(1) విస్తారమైన కారుణ్యము కల అనంత కరుణామయుడు.
(2) ఆయన ప్రజలకు ఖుర్ఆన్ ను దాన్ని కంఠస్తం చేసుకొవటం సులభతరం చేయటం ద్వారా మరియు దాని అర్ధములను సునాయసంగా అర్ధం చేసుకునేట్లుగా నేర్పించాడు.
(3) అయన మానవుడిని సవ్యంగా సృష్టించాడు. మరియు అతని రూపమును మంచిగా చేశాడు.
(4) ఆయన అతనికి మాటపరంగా మరియు వ్రాయటం పరంగా తన మనస్సులో ఉన్న దాన్ని ఏ విధంగా స్పష్టపరచాలో నేర్పించాడు.
(5) సూర్య చంద్రులను వాటికి ఆయన హద్దును నిర్దేశించాడు. అవి పరిపూర్ణ లెక్క ప్రకారం పయనిస్తున్నవి. ప్రజలు సంవత్సరముల గణనను మరియు లెక్కను తెలుసుకోవటానికి.
(6) మరియు కాండము లేని మొక్కలు మరియు వృక్షములు పరిశుద్ధుడైన అల్లాహ్ కు ఆయనకు విధేయిలుగా,లొంగిపోతూ సాష్టాంగపడుతున్నాయి.
(7) మరియు ఆకాశమును దాన్ని భూమిపై దాని కొరకు కప్పుగా పైకెత్తి ఉంచాడు. మరియు భూమిలో న్యాయమును స్థాపించి దాని గురించి తన దాసులకు ఆదేశించాడు.
(8) ఓ ప్రజలారా మీరు అన్యాయమునకు పాల్పడకూడదని మరియు తూకము వేయటంలో,కొలవటంలో అవినీతికి పాల్పడకూడదని ఆయన న్యాయమును స్థాపించాడు
(9) మరియు మీరు తూకమును మీ మధ్య న్యాయంతో నెలకొల్పండి. మరియు మీరు ఇతరుల కొరకు కొలచినప్పుడు మరియు తూకమేసినప్పుడు తూకము వేయటంలో లేదా కొలవటములో మీరు తగ్గించకండి.
(10) మరియు భూమిని దానిపై సృష్టిని స్థిరీకరించటానికి దాన్ని సిద్ధం చేసి పరచాడు.
(11) అందులో ఫలాలను పండించే వృక్షములు కలవు. మరియు అందులో ఖర్జూర పండ్లను కలిగి ఉండే పుష్పకోశాలు గల ఖర్జూరపు చెట్లు కలవు.
(12) మరియు అందులో ఊక గల గోదుమలు మరియు బార్లి వంటి ధాన్యములు కలవు. మరియు అందులో మంచి సువాసన గల మొక్కలు గలవు.
(13) ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
(14) ఆయన ఆదం అలైహిస్సలాంను పెంకులాంటి శబ్దము వినిపించే ఎండు బంక మట్టితో సృష్టించాడు అది కాల్చబడిన బంక మట్టిలా ఉన్నది.
(15) మరియు ఆయన జిన్ను తండ్రిని స్వచ్ఛమైన పొగ జ్వాల నుండి సృష్టించాడు.
(16) ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
(17) శీతాకాలం మరియు ఎండాకాలంలో సూర్యుడు ఉదయించే రెండు చోట్ల,అది అస్తమించే రెండు చోట్ల యొక్క ప్రభువు.
(18) ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
(19) ఆయన (అల్లాహ్) ఉప్పు మరియు తీపి సముద్రములను కలిపాడు అవి కంటికి కనిపించటంలో కలుస్తుంటాయి.
(20) వాటి మధ్య ఒక అడ్డు కట్ట ఉన్నది అది వాటిలో నుండి ప్రతి ఒక్క దాన్ని వేరే దాన్ని ఆక్రమించుకోకుండా తీపిది తీపిగా మరియు ఉప్పుది ఉప్పగా ఉండేందుకు ఆపుతుంది.
(21) ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
(22) రెండు సముద్రముల నుండి పెద్దవి మరియు చిన్నవి ముత్యములు వెలికి వస్తాయి.
(23) ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
(24) సముద్రముల్లో పర్వతములవలె పయనించే ఓడలను పయనింపచేసే అధికారము పరిశుద్ధుడైన,మహోన్నతుడైన ఆయన ఒక్కడికే ఉన్నది.
(25) ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
(26) సృష్టితాల్లోంచి భూమిపై ఉన్న ప్రతీది ఖచ్చితంగా నాశనమవుతుంది.
(27) ఓ ప్రవక్తా తన దాసుల పట్ల గొప్పతనము,దాతృత్వం మరియు దయ కల నీ ప్రభువు యొక్క అస్తిత్వం మిగిలి ఉంటుంది. దానికి వినాశనం ఎన్నటికీ కలగదు.
(28) ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
(29) ఆకాశముల్లో ఉన్న దైవదూతల్లోంచి మరియు భూమిలో ఉన్న జిన్నులు,మానవుల్లోంచి ప్రతి ఒక్కరు తమ అవసరములను ఆయనతోనే వేడుకుంటారు. ప్రతి రోజు ఆయన తన దాసుల వ్యవహారములైన జీవింపజేయటం,మరణింపజేయటం మరియు ఆహారం ప్రసాదించటం మొదలగు వాటిలొ నిమగ్నుడై ఉంటాడు.
(30) ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
(31) ఓ మానవుల్లారా,జిన్నుల్లారా త్వరలోనే మేము మీ లెక్క చూసి ప్రతి ఒక్కరికి వారికి యోగ్యమైన ప్రతిఫలమును,శిక్షను ప్రసాదిస్తాము.
(32) ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
(33) జిన్నులు మరియు మానవులు సమావేశమైనప్పుడు ప్రళయదినమున అల్లాహ్ ఇలా పలుకుతాడు : ఓ జిన్నుల మరియు మానవుల జాతుల వారా ఒక వేళ మీరు మీ కొరకు భూమ్యాకాశముల సరిహద్దుల్లోంచి ఏ సరిహద్దు నుంచైన బయటకు పోయే మార్గం పొందగలిగితే మీరు చేసి చూడండి. మీరు అది ఏదైన బలముతో,ఆధారముతో మాత్రమే చేయగలుగుతారు. మరియు అది మీ దగ్గర ఎక్కడున్నది ?.
(34) ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
(35) ఓ మానవులు మరియు జిన్నాతుల్లారా ఆయన మీపై పొగ లేని అగ్ని జ్వాలలను మరియు జ్వాలలు లేని పొగను పంపిస్తాడు. మీరు దాన్ని ఆపలేరు.
(36) ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
(37) మరియు ఆకాశం దాని నుండి దైవదూతలు దిగటానికి బ్రద్దలైనప్పుడు అది రంగు మెరవటంలో నూనెలా ఎర్రగా అయిపోతుంది.
(38) ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
(39) ఆ మహోన్నతమైన దినమున మానవులకు,జిన్నులకు వారి పాపముల గురించి అడగబడదు ఎందుకంటే వారి కర్మల గురించి అల్లాహ్ కు తెలుసు కాబట్టి.
(40) ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
(41) అపరాదులు ప్రళయదినమున తమ చిహ్నాలైన ముఖములు నల్లబడటం,కళ్ళు నీలంగా మారటం ద్వారా గుర్తించబడుతారు. అప్పుడు వారి నుదుటులను వారి కాళ్ళతో కలిపి కట్టబడి వారు నరకంలో విసరబడుతారు.
(42) ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
(43) మరియు వారితో మందలిస్తూ ఇలా పలకబడును : ఇహలోకములో అపరాధులు తిరస్కరించిన నరకము ఇదే తమ కళ్ళముందట దాన్ని వారు తిరస్కరించలేరు.
(44) వారు దాని మధ్య మరియు తీవ్ర వేడి కల నీటి మధ్య అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు.
(45) ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
(46) తన ప్రభువు ముందట నిలబడటం నుండి భయపడి విశ్వాసమును కనబరచి సత్కర్మలు చేసిన వారి కొరకు రెండు స్వర్గవనాలుంటాయి.
(47) ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
(48) మరియు ఈ రెండు స్వర్గ వనాలు పెద్ద,తాజా,ఫలవంతమైన కొమ్మలు కలవై ఉంటాయి.
(49) ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
(50) ఆ రెండు స్వర్గ వనముల్లో రెండు సెలయేళ్ళు వాటి మధ్య నీటిని తీసుకుని ప్రవహిస్తుంటాయి.
(51) ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
(52) వాటిలో ప్రతిఫలము యొక్క రెండు రకాలు (జతలు) ఉంటాయి.
(53) ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
(54) వారు మందమైన పట్టు తివాచీల మీద ఆనుకుని కూర్చుని ఉంటారు. మరియు రెండు స్వర్గ వనముల నుండి వారికి కోసి ఇవ్వబడే పండ్లు,ఫలాలు నిలబడిన వాడు,కూర్చున్న వాడు,ఆనుకుని ఉన్న వాడు వాటిని దగ్గర నుండి పొందుతాడు.
(55) ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
(56) వాటిలో తమ భర్తల ముందట తమ చూపులను క్రిందికి వాల్చి ఉండే స్త్రీలు ఉంటారు. వారి కన్యతను వారి భర్తల కన్న ముందు ఏ మానవుడుగాని ఏ జిన్ను గాని దూరం చేసి ఉండడు.
(57) ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
(58) వారు అందములో,స్వచ్ఛదనంలో ముత్యములను మరియు పగడాలను పోలి ఉంటారు.
(59) ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
(60) తన ప్రభువుకి మంచి విధేయత చూపిన వారికి అల్లాహ్ అతనికి మంచి ప్రతిఫలమే ప్రసాదిస్తాడు.
(61) ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
(62) ఈ ప్రస్తావించబడిన రెండు స్వర్గ వనములు కాకుండా వేరే రెండు స్వర్గ వనాలుంటాయి.
(63) ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
(64) వాటి పచ్చదనం తీవ్రంగా (ముదురుగా) ఉంటుంది.
(65) ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
(66) ఈ రెండు స్వర్గ వనముల్లో నీటితో తీవ్రంగా పొంగిపొరలే రెండు సెలయేళ్ళు ఉంటాయి. వాటి పొంగిపొరలటం అంతమవదు.
(67) ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
(68) ఆ రెండు స్వర్గ వనముల్లో చాలా ఫలములు,అధికముగా ఖర్జూరములు మరియు దానిమ్మకాయలు ఉంటాయి.
(69) ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
(70) ఈ స్వర్గ వనముల్లో ఉత్తమ గుణవంతులైన,మంచి రూపురేకలు కల స్త్రీలు ఉంటారు.
(71) ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
(72) తమకు భద్రతగా డేరాలలో పరదాలు కప్పబడిన హూర్ లు ఉంటారు.
(73) ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
(74) వారి భర్తల కన్న ముందు ఏ మానవుడు గాని ఏ జిన్ను గాని వారి దగ్గరకు వచ్చి ఉండడు.
(75) ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
(76) వారు ఆకుపచ్చని గలాఫులతో కప్పబడిన దిండ్లకు అనుకుని మరియు అందమైన తివాచీలపై ఉంటారు.
(77) ఓ జిన్నాతులారా మరియు మానవులారా ! మీపై ఉన్న అల్లాహ్ యొక్క అధిక అనుగ్రహాల్లోంచి వేటిని మీరు తిరస్కరిస్తున్నారు ?.
(78) తన దాసులపై ఘనత గల,ఉపకారము చేసే,అనుగ్రహాలు కలిగించే నీ ప్రభువు పేరు అధికంగా,చాలా మేలైనది.