(1) పరిశుద్ధుడైన అల్లాహ్ అసర్ వేళపై ప్రమాణం చేశాడు.
(2) నిశ్చయంగా మానవుడు నష్టములో,వినాశనంలో ఉన్నాడు.
(3) కాని అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించి సత్కర్మలు చేసిన వారు మరియు ఒకరినొకరు సత్యము గురించి మరియు సత్యముపై సహనమును చూపటం గురించి బోధించుకున్న వారు. ఈ గుణములను కలిగిన వారు తమ ఇహపరాల జీవితంలో సాఫల్యం పొందుతారు.