(1) అందరిపై వచ్చి తీరేదైన మరణాంతరం లేపబడే ఘడియను అల్లాహ్ ప్రస్తావిస్తున్నాడు.
(2) ఆ పిదప ఈ ప్రశ్న ద్వారా దాని విషయ గొప్పతనం తెలపబడింది : అనివార్యమయ్యే ఈ సంఝటన ఏమిటి ?.
(3) ఈ అనివార్య సంఘటన ఏమిటో మీకు ఏమి తెలుసు ?.
(4) తన భయానక పరిస్థితులతో ప్రజలను తట్టేటటువంటి ప్రళయమును సాలిహ్ జాతి సమూద్ మరియు హూద్ జాతి ఆద్ తిరస్కరించినది.
(5) ఇక సమూద్ జాతి, వారిని అల్లాహ్ అత్యంత తీవ్రమైన,భయంకరమైన గర్జనతో నాశనం చేశాడు.
(6) ఇక ఆద్ జాతి, వారిని అల్లాహ్ అత్యంత క్రూరమైన తీవ్రమైన చలిగాలి ద్వారా నాశనం చేశాడు.
(7) అల్లాహ్ దాన్ని వారిపై ఏడు రాత్రులు,ఎనిమిది దినముల కాలం వరకు పంపించాడు అది వారిని కూకటి వేళ్ళతో సహా నాశనం చేయసాగింది. నీవు జాతి వారిని వారి ఇళ్ళల్లో నాశనమై భూమిపై పడి ఉండగా చూస్తావు. వారి వినాశనం తరువాత వారు నేలపై పడి ఉన్న బోసిపోయిన ఖర్జూరపు బోదెలవలే ఉన్నారు.
(8) అయితే వారికి శిక్ష కలిగిన తరువాత వారిలోని ఏ ప్రాణమును మిగిలి ఉండగా నీవు చూస్తున్నావా ?!
(9) మరియు ఫిర్ఔన్,అతని కన్నా మునుపటి సమాజాల వారు మరియు తలక్రిందులు చేయబడి శిక్షింపబడిన బస్తీల వారైన లూత్ జాతి వారు షిర్కు మరియు అవిధేయ కార్యాల్లాంటి పాప కార్యములకు పాల్పడ్డారు.
(10) వారిలో నుండి ప్రతి ఒక్కరు తమ వద్దకు పంపించబడ్డ తమ ప్రవక్తకు అవిధేయత చూపి అతన్ని తిరస్కరించారు. అప్పుడు అల్లాహ్ వారి వినాశనం పరిపూర్ణమయ్యే కఠినమైన పట్టుతో పట్టుకున్నాడు.
(11) ఎప్పుడైతే నీరు ఎత్తులో తన పరిమితికి మించి దాటిపోయినదో నిశ్చయంగా మేము మీరు ఎవరి వెన్నులలో ఉన్నారో వారిని మా ఆదేశముతో నూహ్ అలైహిస్సలాం తయారు చేసిన నడిచే ఓడలో ఎక్కించాము. అప్పుడు మిమ్మల్ని ఎక్కించటం అయినది.
(12) మేము ఓడను మరియు దాని గాధను ఒక హితబోధనగా చేయటానికి దాని ద్వారా అవిశ్వాసపరుల వినాశనముపై మరియు విశ్వాసపరుల ముక్తిపై ఆధారమివ్వటానికి. మరియు గుర్తుంచుకునే చెవులు దేన్నైతే విన్నాయో దాన్ని గుర్తుంచుకుంటాయి.
(13) బాకా ఊదే బాధ్యత ఇవ్వబడిన దూత బాకాలో (కొమ్ములో) ఒకే ఒక ఊదటం ఊదినప్పుడు. అది రెండవ బాకా.
(14) మరియు భూమి,పర్వతాలు ఎత్తబడుతాయి ఆ తరువాత అవి రెండు ఒకే సారి తీవ్రంగా దంచబడుతాయి. అప్పుడు భూమి భాగాలు మరియు దాని పర్వత భాగాలు విడిపోతాయి.
(15) అదంతా జరిగే రోజు ప్రళయం వాటిల్లుతుంది.
(16) ఆ రోజు ఆకాశం దాని నుండి దైవ దూతలు దిగటం కొరకు బ్రద్దలైపోతుంది. అది ఆ రోజు ఆకాశము దృఢంగా పట్టు కలిగి ఉండి కూడా బలహీనంగా ఉంటుంది.
(17) మరియు దైవ దూతలు దాని అంచులపై ఉంటారు. మరియు ఆ రోజు నీ ప్రభువు యొక్క సింహాసనమును ఎనిమిది సన్నిహిత దూతలు మోస్తుంటారు.
(18) ఆ రోజున ఓ ప్రజలారా మీరు అల్లాహ్ ముందు హాజరు చేయబడుతారు. అల్లాహ్ పై మీ నుండి ఏ గోప్య విషయం గోప్యంగా ఉండదు అది ఏదైనా కూడా. అంతేకాదు అల్లాహ్ వాటి గురించి తెలుసుకునేవాడును,వాటిని ఎరుగువాడును.
(19) ఇక ఎవరికైతే అతని కర్మల పుస్తకము అతని కుడి చేతిలో ఇవ్వబడుతుందో అతను అప్పుడు సంతోషముతో,ఆనందముతో ఇలా పలుకుతాడు : నా కర్మల పుస్తకమును మీరు పుచ్చుకుని చదవండి.
(20) నేను మరల లేపబడుతానని మరియు నా ప్రతిఫలమును నేను పొందుతానని నిశ్ఛయంగా నాకు ఇహలోకంలోనే తెలుసు మరియు నేను నమ్మేవాడిని.
(21) అతడు శాశ్వతమైన అనుగ్రహాలను చూడటం వలన అతడు సంతృప్తికరమైన జీవితంలో ఉంటాడు.
(22) ఉన్నతమైన స్థానము కల స్వర్గములో.
(23) దాని ఫలాలు వాటిని తినేవారికి దగ్గరగా ఉంటాయి.
(24) వారితో మర్యాదపురంగా ఇలా పలకబడును : మీరు తినండి మరియు త్రాగండి మీరు ఇహలోకంలో గడిచిన దినములలో చేసుకున్న సత్కర్మల వలన అందులో ఎటువంటి బాధ ఉండదు.
(25) మరియు ఇక ఎవరి కర్మల పత్రం అతని ఎడమ చేతిలో ఇవ్వబడుతుందో అతడు తీవ్రమైన అవమానముతో ఇలా పలుకుతాడు : అయ్యో నా పాడుగాను నాకు శిక్షను అనివార్యం చేసే దుష్కర్మలు ఉన్న నా కర్మల పత్రం నాకు ఇవ్వకపోతే ఎంత బాగుండేది.
(26) అయ్యో నా పాడుగాను నా లెక్క ఏమౌతుందో నాకు తెలియకుండా ఉంటే ఎంత బాగుండేది.
(27) బహుశా నేను మరణించిన మరణం దాని తరువాత ఎన్నటికి నేను మరల లేపబడకుండా ఉండే మరణం అయి ఉంటే ఎంత బాగుండేది.
(28) నా సంపద అల్లాహ్ యొక్క శిక్షను నా నుండి ఏమాత్రం తొలగించలేకపోయింది.
(29) నా వాదన మరియు నేను నమ్మకం ఉంచుకున్న బలము మరియు శక్తి నా నుండి అదృశ్యమైపోయాయి.
(30) మరియు ఇలా పలకబడుతుంది : ఓ దైవదూతలారా అతన్ని పట్టుకోండి మరియు అతని చేతులను అతని మెడకేసి కట్టిపడేయండి.
(31) ఆ తరువాత అతడిని నరకములో దాని వేడిని అనుభవించటానికి ప్రవేశింపజేయండి.
(32) ఆ తరువాత అతడిని డబ్బై మూరల పొడవైన గొలుసులో ప్రవేశింపజేయండి.
(33) నిశ్ఛయంగా అతడు మహోన్నతుడైన అల్లాహ్ ను విశ్వసించేవాడు కాదు.
(34) మరియు పేదవారిని అన్నం తినిపించటంపై ఇతరులను ప్రోత్సహించేవాడు కాదు.
(35) ప్రళయ దినమున అతని నుండి శిక్షను తొలగించే దగ్గర బంధువు ఎవడూ అతని కొరకు ఉండరు.
(36) నరక వాసుల శరీరాల నుండి కారే (చీము) రసం తప్ప అతను తినటానికి ఆహారముగా ఏమీ ఉండదు.
(37) ఆ ఆహారమును పాపాత్ములు మరియు అవిధేయులు మాత్రమే తింటారు.
(38) అల్లాహ్ మీరు చూసే వాటి గురించి ప్రమాణం చేశాడు.
(39) మరియు ఆయన మీరు చూడని వాటి గురించి ప్రమాణం చేశాడు.
(40) నిశ్ఛయంగా ఖుర్ఆన్ అల్లాహ్ వాక్కు దాన్ని గౌరవనీయుడైన ఆయన ప్రవక్త ప్రజలకు చదివి వినిపిస్తాడు.
(41) మరియు అది ఏ కవి యొక్క వాక్కు కాదు ఎందుకంటే అది కవిత్వ పద్ధతిలో లేదు. మీరు చాలా తక్కువ విశ్వసిస్తున్నారు.
(42) మరియు అది ఏ జ్యోతిష్యుని వాక్కు కాదు. జ్యోతిష్యుల వాక్కు ఈ ఖుర్ఆన్ కు భిన్నంగా ఉండే విషయము. మీరు చాలా తక్కువ హితోపదేశం గ్రహిస్తున్నారు.
(43) మరియు కాని అది సృష్టిరాసులందరి ప్రభువు వద్ద నుండి అవతరించబడినది.
(44) మరియు ఒక వేళ ముహమ్మద్ మేము పలకని ఏవైన అబద్దపు మాటలను మాపై కల్పించుకుని ఉంటే.
(45) మేము అతనిపై ప్రతీకారం తీర్చుకుంటాము. మరియు మేము అతడిని మా బలముతో మరియు సామర్ధ్యముతో పట్టుకుంటాము.
(46) ఆ పిదప మేము హృదయముతో కలిసి ఉన్న అతని నరమును కోసివేస్తాము.
(47) అయితే మీలో నుండి ఎవరు దాని నుండి మమ్మల్ని ఆపేవాడు ఉండడు. అతడు మాపై కల్పించుకోవటం మీ వలన చాలా దూర విషయం.
(48) మరియు నిశ్చయంగా ఖుర్ఆన్ తమ ప్రభువు ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండి తమ ప్రభువు భీతి కలిగిన వారి కొరకు ఒక హితోపదేశము.
(49) మరియు నిశ్చయంగా మీలో నుండి ఈ ఖుర్ఆన్ ను తిరస్కరించేవాడు ఎవడో మాకు తెలుసు.
(50) మరియు నిశ్చయంగా ఖుర్ఆన్ పట్ల తిరస్కారము ప్రళయదినమున పెద్ద అవమానమునకు కారణమగును.
(51) మరియు నిశ్ఛయంగా ఖుర్ఆన్ అల్లాహ్ వద్ద నుండి అవటంలో ఎటువంటి సందేహము గాని ఎటువంటి సంశయం గాని లేని నమ్మదగిన సత్యము.
(52) ఓ ప్రవక్తా మీరు మీ ప్రభువుకు తగని వాటి నుండి ఆయన పరిశుద్ధతను కొనియాడండి మరియు మహోన్నతుడైన నీ ప్రభువు నామము యొక్క స్మరణను చేయండి.