(1) నిశ్చయంగా మేము మీ హృదయమును మీ కొరకు విస్తరింపజేశాము. కాబట్టి మేము వహీని పొందటమును మీవద్ద ఇష్టమైనదిగా చేశాము.
(2) మరియు మీ మునుపటి పాపాలకు మేము మిమ్మల్ని క్షమించాము మరియు మీరు ఉన్న అజ్ఞానపు రోజుల బరువును మేము తొలగించాము
(3) ఏదైతే మిమ్మల్ని అలసింపజేసి చివరికి అది మీ వెన్నును విరిచివేయటానికి దగ్గరగా ఉన్నదో.
(4) మరియు మేము మీ చర్చను మీ కొరకు పైకి లేపాము. అజాన్ లో మరియు ఇఖామత్ లో మరియు ఇతరవాటిలో మీ ప్రస్తావన జరిగినది.
(5) నిశ్చయంగా కఠినం,కుదింపుతో పాటు సులభము,విశాలము ఉంది.
(6) నిశ్చయంగా కఠినం,కుదింపుతో పాటు సులభము,విశాలము ఉంది. మీరు ఇది తెలుసుకున్నప్పుడు మీ జాతి వారి బాధపెట్టటం మీకు భయాందోళనకు గురి చేయకూడదు. మరియు అల్లాహ్ వైపు పిలవటం నుండి మిమ్మల్ని నిరోధించకూడదు.
(7) మీకు మీ పనుల నుండి తీరిక దొరికి మీరు వాటిని పూర్తి చేసినప్పుడు మీ ప్రభువును ఆరాధించడానికి కృషి చేయండి.
(8) మరియు మీ కోరికను మరియు మీ ఉద్దేశమును ఒక్కడైన అల్లాహ్ కి మాత్రమే చేయండి.