(1) రాత్రి తన చీకటితో ఆకాశమునకు మరియు భూమికి మధ్య ఉన్న వాటిని కప్పి వేసినప్పుడు అల్లాహ్ దానిపై ప్రమాణం చేశాడు.
(2) మరియు పగలు బహిర్గతమై,ప్రత్యక్షమైనప్పుడు దానిపై ప్రమాణం చేశాడు.
(3) మరియు రెండు రకములైన తన సృష్టి అయిన మగ,ఆడ పై ప్రమాణం చేశాడు.
(4) ఓ ప్రజలారా నిశ్చయంగా మీ కర్మ రకరకాలుగా ఉంటుంది. అందులో స్వర్గములో ప్రవేశమునకు కారణమయ్యే సత్కర్మలు కలవు. మరియు నరకములో ప్రవేశమునకు కారణమయ్యే పాప కార్యములు కలవు.
(5) ఇక ఎవరైతే జకాతు,ఖర్చు చేయటం,పాపపరిహారములోంచి ఏదైతే ఖర్చు చేయటం తనపై తప్పనిసరో దాన్ని ఇచ్చాడో మరియు దేని నుండైతే అల్లాహ్ వారించాడో దాని నుండి దూరంగా ఉండాటో.
(6) మరియు పరిహారంగా అల్లాహ్ తనకు ఏదైతే ఇస్తానని వాగ్దానం చేశాడో దాన్ని నమ్ముతాడో.
(7) అతనిపై మేము తొందరలోనే సత్కర్మను చేయటమును మరియు అల్లాహ్ మార్గములో ఖర్చు చేయటమును సులభతరం చేస్తాము.
(8) మరియు ఎవరైతే తన సంపద విషయంలో పిసినారితనం చూపి దాన్ని దేనిలోనైతే ఖర్చు చేయటం తనపై అనివార్యమో ఖర్చు చేయలేదో మరియు అల్లాహ్ నుండి తన సంపద విషయంలో నిర్లక్ష్యం వహించి అల్లాహ్ తో ఆయన అనుగ్రహముల్లోంచి ఏదీ అర్దించలేదో.
(9) అల్లాహ్ ఏదైతే బదులుగా ఇస్తానని మరియు తన సంపదలో నుంచి అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయటంపై ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేశాడో దాన్ని అబద్దమని తిరస్కరించాడు.
(10) తొందరలోనే మేము చెడును చేయటమును అతనిపై సులభతరం చేస్తాము. మరియు మేలును చేయటమును అతనిపై కష్టతరం చేస్తాము.
(11) అతను నాశనం అయి నరకంలో ప్రవేశించినప్పుడు తాను పిసినారి తనం చూపిన తన సంపద తనకు ఏమి పనికి రాలేదు.
(12) నిశ్చయంగా మేము అసత్య మార్గము నుండి సత్య మార్గమును స్పష్టపరచటం మా బాధ్యత.
(13) మరియు నిశ్చయంగా పరలోక జీవితం మా కొరకే మరియు ఇహలోక జీవితం మా కొరకే. వాటిలో మేము తలుచుకున్నట్లు వ్యవహారాలు నడుపుతాము. మాకు తప్ప అది ఎవరికి చెందదు.
(14) ఓ ప్రజలారా ఒక వేళ మీరు అల్లాహ్ కు అవిధేయత చూపితే దహించి వేసే నరకాగ్ని నుండి నేను మిమ్మల్ని హెచ్చరించాను.
(15) ఈ నరకాగ్నిని అనుభవించువాడు దుష్టుడు మాత్రమే మరియు అతడు అవిశ్వాసపరుడు.
(16) అతడే దైవ ప్రవక్త తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించాడు మరియు అల్లాహ్ ఆదేశించిన వాటిని పాటించటం నుండి విముఖత చూపాడు.
(17) ప్రజల్లో అత్యంత దైవ భీతి కలిగిన వారైన అబూబకర్ రజిఅల్లాహు అన్హు దాని నుండి దూరంగా ఉంటారు.
(18) ఆయనే పాపముల నుండి పరిశుద్ధుడగుటకు తన సంపదను పుణ్య మార్గాల్లో ఖర్చు చేశారు.
(19) మరియు తన సంపద నుండి తాను ఖర్చు చేసినది, ఎవరో తనకు ఉపకారము చేసిన దానికి బదులుగా కాదు.
(20) తన సంపదలో నుంచి తాను ఖర్చు చేసినది తన సృష్టి రాసుల కన్న మహోన్నతుడైన తన ప్రభువు మన్నతును కోరుతూ మాత్రమే.
(21) మరియు అతడు తనకు అల్లాహ్ ప్రసాదించే గొప్ప ప్రతిఫలముతో సంతుష్టపడుతాడు.