(1) (الٓـمٓ) అలిఫ్-లామ్-మీమ్ సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.
(2) పర్షియన్ లు రోమన్ లపై విజయం పొందారు.
(3) సిరియా ప్రాంతము దగ్గర నుండి పర్షియన్ ల బస్తీల వరకు.మరియు రోమన్ లు పర్షియన్లు వారిపై విజయం పొందిన తరువాత తొందరలోనే వారిపై విజయం సాధిస్తారు.
(4) మూడు సంవత్సరాల కన్న తక్కువ కాని, పది సంవత్సరాల కన్న అధికం గాని ఒక కాలంలో. రోమన్ల విజయముకు ముందు,దాని తరువాత ఆదేశమంతా అల్లాహ్ కే. రోమన్ లు పర్షియన్ ల పై విజయం పొందిన రోజు విశ్వాసపరులు సంతోషపడుతారు.
(5) వారు రోమన్ లకు అల్లాహ్ సహాయం కలగటం వలన సంతోషపడుతారు. ఎందుకంటే వారు గ్రంధవహులు. అల్లాహ్ తాను కోరిన వారికి తాను కోరిన వారికి వ్యతిరేకంగా సహాయం చేస్తాడు. మరియు ఆయన ఓడించబడని సర్వశక్తిమంతుడు. విశ్వసించిన తన దాసులపై కరుణించేవాడు.
(6) ఈ సహాయం మహోన్నతుడైన అల్లాహ్ తరపు నుండి వాగ్దానము. మరియు అది సాక్షాత్కరించడం ద్వారా విశ్వాసపరులు అల్లాహ్ విజయ వాగ్దానంలో నమ్మకమును అధికం చేసుకుంటారు. కాని చాలా మంది ప్రజలు తమ అవిశ్వాసం వలన దీనిని అర్ధం చేసుకోరు.
(7) విశ్వాసము,ధర్మ ఆదేశాల గురించి వారికి తెలియదు. వారికి మాత్రం జీవనోపాధి సంపాదనకు,భౌతిక నాగరికత నిర్మాణమునకు సంభంధించిన ఇహలోక జీవితము గురించి బాహ్యపరంగా తెలుసు. మరియు వారు వాస్తవ జీవిత నివాసమైన పరలోకము నుండి విముఖత చూపుతున్నారు. దాని పట్ల వారు శ్రద్ధ చూపరు.
(8) ఏ ఈ తిరస్కరించే ముష్రికులందరు తమ స్వయంలో అల్లాహ్ వారిని,ఇతరులను ఎలా సృష్టించాడో యోచన చేయరా ?. అల్లాహ్ ఆకాశములను,భూమిని సత్యముతో మాత్రమే సృష్టించాడు. వాటిని ఆయన వృధాగా సృష్టించలేదు. అవి రెండు లోకములో ఉండటానికి ఒక నిర్ణీత సమయమును వాటి కొరకు ఆయన తయారు చేశాడు. మరియు నిశ్చయంగా ప్రజల్లోంచి చాలా మంది ప్రళయదినాన తమ ప్రభవును కలవటం గురించి తిరస్కరించారు. అందువలనే వారు మరణాంతరం లేపబడటం కొరకు తమ ప్రభువు వద్ద స్వీకృతమయ్యే సత్కర్మ ద్వారా సిద్ధమవటం లేదు.
(9) ఏ వీరందరు వీరికన్న మునుపటి తిరస్కార జాతుల ముగింపు ఏవిధంగా అయినదో యోచన చేయటానికి భూమిలో సంచరించలేదా ?. ఈ జాతుల వారు వీరికన్న ఎక్కువ బలవంతులు. మరియు వారు వ్యవసాయం కొరకు,నిర్మాణం కొరకు దున్నారు. వీరందరు నిర్మించిన వాటి కంటే ఎక్కువగా వారు నిర్మించారు. మరియు వారి వద్దకు వారి ప్రవక్తలు అల్లాహ్ ఏకత్వముపై స్పష్టమైన ఆధారాలను,వాదనలను తీసుకుని వస్తే వారు తిరస్కరించారు. అల్లాహ్ వారిని తుదిముట్టించినప్పుడు వారిని హింసించలేదు. కాని వారే తమ అవిశ్వాసం వలన వినాశన స్థానములకు రావటం వలన తమ స్వయమును హింసించుకున్నారు.
(10) ఆ తరువాత ఎవరి కర్మలైతే అల్లాహ్ తో పాటు సాటి కల్పించటం,దుష్కర్మలకు పాల్పడటంతో చెడుగా అయినవో వారి ముగింపు అత్యంత చెడు ముగింపు అయినది. ఎందుకంటే వారు అల్లాహ్ ఆయతులను తిరస్కరించారు. మరియు వారు వాటి గురించి హేళన చేసేవారు. మరియు వాటి గురించి పరిహాసమాడేవారు.
(11) అల్లహ్ యే పూర్వ నమూనా లేకుండా సృష్టిని ప్రారంభిస్తాడు. ఆ తరువాత దాన్ని అంతం చేస్తాడు. ఆ తరువాత దాన్ని మరలా తీసుకుని వస్తాడు. ఆ తరువాత మీరు ప్రళయదినాన లెక్క తీసుకోబడటం కొరకు,ప్రతిఫలం ప్రసాధించటం కొరకు ఆయన ఒక్కడి వైపునకే మరలించబడుతారు.
(12) మరియు ప్రళయం నెలకొన్న రోజు అపరాధులు అల్లాహ్ కారుణ్యము నుండి నిరాశ చెందుతారు. మరియు అల్లాహ్ పట్ల అవిశ్వాసముపై వారి వాదన అంతమవటం వలన ఆ రోజు వారి ఆశ అంతమైపోతుంది.
(13) వారు ఇహలోకములో ఆరాధించే వారి భాగ స్వాముల్లోంచి ఎవరూ శిక్ష నుండి వారిని రక్షించటానికి సిఫారసు చేసేవారు వారి కొరకు ఉండరు. మరియు వారు తమ భాగస్వాములను తిరస్కరిస్తారు. నిశ్చయంగా వారి అవసరమున్నప్పుడు వారు సహాయమును వదిలివేశారు ఎందుకంటే వారందరు వినాశనంలో సమానము.
(14) మరియు ఏ రోజు ప్రళయం నెలకొంటుందో ఆ రోజు ప్రజలు ఇహ లోకములోని తమ కర్మలను బట్టి ప్రతిఫలం విషయంలో వర్గములుగా విడిపోతారు. కొంత మంది ఇల్లియ్యీన్ లో లేపబడుతారు,మరికొందరు నీచాతి నీచమైన స్థానమైన సిజ్జీన్ లో దించబడుతారు.
(15) ఎవరైతే అల్లాహ్ పట్ల విశ్వాసమును కనబరచి,ఆయన వద్ద స్వీకృతమయ్యే సత్కార్యములు చేస్తారో వారు స్వర్గములో అక్కడ వారు పొందే ఎన్నడూ అంతం కాని శాశ్వత అనుగ్రహాలతో పరవశించబడుతారు.
(16) మరియు ఎవరైతే అల్లాహ్ పట్ల తిరస్కారమును కనబరచి,మా ప్రవక్తపై అవతరింపబడిన మా ఆయతులను తిరస్కరించి,మరణాంతరం లేపబడటమును,లెక్క తీసుకొనబడటమును తిరస్కరిస్తారో వారందరు శిక్ష కొరకు హాజరుపరచబడుతారు. మరియు వారు దాన్నే అంటిపెట్టుకుని ఉంటారు.
(17) కావున మీరు సాయంత్ర వేళలో ప్రవేశించేటప్పుడు అల్లాహ్ పరిశుద్ధతను కొనియాడండి. అది మగ్రిబ్,ఇషా రెండు నమాజుల వేళ. మరియు మీరు ఉదయ వేళలో ప్రవేశించేటప్పుడు ఆయన పరిశుద్ధతను కొనియాడండి. అది ఫజర్ నమాజు వేళ.
(18) ప్రశంసలు పరిశుద్ధుడైన ఆయన ఒక్కడి కొరకే. ఆకాశముల్లో ఆయన దూతలు ఆయన స్థుతులను పలుకుతారు. మరియు భూమిలో ఆయన సృష్టితాలు ఆయన స్థుతులను పలుకుతాయి. మరియు మీరు సంధ్యా కాలములో ప్రవేశించేటప్పుడు ఆయన పరిశుద్ధతను కొనియాడండి. అది అసర్ నమాజు వేళ. మరియు మీరు మధ్యాహ్న కాలములో జొహర్ నమాజు వేళ ప్రవేశించినప్పుడు ఆయన పరిశుద్ధతను కొనియాడండి.
(19) వీర్య బిందువు నుండి ఆయన మనిషిని,పిల్లను గ్రుడ్డు నుండి వెలికి తీయటంలాగా నిర్జీవి నుండి జీవిని వెలికి తీస్తాడు. మరియు ఆయన మనిషి నుండి వీర్యమును,కోడి నుండి గ్రుడ్డును వెలికి తీయటం లాగా జీవి నుండి నిర్జీవిని వెలికి తీస్తాడు. మరియు ఆయన భూమి ఎండిపోయిన తరువాత వర్షమును కురిపించి,దాన్ని మొలకెత్తింపజేసి దాన్ని జీవింపజేస్తాడు. భూమిని మొలకెత్తింపజేసి దాన్ని జీవింపజేసినట్లు మీరు మీ సమాధుల నుండి లెక్క తీసుకోబడటం కొరకు,ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు వెలికితీయబడుతారు.
(20) అల్లాహ్ సామర్ధ్యముపై,ఆయన ఏకత్వంపై సూచించే మహోన్నత సూచనల్లోంచి ఓ ప్రజలారా మీ తండ్రిని మట్టి నుండి సృష్టించినప్పుడు మిమ్మల్ని మట్టితో సృష్టించటం. ఆ పిదప అప్పుడు మీరు మానవులుగా పునరుత్పత్తి ద్వారా అధికమవుతారు మరియు మీరు భూమి యొక్క తూర్పు పడమరలలో వ్యాప్తి చెందుతారు.
(21) మరియు అదేవిధంగా ఆయన సామర్ధ్యంపై,ఆయన ఏకత్వంపై సూచించే ఆయన గొప్ప సూచనల్లోంచి ఓ పురుషులారా మీ కొరకు మీ కోవలో నుండే భార్యలను మీ మధ్య సజాతియత కొరకు వారి వద్ద మీరు మీ స్వయం కొరకు మనశ్శాంతిని పొందటం కొరకు సృష్టించటం. మరియు మీ మధ్య,వారి మధ్య ప్రేమను,అనురాగమును కలిగించటం. నిశ్ఛయంగా ఈ ప్రస్తావించబడిన వాటిలో యోచన చేసే జనుల కొరకు స్పష్టమైన ఆధారాలు,ఋజువులు కలవు. ఎందుకంటే వారే తమ బుద్దులను ఉపయోగించి ప్రయోజనం చెందుతారు.
(22) మరియు ఆయన సామర్ధ్యంపై,ఆయన ఏకత్వంపై సూచించే ఆయన గొప్ప సూచనల్లోంచి : ఆకాశములను సృష్టించటం,భూమిని సృష్టించటం మరియు వాటిలో నుండే మీ భాషలు వేరువేరుగా ఉండటం,మీ రంగులు వేరు వేరుగా ఉండటం. నిశ్ఛయంగా ఈ ప్రస్తావించబడిన వాటిలో జ్ఞానం,అంతర్దృష్టి కలవారి కొరకు ఆధారాలు,సూచనలు కలవు.
(23) మరియు ఆయన సామర్ధ్యంపై,ఆయన ఏకత్వంపై సూచించే ఆయన గొప్ప సూచనల్లోంచి మీరు మీ పనుల నుండి కలిగిన అలసట నుండి విశ్రాంతి పొందటానికి రాత్రి పూట మీరు నిదురపోవటం,పగటి పూట మీరు నిదురపోవటం. మరియు ఆయన సూచనల్లోంచి మీ కొరకు పగలును చేయటం అందులో మీరు మీ ప్రభువు వద్ద నుండి ఆహారోపాధిని అన్వేషిస్తూ వ్యాప్తి చెందటానికి. నిశ్ఛయంగా ఈ ప్రస్తావించబడిన వాటిలో యోచన చేసి,వినటమును స్వీకరించే ఉద్దేశంతో వినే జనుల కొరకు ఆధారాలు,సూచనలు కలవు.
(24) మరియు ఆయన సామర్ధ్యం పై, ఆయన ఏకత్వంపై సూచించే ఆయన గొప్ప సూచనల్లోంచి ఆకాశములో మీకు మెరుపును చూపించటం మరియు అందులో మీ కొరకు గర్జనల నుండి భయము,వర్షము నుండి ఆశ మధ్య సమీకరించటం మరియు ఆకాశము నుండి మీ కొరకు వర్షపు నీటిని కురిపించి భూమి ఎండిపోయిన తరువాత అందులో మొలకెత్తే మొక్కల ద్వారా జీవం పోయటం. నిశ్చయంగా వీటిలో బుద్ధిమంతులకి స్పష్టమైన ఆధారాలు,సూచనలు కలవు. వారు వాటి ద్వారా మరణాంతరం లెక్క తీసుకోబడటం,ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు మరల లేపబడటం పై ఆధారాలను స్వీకరిస్తారు.
(25) మరియు అల్లాహ్ సామర్ధ్యమును,ఆయన ఏకత్వమును సూచించే ఆయన సూచనల్లోంచి ఆకాశము పడిపోకుండా మరియు భూమి ధ్వంసం అవకుండా పరిశుద్ధుడైన ఆయన ఆదేశముతో నెలకొని ఉండటం. ఆ పిదప పరిశుద్ధుడైన ఆయన దైవ దూత బాకాలో ఒక ఊదటం ద్వారా మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు లెక్క తీసుకోబడటం,ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు మీ సమాదుల నుండి వెలికి వస్తారు.
(26) ఆకాశముల్లో ఉన్న వారు మరియు భూమిలో ఉన్న వారు అధికార పరంగా,సృష్టి పరంగా,విధి వ్రాత పరంగా ఆయన ఒక్కడి కొరకే. ఆయన సృష్టితాల్లో నుంచి ఆకాశముల్లో ఉన్న వారు,భూమిలో ఉన్న వారు ఆయనకే లోబడి ఉన్నారు మరియు ఆయన ఆదేశమునకే కట్టుబడి ఉన్నారు.
(27) మరియు పరిశుద్ధుడైన ఆయనే పూర్వ నమూనా లేకుండా సృష్టిని ప్రారంభించినవాడు. ఆ తరువాత దాన్ని నాశనం చేసిన తరువాత ఆయనే దానిని మరలింపజేస్తాడు. ప్రారంభించటం కన్న మరలింపజేయటమే ఎంతో సులభము. మరియు ఆ రెండు కూడా ఆయనకు సులభమే ఎందుకంటే ఆయన దేనినైన కోరినప్పుడు దానితో (కున్) నీవు అయిపో అంటాడు. అప్పుడు అది అయిపోతుంది. మరియు మహత్వము,పరిపూర్ణ గుణాల్లో నుంచి ఆయనకు వర్ణించబడిన ప్రతి దానిలో అధిక వర్ణత ఆయన అజ్జ వ జల్ల (సర్వ శక్తిమంతుడు,మహోన్నతుడు) కొరకే. మరియు ఆయన ఓటమి లేని సర్వ శక్తిమంతుడు మరియు తన సృష్టించటంలో,తన పర్యాలోచనలో వివేకవంతుడు.
(28) ఓ ముష్రికులారా అల్లాహ్ మీలో నుండి తీసుకొనబడిన ఒక ఉపమానమును మీ కొరకు తెలియపరుస్తున్నాడు : మీ బానిసల్లో నుంచి,మీ ఆదీనంలో ఉన్న వారిలో నుంచి మీ సంపదల్లో సమానముగా భాగస్వామి అయ్యే ఎవరైన భాగస్వామి ఉన్నారా, ఏ విధంగానైతే మీలో నుండి కొందరు తమ స్వతంత్ర భాగ స్వామి తనతోపాటు సంపదను పంచుకుంటాడని భయపడుతారో ఆ విధంగా వారు మీతోపాటు మీ సంపదలను పంచుకుంటారని భయపడుతున్నారా ?. ఏమీ మీరు దీనిని మీ బానిసల నుండి మీ స్వయం కొరకు ఇష్టపడుతారా ?. మీరు దాన్ని ఇష్టపడకపోవటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అల్లాహ్ తన రాజ్యాధికారములో తన సృష్టితాల్లో నుంచి,తన దాసుల్లో నుంచి ఎటువంటి సాటి లేకపోవటంలో ఎక్కువ హక్కు దారుడు. ఇటువంటి ఉపమానములను,ఇతర వాటిని తెలిపి మేము వాదనలను,ఆధారాలను వాటి విభిన్న రూపములలో బుద్ధిగల జనులకు స్పష్టపరుస్తాము. ఎందుకంటే వారే వాటి ద్వారా ప్రయోజనం చెందుతారు.
(29) వారి మార్గ భ్రష్టతకు కారణం ఆధారాల్లో లోపమూ కాదు మరియు వాటిలో స్పష్టత లేకపోవటమూ కాదు. కేవలం మనోవాంఛలను అనుసరించటం,తమ తాత ముత్తాతలను అనుకరించటం మాత్రమే. అల్లాహ్ ఎవరినైతే మార్గభ్రష్టతకు లోను చేస్తాడో వాడికి ఎవరు సన్మార్గము కొరకు భాగ్యమును కలిగిస్తాడు ?!. ఎవడూ అతడికి భాగ్యమును కలిగించడు. మరియు అల్లాహ్ శిక్షను వారి నుండి తొలగించే సహాయకులు వారి కొరకు ఉండరు.
(30) అయితే ఓ ప్రవక్తా మీరు,మీతోపాటు ఉన్న వారు అన్నీ ధర్మాల నుండి వాలి అల్లాహ్ మిమ్మల్ని ఏ ధర్మం వైపునకు మరల్చాడో ఆ ధర్మం వైపునకు మరలండి. అది ఇస్లాం ధర్మం దాని (స్వభావం) పైనే అల్లాహ్ మానవులందరిని సృష్టించాడు. అల్లాహ్ సృష్టిలో ఎటువంటి మార్పు జరగదు. ఎటువంటి వంకరతనం లేని సరైన ధర్మము ఇది. కానీ చాలా మంది ప్రజలకు సత్యధర్మము అన్నది ఈ ధర్మము అని తెలియదు.
(31) మరియు మీరు పరిశుద్ధుడైన ఆయన వైపునకు మీ పాపముల నుండి పశ్చాత్తాప్పడుతూ మరలండి. మరియు మీరు ఆయన ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ ఆయన భీతి కలిగి ఉండండి. మరియు మీరు నమాజును దాని పరిపూర్ణ పధ్ధతిలో పూర్తి చేయండి. మరియు స్వభావానికి విరుద్ధంగా చేసి తమ ఆరాధనల్లో అల్లాహ్ తో పాటు ఇతరులను సాటి కల్పించే ముష్రికుల్లోంచి మీరు కాకండి.
(32) మరియు తమ ధర్మమును మార్చుకుని అందులోని కొన్నిటిని విశ్వసించి,కొన్నిటిని తిరస్కరించే ముష్రికుల్లోంచి మీరు కాకండి. మరియు వారు వర్గములుగా,తెగలుగా అయిపోయారు. వారిలో నుండి ప్రతీ తెగ తాము ఉన్న అసత్యముపై సంతోషముగా ఉన్నది. వారిలో తాము ఒక్కటే సత్యముపై ఉన్నారని,ఇతరులు అసత్యముపై ఉన్నారని వారు భావించేవారు.
(33) మరియు ముష్రికులకు ఏదైన రోగము వలన లేదా పేదరికం వలన లేదా కరువు వలన ఏదైన ఆపద వచ్చినప్పుడు వారు తమకు కలిగిన ఆపదను తమ నుండి తొలగించమని వారు పరిశుద్ధుడైన,ఒక్కడైన తమ ప్రభువును కడు వినయంతో,ప్రార్ధనతో ఆయన వైపునకు మరలుతూ వేడుకునేవారు. ఆ పిదప ఆయన వారికి కలిగిన ఆపదను తొలగించి వారిపై కనికరించినప్పుడు వారిలో నుంచి ఒక వర్గము దుఆలో అల్లాహ్ తో పాటు ఇతరులను సాటి కల్పించటం వైపునకు మరలిపోయేవారు.
(34) అప్పుడు వారు అల్లాహ్ అనుగ్రహముల పట్ల కృతఘ్నులైపోయేవారు - మరియు వాటిలో నుండి ఆపదను తొలగించిన అనుగ్రహము ఉన్నది. మరియు వారు ఇహలోకములో వారి ముందట ఉన్న వాటితో ప్రయోజనం చెందుతారు. వారు తొందరలోనే ప్రళయ దినమున తమ కళ్ళతో తాము స్ఫష్టమైన మార్గ భ్రష్టతలో ఉన్న దాన్ని చూస్తారు.
(35) వారి కొరకు ఎటువంటి ఆధారం లేకుండా అల్లాహ్ తో పాటు సాటి కల్పించటం వైపునకు వారిని ఏది పిలిచినది ?! వారు అల్లాహ్ తో పాటు తమ సాటి కల్పించటంపై ఆధారము చూపే ఎటువంటి పుస్తకమును వారిపై ఆధారంగా మేము అవతరింపజేయలేదు. మరియు వారితో పాటు వారి షిర్కు గురించి మట్లాడే, వారు ఉన్న అవిశ్వాసము సరైనదని వారి కొరకు నిరూపించే ఎటువంటి పుస్తకము లేదు.
(36) మరియు మేము ప్రజలకు మా అనుగ్రహాల్లోంచి ఆరోగ్యము, ఐశ్వర్యము లాంటి ఏదైన అనుగ్రహము రుచిని చూపించినప్పుడు వారు అహంకార సంతోషమును చూపుతారు మరియు గర్విస్తారు. మరియు ఒక వేళ వారికి వారు తమ చేజేతులా చేసుకున్న పాపము వలన బాధను కలిగించే రోగము,పేదరికం కలిగితే అప్పుడు వారు అల్లాహ్ కారుణ్యము నుండి నిరాశ్యులైపోతారు. మరియు వారు వారిని బాధ కలిగించేది తొలగిపోవటం నుండి నిరాశ్యులైపోతారు.
(37) ఏమీ వారు చూడటం లేదా అల్లాహ్ తన దాసుల్లోంచి తాను కోరిన వారికి అతనికి పరీక్షగా ఆహారోపాధిని విస్తరింపజేస్తాడు అతడు కృతజ్ఞత తెలుపుకుంటాడా లేదా కృతఘ్నుడవుతాడా(అని) ?. మరియు వారిలో నుంచి తాను కోరున్న వారిపై దాన్ని (ఆహారోపాధిని) అతని పరీక్ష కొరకు కుదించివేస్తాడు అతడు సహనం చూపుతాడా లేదా అసహనానికి గురవుతాడా(అని) ?! కొందరిపై ఆహారోపాధిని విస్తరింపజేయటంలో,కొందరిపై దాన్ని కుదించటంలో విశ్వాసపరుల కొరకు అల్లాహ్ దయ,ఆయన కారుణ్యముపై సూచనలు కలవు.
(38) అయితే ఓ ముస్లిమ్ నీవు బంధువులకు వారి హక్కు అయిన మంచితనము,బంధమును కలపటమును ఇవ్వు. మరియు అవసరం కలవాడికి అతని అవసరమును తీర్చే దాన్ని ఇవ్వు. మరియు తన ఊరి నుండి దారి తెగిపోయిన బాట సారికి ఇవ్వు. ఈ మార్గముల్లో ఇవ్వటం దానితో అల్లాహ్ మన్నతను కోరుకునే వారికి మేలైనది. ఎవరైతే ఈ సహాయమును,హక్కులను నెరవేరుస్తారో వారే తాము ఆశించే స్వర్గమును పొంది,తాము భయపడే శిక్ష నుండి భద్రంగా ఉండటంతో సాఫల్యం చెందుతారు.
(39) మరియు మీరు సంపదల్లోంచి ఏదైన ప్రజల్లోంచి ఎవరికైన వారు మీకు అధికం చేసి ఇస్తారని చెల్లిస్తే అల్లాహ్ వద్ద దాని ప్రతిఫలము పెరగదు. మరియు మీరు మీ సంపదల్లోంచి ఏదైన అవసరమును తీర్చటానికి ఇచ్చి దానితో మీరు అల్లాహ్ మన్నతను కోరుకుంటారు. మీరు ప్రజల నుండి ఎటువంటి స్థానమును గాని ఎటువంటి పుణ్యమును గాని కోరుకోరు. వారందరి కొరకు అల్లాహ్ వద్ద పుణ్యము రెట్టింపు చేయబడుతుంది
(40) మిమ్మల్ని సృష్టించటంలో,ఆ తరువాత మీకు ఆహారోపాధి సమకూర్చటంలో,ఆ తరువాత మీకు మరణమును కలిగించటంలో,ఆ తరువాత మరణాంతరం లేపటం కొరకు మిమ్మల్ని జీవింపజేయటంలో అద్వితీయమైనవాడు అల్లాహ్ ఒక్కడే. ఏ మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్న మీ విగ్రహాల్లోంచి ఎవరైన వీటిలో నుండి ఏదైన చేయగలవా ?! ముష్రికులు పలుకుతున్న,విశ్వసిస్తున్న వాటి నుండి ఆయన అతీతుడు మరియు పరిశుద్ధుడు.
(41) భూమిపై,సముద్రంలో ప్రజల జీవనోపాధిలో కొరతతో మరియు వారి స్వయంలో రోగాలు,అంటు వ్యాధుల కలగటంతో వారు చేసుకున్నపాపముల వలన ఉపద్రవం తలెత్తింది. అల్లాహ్ వారికి వారు ఆయన వైపునకు పశ్చాత్తాపముతో మరలుతారని ఆశిస్తూ ఇహలోకములోని వారి కొన్ని పాపకార్యముల ప్రతిఫలము రుచిని చూపించటానికి ఇది సంభవించింది.
(42) ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : మీరు భూమిలో సంచరించి మీ కన్న పుర్వ తిరస్కార జాతుల ముగింపు ఎలా అయ్యిందో యోచన చేయండి. నిశ్చయంగా చెడు పరిణామం జరిగింది. వారిలో నుండి చాలా మంది అల్లాహ్ తోపాటు సాటి కల్పించేవారు ఉండేవారు. ఆయనతో పాటు ఇతరులను ఆరాధించేవారు. అల్లాహ్ తో పాటు వారు భాగస్వామ్యం కలపటం వలన వారు నాశనం చేయబడ్డారు.
(43) అయితే ఓ ప్రవక్తా మీరు మీ ముఖమును ఎటువంటి వంకరతనం లేని సరైన ధర్మము ఇస్లాం కొరకు ప్రళయం రాక ముందే స్థిరంగా ఉంచండి. అది వచ్చినప్పుడు దాన్ని మరల్చేవాడుండడు. ఆ రోజు ప్రజలు వర్గములుగా వేరైపోతారు. ఒక వర్గము స్వర్గములో సుఖభోగాలను అనుభవిస్తూ ఉంటుంది. ఇంకొక వర్గము నరకాగ్నిలో శిక్షించబడుతుంది.
(44) మరియు ఎవరైతే అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరుస్తాడో అతని అవిశ్వాసము యొక్క నష్టము - అది నరకాగ్నిలో శాస్వతంగా ఉండటం - అతని పైనే మరలి వస్తుంది. మరియు ఎవరైతే సత్కర్మను చేసి దాని ద్వారా అల్లాహ్ మన్నతను ఆశిస్తాడో తమ స్వయం కొరకు వారు స్వర్గ ప్రవేశమును,అందులో ఉన్నవాటితో సుఖభోగాలను అనుభవించటమును తయారు చేసుకుంటారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.
(45) ఎవరైతే అల్లాహ్ పట్ల విశ్వాసమును కనబరచి తమ ప్రభువును ప్రసన్నుడిని చేసే సత్కార్యములు చేస్తారో వారికి ఆయన ప్రతిఫలమును ప్రసాదించటానికి. నిశ్చయంగా పరిశుద్ధుడైన ఆయన తన పట్ల ,తన ప్రవక్తల పట్ల అవిశ్వాసమును కనబరిచే వారిని ఇష్టపడడు. అంతేకాదు అత్యంత తీవ్రంగా ధ్వేషిస్తాడు. మరియు ఆయన తొందలోనే ప్రళయ దినాన వారిని శిక్షిస్తాడు.
(46) మరియు ఆయన సామర్ధ్యంపై,ఆయన ఏకత్వంపై సూచించే ఆయన గొప్ప సూచనల్లోంచి ఆయన వర్షం కురవటము దగ్గరవటం గురించి దాసులకు శుభవార్తనిచ్చే గాలులను పంపటం. మరియు ఓ ప్రజలాారా ఆయన మీకు వర్షం కురిసిన తరువాత సంభవించే సస్యశ్యామలం, కలిమి ద్వారా తన కారుణ్య రుచిని చూపించటానికి మరియు ఆయన ఇచ్చతో సముద్రములో ఓడలు పయనించటానికి మరియు మీరు వ్యాపారం ద్వారా సముద్రంలో ఆయన అనుగ్రహమును అన్వేషించటానికి. బహుశా మీరు మీపై ఉన్న అల్లాహ్ అనుగ్రహాలపై కృతజ్ఞతలు తెలుపుకుంటే ఆయన మీకు వాటికన్న అధికంగా ప్రసాదిస్తాడు.
(47) మరియు ఓ ప్రవక్తా నిశ్చయంగా మేము మీ కన్న ముందు ప్రవక్తలను వారి జాతుల వద్దకు పంపించాము. అప్పుడు వారు వారి వద్దకు తమ నిజాయితీ పై సూచించే వాదనలను,ఆధారాలను తీసుకుని వచ్చారు. అప్పుడు వారు తమ ప్రవక్తలు తమ వద్దకు తీసుకుని వచ్చిన వాటిని తిరస్కరించారు. అయితే మేము దుష్కార్యములకు పాల్పడిన వారిపై ప్రతీకారము తీర్చుకున్నాము. అప్పుడు మేము వారిని మా శిక్షతో తుదిముట్టించాము. మరియు మేము ప్రవక్తలను, వారిని విశ్వసించిన వారిని వినాశనము నుండి రక్షించాము. మరియు విశ్వాసపరులని రక్షించటం,వారికి సహాయం చేయటం వాస్తవం దాన్ని మేము మా పై తప్పనిసరి చేసుకున్నాము.
(48) పరిశుద్దుడైన అల్లాహ్ ఆయనే గాలులను నడిపిస్తాడు మరియు వాటిని పంపిస్తాడు. అప్పుడు ఆ గాలులు మేఘమును పైకి లేపి దాన్ని కదిలిస్తాయి. అప్పుడు ఆయన దాన్ని ఆకాశంలో తాను కోరిన విధంగా తక్కువగా లేదా ఎక్కువగా వ్యాపింపజేస్తాడు. మరియు దాన్ని ముక్కలుగా చేస్తాడు. ఓ చూసేవాడా అప్పుడు నీవు దాని మధ్యలో నుండి వర్షమును వెలికి వస్తుండగా చూస్తావు. ఆయన దాసుల్లో నుండి ఆయన కోరిన వారికి వర్షమును చేరవేసినప్పుడు వారు తమ కొరకు వర్షమును కురిపించటం ద్వారా, దాని తరువాత నేల వారికి,వారి పశువులకు అవసరమగు వాటిని మొలకెత్తించటం ద్వారా కలిగిన అల్లాహ్ కారుణ్యముతో సంబరపడిపోతారు.
(49) మరియు వాస్తవానికి వారు తమపై అల్లాహ్ వర్షమును కురిపించక మునుపు తమపై దాని కురవటం నుండి నిరాశ్యులైపోయి ఉండేవారు.
(50) అయితే ఓ ప్రవక్తా మీరు అల్లాహ్ తన దాసుల కొరకు కారుణ్యంగా కురిపించిన వర్షము యొక్క చిహ్నముల వైపునకు చూడండి. అల్లాహ్ ఏ విధంగా భూమిని - అది తాను ఎండిపోయి,బంజరుగా అయిపోయిన తరువాత రకరకాల మొక్కలను మొలకెత్తించటం ద్వారా - జీవింపజేశాడు. నిశ్చయంగా ఎవరైతే బంజరు భూమిని జీవింపజేశాడో ఆయన మృతులను జీవింపజేస్తాడు. మరియు ఆయన అన్నింటిపై సామర్ధ్యము కలవాడు. ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు.
(51) మరియు ఒక వేళ మేము వారి పంటలపై,వారి మొక్కలపై వాటిని నాశనం చేసే గాలులను పంపిస్తే అప్పుడు వారు తమ పంటలను పచ్చగా ఉండిన తరువాత కూడా పసుపు రంగులలో చూస్తారు. వాటిని వారు అలా చూసిన తరువాత పూర్వం తమపై అధికంగా కలిగిన అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతఘ్నులైపోతారు.
(52) ఎలాగైతే నీవు మృతులను వినిపింపజాలవో మరియు చెవిటి వారిని వినిపింపజాలవో వాస్తవానికి వారు తమ వినకపోవటమును నిర్ధారించుకోవటానికి నీ నుండి దూరమైపోయారు. అలాగే విముఖత చూపటంలో,ప్రయోజనం చెందక పోవటంలో వీరందరిని పోలిన వారిని మీరు సన్మార్గం చూపజాలరు.
(53) మరియు నీవు సన్మార్గము నుండి తప్పిపోయిన వాడిని ఋజు మార్గం పై నడిపించటం వైపునకు భాగ్యం కలిగించే వాడివి కావు. నీవు కేవలం మా ఆయతులను విశ్వసించే వారిని మాత్రమే ప్రయోజనం చెందే విధంగా వినిపించగలవు. ఎందుకంటే వాడే నీవు పలికిన వాటి ద్వారా ప్రయోజనం చెందుతాడు. అయితే వారు మా ఆదేశమునకు కట్టుబడి ఉంటారు,దానికి విధేయులై ఉంటారు.
(54) ఓ ప్రజలారా అల్లాహ్ యే మిమ్మల్ని నీచపు నీటితో సృష్టించాడు. ఆ తరువాత మీ బాల్య బలహీనత తరువాత మీ యవ్వన బలమును తయారు చేశాడు. ఆ తరువాత యవ్వన బలము తరువాత వృద్ధాప్య,ముసలితనం యొక్క బలహీనతను తయారు చేశాడు. ఆయన ప్రతీది తెలిసిన వాడు. ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. ఏది కూడా ఆయనను ఓడించని సర్వసమర్ధుడు.
(55) ప్రళయము నెలకొనే రోజు అపరాధులు తాము తమ సమాధులలో ఒక ఘడియ మాత్రమే ఉన్నారని ప్రమాణాలు చేస్తారు. వారు ఏవిధంగా తమ సమాధులలో ఉండిన లెక్కను గుర్తించటం నుండి మరలించబడ్డారో అదే విధంగా ఇహలోకములో సత్యము నుండి మరలిపోయారు.
(56) మరియు అల్లాహ్ జ్ఞానమును ప్రసాదించినటువంటి ప్రవక్తలు,దైవ దూతలు ఇలా పలుకుతారు : నిశ్చయంగా మీరు అల్లాహ్ తన ముందస్తు జ్ఞానంలో వ్రాసిన దానిలో మీ పుట్టుక దినము నుండి మీరు తిరస్కరించిన మరణాంతరం మీరు లేపబడే దినం వరకు ఉన్నారు. కాని మీరు మరణాంతరం లేపబడటము వాటిల్లుతుందన్న విషయాన్ని తెలుసుకోలేకపోయారు. కాబట్టి మీరు దాన్ని తిరస్కరించారు.
(57) అయితే అల్లాహ్ సృష్టిని లెక్క తీసుకోవటం కొరకు,ప్రతిఫలం ప్రసాదించటం కొరకు మరణాంతరం లేపే రోజు దుర్మార్గులు కల్పించుకున్న సాకులు ప్రయోజనం కలిగించవు. మరియు తౌబా ద్వారా,ఆయన వైపు మరలటం ద్వారా అల్లాహ్ కు సంతుష్టం కలిగించమని కూడా వారితో కోరబడదు ఎందుకంటే దాని సమయం కూడా అయిపోయింది.
(58) మరియు నిశ్చయంగా మేము ఈ ఖుర్ఆన్ లో ప్రజల కొరకు వారి పట్ల శ్రద్ధ చూపుతూ ప్రతీ ఉపమానమును వారికి అసత్యము నుండి సత్యము స్పష్టమవటానికి తెలిపాము. ఓ ప్రవక్తా ఒక వేళ మీరు వారి వద్దకు మీ నిజాయితీ పై ఏదైన వాదనను తీసుకుని వస్తే అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచే వారు మీరు తీసుకుని వచ్చిన దానిలో మీరు కేవలం మిథ్యా వాదులే అని తప్పకుండా అంటారు.
(59) మీరు ఏదైన సూచనను తీసుకుని వస్తే దాని పట్ల విశ్వాసమును కనబరచని వీరందరి హృదయములపై ఈ ముద్రను వేసిన విధంగానే అల్లాహ్ మీరు తీసుకుని వచ్చినది సత్యము అని తెలుసుకోని అందరి హృదయములపై ముద్ర వేస్తాడు.
(60) అయితే ఓ ప్రవక్తా మీరు మీ జాతి వారు మిమ్మల్ని తిరస్కరించిన దానిపై సహనం చూపండి. నిశ్చయంగా మీ కొరకు విజయం,సాధికారత గరించి అల్లాహ్ వాగ్దానం ఏ విధమైన సందేహం లేకండా నిరూపితమవుతుంది. మరియు మరణాంతరం మరల లేపబడుతారని విశ్వసించని వారు మిమ్మల్ని తొందరపెట్టటానికి,సహనమును వదిలివేయటానికి పురగొల్పకూడదు.