80 - Abasa ()

|

(1) దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన నుదిటిపై మడతలు పడేటట్లు చేశారు మరియు ముఖం త్రిప్పుకున్నారు.

(2) అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమ్మె మక్తూమ్ ఆయనతో సన్మార్గమును కోరుతూ రావటం వలన. మరియు ఆయన గ్రుడ్డివారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముష్రికుల పెద్ద వారితో వారి సన్మార్గమును ఆశిస్తూ నిమగ్నమై ఉండగా ఆయన వచ్చారు.

(3) ఓ ప్రవక్త మీకేమి తెలుసు బహుశా ఈ గ్రుడ్డి వాడు తన పాపముల నుండి పరిశుద్ధుడవుతాడేమో ?!

(4) లేదా మీ నుండి ఆయన విన్న హితోపదేశముల ద్వారా హితబోధన గ్రహించి వాటి ద్వారా ప్రయోజనం చెందుతాడేమో.

(5) ఇక ఎవడైతే తన వద్ద ఉన్నసంపద వలన మీరు తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసించటం నుండి తన స్వయం పట్ల నిర్లక్ష్యం వహించాడో.

(6) అతని కొరకు మీరు ఆసక్తి చూపి అతని వైపు ముందడుగు వేస్తున్నారు.

(7) ఒక వేళ అతడు తన పాపముల నుండి అల్లాహ్ యందు పశ్ఛాత్తాపముతో పరిశుద్ధుడు కానప్పుడు నీకేమగును.

(8) మరియు ఎవరైతే మేలును వెతుకుతూ నీ వద్దకు పరిగెత్తుకుని వచ్చాడో

(9) మరియు అతడు తన ప్రభువుతో భయపడుతున్నాడో

(10) మీరు అతనిపట్ల నిర్లక్ష్యం చేసి ఇతరులైన ముష్రికుల పెద్దవారి పట్ల శ్రద్ధ చూపుతున్నారు.

(11) విషయం అది కాదు. అది మాత్రం స్వీకరించేవారి కొరకు ఒక హితోపదేశము మాత్రమే.

(12) ఎవరైతే అల్లాహ్ ను స్మరించదలచాడో ఆయనను స్మరించాలి మరియు ఈ ఖుర్ఆన్ లో ఉన్న వాటి ద్వారా హితబోధన గ్రహించాలి.

(13) ఈ ఖుర్ఆన్ దైవదూతల వద్ద ప్రతిష్టాకరమైన పుటలలో ఉన్నది.

(14) ఉన్నత ప్రదేశంలో ఉంచబడి ఉంది, పవిత్రమైనది దానికి ఎటువంటి మలినము గాని అశుద్ధత గాని తగలదు.

(15) మరియు అది దైవదూతల్లోంచి లేఖకుల చేతుల్లో ఉంది.

(16) తమ ప్రభువు వద్ద గౌరవంతులు వారు, మంచిని,విధేయ కార్యములను అధికంగా చేసేవారు.

(17) కృతఘ్నుడైన మానవుడు నాశనం గాను. అతడు అల్లాహ్ పట్ల ఎంత కృతఘ్నుడు.

(18) అల్లాహ్ అతడిని ఏ వస్తువుతో సృష్టించాడు చివరికి అతడు భూమిలో అహంకారమును చూపుతున్నాడు మరియు ఆయనను తిరస్కరిస్తున్నాడు ?!

(19) అల్పమైన నీటితో అతన్ని సృష్టించాడు. అతని సృష్టిని ఒక దశ తరువాత ఇంకొక దశగా తీర్చిదిద్దాడు.

(20) ఈ దశల తరువాత అతని కొరకు అతని తల్లి కడుపు నుండి బయటకు వచ్చే మార్గమును శులభతరం చేశాడు.

(21) ఆ పిదప అతనికి జీవితంలో ఆయుషును నిర్ధారించిన తరువాత అతనికి మరణమును ప్రసాదించాడు. మరియు అతని కొరకు సమాదిని ఏర్పరచాడు అందులో అతడు మరణాంతరం లేపబడే వరకు ఉండిపోతాడు.

(22) ఆ తరువాత అతను తలచినప్పుడు లెక్క తీసుకోవటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించటం కొరకు అతడిని మరల లేపుతాడు.

(23) ఈ అవిశ్వాసపరుడు తనపై ఉన్న తన ప్రభువు హక్కును నెరవేర్చాడని భావిస్తున్నట్లు విషయం కాదు. అతడు తనపై అల్లాహ్ అనివార్యం చేసిన విధులను నెరవేర్చలేదు.

(24) అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచే మానవుడు తాను తినే ఆహారం ఎలా లభించినదో గమనించాలి.

(25) దాని మూలము ఆకాశము నుండి ధారాపాతంగా,బలంగా కురిసే వర్షం నుండి వచ్చింది.

(26) ఆ తరువాత మేము భూమిని చీల్చాము. అది మొక్కలతో చీలిపోయింది.

(27) అప్పుడు మేము గోదుమ,మొక్కజొన్న మరియు ఇతర ధాన్యాలను అందులో మొలకెత్తించాము.

(28) మరియు మేము అందులో ద్రాక్ష పండ్లను మరియు కూరగాయలను మొలకెత్తించాము వారి పశువులకు మేత అవటానికి.

(29) మరియు మేము అందులో ఆలివ్ (జైతూన్) ను మరియు ఖర్జూరములను మొలకెత్తించాము.

(30) మరియు మేము అందులో అధికముగా వృక్షములు గల తోటలను మొలకెత్తించాము.

(31) మరియు మేము అందులో ఫలములను మొలకెత్తించాము మరియు అందులో మీ పశువులు మేసే వాటిని మొలకెత్తించాము.

(32) మీ ప్రయోజనం కొరకు మరియు మీ పశువుల ప్రయోజనం కొరకు.

(33) చెవులను చెవిటిగా చేసే పెద్ద ధ్వని వచ్చినప్పుడు మరియు అది రెండవ బాకా.

(34) ఆ రోజు మనిషి తన సోదరుడి నుండి పారిపోతాడు.

(35) మరియు అతడు తన తల్లి నుండి,తండ్రి నుండి పారిపోతాడు.

(36) మరియు తన భార్య నుండి,తన సంతానము నుండి పారిపోతాడు.

(37) ఆ దినమును బాధ తీవ్రత వలన వారిలో నుండి ప్రతి ఒక్కరికి ఇంకొకరి నుండి నిర్లక్ష్యం వహించే స్థితి ఉంటుంది.

(38) ఆ రోజున పుణ్యాత్ముల ముఖములు కాంతివంతంగా ఉంటాయి.

(39) అల్లాహ్ వారి కొరకు సిద్ధం చేసి ఉంచిన తన కారుణ్యం వలన సంతోషముతో ఆహ్లాదకరంగా ఉంటారు.

(40) దుష్టుల ముఖములపై ఆ రోజున దుమ్ము చేరి ఉంటుంది.

(41) వారిపై చీకటి కమ్ముకుని ఉంటుంది.

(42) ఈ పరిస్థితితో వర్ణించబడిన వీరందరే అవిశ్వాసము మరియు దుష్కర్మల మధ్య సమీకరించబడ్డారు.