101 - Al-Qaari'a ()

|

(1) ప్రళయం అదే ఏదైతే ప్రజల హృదయాలను తన పెద్ద భయాందోళనల ద్వారా తట్టుతుందో.

(2) ప్రజల హృదయాలను తన పెద్ద భయాందోళనల ద్వారా తట్టే ఈ ప్రళయం ఏమిటి ?!.

(3) ఓ ప్రవక్త మీకేమి తెలుసు - ప్రజల హృదయాలను తన పెద్ద భయాందోళనల ద్వారా తట్టే ఈ ప్రళయం ఏమిటి ?! అది ప్రళయదినం.

(4) ఆ రోజు అది ప్రజల హృదయములను తట్టుతుంది.వారు అక్కడ ఇక్కడ విస్తరించి పడి ఉన్న చిమ్మెటల వలె అయిపోతారు.

(5) మరియు పర్వతాలు వాటి నడవటంలో,వాటి కదలికల్లో తేలికదనంలో ఈకబడిన ఉన్ని వలే అయిపోతాయి.

(6) మరియు ఎవరి సత్కర్మలు అతని దుష్కర్మల కన్న బరువుగా వంగుతాయో.

(7) అతడు మనస్సుకు నచ్చిన భోగభాగ్యాలతో కూడిన జీవితంలో ఉంటాడు. దాన్ని అతడు స్వర్గంలో పొందుతాడు.

(8) మరియు ఇక ఎవరి దుష్కర్మలు అతని సత్కర్మల కన్న బరువుగా వంగుతాయో.

(9) అయితే అతని నివాసము మరియు అతని ఆశ్రమం ప్రళయదినాన అది నరకము

(10) ఓ ప్రవక్తా అది ఏమిటో మీకు ఏమి తెలుసు ?.

(11) అది తీవ్ర వేడి గల నరకాగ్ని.