(1) హా-మీమ్ సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.
(2) ఖుర్ఆన్ అవతరణ ఎవరూ ఓడించలేని సర్వ శక్తిమంతుడైన,తన సృష్టించటంలో,తన విధి వ్రాతలో,తన ధర్మ శాసనంలో వివేకవంతుడైన అల్లాహ్ వద్ద నుండి జరిగింది.
(3) ఆకాశములను,భూమిని మరియు ఆ రెండింటిలో ఉన్న వాటన్నింటిని మేము వృధాగా సృష్టించలేదు. అంతే కాదు మేము వాటన్నింటిని సత్యముతో సంపూర్ణ విజ్ఞతలతో సృష్టించాము. దాసులు వాటి ద్వారా ఆయనను (అల్లాహ్ ను) గుర్తించి ఆయన ఒక్కడి ఆరాధన చేయటం మరియు ఆయనతో పాటు దేనిని సాటి కల్పించకపోవటం వాటిలో నుండే. మరియు వారు అల్లాహ్ ఒక్కడికి తెలిసిన ఒక నిర్ణీత కాలం వరకు భూమిలో వారికి ప్రాతినిధ్యమును చేకూర్చేవాటిని వారు నెలకొల్పాలి. మరియు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచేవారు అల్లాహ్ గ్రంధములో వారికి హెచ్చరించబడిన వాటి నుండి విముఖత చూపుతున్నారు. వాటిని లెక్కచేయటం లేదు.
(4) ఓ ప్రవక్తా మీరు సత్యము నుండి విముఖత చూపే ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్న మీ విగ్రహాల గురించి నాకు తెలపండి వారు భూమి యొక్క భాగములలో నుండి ఏమి సృష్టించారు ?. వారు ఏదైన పర్వతమును సృష్టించారా ?. ఏదైన కాలువను సృష్టించారా ?. లేదా ఆకాశములను సృష్టించటంలో అల్లాహ్ తో పాటు వారికి ఏదైన భాగము,వాటా ఉన్నదా ?. ఖుర్ఆన్ కన్న ముందు అల్లాహ్ వద్ద నుండి అవతరింపబడిన ఏదైన గ్రంధమును లేదా మీ పూర్వికులు వదిలి వెళ్ళిన దానిలో నుండి మిగిలిన ఏదైన జ్ఞానమును నా వద్దకు తీసుకుని రండి ఒక వేళ మీ విగ్రహాలు ఆరాధనకు అర్హులని మీరు చేస్తున్న వాదనలో మీరు సత్యవంతులేనైతే.
(5) మరియు అల్లాహ్ ను వదిలి ప్రళయదినం వరకు తన దుఆని స్వీకరించని ఒక విగ్రహమును ఆరాధించే వాడి కన్న పెద్ద మార్గభ్రష్టుడెవడూ ఉండడు. మరియు వారు అల్లాహ్ ను వదిలి ఆరాధించే ఈ విగ్రహాలు తమను ఆరాధించే దాసుల దుఆ నుండి నిర్లక్ష్యంలో పడి ఉన్నారు. వారు వారికి ప్రయోజనం కలిగించటం లేదు నష్టం కలిగించటం దూర విషయం.
(6) మరియు వారు ఇహలోకములో వారికి ప్రయోజనం కలిగించకపోవటంతో పాటు వారు ప్రళయదినము నాడు సమీకరించబడినప్పుడు తమను ఆరాధించేవారికి శతృవులైపోతారు. మరియు వారికి తమకి సంబంధం లేదంటారు. మరియు వారు తమను ఆరాధించిన విషయం తెలవటం గురించి నిరాకరిస్తారు.
(7) మరియు మన ప్రవక్తపై అవతరించబడిన మా ఆయతులను వారి ముందట చదివి వినిపించబడినప్పుడు తమ ప్రవక్త చేత తమ వద్దకు వచ్చిన ఖుర్ఆన్ ను తిరస్కరించిన వారు ఇలా పలుకుతారు : ఇది స్పష్టమైన మంత్రజాలము. మరియు అల్లాహ్ వద్ద నుండి ఎటువంటి దైవవాణి కాదు.
(8) ఏమీ ఈ ముష్రికులందరు : నిశ్ఛయంగా ముహమ్మద్ ఈ ఖుర్ఆన్ ను కల్పించుకుని దాన్ని అల్లాహ్ కు అంటగట్టాడు అని పలుకుతున్నారా ?. ఓ ప్రవక్తా మీరు వారితో ఇలా పలకండి : ఒక వేళ నేను దాన్ని నా వద్ద నుండి కల్పించుకుని ఉండి అల్లాహ్ నన్ను శిక్షించదలచి ఉంటే మీకు నా విషయంలో ఎటువంటి ఉపాయం ఉండదు. అటువంటప్పుడు ఆయనపై అబద్దమును అపాదించి నేను ఎలా నా స్వయమును శిక్షకు సమర్పించుకుంటాను ?. మీరు అల్లాహ్ విషయంలో ఆయన ఖుర్ఆన్ విషయంలో దూషిస్తున్న వాటి గురించి మరియు నా విషయంలో అపనిందపాలు చేస్తున్నది అల్లాహ్ కు బాగా తెలుసు. నాకు,మీకు మధ్య సాక్ష్యంగా పరిశుద్ధుడైన ఆయన చాలు. మరియు ఆయన తన దాసుల్లోంచి పశ్ఛత్తాపముతో మరలే వారి పాపములను బాగా మన్నించేవాడును,వారిపై అపారంగా కరుణించేవాడును.
(9) ఓ ప్రవక్తా మీ దైవదౌత్యమును తిరస్కరించే ఈ ముష్రికులందరితో మీరు ఇలా పలకండి : నేను మీకు ఇచ్చిన నా పిలుపునకు మీరు ఆశ్ఛర్యపోవటానికి నేను అల్లాహ్ పంపించిన మొట్టమొదటి ప్రవక్తని కాదు. వాస్తవానికి నా కన్న మునుపు చాలా మంది ప్రవక్తలు గతించారు. నా పట్ల అల్లాహ్ ఏమి చేస్తాడో మరియు మీ పట్ల ఇహలోకంలో ఏమి చేస్తాడో నాకు తెలియదు. అల్లాహ్ నాకు దైవవాణి ద్వారా తెలియపరచిన దాన్ని మాత్రమే నేను అనుసరిస్తాను. నేను ఏదన్న పలికిన,ఏదన్న చేసిన ఆయన దైవ వాణి ప్రకారం మాత్రమే ఉంటుంది. మరియు నేను మాత్రం అల్లాహ్ శిక్ష నుండి మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించే వాడిని మాత్రమే.
(10) ఓ ప్రవక్తా ఈ తిరస్కారులందరితో ఇలా పలకండి : మీరు నాకు చెప్పండి ఒక వేళ ఈ ఖుర్ఆన్ అల్లాహ్ వద్ద నుండి అయ్యి వుండి,మీరు దాన్ని తిరస్కరించి ఉండి,బనీ ఇస్రాయీల్ నుండి ఒక సాక్ష్యం పలికే వాడు దాని విషయంలో తౌరాత్ లో వచ్చిన దాన్ని నమ్ముతూ అది అల్లాహ్ వద్ద నుండి వచ్చినదని సాక్ష్యం పలికి,దానిపై అతను విశ్వాసమును కనబరచి ఉండి మరియు మీరు దానిపై విశ్వాసమును కనబరచటం నుండి అహంకారమును చూపితే అప్పుడు మీరు దుర్మార్గులు కారా ?! నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గ ప్రజలకు సత్యము కొరకు సౌభాగ్యం కలిగించడు.
(11) మరియు ఖుర్ఆన్ ని,తమ వద్దకు తమ ప్రవక్త తీసుకుని వచ్చిన దాన్ని అవిశ్వసించిన వారు విశ్వాసపరులతో ఇలా పలుకుతారు : ఒక వేళ ముహమ్మద్ తీసుకుని వచ్చినది మంచి వైపునకు మార్గదర్శకం చేసే సత్యమే అయితే ఈ నిరుపేదలు,బానిసలు,బలహీనులు మా కన్న ముందు దానివైపునకు సాగరు. మరియు ఎందుకంటే వారు తమ వద్దకు తమ ప్రవక్తలు తీసుకుని వచ్చిన దానితో మార్గదర్శకం పొందలేదు. తొందరలోనే వారు ఇలా అంటారు : అతడు మా వద్దకు తీసుకుని వచ్చినది ఇది ప్రాచీన అబద్దము. మరియు మేము అబద్దమును అనుసరించము.
(12) ఈ ఖుర్ఆన్ కన్న మునుపు అల్లాహ్ మూసా అలైహిస్సలాంపై అవతరింపజేసిన గ్రంధం తౌరాత్ మార్గదర్శకంగా సత్యం విషయంలో అనుసరించటానికి మరియు బనీ ఇస్రాయీల్లోంచి దానిపై విశ్వాసమును కనబరచి దాన్ని అనుసరించిన వారి కొరకు కారుణ్యంగా ఉన్నది. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ అరబీ భాషలో దాని కన్న మునుపటి గ్రంధములను దృవీకరించే గ్రంధము. అల్లాహ్ కి సాటి కల్పించటం ద్వారా,పాపకార్యములకు పాల్పడటం ద్వారా తమ స్వయముపై దుర్మార్గమునకు పాల్పడిన వారికి దాని ద్వారా హెచ్చరించటానికి. మరియు ఇది తమ సంబంధమును తమ సృష్టికర్తతో మరియు తమ సంబంధమును ఆయన సృష్టితో మెరుగుపరచిన సజ్జనులకు ఒక శుభవార్త.
(13) నిశ్ఛయంగా ఎవరైతే మనకు అల్లాహ్ తప్ప ఇంకెవరూ ప్రభువు లేడూ అని పలికి ఆ తరువాత విశ్వాసముపై మరియు సత్కర్మపై స్థిరంగా ఉంటారో వారిపై పరలోకంలో వారు ఎదుర్కొనే వాటి విషయంలో ఎటువంటి భయం ఉండదు. మరియు ఇహలోక భాగముల నుండి వారు కోల్పోయిన వాటిపై మరియు తమ వెనుక వారు వదిలి వచ్చిన వాటి పై వారు దుఃఖించరు.
(14) ఈ గుణాలతో వర్ణించబడిన వారు స్వర్గవాసులు. వారు అందులో శాశ్వతంగా ఉంటారు. వారు ఇహలోకములో ముందు పంపించుకున్న తమ సత్కర్మలపై వారికి ప్రతిఫలంగా.
(15) మరియు మేము మానవునికి తన తల్లిదండ్రుల పట్ల వారికి వారి జీవితంలో మరియు వారి మరణం తరువాత ధర్మమునకు వ్యతిరేకం కాని మంచి చేసి ఉత్తమంగా మెలగమని గట్టి ఆదేశమును ఇచ్చాము. ముఖ్యంగా తన తల్లిని ఎవరైతే తనను గర్భంలో కష్టంగా భరించిందో మరియు తనను కష్టంగా జన్మనిచ్చిందో. మరియు తను గర్భంలో నిలదొక్కుకుని తన పాలు విడిపించే సమయం మొదలయ్యే వరకు కాలము ముప్పై నెలలు అవుతుంది. చివరికి అతను బౌద్ధిక మరయు శారీరక తన రెండు బలములను పరిపూర్ణం చేసుకునటమునకు చేరుకున్నప్పుడు మరియు నలభై సంవత్సరములను పూర్తి చేసుకున్నప్పుడు ఇలా పలుకుతాడు : ఓ నా ప్రభువా నీవు నాపై, నా తల్లిదండ్రులపై అనుగ్రహించిన నీ అనుగ్రహాలపై నేను కృతజ్ఞతను తెలుపుకోవటానికి నాకు స్పూర్తినివ్వు మరియు నేను నీవు సంతుష్టపడి నా నుండి స్వీకరించే సత్కర్మను చేసే నాకు స్పూర్తినివ్వు. మరియు నీవు నా సంతానమును నా కొరకు తీర్చి దిద్దు. నిశ్చయంగా నేను నా పాపముల నుండి పశ్ఛాత్తాప్పడుతూ నీ వైపునకు మరలాను. మరియు నిశ్చయంగా నేను నీ విధేయతకు కట్టుబడి ఉన్నాను,నీ ఆదేశములకు విధేయుడను.
(16) ఇలాంటి వారి నుండి వారు చేసుకున్న సత్కర్మలను మేము స్వీకరిస్తాము. మరియు మేము వారి పాపములను మన్నించి వేస్తాము. వారిని వాటి వలన పట్టుకోము. వారందరు స్వర్గ వాసుల్లో ఉంటారు. వారితో చేయబడిన ఈ వాగ్దానము సత్య వాగ్దానము. అది తొందరలోనే ఖచ్చితంగా నెరవేరుతుంది.
(17) మరియు ఎవడైతే తన తల్లిదండ్రులతో ఇలా పలికాడో : మీకు వినాశనం కలుగు గాక. ఏమీ నేను మరణించిన తరువాత జీవింపజేయబడి నా సమాధి నుండి నేను వెలికి తీయబడుతానని మీరు నన్ను బెదిరిస్తున్నారా ?! వాస్తవానికి చాలా తరాలు గతించిపోయాయి. మరియు వాటిలో జనం చనిపోయారు కాని వారిలో నుండి ఎవరూ జీవింపజేయబడి మరల లేపబడలేదు. మరియు అతని తల్లిదండ్రులు అల్లాహ్ తో తమ కుమారునకు విశ్వాసము కొరకు మార్గదర్శకత్వం చేయమని సహాయమును కోరేవారు. మరియు వారిద్దరు తమ కుమారునితో ఇలా పలికేవారు : ఒక వేళ నీవు మరణాంతరం లేపబడటమును విశ్వసించకపోతే నీకు వినాశనం కలుగును కాబట్టి నీవు దాన్ని విశ్వసించు. నిశ్చయంగా మరణాంతరం లేపబడటం గురించి అల్లాహ్ వాగ్దానము ఎటువంటి సందేహం లేని సత్యము. మరణాంతరం లేపబడటము పట్ల తన తిరస్కారమును నవీనపరుస్తూ అతడు ఇలా పలుకుతాడు : మరణాంతరం లేపబడటం గురించి పలుకబడుతున్న ఈ మాటలు మాత్రం పూర్వికుల పుస్తకముల నుండి మరియు వారు వ్రాసిన వాటి నుండి అనుకరించబడినవి. అవి అల్లాహ్ నుండి నిరూపించబడలేదు.
(18) వీరందరు వారే ఎవరిపైనైతే శిక్ష అనివార్యమైనదో వీరికన్న మునుపటి జిన్నుల,మానవుల తరాల వారు. నిశ్చయంగా వారు తమను నరకంలో ప్రవేశింపజేసుకుని తమ స్వయమునకు మరియు తమ ఇంటివారికి నష్టమును కలిగించుకోవటం వలన నష్టపోయేవారు.
(19) ఆ రెండు వర్గముల కొరకు - స్వర్గపు వర్గము మరియు నరకపు వర్గము - వారి కర్మలను బట్టి స్థానాలు ఉంటాయి. అయితే స్వర్గ వాసుల స్థానాలు ఉన్నత స్థానాలు. మరియు నరక వాసుల స్థానాలు అదమమైన శ్రేణులు. వారికి అల్లాహ్ వారి కర్మల ప్రతిఫలమును సంపూర్ణంగా ఇవ్వటానికి. మరియు వారికి ప్రళయదినమున వారి పుణ్యములు తగ్గించి, వారి పాపములు అధికం చేసి అన్యాయం చేయబడదు.
(20) మరియు ఆ రోజు అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరచి మరియు ఆయన ప్రవక్తలను తిరస్కరించిన వారిని నరకాగ్ని వద్దకు అందులో వారిని శిక్షంచటం కొరకు ప్రవేశపెట్టటం జరుగుతుంది. మరియు వారిని మందలిస్తూ మరియు దూషిస్తూ ఇలా పలకబడుతుంది : మీరు మీ ఇహలోక జీవితంలోనే మీ మంచి వస్తువులను పోగొట్టుకున్నారు. మరియు మీరు అందులో ఉన్న సుఖభోగాలను అనుభవించేశారు. ఇక పోతే ఈ రోజున, మీరు భూమిలో అన్యాయంగా చూపించిన మీ అహంకారము వలన మరియు అవిశ్వాసం,పాపకార్యములతో మీరు అల్లాహ్ విధేయత నుండి వైదొలగిపోవటం వలన మిమ్మల్ని అవమానమమునకు గురి చేసే,మిమ్మల్ని పరాభవమునకు గురి చేసే శిక్ష మీకు ఇవ్వబడుతుంది.
(21) ఓ ప్రవక్తా మీరు బంధములో ఆద్ సోదరుడైన హూద్ అలైహిస్సలాం తన జాతివారిని వారిపై వాటిల్లే శిక్ష గురించి హెచ్చరించినప్పటి వైనమును జ్ఞప్తికి తెచ్చుకోండి. మరియు వారు అరేబియా ద్వీపకల్పం యొక్క దక్షిణప్రాంతంలో తమ ఇళ్లల్లో ఉన్నారు. వాస్తవానికి హూద్ కన్న ముందు మరియు ఆయన తరువాత ప్రవక్తలు తమ జాతి వారిని హెచ్చరిస్తూ వారితో ఇలా పలుకుతూ గతించారు : మీరు ఒక్కడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. మరియు మీరు ఆయనతో పాటు ఇతరులను ఆరాధించకండి. ఓ నా జాతి వారా నిశ్చయంగా నేను మీ గురించి గొప్ప దినమైన ప్రళయదిన శిక్ష గురించి భయపడుతున్నాను.
(22) ఆయనతో ఆయన జాతి వారు ఇలా పలికారు : ఏమీ నీవు మమ్మల్ని మా దేవతల ఆరాధన నుండి దూరం చేయటానికి మా వద్దకు వచ్చావా ?! అది నీకు జరగదు. నీవు మాకు బేదిరిస్తున్న శిక్షను మా వద్దకు తీసుకునిరా ఒక వేళ నీవు బెదిరిస్తున్న విషయంలో సత్యవంతుడివేనైతే.
(23) ఆయన ఇలా సమాధానమిచ్చారు : శిక్ష వేళ యొక్క జ్ఞానము అల్లాహ్ వద్ద మాత్రమే ఉన్నది. మరియు నాకు దాని గురించి ఎటువంటి జ్ఞానం లేదు. నేను మాత్రం నాకు మీ వద్దకు ఇచ్చి పంపించిన సందేశాలను మీకు చేరవేసే ఒక ప్రవక్తను. కాని నేను మిమ్మల్ని, మీకు ప్రయోజనం ఉన్న వాటి విషయంలో అజ్ఞానులై దాన్ని వదిలివేసే మరియు మీకు నష్టం ఉన్న వాటిని పొందే జనులుగా చూస్తున్నాను.
(24) మరి ఎప్పుడైతే వారు తొందర చేసిన శిక్ష వారి వద్దకు వచ్చినదో వారు దాన్ని ఆకాశపు ఒక వైపు ఒక మేఘము రూపంలో ప్రత్యక్షమై తమ లోయల వైపునకు వస్తుండగా చూసి ఇలా పలికారు : ఇది మాపై వర్షమును కురిపించటానికి ప్రత్యక్షమయింది. హూద్ అలైహిస్సలాం వారితో ఇలా పలికారు : విషయము మీరు అనుకుంటున్నట్లు అది మీపై వర్షమును కురిపించే మేఘం కాదు. కాని అది మీరు తొందరగా కోరుకున్న శిక్ష. అది ఒక గాలి అందులో ఒక బాధాకరమైన శిక్ష కలదు.
(25) అల్లాహ్ దేనిని నాశనం చేయమని దానికి ఆదేశించాడో అది ఆ ప్రతీ దానిపై వీచి నాశనం చేస్తుంది. వారి నివాసుమున్న వారి ఇండ్లను వారు ముందు వాటిలో ఉన్నట్లు సాక్ష్యం పలకటమును మాత్రమే కనిపించబడును. తమ అవిశ్వాసం పై మరియు తమ పాపకార్యములపై మొండిగా వ్యవహరించే వారికి మేము ఇటువంటి బాధాకరమైన శిక్షను కలిగిస్తాము.
(26) మరియు నిశ్ఛయంగా మేము మీకు ఇవ్వని సాధికారత సాధనాలను హూద్ జాతివారికి ప్రసాదించాము. మరియు మేము వారికి వినగలిగే వినికిడిని మరియు చూడగలిగే చూపును మరియు అర్ధం చేసుకునే హృదయములను చేశాము. అయితే వారి వినికిడి గాని వారి చూపులు గాని వారి బుద్దులు గాని వారికి ఏమాత్రం పనికి రాలేదు. వారి వద్దకు అల్లాహ్ శిక్ష వచ్చినప్పుడు అవి వారి నుండి తొలగించలేదు. ఎందుకంటే వారు అల్లాహ్ ఆయతులను తిరస్కరించేవారు. మరియు వారిపై వారి ప్రవక్త హూద్ అలైహిస్సలాం భయపెట్టిన శిక్షదేని గురించినయితే వారు హేళన చేసే వారో అది కురిసింది.
(27) ఓ మక్కా వాసులారా నిశ్ఛయంగా మేము మీ చుట్టు ప్రక్కల కల ఎన్నో బస్తీలను నాశనం చేశాము. నిశ్ఛయంగా మేము ఆద్ ను,సమూద్ ను,లూత్ జాతి వారిని మరియు మద్యన్ వారిని నాశనం చేశాము. మరియు మేము వారు తమ అవిశ్వాసము నుండి మరలుతారని ఆశిస్తూ వారి కొరకు రకరకాల వాదనలను,ఆధారాలను ఇచ్చాము.
(28) అయితే వారు అల్లాహ్ ను వదిలి దేవతలుగా తయారు చేసుకుని,ఆరాధన ద్వారా,బలి ఇవ్వటం ద్వారా వారు దగ్గరత్వమును పొందిన విగ్రహాలు ఎందుకని వారికి సహాయం చేయలేదు ?! అవి వారికి ఖచ్చితంగా సహాయం చేయవు. అంతే కాదు వారికి వారు అత్యంత అవసరమైనప్పుడు వారు వారి నుండి అదృశ్యమైపోయారు. మరియు ఈ విగ్రహాలు వారికి ప్రయోజనం కలిగిస్తాయని మరియు వారి కొరకు అల్లాహ్ వద్ద సిఫారసు చేస్తారని వారు ఏదైతే ఆశించారో అదంతా వారి అబద్దము మరియు వారి కల్పన.
(29) ఓ ప్రవక్తా మేము మీ వైపునకు జిన్నుల్లో నుండి ఒక వర్గమును మీ వద్దకు పంపిస్తే వారు మీ పై అవతరింపబడిన ఖుర్ఆన్ ను వింటున్నప్పటి వైనమును మీరు గుర్తు చేసుకోండి. వారు దాన్ని వినటానికి హాజరు అయినప్పుడు పరస్పరం ఇలా మాట్లాడుకున్నారు : మేము దాన్ని వినగలిగే వరకు మీరు నిశబ్దంగా ఉండండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఖిరాఅత్ ను ముగించగానే వారు తమ జాతి వారి వద్దకు ఒక వేళ వారు ఈ ఖుర్ఆన్ ను విశ్వసించకపోతే వారిని అల్లాహ్ శిక్ష నుండి హెచ్చరిస్తూ మరలారు.
(30) వారు వారితో ఇలా పలికారు : ఓ మా జాతి వారా మేము మూసా తరువాత అల్లాహ్ అవతరింపజేసిన గ్రంధమును విన్నాము అది దాని కన్న మునుపు అల్లాహ్ వద్ద నుండి అవతరింపబడిన గ్రంధములను దృవీకరుస్తుంది. మేము విన్న ఈ గ్రంధము సత్యము వైపునకు మార్గదర్శకత్వం చేస్తుంది. మరియు అది సన్మార్గం వైపునకు దారి చూపుతుంది. మరియు అది ఇస్లాం మార్గము.
(31) ఓ మా జాతి వారా ముహమ్మద్ మిమ్మల్ని పిలుస్తున్న సత్యము విషయంలో ఆయనను స్వీకరించండి. మరియు ఆయన తన ప్రభువు వద్ద నుండి పంపించబడ్డ ప్రవక్త అని విశ్వసించండి. అల్లాహ్ మీ పాపములను మీ కొరకు మన్నించివేస్తాడు మరియు ఆయన మిమ్మల్ని మీ కోసం నిరీక్షించే బాధాకరమైన శిక్ష నుండి రక్షిస్తాడు. మరియు ఆయన మిమ్మల్ని పిలిచిన సత్యము విషయంలో ఆయనను అంగీకరించకపోయినప్పుడు మరియు ఆయనను తన ప్రభువు వద్ద నుండి పంపించబడ్డ ప్రవక్త అని విశ్వసించనప్పుడు మీరు బాధాకరమైన శిక్షకు అర్హులవుతారు.
(32) మరియు ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పిలిచిన సత్యమును అంగీకరించని వాడు భూమిలో పారిపోయి అల్లాహ్ నుండి తప్పించుకోలేడు. మరియు అతని కొరకు శిక్ష నుండి రక్షించే వాడు అల్లాహ్ కాకుండా ఏ రక్షకుడు లేడు. వారందరు సత్యము నుండి స్పష్టముగా తప్పిపోయారు.
(33) మరణాంతరం లేపబడటమును తిరస్కరించే ఈ ముష్రికులందరు ఆ అల్లాహ్ ఆకాశములను మరియు భూమిని సృష్టించిన వాడు మరియు అవి పెద్దవైనా కూడా,విశాలమైనా కూడా వాటిని సృష్టించటం నుండి అశక్తుడు కాని వాడు మృతులను లెక్క తీసుకోవటం కొరకు,ప్రతిఫలం ప్రసాదించటం కొరకు జీవింపజేయటం పై సామర్ధ్యం కలవాడని చూడటం లేదా ?! ఎందుకు కాదు. ఆయన వారిని జీవింపజేయటంపై సామర్ధ్యము కలవాడు. పరిశుద్ధుడైన ఆయన ప్రతీ వస్తువుపై సామర్ధ్యం కలవాడు. మృతులను జీవిపజేయటం నుండి ఆయన అశక్తుడు కాడు.
(34) మరియు అల్లాహ్ ను,ఆయన ప్రవక్తలను అవిశ్వసించిన వారిని నరకాగ్ని వద్దకు అందులో వారిని శక్షించటానికి తిసుకుని రాబడే దినమున వారితో మందలిస్తూ ఇలా పలకబడుతుంది : ఏమీ మీరు చూస్తున్నటువంటి ఈ శిక్ష వాస్తవం కాదా ?! లేదా మీరు ఇహలోకంలో మీరు పలికిన విధంగా అబద్దమా ?! వారు, మా ప్రభువు సాక్షిగా నిశ్ఛయంగా అది సత్యము అని పలుకుతారు. అప్పుడు వారితో ఇలా పలకబడుతుంది : అల్లాహ్ పై మీ అవిశ్వాసం కారణంగా మీరు శిక్షను చవిచూడండి.
(35) ఓ ప్రవక్తా మీరు నూహ్,ఇబ్రాహీమ్,మూసా,ఈసా అలైహిముస్సలాంటి దృఢ సంకల్పం కల ప్రవక్తలు సహహనం పాటించినట్లుగా మీ జాతి వారు మిమ్మల్ని తిరస్కరించటంపై సహనం చూపండి. వారి కొరకు శిక్ష గురించి తొందర చేయకండి. మీ జాతి వారిలో నుండి తిరస్కారులు పరలోకంలో వారికి వాగ్దానం చేయబడిన శిక్షను చూసిన రోజు వారి శిక్ష పొడిగింపు వలన వారు ఇహలోకంలో దినపు ఒక ఘడియను మాత్రమే గడిపారనుకుంటారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ ఒక సందేశము మరియు మానవులకు,జిన్నులకు చాలును. నిశ్చయంగా అవిశ్వాసముతో,పాపకార్యములతో అల్లాహ్ విధేయత నుండి తొలగిపోయిన జాతి వారు మాత్రమే శిక్ష ద్వారా నాశనం చేయబడుతారు.