలా సమాధానం ఇవ్వండి : అవును,అల్లాహ్ సాక్షిగా నిశ్ఛయంగా అది సత్యము.మరియు మీరు దాని నుండి విముక్తి పొందలేరు.

(54) ఒక వేళ అల్లాహ్ తోపాటు సాటి కల్పించే ప్రతి ఒక్కరికి భూమిలో ఉండే విలువైన సంపద ఉంటే దాన్ని అల్లాహ్ శిక్షకు పరిహారంగా చేయటానికి ఏర్పాటు చేయబడితే అతడు దాన్ని అల్లాహ్ శిక్ష నుండి విముక్తి పొందటానికి పరిహారంగా ఇస్తాడు.మరియు ముష్రికులు ప్రళయదినాన శిక్షను చూసినప్పుడు తమ అవిశ్వాసముపై పశ్చాత్తాపమును గోప్యంగా ఉంచుతారు.మరియు అల్లాహ్ వారి మధ్య న్యాయపరంగా తీర్పునిస్తాడు.మరియు వారికి అన్యాయం చేయబడదు.వారు తమ ఆచరణల పరంగా మాత్రమే ప్రతిఫలం ప్రసాధించబడుతారు.

(55) వినండి నిశ్చయంగా ఆకాశాల్లో ఉన్నవాటి అధికారము,భూమిలో ఉన్నవాటి అధికారము ఒక్కడైన అల్లాహ్ కొరకే.వినండి నిశ్చయంగా అవిశ్వాసపరులకు శిక్ష విషయంలో అల్లాహ్ వాగ్దానం నెరవేరనుంది అందులో ఎటువంటి సందేహం లేదు.కాని చాలా మందికి ఇది తెలియదు వారు సందేహంలో పడిపోతున్నారు.

(56) పరిశుద్దుడైన ఆయనే మృతులను మరల జీవింపజేస్తాడు మరియు జీవించి ఉన్నవారిని మరణింపజేస్తాడు.ప్రళయదినాన మీరందరు ఆయన ఒక్కడి వైపునకు మరలించబడుతారు.అప్పుడు మీ కర్మలపరంగా ఆయన మీకు ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.

(57) ఓ ప్రజలారా మీ వద్దకు ఖుర్ఆన్ వచ్చినది అందులో హితబోధన ఉంది,ప్రోత్సాహం ఉన్నది,భయపెట్టటం ఉన్నది.మరియు అది హృదయాల్లో ఉన్న సందేహము,సంశయము లాంటి రోగాలకు చికిత్స,సత్యమార్గము దర్శకత్వము.మరియు అందులో విశ్వాసపరులకు కారుణ్యము ఉన్నది.అయితే వారే దానితో ప్రయోజనం చెందుతారు.

(58) ఓ ప్రవక్తా మీరు ప్రజలతో ఇలా పలకండి : నేను మీ వద్దకు తీసుకుని వచ్చిన ఖుర్ఆన్ మీపై అల్లాహ్ అనుగ్రహము మరియు మీపై ఆయన కారుణ్యము.మీపై అల్లాహ్ అనుగ్రహము ద్వారా,మీపై ఆయన కారుణ్యము ద్వారా ఈ ఖుర్ఆన్ అవతరణ ద్వారా మీరు ఈ రెండింటి ద్వారానే (అనుగ్రహము,కారుణ్యము) ఆనందపడండి.ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రభువు వద్ద నుండి వారి వద్దకు ఏదైతే తీసుకుని వచ్చారో అది వారు కూడబెట్టుకున్న అంతమైపోయే ప్రాపంచిక సామగ్రి కన్న మేలైనది.

(59) ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : అల్లాహ్ జీవనోపాదిని అవతరింప జేయటం నుండి మీపై అనుగ్రహించిన వాటి గురించి నాకు మీరు తెలియపరచండి.అప్పుడు మీరు వాటిలో మీ మోహమును బట్టి ఆచరించారు.వాటిలో కొన్నింటిని మీరు నిషేధించుకున్నారు మరియు వాటిలో కొన్నింటిని మీరు ధర్మసమ్మతం చేసుకున్నారు.మీరు వారితో ఇలా పలకండి : ఏమీ మీరు ధర్మసమ్మతం చేసిన వాటిని సమ్మతం చేసుకునే విషయంలో,మీరు నిషేధించుకున్న వాటి వషయంలో నిషేధించటానికి అల్లాహ్ మీకు అనుమతి ఇచ్చాడా లేదా మీరు ఆయనపై అబద్దమును కల్పించుకుని అంటగడుతున్నారా ?.

(60) ఆయనపై అబద్దమును కల్పించుకునేవారు ప్రళయదినాన తమపై ఏమి వచ్చి పడుతుందనుకుంటున్నారు ?!. ఏ వారిని మన్నించటం జరుగుతుందని వారు భావిస్తున్నారా ?!. దూరం అవుగాక.నిశ్చయంగా అల్లాహ్ ప్రజలపై వారిని గడువునిచ్చి,వారిపై శిక్షను తొందరగా కలిగించకుండా ఉపకారము చేసేవాడు.కాని వారిలో చాలామంది తమపై ఉన్న అల్లాహ్ అనుగ్రహాలను తిరస్కరిస్తారు.మరియు వాటికి వారు కృతజ్ఞతలు తెలుపుకోరు.

(61) ఓ ప్రవక్తా మీరు కార్యాల్లోంచి ఏ కార్యంలో ఉన్నా,ఖుర్ఆన్ నుండి మీరు ఏమి చదివినా,ఓ విశ్వాసపరులారా మీరు ఏ పని చేస్తున్నా మేము మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటాము,మీరు పని మొదలుపెట్టి అందులో నిమగ్నమై ఉన్నప్పుడు మిమ్మల్ని వింటాము.ఆకాశములో కాని భుమిలో కాని అణువంత బరువు దాని బరువు కన్న తక్కువ లేదా దాని కన్న ఎక్కువ బరువు నీ ప్రభువు జ్ఞానము నుండి గోప్యంగా ఉండదు.కాని అది స్పష్టమైన గ్రంధములో నమోదై ఉంటుంది.అది ఏ చిన్న దాన్ని వదలదు పెద్ద దాన్ని వదలదు.కాని దాన్ని లెక్కవేసి ఉంటుంది.

(62) వినండి నిశ్ఛయంగా అల్లాహ్ కు ప్రియులైన వారికి వారు ఎదుర్కొనే ప్రళయదిన భయానకపరిస్థితుల నుండి ఎటువంటి భయము ఉండదు. మరియు ఇహలోక భాగములు వారు కోల్పోయిన దానిపై వారికి దుఃఖము ఉండదు.

(63) ఈ ప్రియతములందరు వారే ఎవరైతే అల్లాహ్ పై,ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై విశ్వాస గుణము కలవారో వారు ఆయన ఆదేశాలను పాఠిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ అల్లాహ్ భీతి కలిగినవారు.

(64) సత్యకలలతో లేదా ప్రజల ప్రశంసలతో వారి కొరకు ఇహలోకములో వారి ప్రభువు తరపు నుండి వారిని నంతోషపెట్టే సువార్త ఉన్నది,మరియు దైవదూతల తరపు నుండి వారి కొరకు వారి ఆత్మలను సేకరించేటప్పుడు, మరణం తరువాత,హష్ర్ లో సువార్త ఉంటుంది.అల్లాహ్ వారికి చేసిన వాగ్దానములో ఎటువంటి మార్పు ఉండదు.ఈ ప్రతిఫలము కోరిన వాటిని పొందటం,భయపడుతున్న వాటి నుండి విముక్తి పొందటం లాంటివి ఇందులో ఉండటం వలన అది గొప్ప సాఫల్యము.

(65) ఓ ప్రవక్తా వీరందరు మీ ధర్మ విషయంలో ధూషణలు,అపవాదులు పలకటం వలన మీరు దుఃఖించకండి.నిశ్ఛయంగా ఆధిపత్యము,ఆధిక్యత అంతా అల్లాహ్ కొరకే.ఏదిను ఆయనని అశక్తిని చేయదు.ఆయనే వారి మాటలను బాగా వినేవాడు,వారి చేతలను బాగా తెలుసుకునేవాడు.మరియు తొందరలోనే వాటిపరంగా వారికి ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.

(66) వినండి నిశ్ఛయంగా అకాశముల్లో ఉన్న వారి యొక్క అదికారము,భూమిలో ఉన్న వారి యొక్క అధికారము ఒక్కడైన అల్లాహ్ కొరకే. అల్లాహ్ ను వదిలి ఇతరులను ఆరాధించి సాటి కల్పించే వారు దేనిని అనుసరిస్తున్నారు ?.వాస్తవానికి వారు భ్రమను అనుసరిస్తున్నారు.వారు కేవలం తమ బహుదైవాల నిష్పత్తిలో అల్లాహ్ వైపున అబద్దం పలుకుతున్నారు.వారి మాటల నుండి అల్లాహ్ ఎంతో మహోన్నతుడు.

(67) ఓ ప్రజలారా ఒక్కడైన ఆయనే మీ కొరకు రాత్రిని అందులో చలనం నుండి,అలసట నుండి మీరు విశ్రాంతి పొందటానికి చేశాడు.మరియు ఆయన పగలును మీరు మీ జీవనోపాది విషయంలో మీకు ప్రయోజనం చేసే వాటిలో మీరు శ్రమించడానికి ప్రకాశవంతంగా చేశాడు.నిశ్ఛయంగా వీటిలో గుణపాఠమును నేర్చుకోవటానికి,స్వీకరించటానికి వినే జనుల కొరకు స్పష్టమైన ఆధారాలు ఉన్నవి.

(68) ముష్రికుల్లోంచి ఒక వర్గము అల్లాహ్ దైవదూతలను కుమార్తెలుగా చేసుకున్నాడు అన్నారు. అల్లాహ్ వారి మాటల నుండి అతీతుడు.ఆయనే పరిశుద్ధుడు తన సృష్టితాలన్నింటి నుండి అక్కరలు లేనివాడు (స్వయం సమృద్ధుడు). ఆకశముల్లో ఉన్నవాటి యొక్క రాజ్యాధికారము,భూమిలో ఉన్నవాటి యొక్క రాజ్యాధికారము ఆయన కొరకే. ఓ ముష్రికులారా మీ ఈ మాటకు మీ వద్ద ఎటువంటి ఆధారం లేదు. ఏమీ మీరు అల్లాహ్ కు సంతానమును అంటగట్టి అల్లాహ్ పై పెద్ద మాటను పలుకుతున్నారా ?.ఎటువంటి ఆధారం లేకుండా దాని వాస్తవికత మీరు తెలుసుకోలేరు.

(69) ఓ ప్రవక్తా వారితో ఇలా పలకండి : నిశ్ఛయంగా ఎవరైతే కొడుకు నిష్పత్తి అల్లాహ్ వైపున చేసి ఆయనపై అబద్దమును అంటగడుతారో వారు తాము కోరుకున్నదాని ద్వారా సాఫల్యం చెందరు మరియు తాము భయపడుతున్న దాని నుండి విముక్తి పొందరు.

(70) వారు అనుభవిస్తున్న ఇహలోక సుఖాలు,దివ్యానందాల వలన వారు మోసపోకుడదు.ఎందుకంటే అది అస్థిరమైన కొద్దిపాటి సామగ్రి మాత్రమే.ఆ తరువాత ప్రళయదినాన వారి మరలటం మా వైపునే.ఆతరువాత మేము అల్లాహ్ పట్ల వారి అవిశ్వాసం,ఆయన ప్రవక్తను వారి తిరస్కరించటం వలన వారికి కఠినమైన శిక్ష రుచి చూపిస్తాము.

(71) ఓ ప్రవక్తా తిరస్కారులైన ఈ అవిశ్వాసపరులందరికి నూహ్ అలైహిస్సలాం తన జాతి వారితో ఇలా అన్నప్పటి గాధను వినిపించండి : ఓ నా జాతివారా ఒకవేళ నేను మీ మధ్యలో ఉండటం మీకు బాధ కలిగిస్తే,అల్లాహ్ ఆయతుల ద్వారా నేను బోధించటం,నా హితబోధన మీకు కష్టంగా ఉంటే,వాస్తవానికి మీరు నన్ను తుదిముట్టించటానికి పూనుకున్నారు.అయితే మీరు రచిస్తున్నవ్యూహాలను వృధా చేయటంలో నేను ఒక్కడైన అల్లాహ్ పై నమ్మకమును కలిగి ఉన్నాను.మీ కార్యమును మీరు నిర్ణయించుకోండి.మరియు నన్ను తుదిముట్టించటానికి మీరు గట్టిగా పూనుకోండి.అందులో సహాయం కోసం మీ ఆరాధ్య దైవాలను పిలుచుకోండి.ఆ పిదప మీ వ్యూహం అపారదర్శక రహస్యంగా ఉండకూడదు.మరియు మీరు నన్ను చంపడానికి ప్రణాళిక చేసిన తరువాత,మీరు కుట్ర చేసిన దాని వైపునకు ముందడుగు వేయండి.మరియు మీరు నన్ను ఒక్క క్షణం కూడా వ్యవధి ఇవ్వకండి.

(72) ఒకవేళ మీరు నా ఆహ్వానము నుండి విముఖత చూపితే నేను నా ప్రభువు సందేశమును మీకు చేరవేయటం పై ఎటువంటి ప్రతిఫలాన్నిమీతో ఆశించలేదని మీకు తెలుసు.నా ప్రతిఫలం అల్లాహ్ వద్ద మాత్రమే ఉన్నది. మీరు నన్ను విశ్వసించినా లేదా నన్ను తిరస్కరించినా.మరియు అల్లాహ్ నేను విధేయత,సత్కర్మల ద్వారా ఆయనకు విధేయులుగా ఉండేవారిలో అయిపోమని నన్ను ఆదేశించాడు.

(73) అయితే అతని జాతి వారు అతనిని తిరస్కరించారు.అతన్ని అంగీకరించలేదు.అప్పుడు మేము అతన్ని,అతనితోపాటు ఉన్న విశ్వాసపరులను ఓడలో రక్షించాము.మరియు మేము వారిని వారి పూర్వికులకు వారసులుగా చేశాము.మరియు మేము ఎవరైతే ఆయన తీసుకుని వచ్చిన ఆయతులను,వాదనలను తిరస్కరించారో వారిని తుఫాను ద్వారా తుదిముట్టించాము.అయితే ఓ ప్రవక్తా నూహ్ అలైహిస్సలాం హెచ్చరించిన జాతివారి విషయ ముగింపు ఏ విదంగా జరిగిందో మీరు చూడండి.వారు విశ్వసించలేదు.

(74) నూహ్ అలైహిస్సలాం తరువాత చాలా కాలం తరువాత ప్రవక్తలను వారి జాతులవారి వద్దకు పంపించినాము.అయితే ప్రవక్తలు తమ జాతులవారి వద్దకు ఆయతులను,ఋజువులను తీసుకుని వచ్చారు.ప్రవక్తల తిరస్కారము పై వారి పూర్వ మొండితనము కారణంగా వారికి విశ్వసించే ఉద్దేశము లేదు.అయితే అల్లాహ్ వారి హృదయములపై ముద్ర వేశాడు.పూర్వ ప్రవక్తలను అనుసరించే వారి హృదయాలపై మేము వేసినటువంటి ఈ ముద్రనే ప్రతీ కాలములో,ప్రతీ ప్రదేశములో అవిశ్వాసము ద్వారా అల్లాహ్ హద్దులను అతిక్రమించే అవిశ్వాసపరుల హృదయములపై ముద్ర వేస్తాము.

(75) ఆ పిదప ఈ ప్రవక్తలందరి తరువాత చాలా కాలం తరువాత మేము మిసర్ రాజైన ఫిర్ఔన్,అతని జాతి పెద్ద నాయకుల వద్దకు మూసాను,అతని సోధరుడైన హారూన్ ను పంపించినాము.వారిద్దరి నిజాయితీని దృవీకరించే ఆయతులను ఇచ్చి మేము వారిద్దరిని పంపించాము.వారిద్దరు తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసించటం నుండి వారందరు దురఅహంకారమును చూపారు.అల్లాహ్ పట్ల వారి తిరస్కారము,ఆయన ప్రవక్తల పట్ల వారి తిరస్కారం వలన వారందరు అపరాదులైపోయారు.

(76) అయితే ఎప్పుడైతే ఫిర్ఔన్ మరియు ఆయన జాతి పెద్దల వద్దకు మూసా,హారూన్ అలైహిమస్సలాం తీసుకుని వచ్చిన ధర్మము వచ్చినదో మూసా తీసుకుని వచ్చినది సత్యమని నిర్ధారించే ఆయన ఆయతుల గురించి వారు ఇలా పలకసాగారు : నిశ్ఛయంగా అది స్పష్టమైన మంత్రజాలము మరియు అది సత్యం కాదు.

(77) మూసా వారిని ఖండిస్తూ ఇలా పలికారు : ఏమీ మీరు మీ వద్దకు వచ్చిన సత్యమును మంత్రజాలము అంటున్నారా ?!.వాస్తవానికి కాదు,అది మంత్రజాలము కాదు.మరియు నిశ్ఛయంగా మాంత్రికుడు ఎన్నటికీ సాఫల్యం చెందడని నాకు తెలుసు అటువంటప్పుడు నేను దాన్ని ఉపయోగించటం ఎలా ?!.

(78) ఫిర్ఔన్ జాతివారు మూసా అలైహిస్సలాంతో ఇలా పలుకుతూ సమాధానమిచ్చారు : ఏమీ మా తాతముత్తాతలను ఏ ధర్మముపైనైతే మేము పొందామో దాని నుండి మమ్మల్ని నీవు మరల్చటానికి,నీ కొరకు,నీ సోధరుని కొరకు రాజ్యం అయిపోవాలని నీవు ఈ మంత్రజాలమును మా వద్దకు తీసుకుని వచ్చావా ?.ఓ మూసా మరియు హారూన్ మీరిద్దరు మా వద్దకు పంపించబడిన ప్రవక్తలని మేము అంగీకరించము.

(79) మరియు ఫిర్ఔన్ తన జాతివారితో ఇలా ఆదేశించాడు : మీరు మంత్రజాలమును తెలిసి,దానిలో నేర్పరి అయిన ప్రతీ మాంత్రికుడిని నా వద్దకు తీసుకుని రండి.

(80) వారు ఫిర్ఔన్ వద్దకు మాంత్రికులను తీసుకుని వచ్చినప్పుడు మూసా అలైహిస్సలాం వారిపై తన గెలుపు నమ్మకముతో వారితో ఓ మాంత్రికులారా మీరు విసరదలచుకున్న వాటిని విసరండి అని పలికారు.

(81) ఎప్పుడైతే వారు తమ వద్ద ఉన్నమంత్రజాలమును విసిరారో మూసా వారితో ఇలా పలికారు : మీరు ప్రదర్శించినది అది మంత్రజాలము.నిశ్ఛయంగా అల్లాహ్ మీరు తయారు చేసిన దాన్ని ఎటువంటి ప్రభావము లేకుండా భంగపరుస్తాడు.నిశ్ఛయంగా మీరు మీ మంత్రజాలము ద్వారా భూమిలో ఉపద్రవం సృష్టిస్తున్నారు.మరియు అల్లాహ్ ఉపద్రవాలను సృష్టించే వాడి కార్యమును చక్కదిద్దడు.

(82) మరియు అల్లాహ్ సత్యాన్ని నిరూపిస్తాడు.మరియు దానికి ఆయన తన విధిరాత మాటల ద్వారా,తన ధర్మపరమైన మాటల్లో ఉన్న వాదనలు,ఋజువుల ద్వారా నిరూపిస్తాడు.ఒకవేళ ఫిర్ఔన్ సంతతిలో నుండి ఆ అపరాదులైన అవిశ్వాసపరులు అయిష్టత చూపినా సరే.

(83) జాతివారు విముఖత చూపటంపై కృతనిశ్ఛయం చేసుకున్నారు.అయితే మూసా అలైహిస్సలాం బహిరంగ సూచనలు,స్పష్టమైన వాదనలు తీసుకుని వచ్చినా కూడా ఒకవేళ తమ విషయం బహిర్గతం అయతే ఫిర్ఔన్,అతని జాతి పెద్దలు వారిని శిక్షించి వారి విశ్వాసము నుండి మరలింపజేస్తారని భయపడుతూ ఆయన జాతి వారి అయిన బనీ యిస్రాయీల్ లోంచి కొందరు యువకులు తప్ప విశ్వసించలేదు.నిశ్ఛయంగా ఫిర్ఔన్ అహంకారి,ఈజిప్టు పై,దాని వాసులపై ఆధిపత్యమును చూపేవాడు.మరియు నిశ్ఛయంగా అతడు అవిశ్వాసములో,బనీయిస్రాయీలును హతమార్చటంలో శిక్షించటంలో హద్దును అతిక్రమించేవారిలోంచి ఉన్నాడు.

(84) మరియు మూసా అలైహిస్సలాం తన జాతివారిని ఉద్దేశించి ఇలా పలికారు : ఓ నా జాతి వారా ఒకవేళ మీరు అల్లాహ్ పై సత్య విశ్వాసమును కలిగి ఉంటే,ఒక వేళ ముస్లిములైతే ఒక్కడైన అల్లాహ్ పై నమ్మకమును కలిగి ఉండండి.అల్లాహ్ పై నమ్మకము మీ నుండి చెడును దూరం చేస్తుంది.మరియు మీ కొరకు మేలును తీసుకుని వస్తుంది.

(85) అయితే వారు మూసా అలైహిస్సలాంకు ఇలా పలుకుతూ జవాబు ఇచ్చారు : ఒక్కడైన అల్లాహ్ పై మేము నమ్మకమును కలిగి ఉన్నాము.ఓ మా ప్రభువా శిక్షించటం ద్వారా,హత్య చేయటం ద్వారా,రెచ్చగొట్టటం ద్వారా మమ్మల్ని మా ధర్మ విషయంలో వేదించటానికి మాపై దుర్మార్గులకు ఆధిక్యతను ప్రసాధించకు.

(86) ఓ మాప్రభువా నీ కారుణ్యము ద్వారా అవిశ్వాసపరులైన ఫిర్ఔన్ చెర నుండి మమ్మల్ని విముక్తి కలిగించు.వారు మమ్మల్ని బానిసలుగా చేసుకున్నారు.మరియు వారు శిక్షించటం ద్వారా,హతమార్చటం ద్వారా మమ్మల్ని బాధ కలిగించారు.

(87) మరియు మేము మూసా,ఆయన సోధరుడు హారూన్ అలైహిమస్సలాం వైపునకు మీరిద్దరూ ఒక్కడైన అల్లాహ్ ఆరాధన కొరకు మీ జాతివారి కొరకు గృహములను ఎంచుకొని నిర్మించుకోండి అని దివ్యజ్ఞానమును పంపాము. మరియు మీరు మీ గృహములను ఖిబ్లాకి (బైతుల్ మఖ్దిస్) అబిముఖంగా చేసుకోండి. మరియు మీరు నమాజులను సంపూర్ణంగా నిర్వర్తించండి. ఓ మూసా విశ్వాసపరులకు వారిని సంతోషము కలిగించే అల్లాహ్ సహాయము,వారికి మద్దతు,వారి శతృవులను తుదిముట్టించటం,వారిని భూమిలో ప్రతినిదులుగా చేయటం లాంటి గురింంచి సమాచారమివ్వండి.

(88) మరియు మూసా అలైహిస్సలాం ఇలా విన్నపించుకున్నారు : ఓ మా ప్రభువా నిశ్ఛయంగా నీవు ఫిర్ఔనును,అతని జాతి పెద్దలను ప్రాపంచిక అలంకారమును,దాని వైభవము సొంపును ప్రసాధించావు.మరియు నీవు వారికి ఇహలోకములో చాలా సంపదలను ప్రసాధించావు.వారు నీవు ప్రసాధించిన వాటిపై నిన్ను కృతజ్ఞతలు తెలుపలేదు కానీ వారు వాటి ద్వారా నీ మార్గము నుండి తప్పించటానికి సహాయము తీసుకున్నారు.ఓ మా ప్రభువా వారి సంపదలను తుడిచివేయి,వాటిని పూర్తిగా నాశనంచేయి.మరియు వారి హృదయాలను కఠినంగా చేయి.వారు బాధాకరమైన శిక్షను చూస్తేనే తప్ప విశ్వసించరు.అప్పుడు వారి విశ్వాసము వారికి ప్రయోజనం చేకూర్చదు.

(89) అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : ఓ మూసా,హారూన్ ఫిర్ఔన్,అతని జాతి పెధ్దల విషయంలో నేను మీ ఉభయుల శాపము ను స్వీకరించాను.అయితే మీరిద్దరు మీ ధర్మము పై స్థిరంగా ఉండండి.మరియు మీరిద్దరు దాని నుండి సత్యమార్గము తెలియని అజ్ఞానుల మార్గమును అనుసరించటం వైపునకు మరలకండి.

(90) మరియు మేము ఇస్రాయీలు సంతతి వారి కొరకు సముద్రమును చీల్చిన తరువాత సముద్రమును దాటటం సులభతరం చేశాము.చివరికి వారు సురక్షితముగా దాన్ని దాటారు.ఫిర్ఔన్,అతని సైన్యాలు వారిని దుర్మార్గముతో,శతృత్వముతో వెంటాడారు. చివరికి సముద్రము అతన్ని కప్పివేసింది. మరియు అతను మునిగిపోయాడు.మరియు అతడు విముక్తత నుండి ఆశ కోల్పోయాడు. ఇస్రాయీలు సంతతివారు విశ్వసించిన వాస్తవ ఆరాధ్యదైవమును నేను విశ్వసించాను మరియు నేను అల్లాహ్ కొరకు విధేయత చూపే వారిలోంచి అయిపోయాను అని అన్నాడు.

(91) జీవితము నుండి నిరాశుడైన తరువాత ఇప్పుడు నీవు విశ్వసిస్తావా .ఓ పిర్ఔన్ నిశ్ఛయంగా నీవు శిక్ష రాక ముందే ఆయనను తిరస్కరించి,ఆయన మార్గము నుండి ఆపి అల్లాహ్ కు అవిధేయత చూపావు.నీవు స్వయంగా మార్గభ్రష్టుడివై,ఇతరులను మార్గభ్రష్టులు చేసి చెడును వ్యాపింపజేసే వారిలో చేరిపోయావు.

(92) అయితే ఓ ఫిర్ఔన్ ఈ రోజు మేము నిన్ను సముద్రము నుండి వెలికి తీస్తాము మరియు నీ తరువాత వచ్చేవారు నీ ద్వారా గుణపాఠం నేర్చుకోవటానికి మేము నిన్ను భూ ఉపరితలంపై ఉండేటట్లుగా చేస్తాము.మరియు నిశ్ఛయంగా చాలా మంది ప్రజలు మా సామర్ధ్యపు వాదనలు,ఋజువుల నుండి నిర్లక్ష్యం వహిస్తున్నారు.వాటి విషయంలో యోచన చేయటం లేదు.

(93) మరియు నిశ్ఛయంగా మేము ఇస్రాయీలు సంతతి వారిని గౌరవప్రధమైన సిరియా దేశంలో ప్రశంసాత్మకమైన స్థలములో,సంతృప్తికరమైన నివాసములో దించాము.మరియు మేము వారికి స్వచ్ఛమైన,ధర్మసమ్మతమైన ఆహారోపాదిని కల్పించాము.ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గుణము గురించి వారు తౌరాతులో చదివిన దాన్ని దృవీకరించే ఖుర్ఆన్ వారి వద్దకు వచ్చెంత వరకు వారు తమ ధర్మ విషయంలో విభేదించుకోలేదు.ఎప్పుడైతే వారు దాన్ని తిరస్కరించారో వారి మాతృభూములు గింజుకోబడ్డాయి.ఓ ప్రవక్తా నిశ్ఛయంగా నీ ప్రభువు వారు విభేదించుకున్న వాటి విషయంలో ప్రళయదినాన వారి మధ్య తీర్పునిస్తాడు.అయితే ఆయన వారిలోంచి సత్యవంతుడికి,అసత్యవంతుడికి వారిద్దరిలోంచి ప్రతిఒక్కరికి వారి అర్హతకు తగిన విధంగా ప్రతిఫలాన్ని ప్రసాధిస్తాడు.

(94) ఓ ప్రవక్తా మేము మీ వైపు అవతరింపజేసిన ఖుర్ఆన్ వాస్తవికత విషయంలో మీకు సందేహము,సంశయము ఉంటే మీరు యూదుల్లోంచి తౌరాతును చదివే విశ్వాసపరులను,క్రైస్తవుల్లోంచి ఇంజీలను చదివే విశ్వాసపరులను అడగితే వారు తమ ఇద్దరి గ్రంధాల్లో దాని గుణమును పొందటం వలన మీపై అవతరించినది సత్యం అని మీకు సమాధానమిస్తారు.నిశ్ఛయంగా మీ ప్రభువు వద్ద నుండి ఎటువంటి సందేహము లేని సత్యము మీ వద్దకు వచ్చినది.అయితే మీరు సందేహము చూపే వారిలోంచి కాకండి.

(95) మరియు మీరు అల్లాహ్ వాదనలను,ఆయన ఋజువులను తిరస్కరించిన వారిలోంచి కాకండి.దానివలన మీరు తమ అవిశ్వాసం వలన తమ స్వయమును కావాలని వినాశనము కలిగే స్థానాల్లో చేర్చి స్వయానికి నష్టం కలిగించుకున్న వారిలోంచి అయిపోతారు.ఈ హెచ్చరిక అంతా సందేహము,తిరస్కారము యొక్క తివ్రతను స్పష్టపరచటానికి.కాకపోతే ప్రవక్త తన నుండి ఈ చర్య జరగటము నుండి దోషరహితులు.

(96) నిశ్ఛయంగా ఎవరిపైనైతే అల్లాహ్ నిర్ణయం వారు అవిశ్వాసం పై తమ మొండి వైఖరి వలన అవిశ్వాసము పైనే మరణిస్తారని జరిగినదో వారు ఎన్నటికి విశ్వసించరు.

(97) మరియు ఒక వేళ వారి వద్దకు ధర్మం యొక్క,విశ్వము యొక్క సూచనలన్ని వచ్చి చివరికి వారు బాధాకరమైన శిక్షను చూసి అప్పుడు వారు విశ్వసిస్తే ఆ విశ్వాసము వారికి ప్రయోజనం కలిగించదు.

(98) మేము ఏ పల్లె వాసుల వద్దకు ప్రవక్తలను పంపించామో అందులో నుంచి ఏ ఒక పల్లె వాసులు కూడా శిక్షను కళ్ళారా చూడక ముందే షుమారు చేయబడే విశ్వాసమును కనబరచటం జరగలేదు.దాని విశ్వాసం దాన్ని (శిక్షను) కళ్ళారా చూడక ముందు అవటం వలన దానికి ప్రయోజనం చేకూర్చేది.కాని యూనుస్ జాతి వారు సత్య విశ్వాసమును కనబరచి నప్పుడు మేము వారి నుండి అవమానమునకు గురిచేసే శిక్షను ఇహలోకంలో తొలగించాము.వారి సమయం పూర్తయ్యే వరకు (వారి ఆయుష్షు పూర్తయ్యే వరకు) వారికి మేము ప్రయోజనం చేకూర్చాము.

(99) ఓ ప్రవక్తా ఒకవేళ నీ ప్రభువు భూమిలో ఉన్నవారందరి విశ్వాసమును కోరుకుంటే వారందరూ విశ్వసించే వారు.కాని ఆయన తన వివేకము వలన అలా కోరుకోలేదు.అతడు తన న్యాయముతో తాను కోరుకున్న వారిని మార్గభ్రష్టులు చేస్తాడు.మరియు అతడు తన అనుగ్రహము ద్వారా తాను కోరుకున్న వారికి సన్మార్గము చూపుతాడు.అయితే ప్రజలను వారు విశ్వాసపరులు అయిపోవటం పై మీరు బలవంతం చేయలేరు.విశ్వాసము కొరకు వారి అనుగ్రహము ఒక్కడైన అల్లాహ్ చేతిలో మాత్రమే ఉన్నది.

(100) అల్లాహ్ అనుమతి లేకుండా ఏ వ్యక్తి తన తరపు నుండి విశ్వసించడం అసంభవం.ఆయన ఇచ్ఛతో మాత్రమే విశ్వాసం వాటిల్లుతుంది.వారిపై శోకముతో మీ ప్రాణము పోకూడదు.మరియు అల్లాహ్ వారిపై ఎవరైతే ఆయన నుండి ఆయన వాదనలను,ఆయన ఆదేశాలను,ఆయన వారింపులను అర్ధం చేసుకోరో శిక్షను,పరాభవమును కలిగిస్తాడు.

(101) ఓ ప్రవక్తా మీతో సూచనలను అడిగే ముష్రికులతో ఇలా పలకండి : మీరు భూమ్యాకాశముల్లో అల్లాహ్ ఏకత్వమును,ఆయన సామర్ధ్యమును ఋజువు చేసే సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిలో యోచన చేయండి.మరియు సూచనలు,వాదనలు,ప్రవక్తల అవతరణ విశ్వాసములో తమ మొండితనము వలన విశ్వసించటానికి నైపుణ్యత లేని జాతి వారి విషయంలో ప్రయోజనం కలిగించదు.

(102) ఈ తిరస్కారులందరూ పూర్వ తిరస్కార జాతుల వారిపై అల్లాహ్ కలిగించిన సంఘటనల్లాంటి సంఘటనల కోసం నిరీక్షిస్తున్నారా ?.ఓ ప్రవక్తా వారితో ఇలా పలకండి : మీరు అల్లాహ్ శిక్ష కోసం నిరీక్షించండి.నిశ్ఛయంగా నేను మీతో పాటు నా ప్రభువు వాగ్దానము కొరకు నిరీక్షించేవారిలోంచి ఉన్నాను.

(103) ఆ తరువాత మేము వారిపై శిక్షను అవతరింపజేస్తాము.మరియు మా ప్రవక్తలను మేము రక్షిస్తాము.మరియు వారితోపాటు విశ్వసించిన వారిని రక్షిస్తాము.అయితే వారి జాతి వారికి సంభవించినది వారికి సంభవించదు.ఈ ప్రవక్తలందరిని,వారితోపాటు విశ్వాసపరులను రక్షించినట్లు అల్లాహ్ ప్రవక్తను,ఆయనతోపాటు విశ్వాసపరులను ఖచ్చితంగా రక్షించటం మనపై తప్పనిసరి.

(104) ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ ప్రజలారా ఒక వేళ నేను మిమ్మల్ని పిలుస్తున్న నా ధర్మ విషయంలో మీకు ఏదైనా సందేహం ఉన్నా వాస్తవానికి అది ఏకదైవోపాసన ధర్మం, మీ ధర్మం అవినీతిమయం అని ఖచ్చితంగా నాకు తెలుసు.అయితే నేను దాన్ని అనుసరించను.మీరు అల్లాహ్ ను వదిలి వేటినైతే ఆరాధిస్తున్నారో వాటిని నేను ఆరాధించను.కాని నేను మీకు మరణాన్ని ప్రసాదించే అల్లాహ్ ను ఆరాధిస్తున్నాను.మరియు ఆయన నేను ధర్మమును ఆయన కొరకు ప్రత్యేకించుకునే విశ్వాసపరుల్లోంచి అయిపోవాలని నన్ను ఆదేశించాడు.

(105) మరియు అలాగే నన్ను సత్య ధర్మముపై స్థిరముగా ఉండమని,ధర్మములన్నింటిని వదిలి దాని వైపునకు మరలి దానిపై స్థిరంగా ఉండమని ఆయన ఆదేశించాడు.ఆయనతోపాటు సాటి కల్పించే వారిలో అవటం నుండి నన్ను వారించాడు.

(106) ఓ ప్రవక్తా మీరు అల్లాహ్ ను వదిలి మీకు లాభం చేయటానికి ఎటువంటి లాభమునకు,మీకు నష్టం కలిగించటానికి ఎటవంటి నష్టమునకు అధికారములేని విగ్రహాలను,శిల్పాలను,ఇతరులను వేడుకోకండి.ఒక వేళ మీరు వాటిని ఆరాధిస్తే నిశ్చయంగా అప్పుడు మీరు అల్లాహ్ హక్కును,తమ స్వయం హక్కును అతిక్రమించిన దుర్మార్గుల్లోంచి అయిపోతారు.

(107) ఓ ప్రవక్తా ఒక వేళ అల్లాహ్ మీకు ఏదైన ఆపదకు గురిచేస్తే,మరియు మీరు దాన్ని మీ నుండి తొలగించటమును కోరితే దాన్ని పరిశుద్ధుడైన అల్లాహ్ తప్ప ఇంకెవరూ తొలగించలేరు.ఒక వేళ ఆయన ఏదైన మేలును కలిగిస్తే ఆయన అనుగ్రహమును ఆపేవాడు ఎవడూ లేడు.ఆయన తన అనుగ్రహమును తన దాసుల్లోంచి ఎవరిని తలచుకుంటే వారిని అనుగ్రహిస్తాడు.దాన్ని ఇష్టపడని వాడు ఉండడు.ఆయన తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడేవారిని మన్నించేవాడు,వారిపై కనికరించేవాడు.

(108) ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ ప్రజలారా నిశ్చయంగా మీ ప్రభువు వద్ద నుండి ఖుర్ఆన్ అవతరింపబడి మీ వద్దకు వచ్చినది.అయితే ఎవరైన సన్మార్గం పొంది మరియు దానిపై విశ్వాసమును కనబరిస్తే దాని ప్రయోజనం అతని వైపునకే మరలుతుంది.ఎందుకంటే అల్లాహ్ తన దాసుల విధేయత అవసరం లేనివాడు.మరియు ఎవరైనా అపమార్గం పొందితే అతని అపమార్గ ప్రభావము అతని ఒక్కడిపైనే ఉంటుంది.అయితే అల్లాహ్ కి తన దాసుల అవిధేయత నష్టం కలిగించదు.మరియు నేను మీ కర్మలను రక్షించే పరిరక్షకుడినీ కాను,వాటి పరంగా మీ లెక్క తీసుకునే వాడునూ కాను.

(109) ఓ ప్రవక్త మీ ప్రభువు మీ వైపు అవతరింపజేసిన దాన్ని మీరు అనుసరించండి మరియు దాన్ని ఆచరించండి.మరియు మీజాతి వారిలోంచి మిమ్మల్ని వ్యతిరేకించిన వారి బాధించటంపై,చేరవేయమని మీకు ఆదేశించబడిన సందేశాలను చేరవేయటంపై మీరు సహనం చూపండి.మరియు అల్లాహ్ ఇహలోకములో వారిపై మీకు విజయం కలిగించే,ఒక వేళ వారు తమ అవిశ్వాసంపై మరణిస్తే పరలోకములో వారిని శిక్షించటం ద్వారా వారి విషయంలో తన తీర్పునిచ్చేంత వరకు దానిపైనే (సహనం పైనే) కొనసాగండి.