(1) ఈ ముష్రికులందరు తమ వైపు అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను పంపించిన తరువాత ఏ నిషయం గురించి పరస్పరం ప్రశ్నించుకుంటున్నారు ?!
(2) వారు గొప్ప వార్తను గురించి ఒకరినొకరు అడుగుతున్నారు. మరియు అది మరణాంతరం లేపబడటం వార్తకు సంబంధించి వారి ప్రవక్త పై అవతరింపబడిన ఈ ఖుర్ఆను
(3) ఈ ఖుర్ఆన్ అదే దేని గురించైతే వారు మంత్రజాలమవటం లేదా కవిత్వమవటం లేదా జ్యోతిష్యమవటం లేదా పూర్వికుల కట్టు కధలవటం గురించి వారు తెలుపుతున్న విషయంలో విబేధించుకున్నారు.
(4) వారు భావించినట్లు విషయం కాదు. ఖుర్ఆన్ ను తిరస్కరించే వీరందరు తమ తిరస్కారము యొక్క దుష్పరిణామమును తొందరలోనే తెలుసుకుంటారు.
(5) ఆ పిదప వారికి దాని గురించి తాకీదు చేయబడింది.
(6) ఏమీ మేము భూమిని వారు దానిపై స్థిరంగా ఉండటానికి పాన్పుగా చేయలేదా ?!
(7) మరియు మేము పర్వతాలను దానిపై అది ప్రకంపించకుండా ఉండటానికి మేకుల స్థానంలో ఉంచాము.
(8) మరియు మేము ఓ ప్రజలారా మిమ్మల్ని రకరకాలుగా సృష్టించాము : మీలో పురుషులు మరియు స్త్రీలు ఉన్నారు.
(9) మరియు మీరు విశ్రాంతి తీసుకోవటానికి మేము మీ నిద్రను కర్యకలాపముల నుండి విరామంగా చేశాము.
(10) మరియు మీరు మీ మర్మావయవాలను కప్పుకునే దుస్తుల మాదిరిగా రాత్రిని తన చీకటి ద్వారా మీకు ఆచ్ఛాదనగా చేశాము.
(11) మరియు మేము పగలును సంపాదన కోసం మరియు జీవనోపాది శోధన కోసం మైదానముగా చేశాము.
(12) మరియు మేము మీపై దృఢ నిర్మితమైన మరియు పటిష్ట నిర్మితమైన సప్తాకాశములను నిర్మించాము.
(13) మరియు మేము సూర్యుడిని తీవ్రంగా వెలిగే మరియు ప్రకాశించే దీపముగా చేశాము.
(14) మరియు మేము కురవటానికి వేళ అయిన మేఘముల నుండి ఎక్కువగా ఉప్పొంగే నీటిని కురిపించాము.
(15) దాని ద్వారా మేము రకరకాల ఆహార ధాన్యాలను మరియు రకరకాల మొక్కలను వెలికితీయటానికి.
(16) మరియు మేము దాని ద్వారా కొమ్మలు అధికంగా ఒక దానిలో ఒకటి చొచ్చబడిన చెట్ల వలన చుట్టబడిన తోటలను వెలికితీశాము.
(17) నిశ్చయంగా సృష్టి రాశుల మధ్య తీర్పుదినము ఒక వేళతో నిర్ధారితమై నిర్ణీతమై ఉంది. దానికి విరుద్ధంగా జరగదు.
(18) దైవ దూత బాకాలో రెండవ సారి ఊదిన రోజు ఓ ప్రజలారా మీరు సమూహాలు సమూహాలుగా వస్తారు.
(19) మరియు ఆకాశము తెరవబడుతుంది అప్పుడు దాని కొరకు తెరవబడిన తలుపుల వలే ద్వారములు అయిపోతాయి.
(20) మరియు పర్వతాలు నడిపించబడుతాయి చివరికి అవి వ్యాపించబడ్డ దూళిగా మారిపోతాయి. అప్పుడు అవి ఎండమావుల వలె అయిపోతాయి.
(21) నిశ్ఛయంగా నరకము మాటువేసి వేచి ఉంది.
(22) దుర్మార్గుల కొరకు అది ఒక మరలే చోటు. వారు దాని వైపునకు మరలి వెళతారు.
(23) వారు అందులో అంతం లేని యుగాలు కాలాల వరకు ఉంటారు.
(24) వారు అందులో తమ నుండి నరకాగ్ని వేడిని చల్లబరిచే ఎటువంటి చల్ల గాలి రుచి చూడరు. మరియు వారు అందులో ఆస్వాదించటానికి ఎటువంటి పాణియంను చవిచూడరు.
(25) మరియు వారు తీవ్రమైన వేడి నీటిని మరియు నరక వాసుల నుండి ప్రవహించే చీముని మాత్రమే చవిచూస్తారు.
(26) వారు ఉన్న అవిశ్వాసము మరియు అపమార్గమునకు తగిన విధంగా ప్రతిఫలం.
(27) నిశ్చయంగా వారు ఇహలోకంలో అల్లాహ్ వారిని పరలోకంలో లెక్క తీసుకోవటం నుండి భయపడేవారు కాదు. ఎందుకంటే వారు మరణాంతరం లేపబడటమును విశ్వసించేవారు కాదు. ఒక వేళ వారు మరణాంతరం లేపబడటం నుండి భయపడి ఉంటే అల్లాహ్ ను విశ్వసించి సత్కర్మలు చేసి ఉండేవారు.
(28) మరియు వారు మన ప్రవక్త పై అవతరింపబడిన మా ఆయతులను తిరస్కరించేవారు.
(29) మరియు వారి కర్మల్లోంచి ప్రతీ దాన్ని మేము నమోదుచేసి ఉంచాము మరియు లెక్కవేసి ఉంచాము. మరియు అది వారి కర్మల పత్రాలలో వ్రాయబడి ఉంది.
(30) ఓ మితిమీరే వారా మీరు ఈ శాశ్వత శిక్షను రుచి చూడండి. మేము మీ శిక్షపై శిక్షను మాత్రమే మీపై అధికం చేస్తాము.
(31) నిశ్చయంగా తమ ప్రభువు ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయనతో భయపడే వారి కొరకు సాఫల్య స్థలం కలదు వారు అందులో తాము ఆశించిన దానితో సాఫల్యం చెందుతారు. అది స్వర్గము.
(32) ఉధ్యానవనాలు మరియు ద్రాక్ష ఫలాలు కలవు.
(33) పొంగే పరువాలు కల సమవయస్కులైన స్త్రీలు ఉంటారు.
(34) మద్యముతో నిండిన పాత్ర.
(35) వారు స్వర్గంలో అసత్య మాటలు వినరు మరియు వారు అబద్దమును వినరు. మరియు వారు ఒకరితో ఒకరు అబద్దము మాట్లాడుకోరు.
(36) ఇదంతా అల్లాహ్ తన వద్ద నుండి వారికి ప్రసాదించిన తగినంత అనుగ్రహము మరియు ప్రసాదము.
(37) ఆకాశముల మరియు భూమి ప్రభువు మరియు వాటి మధ్య ఉన్న వాటి ప్రభువు. ఇహలోక,పరలోక కరుణామయుడు. భూమిలో గాని అకాశములో గాని ఉన్న వాటన్నింటికి ఆయన వారికి అనుమతిస్తే తప్ప ఆయనతో మాట్లాడలేరు.
(38) ఏ రోజునైతే జిబ్రయీలు మరియు దైవదూతలు పంక్తుల్లో నిలబడుతారో కరుణామయుడు అనుమతిస్తే తప్ప ఎవరి కొరకు సిఫారసు గురించి వారు మాట్లాడరు. మరియు వారు తౌహీద్ వాక్కు లాంటి సరైన మాటనే మాట్లాడుతారు.
(39) మీకు వర్ణించబడినది అది ఆ రోజు దాని వాటిల్లటంలో ఎటువంటి సందేహం లేదు. అందులో ఎవరైతే అల్లాహ్ శిక్ష నుండి ముక్తి పొందదలచాడో అతడు తన ప్రభువు ఇష్టపడే సత్కర్మలతో దాని వైపునకు మార్గమును తయారు చేసుకోవాలి.
(40) ఓ ప్రజలారా నిశ్చయంగా మేము దగ్గరలోనే కలిగే శిక్ష నుండి మిమ్మల్ని భయపెట్టాము. ఆ రోజు మనిషి ఇహలోకంలో ముందస్తు పంపించుకున్న తన కర్మను చూసుకుంటాడు. మరియు అవిశ్వాసి శిక్ష నుండి ముక్తిని ఆశిస్తూ ఇలా పలుకుతాడు : అయ్యో ఆ పశువుల మాదిరిగా వేటినైతే ప్రళయదినమున మీరు మట్టి అయిపోండి అని పలకబడినదో నేను కూడా మట్టినైపోతే బాగుండును.