(1) ఓ ప్రవక్తా తన భర్త విషయంలో (అతడు ఔస్ ఇబ్నే సామిత్) ఆమెతో ఆయన జిహార్ చేసినప్పుడు మీతో తిరోగమిస్తున్న స్త్రీ (ఆమె ఖౌలా బిన్తే సామిత్) మాటను అల్లాహ్ విన్నాడు. ఆమే అల్లాహ్ ముందు తన భర్త తన పట్ల వ్యవహరించిన దాని గురించి ఫిర్యాదు చేస్తున్నది. మరియు అల్లాహ్ మీరు పదే పదే మాట్లాడుకుంటున్న మాటలను వింటున్నాడు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా లేదు. నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసుల మాటలను వినేవాడును మరియు వారి కర్మలను చూసేవాడును. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
(2) ఎవరైతే తమ భార్యలతో జిహార్ చేస్తారో వారిలో నుండి ఎవరైన తమ భార్యతో "నీవు నా వద్ద నా తల్లి వీపు లాంటి దానివి" అని పలికి (జిహార్ చేస్తారో) వారు తమ ఈ మాటలో అబద్దము పలికారు. ఎందుకంటే వారి భార్యలు వారి తల్లులు కారు. నిశ్ఛయంగా వారిని జన్మనిచ్చిన వారు వారి తల్లులు. మరియు వారు మాత్రం ఈ మాటను పలికినప్పుడు అత్యంత నీచమైన మాటను,అబద్దమును పలికినారు. మరియు నిశ్ఛయంగా అల్లాహ్ మన్నించేవాడును,క్షమించేవాడును. నిశ్ఛయంగా ఆయన వారికి పాపము నుండి ముక్తిగా పాప పరిహారమును వారి కొరకు ధర్మబద్దం చేశాడు.
(3) మరియు ఎవరైతే ఈ నీచమైన మాటను పలుకుతారో ఆ తరువాత తాము జిహార్ చేసిన స్త్రీలతో సంబోగము చేయదలచుకుంటే వారు వారితో సంబోగము చేయక ముందే ఒక బానిసను విముక్తి కలిగించటం ద్వారా పరిహారం చెల్లించాలి. ఈ ప్రస్తావించబడిన ఆదేశము మిమ్మల్ని జిహార్ నుండి మందలించటానికి మీకు ఆదేశించబడినది. మరియు అల్లాహ్ మీరు చేస్తున్న కర్మల గురించి బాగా తెలిసిన వాడు. మీ కర్మల్లోంచి ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు.
(4) ఎవరైతే మీలో నుండి బానిసను విముక్తి చేయటానికి పొందని వారిపై తాము జిహార్ చేసిన తమ భార్యతో సంబోగం చేయక ముందు క్రమం తప్పకుండా రెండు నెలల ఉపవాసముండాలి. ఎవరికైతే దాని శక్తి లేదో వారు అరవై మంది నిరుపేదలకు భోజనం ఏర్పాటు చేయాలి. మేము నిర్దేశించిన ఈ ఆదేశము అల్లాహ్ దాన్ని ఆదేశించాడని మీరు విశ్వసించి ఆయన ఆదేశమును మీరు పాటించాలని. మేము మీ కొరకు ధర్మ బద్ధం చేసిన ఈ ఆదేశములు అల్లాహ్ తన దాసుల కొరకు చేసిన హద్దులు. కాబట్టి మీరు వాటిని అతిక్రమించకండి. అల్లాహ్ ఆదేశములను మరియు ఆయన నిర్ణయించిన హద్దులను తిరస్కరించే వారి కొరకు బాధాకరమైన శిక్ష కలదు.
(5) నిశ్ఛయంగా అల్లాహ్ తో, ఆయన ప్రవక్తతో శతృత్వము చేసేవారు ఆయనతో శతృత్వము చేసి కించపరచబడిన పూర్వ సమాజములవలె అవమానింపబడుతారు మరియు కించపరచబడుతారు. మరియు నిశ్ఛయంగా మేము స్పష్టమైన ఆయతులను అవతరింపజేశాము. మరియు అల్లాహ్ ను,ఆయన ప్రవక్తను,ఆయన ఆయతులను తిరస్కరించేవారి కొరకు అవమానముకు గురి చేసే శిక్ష కలదు.
(6) ఆరోజు అల్లాహ్ వారందరిని మరల లేపుతాడు. వారిలో నుండి ఎవరిని వదిలిపెట్టడు. అప్పుడు ఆయన వారు ఇహలోకంలో చేసుకున్న దుష్కర్మల గురించి వారికి తెలియపరుస్తాడు. అల్లాహ్ వారికి వ్యతిరేకంగా వాటిని షుమారు చేసి ఉంచాడు. వారి కర్మల్లోంచి ఏదీ ఆయన నుండి తప్పిపోదు. మరియు వారు వాటిని మరచిపోయారు, ఏ చిన్న దాన్ని గాని పెద్ద దాన్ని గాని వదలకుండా షుమారు చేసిన తమ కర్మల పుస్తకముల్లో వ్రాసి ఉండగా వారు వాటిని పొందుతారు. మరియు అల్లాహ్ ప్రతీ వస్తువును తెలుసుకునే వాడు వారి కర్మల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
(7) ఓ ప్రవక్తా ఏమీ ఆకాశముల్లో ఉన్నది మరియు భూమిలో ఉన్నది అల్లాహ్ కు తెలుసు అని మీరు గమనించలేదా ?! వాటిలో ఉన్నది ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. రహస్యంగా ముగ్గురి మాటలు జరిగితే పరిశుద్ధుడైన ఆయన తన జ్ఞానముతో వారిలో నాలుగో వాడవుతాడు. మరియు రహస్యంగా ఐదుగురి మాటలు జరిగితే పరిశుద్ధుడైన ఆయన తన జ్ఞానముతో వారిలో ఆరవ వాడవుతాడు. ఆ లెక్క కన్నా తక్కువ అయినా లేదా దాని కన్నా ఎక్కువ అయిన వారు ఎక్కడ ఉన్నా ఆయన తన జ్ఞానముతో వారితో పాటు ఉంటాడు. వారి మాటల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. ఆ తరువాత అల్లాహ్ వారికి వారు చేసుకున్న కర్మల గురించి ప్రళయదినమున తెలియపరుస్తాడు. నిశ్ఛయంగా అల్లాహ్ కు ప్రతీ వస్తువు గురించి బాగా తెలుసు. ఆయన పై ఏదీ గోప్యంగా ఉండదు.
(8) ఓ ప్రవక్తా మీరు యూదులను చూడలేదా వారు ఏ విశ్వాసపరుడినైనా చూసినప్పుడు రహస్య మంతనాలు చేసేవారు. అల్లాహ్ వారిని రహస్య మంతనాలు చేయటం నుండి వారించాడు. అయినా కూడా వారు అల్లాహ్ వారించిన వాటి వైపునకు మరలుతున్నారు. మరియు వారు విశ్వాసపరుల చాడీలు చెప్పుకోవటం లాంటి పాపములు కల వాటి గురించి మరియు వారికి వ్యతిరేకముగా ద్వేషము కల వాటి గురించి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అవిధేయత కల వాటి గురించి పరస్పరం రహస్య మంతనాలు జరిపేవారు. ఓ ప్రవక్తా వారు మీ వద్దకు వచ్చినప్పుడు వారు అల్లాహ్ మీకు సలాం చేయని వాటి ద్వారా మీకు సలాం చేసేవారు. వారు మరణమును ఉద్దేశించుకుని "అస్సాము అలైక" నీవు నాశనం అయిపో అని పలకటం వారి పలుకులు ఇవి. మరియు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను తిరస్కరిస్తూ ఇలా పలికే వారు : ఎందుకని అల్లాహ్ మేము పలికిన మాటలపై శిక్షించడు. ఒక వేళ ఆయన ప్రవక్త అన్న తన వాదనలో సత్య వంతుడే అయితే ఆయన విషయంలో మేము పలికిన వాటి గురించి అల్లాహ్ మమ్మల్ని శిక్షించి ఉండేవాడు. వారు పలికిన మాటలకు శిక్షగా వారికి నరకం చాలును. వారు దాని వేడిని అనుభవిస్తారు. వారి పరిణామము చెడ్డదైన పరిణామము.
(9) ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన తమ కొరకు ధర్మ బద్దం చేసిన వాటిని ఆచరించేవారా మీరు పాపము ఉన్న వాటి గురించి లేదా ద్వేషము ఉన్న వాటి గురించి లేదా ప్రవక్తకి అవిధేయత గురించి మీరు యూదులవలే కాకుండా ఉండటానికి రహస్య మంతనాలు చేయకండి. మరియు మీరు అల్లాహ్ కి విధేయత కల మరియు ఆయన అవిధేయత నుండి ఆపే వాటి గురించి రహస్య మంతనాలు చేయండి. మరియు మీరు అల్లాహ్ కి ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండటంతో భయపడండి. ప్రళయదినమున లెక్క తీసుకోబడటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు ఆయన ఒక్కడి వైపే మీరు సమీకరించబడుతారు.
(10) నిశ్ఛయంగా పాపముతో,ధ్వేషముతో మరియు ప్రవక్తకి అవిధేయతతో కూడుకున్న రహస్య మంతనాలు షైతాను అలంకరణ మరియు తన స్నేహితులకు అతను పురిగొల్పటం వలన. విశ్వాసపరులకు వారు వారి కొరకు కుట్ర పన్నుతున్నారని బాధ కలగటానికి. మరియు షైతాను, అతని అలంకరణ విశ్వాసపరులకు ఏమీ నష్టం కలిగించలేవు కాని అల్లాహ్ చిత్తము మరియు అయన ఇచ్ఛతో. మరియు విశ్వాసపరులు తమ పూర్తి వ్యవహారాల్లో అల్లాహ్ పైనే నమ్మకమును కలిగి ఉండాలి.
(11) ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన తమ కొరకు ధర్మ బద్దం చేసిన వాటిని ఆచరించేవారా మిమ్మల్ని కూర్చున్న ప్రదేశముల్లో విశాలమై కూర్చోమని పలకబడినప్పుడు మీరు విశాలమై కూర్చోండి అల్లాహ్ మీ ఇహలోక జీవితంలో మరియు పరలోకంలో మీకు విశాలమును కలిగిస్తాడు. మరియు మిమ్మల్ని కొన్ని కూర్చునే ప్రదేశముల నుండి అక్కడ గొప్ప వారు కూర్చోవటానికి లెగమంటే మీరు అక్కడ నుండి లేవండి. పరిశుద్ధుడైన అల్లాహ్ మీలో నుండి విశ్వసించిన వారిని మరియు జ్ఞానము ప్రసాదించబడిన వారిని గొప్ప స్థానములకు పెంచుతాడు. మరియు మీరు చేసేవన్ని అల్లాహ్ తెలుసుకునేవాడు. మీ కర్మల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు ఆయన వాటి పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
(12) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లముతో రహస్య మంతనాలు చేసేవారు అనుచరులు చాలామంది కావటంతో అల్లాహ్ ఇలా పలికాడు : ఓ విశ్వాసపరులారా మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో రహస్యంగా మాట్లాడదలచుకుంటే మీ రహస్యంగా మాట్లాడటం కన్న ముందు ఏమైన దానం చేయండి. ముందస్తు దానం చేయటం హృదయములను పరిశుద్ధపరిచే అల్లాహ్ పై విధేయత అందులో ఉండటం వలన మీ కొరకు ఎంతో ఉత్తమమైనది మరియు ఎంతో పరిశుద్ధమైనది. మీరు దానం చేయవలసినది మీరు పొందకపోతే ఆయనతో రహస్యంగా మాట్లాడటంలో మీపై ఎటువంటి దోషం లేదు. ఎందుకంటే అల్లాహ్ తన దాసుల పాపములను మన్నించేవాడును,వారిపై కరుణించేవాడును. అందుకనే ఆయన వారిపై వారి శక్తికి మించి భారం వేయలేదు.
(13) ఏమీ మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో రహస్యంగా మాట్లాడినప్పుడు ముందస్తు దానం చేయటం వలన పేదరికం నుండి భయపడిపోయారా ?! అల్లాహ్ ఆదేశించిన వాటిని మీరు చేయలేకపోయినప్పుడు ఆయన మీపై దయ చూపాడు అందుకనే ఆయన వాటిని వదిలి వేయటానికి మీకు అనుమతిచ్చాడు. కాబట్టి మీరు నమాజును పరిపూర్ణ పద్ధతిలో పాటించండి మరియు మీ సంపదల జకాతును చెల్లించండి మరియు అల్లాహ్ కు,ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. మరియు మీరు చేసేది అల్లాహ్ కు బాగా తెలుసు. మీ కర్మల్లోంచి ఆయనపై ఏదీ గోప్యంగా లేదు. మరియు ఆయన వాటి పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
(14) ఓ ప్రవక్తా తమ అవిశ్వాసము వలన మరియు తమ పాప కార్యముల వలన అల్లాహ్ ఆగ్రహమునకు గురి అయిన యూదులతో స్నేహం చేసిన కపటులను మీరు గమనించ లేదా. ఈ కపటులందరు విశ్వాసపరుల్లోంచి కారు మరియు యూదులలోంచి కారు. కాని వారు వీరందరి వైపున కాకుండా మరియు వారందరి వైపున కాకుండా తటస్తము లేకుండా తిరుగుతున్నారు. మరియు తాము ముస్లిములని మరియు తాము ముస్లిముల సమాచారములను యూదులకు చేరవేయటం లేదని ప్రమాణాలు చేస్తున్నారు. వారు తమ ప్రమాణం చేయటంలో అసత్యము పలుకుతున్నారు.
(15) అల్లాహ్ వారి కొరకు పరలోకంలో కఠినమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాడు. అందుకనే ఆయన వారిని నరకములో అట్టడుగు స్థానంలో ప్రవేశింపజేస్తాడు. నిశ్ఛయంగా వారు తాము ఇహలోకంలో చేసుకున్న అవిశ్వాస కార్యములు చెడ్డవైనవి.
(16) వారు తాము చేసే ప్రమాణములను అవిశ్వాసము వలన హతమార్చబడటము నుండి డాలుగా చేసుకున్నారు. అందుకనే వారు తమ రక్తములను,తమ సంపదలను రక్షించుకోవటానికి వాటి ద్వారా ఇస్లామును వ్యక్తపరిచేవారు. వారు ప్రజలను సత్యము నుండి మళ్ళించి వేశారు అందులో ముస్లిములకు అవమానము మరియు నిరుత్సాహము ఉండటం వలన. కావున వారి కొరకు వారిని అవమానమును కలిగించే,వారిని నిరుత్సాహపరిచే శిక్ష కలదు.
(17) వారికి వారి సంపదలు గాని వారి సంతానము గాని అల్లాహ్ నుండి ఏమాత్రం ఉపయోగపడవు. వారందరు నరక వాసులు అందులో వారు శాశ్వతంగా ఉండటానికి ప్రవేశిస్తారు. వారి నుండి శిక్ష అంతమవదు.
(18) ఏ రోజైతే అల్లాహ్ వారందరిని మరల లేపుతాడో ప్రతిఫలం కొరకు వారిలో నుండి ఎవరిని వదలకుండా లేపుతాడు. అప్పుడు వారు అల్లాహ్ ముందు తాము అవిశ్వాసంపై,కపటత్వంపై లేమని ప్రమాణం చేస్తారు. తాము మాత్రం అల్లాహ్ కు ఇష్టమైన కార్యములు చేసే విశ్వాసపరులమనేవారు. ఓ విశ్వాసపరులారా వారు ఇహలోకములో తాము విశ్వాసపరులమని మీ ముందట ఎలా ప్రమాణం చేసేవారో పరలోకంలో ఆయన ముందు అలా ప్రమాణం చేస్తారు. వారు అల్లాహ్ ముందు తాము దేనిపైనైతే ప్రమాణము చేస్తున్నారో అది తమకు లాభమును తీసుకుని వచ్చేది లేదా తమ నుండి నష్టమును తొలగించేది అని భావిస్తున్నారు. వినండి వారు వాస్తవానికి తమ ప్రమాణముల్లో ఇహలోకములో మరియు తమ ప్రమాణముల్లో పరలోకములో అసత్యపరులు.
(19) షైతాను వారిని లొంగదీసుకుని తన దుష్ప్రేరణతో అల్లాహ్ స్మరణను వారికి మరిపింపజేశాడు. కావున వారు ఆయనకు ఇష్టమైన వాటిని చేయలేదు. ఆయనకు కోపము తెచ్చే వాటిని మాత్రం వారు చేశారు. ఈ గుణములతో వర్ణించబడిన వీరందరూ ఇబ్లీసు సైన్యము మరియు అతడి అనుచరులు. వినండీ నిశ్ఛయంగా ఇబ్లీసు సైన్యము మరియు అతని అనుచరులే ఇహలోకములో మరియు పరలోకములో నష్టమును చవిచూసేవారు. వారు అపమార్గమునకు బదులుగా సన్మార్గమును మరియు నరకమునకు బదులుగా స్వర్గమును అమ్మివేశారు.
(20) నిశ్ఛయంగా అల్లాహ్ తో విరోధంగా ఉన్నవారు మరియు ఆయన ప్రవక్త పట్ల విరోధంగా ఉన్న వారు వారందరిని అల్లాహ్ ఇహలోకములో అవమానమునకు గురిచేశాడు మరియు పరలోకములో వారిని ఆయన అవిశ్వాస సమాజములలో పరాభవమునకు గురిచేస్తాడు.
(21) అల్లాహ్ తన ముందస్తు జ్ఞానములో నేను మరియు నా ప్రవక్తలు ఆధారముతో,బలముతో మా శతృవులపై విజయం పొందుతాము అని నిర్ణయించాడు. నిశ్ఛయంగా అల్లాహ్ తన ప్రవక్తల సహాయము చేయటముపై బలవంతుడు,వారి శతృవుల పై ప్రతీకారము తీర్చుకోవటంలో పరాక్రమవంతుడు.
(22) ఓ ప్రవక్తా అల్లాహ్ తో మరియు ఆయన ప్రవక్తతో శతృత్వముతో వ్యవహరించే వారితో అల్లాహ్ ను విశ్వసించి,ప్రళయదినమును విశ్వసించే ఏ జాతి వారు ఇష్టపడటమును మరియు స్నేహం చేయటమును మీరు పొందరు. ఒక వేళ అల్లాహ్,ఆయన ప్రవక్త శతృవులైన వీరందరు వారి తండ్రులైన లేదా వారి కుమారులైన లేదా వారి సోదరులైన లేదా వారు సంబంధము కలిగిన వారి కుటుంబము వారైన సరే. ఎందుకంటే విశ్వాసము అల్లాహ్,ఆయన ప్రవక్త శతృవులతో స్నేహం చేయటం నుండి ఆపుతుంది. మరియు ఎందుకంటే విశ్వాసముతో సంబంధము అన్నింటితో సంబంధాల కన్నా ఎంతో గొప్పది. కాబట్టి అవి ఎదురైనప్పుడు అది ముందుంటుంది. వారందరు ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త శతృవులతో స్నేహం చేయరో - ఒక వేళ వారు దగ్గరి బందువులైనా - వారే అల్లాహ్ వారి హృదయముల్లో విశ్వాసమును స్థిరపరచాడు. కావున అది మారదు. మరియు ఆయన వారిని తన వద్ద నుండి ఋజువుతో మరియు వెలుగుతో బలబరచాడు. మరియు ఆయన వారిని ప్రళయదినమున శాశ్వతమైన స్వర్గ వనముల్లో ప్రవేశింపజేస్తాడు. వాటి భవనముల క్రింది నుండి మరియు వాటి వృక్షముల క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వారు వాటిలో శాశ్వతంగా నివాసముంటారు. వాటి అనుగ్రహాలు వారి నుండి అంతము కావు మరియు వారు దాని నుండి నశించిపోరు. అల్లాహ్ వారి నుండి ఎంత సంతుష్ట పడతాడంటే దాని తరువాత ఆయన ఎన్నడూ ఆగ్రహానికి లోను కాడు. మరియు ఆయన వారికి ప్రసాదించిన అంతము కాని అనుగ్రహాల వలన వారు ఆయనతో సంతుష్టపడుతారు. పరిశుద్ధుడైన ఆయనను దర్శించుకోవటం వాటిలో నుంచే. ప్రస్తావించబడిన వాటితో వర్ణించబడిన వారందరు అల్లాహ్ ఆదేశించిన వాటిని పాటించే మరియు ఆయన వారించిన వాటి నుండి ఆగిపోయే అల్లాహ్ సైన్యము. వినండి నిశ్చయంగా అల్లాహ్ సైన్యమే వారే తాము ఆశించిన వాటిని పొంది తాము భయపడే వాటి నుండి తొలగిపోయి ఇహపరాల్లో సాఫల్యం చెందుతారు.