19 - Maryam ()

|

(1) (كٓهيعٓصٓ) కాఫ్ - హా - యా - ఐన్ - సాద్.సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.

(2) ఇది తన దాసుడు జకరియ్యా అలైహిస్సలాం పై నీ ప్రభువు యొక్క కారుణ్యము యొక్క ప్రస్తావన.దాని ద్వారా గుణపాఠం నేర్చుకోవటానికి మేము దాన్ని మీకు తెలియపరుస్తున్నాము.

(3) అతడు పరిశుద్ధుడైన తన ప్రభువును ఏకాంతంలో స్వీకరించబడటానికి అత్యంత దగ్గరవటానికి మొరపెట్టుకున్నప్పుడు.

(4) ఇలా పలికాడు : ఓ నా ప్రభువా నా ఎముకలు బలహీనమైపోయాయి, నా తల వెంట్రుకలు చాలా తెల్లబడిపోయాయి, నీతో నేను మొర పెట్టుకున్నప్పుడు నేను విఫలం కాలేదు. అంతే కాక నేను నిన్ను మొరపెట్టుకున్నప్పుడల్లా నీవు నన్ను స్వీకరించావు.

(5) నిశ్చయంగా నా దగ్గరి బందువులు నా తదనంతరం వారు ఇహలోకపు విషయాల్లో మునిగి ఉండటం వలన ధర్మము యొక్క హక్కును నెరవేర్చరని భయపడుతున్నాను. నా భార్య ఏమో జన్మనివ్వని గొడ్రాలు.కాబట్టి నీవు నీ వద్ద నుండి నాకు ఒక సహాయకుడిగా ఒక కుమారుడిని ప్రసాధించు.

(6) అతడు దైవదౌత్యంలో నాకు వారసుడవుతాడు. మరియు అందులో యాఖూబ్ సంతతి వారికి వారసుడవుతాడు. ఓ నా ప్రభువా నీవు అతడిని తన ధర్మములో,తన గుణములలో,తన జ్ఞానములో ప్రీతిపాత్రునిగా చేసుకో.

(7) అప్పుడు అల్లాహ్ అతని దుఆను స్వీకరించి అతడిని పిలిచి ఇలా పలికాడు : ఓ జకరియ్యా నిశ్చయంగా మేము నీకు సంతోషమును కలిగించే మాటను తెలియపరిచాము. నిశ్చయంగా మేము మీ దుఆను స్వీకరించాము. మరియు మేము నీకు ఒక కుమారుడిని ప్రసాధించాము అతని పేరు యహ్యా. అతనికన్న ముందు మేము ఈ నామమును ఇంకెవరికీ పెట్టలేదు.

(8) జకరియ్యా అల్లాహ్ సామర్ధ్యముపై ఆశ్చర్యపడుతూ ఇలా పలికారు : ఎలా నాకు కుమారుడు కలుగుతాడు. వాస్తవానికి నా భార్య జన్మనివ్వని గొడ్రాలు,నేనేమో వృద్ధాప్యపు ఆఖరి దశకు చేరుకున్నాను,నా ఎముకలు బలహీనమైపోయినవి ?.

(9) దైవ దూత ఇలా పలికాడు : విషయం నీవు పలికినట్లుగానే నీ భార్య జన్మనివ్వలేదు. మరియు నీవు వృద్ధాప్యపు చివరి దశకు చేరుకున్నావు. మరియు ఎముకలు బలహీనమైపోయాయి. కానీ నీ ప్రభువు ఇలా పలుకుతున్నాడు : గొడ్రాలైన ఒక తల్లి మరియు వృద్ధాప్యపు చివరి దశకు చేరుకున్న ఒక తండ్రి నుండి నీ ప్రభువు యహ్యాను సృష్టించటం సులభము. ఓ జకరియ్యా వాస్తవానికి నేను నిన్ను ఇంతకు ముందు నీవు ప్రస్తావించబడ్డ వస్తువుగా లేనప్పుడే సృష్టించాను. ఎందుకంటే (అప్ఫుడు) నీవు ఉనికిలో లేవు.

(10) జకరియ్యా అలైహిస్సలాం ఇలా పలికారు : ఓ నా ప్రభువా నీవు నాకు ఒక సూచనను ఇవ్వు . అది దైవ దూతలు శుభవార్త ఇచ్చినది సంభవించటమును సూచించాలి దాని ద్వారా నేను సంతృప్తి చెందుతాను. ఆయన ఇలా పలికాడు : నీవు శుభవార్తనివ్వబడినది సంభవించటానికి నీ సూచన ఏమిటంటే ఎటువంటి రోగము లేకుండా నీవు మూడు రాత్రులు (రోజులు) ప్రజలతో సంభాషించలేవు. అంతేకాదు నీవు స్వస్థతతో ఎటువంటి అనారోగ్యం లేకుండా ఉంటావు.

(11) అప్పుడు జకరియ్యా తన ప్రార్ధన ప్రదేశము నుండి తన జాతి వారి వద్దకు వచ్చి వారితో మాట్లాడకుండా పరిశుద్ధుడైన అల్లాహ్ ను దినపు మొదటి వేళలో,దాని చివరి వేళలో పరిశుద్ధతను కొనియాడమని సైగతో చెప్పేవారు.

(12) అయితే ఆయనకు యహ్యా జన్మించారు. ఆయన సంబోధించే వయస్సుకు చేరుకున్నప్పుడు మేము ఆయనతో ఇలా పలికాము : ఓ యహ్యా మీరు తౌరాతును గంభీరతతో,కృషితో పట్టుకోండి. మరియు మేము ఆయనకు అవగాహనను,జ్ఞానమును,గంభీరతను,దృఢ సంకల్పమును ఆయన బాల్య వయస్సులోనే ప్రసాధించాము.

(13) మరియు మేము మా వద్ద నుండి అతనిపై కారుణ్యాన్ని ప్రసాధించి అతన్ని పాపములనుండి పరిశుద్ధపరచాము. మరియు అతడు అల్లాహ్ ఆదేశాలను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి దైవభీతి గలవాడయ్యాడు.

(14) మరియు అతడు తన తల్లిదండ్రుల పట్ల కర్తవ్యపాలకుడిగా,వారిద్దరిపై దయ కలవాడిగా,వారి పట్ల మంచిగా మెలిగేవాడిగా అయ్యాడు. అతడు తన ప్రభువుపై విధేయత చూపటం నుండి,వారిద్దరిపై విధేయత చూపటం నుండి అహంకారమును చూపలేదు,తన ప్రభువు పట్ల లేదా తన తల్లిదండ్రులపట్ల అవిధేయుడు కాలేదు.

(15) మరియు అతనిపై అతను జన్మించిన రోజు,అతను మరణించి ఈ జీవితము నుండి వైదొలిగే రోజు,ప్రళయ దినాన జీవింపజేయబడి మరల లేపబడే రోజు అల్లాహ్ తరపు నుండి శాంతి,ఆయన వద్ద నుండి భద్రత కలుగుగాక. ఈ మూడు ప్రదేశాలు మానవునిపై గడిచే అత్యంత భయంకరమైనవి. అతడు వాటిలో భద్రంగా ఉన్నప్పుడు వేరే వాటిలో అతనిపై భయం లేదు.

(16) ఓ ప్రవక్తా మీపై అవతరింపబడిన ఖుర్ఆన్ లో మర్యమ్ అలైహస్సలాం తన ఇంటివారి నుండి వేరై వారికి తూర్పు దిశలో ఒక ప్రదేశంలో ఏకాంతంలో వెళ్ళిపోయినప్పటి వార్తను గుర్తు చేసుకోండి.

(17) అప్పుడు ఆమె తన ప్రభువు కొరకు చేసుకునే తన ఆరాధనను తన జాతి వారు చూడకుండా ఉండటానికి ఒక అడ్డు తెరను తన స్వయం కొరకు ఏర్పాటు చేసుకుంది. అప్పుడు మేము ఆమె వద్దకు జిబ్రయీల్ అలైహిస్సలాంను పంపించాము. అప్పుడు ఆయన పుట్టుకలో సంపూర్ణ మానవుని రూపములో ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆమె ఆయన ఆమె పట్ల దురుద్దేశమును కలిగి ఉన్నాడేమోనని భయపడింది.

(18) ఎప్పుడైతే ఆమె అతనిని సంపూర్ణ మానవుని రూపములో తనవైపునకు రావటమును చూసినదో ఇలా పలికింది : నిశ్చయంగా నేను నీ నుండి చెడు పొందటం నుండి అనంత కరుణామయుడి శరణును కోరుకుంటున్నాను. ఓహ్ ఇది ఒక వేళ నీవు దైవభీతి కలవాడివయితే అల్లాహ్ తో భయపడు.

(19) జిబ్రయీల్ అలైహిస్సలాం ఇలా సమాధానమిచ్చారు : నేను మనిషిని కాను.నేను మాత్రం నీ ప్రభువు తరపు నుండి పంపించబడ్డ దూతను,ఆయన నేను నీకు పరిశుద్ధుడైన,సుశీలుడైన ఒక కుమారునిని ప్రసాధించటానికి నన్ను నీ వద్దకు పంపించాడు.

(20) మర్యమ్ అలైహస్సలాం ఆశ్చర్యపోయి ఇలా అడిగారు : నాకు ఎలా కుమారుడు కలుగుతాడు. వాస్తవానికి నా వద్దకు ఏ భర్త గానీ వేరే వారు గానీ రాలేదు. అలాగే నాకు కుమారుడు కలగటానికి నేను వ్యభిచారిణిని కాను ?!.

(21) జిబ్రయీలు ఆమెతో ఇలా పలికారు : నిన్ను ఏ భర్తా గాని వేరెవరూ గాని తాకలేదని,నీవు వ్యభిచారిణీ కాదని విషయము నీవు ప్రస్తావించినట్లే. కానీ పరిశుద్ధుడైన నీ ప్రభువు ఇలా పలికాడు : ఏ తండ్రి లేకుండా పిల్లవాడిని సృష్టించటం నాకు సులభము. మరియు నీకు ప్రసాధించబడిన పిల్లవాడు అల్లాహ్ సామర్ధ్యము పై ప్రజల కొరకు ఒక సూచన మరియు నీ కొరకు ఆయన పై విశ్వాసమును కనబరచిన వారి కొరకు మా వద్ద నుండి ఒక కారుణ్యం కావటానికి. మరియు ఈ నీ కుమారుని పుట్టుక అల్లాహ్ వద్ద నుండి తీర్పు నిర్ణయించబడి ఉంది,లౌహె మహ్ఫూజ్ లో వ్రాయబడి ఉంది.

(22) అప్పుడు దూత ఊదిన తరువాత ఆమె అతనిని (బాలుడి) గర్భంలో భరించింది. ఆ తరువాత అతనితో (గర్భంతో) ప్రజల నుండి దూర ప్రాంతమునకు వేరై వెళ్ళిపోయింది.

(23) అయితే ఆమెకు పురిటినొప్పులు కలిగాయి. అవి ఆమెను ఒక ఖర్జూరపు చెట్టు మొదలు వద్దకు చేర్చాయి. మర్యమ్ అలైహస్సలాం ఇలా పలికారు : అయ్యో నేను ఈ రోజు కన్న ముందే చనిపోతే బాగుండేది. మరియు నా గురించి చెడుగా భావించకుండా ఉండటానికి నేను చర్చించదగని వస్తువైపోవల్సింది.

(24) అప్పుడు ఆమె పాదముల క్రింది నుండి ఈసా ఆమెను పిలిచి ఇలా పలికారు : మీరు దుఃఖించకండి. నిశ్చయంగా మీ ప్రభువు మీ క్రింద ఒక సెలయేరును తయారు చేశాడు. మీరు దాని నుండి త్రాగుతారు.

(25) మరియు నీవు ఖర్జూరపు చెట్టు మొదలు పట్టుకుని దాన్ని ఊపు నీపై ఆ ఘడియలోనే కోయబడిన తాజా పండిన ఖర్జూరములు రాలుతాయి.

(26) అయితే నీవు పండిన ఖర్జూర పండ్లు తిని,నీటిని త్రాగు. నీకు కలిగిన సంతానము పట్ల మనస్సు కుదుటపరుచుకో,దుఃఖించకు. ప్రజల్లోంచి ఎవరినైన పుట్టిన పిల్లవాడి సమాచారము గురించి ప్రశ్నిస్తుండగా నీవు గమనిస్తే అతనితో ఇలా పలుకు : నిశ్చయంగా నేను ఈ రోజు నా ప్రభువు కొరకు నాపై మౌనాన్ని అనివార్యము చేసుకున్నాను. కావున నేను ఈ రోజు ప్రజల్లోంచి ఎవరితో మాట్లాడను.

(27) అప్పుడు మర్యమ్ తన కుమారుడిని ఎత్తుకుని తన జాతి వారి వద్దకు తీసుకుని వచ్చింది. అప్పుడు ఆమె జాతి వారు ఆమెతో అసహ్యించుకుంటూ ఇలా పలికారు : ఓ మర్యమ్ నీవు తండ్రి లేకుండా ఒక పిల్లవాడిని తీసుకుని వచ్చి ఒక పెద్ద నింద్యమైన కార్యమును చేశావు.

(28) ఓ ఆరాధనలో హారూన్ ను పోలిన దానా (ఆయన పుణ్యాత్ముడు) నీ తండ్రీ వ్యభిచారి కాదు. నీ తల్లీ వ్యభిచారిణి కాదు. నీవు పుణ్యములో ప్రసిద్ధి చెందిన పరిశుధ్ధ ఇంటి నుంచి వచ్చావు. అటువంటప్పుడు నీవు ఎలా ఏ తండ్రి లేకుండా ఒక పిల్లవాడిని తీసుకుని వచ్చావు ?!.

(29) అప్పుడు ఆమె ఒడిలో ఉన్న తన కుమారుడగు ఈసా అలైహిస్సలాం వైపునకు సైగ చేసింది. అప్పుడు ఆమె జాతి వారు ఆమెతో ఆశ్చర్యపోతూ ఇలా పలికారు : మేము ఒడిలో ఉన్న ఒక పిల్లవాడితో ఎలా మాట్లాడగలం ?!.

(30) అప్పుడు ఈసా అలైహిస్సలాం ఇలా పలికారు : నేను అల్లాహ్ దాసుడను,ఆయన నాకు ఇంజీలును ఇచ్చి నన్ను తన ప్రవక్తల్లోంచి ఒక ప్రవక్తగా చేశాడు.

(31) మరియు ఆయన నన్ను నేను ఎక్కడ ఉన్నా దాసుల కొరకు అధిక ప్రయోజకునిగా చేశాడు. మరియు నన్ను నా జీవితాంతం నమాజు పాటించటం గురించి, జకాత్ చెల్లించటం గురించి ఆదేశించాడు.

(32) మరియు నన్ను నా తల్లి పట్ల కర్తవ్యపాలకుడిగా చేశాడు,మరియు ఆయన నన్ను నా ప్రభువు పై విధేయత చూపటం నుండి గర్విష్టిగా చేయలేదు,ఆయనకు అవిధేయుడిని చేయలేదు.

(33) షైతాను నుండి,అతని సహాయకుల నుండి నాపై నేను పుట్టిన రోజు,నేను మరణించిన రోజు,ప్రళయదినాన నేను జీవింపజేసి మరల లేపబడే రోజు రక్షణ కలుగుగాక. ఈ మూడు నిర్జన (భయానక) పరిస్థితుల్లో షైతాను అతన్ని కలవరపెట్టలేదు.

(34) ఈ లక్షణాలతో వర్ణించబడిన వారే మర్యమ్ కుమారుడగు ఈసా. మరియు ఈ మాటే అతని విషయంలో సత్యమైన మాట. సందేహమును చూపే,విబేధించుకునే మార్గ భ్రష్టులు అతని విషయంలో పలికిన మాటలు కాదు.

(35) ఎవరినైన కుమారునిగా చేసుకోవటం అల్లాహ్ కి తగదు. వీటి నుండి అతడు పరిశుద్ధుడు,అతీతుడు. ఏదైన కార్యం చేయదలచుకున్నప్పుడు పరిశుద్ధుడైన ఆయన ఆ పనికి కున్ (నీవు అయిపో) అని పలకితే చాలు అది ఖచ్చితంగా అయి తీరుతుంది. ఎవరైతే ఇలాంటివాడై ఉంటాడో అతడు సంతానమును కలిగి ఉండటం నుండి అతీతుడు.

(36) మరియు నిశ్చయంగా పరిశుద్ధుడైన అల్లాహ్ అతడు నాకూ ప్రభువు,మీ అందరికీ ప్రభువు. అయితే మీరు ఆయన ఒక్కడి కొరకే ఆరాధనను ప్రత్యేకించుకోండి. ఇది ఏదైతే నేను మీ కొరకు ప్రస్తావించానో అది అల్లాహ్ మన్నతలకు చేర్చే సన్మార్గము.

(37) అప్పుడు ఈసా అలైహిస్సలాం విషయంలో విభేధించుకునేవారు విభేధించుకున్నారు. అప్పుడు వారు అతని జాతి వారి మధ్య నుండి వేరు వేరు వర్గాలుగా అయిపోయారు. వారిలో నుండి కొందరు ఆయనపై విశ్వాసమును కనబరిచి ఆయన ప్రవక్త అని పలికారు. మరి కొందరు యూదులులాంటివారు,ఆయన విషయంలో అతిక్రమించినటువంటి వర్గాల వారు ఆయనను తిరస్కరించారు. వారిలోని కొందరు అతడు అల్లాహ్ అన్నారు,మరికొందరు ఆయన అల్లాహ్ కుమారుడు అన్నారు. వీటి నుండి అల్లాహ్ మహోన్నతుడు. ఆయన విషయంలో విభేధించుకునే వారి కొరకు గొప్ప ప్రళయ దినము హాజరు అవటం నుండి అందులో ఉన్న దృశ్యాలు,లెక్క తీసుకోవటం,శిక్ష ద్వారా వినాశనము కలదు.

(38) ఆ రోజు వారు ఎంత బాగా వినేవారై ఉంటారు,ఎంత బాగా చూసేవారై ఉంటారు. వారు విన్నారు అప్పుడు వినికిడి వారికి ప్రయోజనం కలిగించలేదు. మరియు వారు చూశారు అప్పుడు వారి చూపు వారికి ప్రయోజనం చేకూర్చలేదు. కానీ దుర్మార్గులు ఇహలోక జీవితములో సన్మార్గము నుండి స్పష్టమైన మార్గభ్రష్టతలో ఉన్నారు. వారు తమ దుర్మార్గంలో ఉన్న స్థితిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా పరలోకము వారి వద్దకు వచ్చెంతవరకు పరలోకము కొరకు సిద్ధం కాలేదు.

(39) ఓ ప్రవక్తా పాపాత్ముడు తాను చేసిన పాపముపై ,పుణ్యాత్ముడు విధేయ కార్యము అధికంగా చేయకపోవటంపై పశ్చాత్తాప్పడే వేళ అయిన పశ్చాత్తాప్పడే దినము నుండి ప్రజలను హెచ్చరించండి. అప్పుడు దాసుల కర్మపుస్తకాలు చుట్టి వేయబడి వారి లెక్క తీసుకోవటం పూర్తవుతుంది. ప్రతి ఒక్కడు తాను ముందుకు పంపించినది అయిపోయింది. మరియు వారు తమ ప్రాపంచిక జీవితంలో ఉండి దాని ద్వారా ఆకర్షితులయ్యారు.పరలోక జీవితం నుండి పరధ్యానంలో ఉన్నారు. మరియు వారు ప్రళయదినమును విశ్వసించలేదు.

(40) నిశ్చయంగా సృష్టితాలన్ని అంతమైపోయిన తరువాత మేమే భూమికి వారసులుగా ఉండిపోయేవారము,వారి అంతమైపోవటం వలన,వారి తరువాత మేము ఉండిపోవటం వలన దానిపై ఉన్న వాటన్నింటికి మేము వారసులమవుతాము. మరియు మేము వారిపై అధికారము కలవారమవుతాము,మేము కోరుకున్న విధంగా వారి మధ్య వ్యవహరిస్తాము. ప్రళయదినాన మా ఒక్కరి వైపే లెక్కతీసుకొనబడటానికి,ప్రతిఫలం ఇవ్వబడటానికి వారు మరలించబడుతారు.

(41) ఓ ప్రవక్తా మీపై అవతరింపబడిన ఖుర్ఆన్ లో ఇబ్రాహీమ్ అలైహిస్సలాం వృత్తాంతమును మీరు గుర్తు చేసుకోండి.నిశ్చయంగా ఆయన అత్యంత నిజాయితీ పరుడు,అల్లాహ్ ఆయతులను దృవీకరించేవాడు,అల్లాహ్ వద్ద నుండి పంపించబడ్డ ఒక ప్రవక్త.

(42) ఆయన తన తండ్రి ఆజర్ తో ఇలా పలికినప్పుడు : ఓ నా తండ్రి మీరు అల్లాహ్ ను వదిలి విగ్రహమును ఒక వేళ మీరు దాన్ని మొరపెట్టుకుంటే అది మీ దుఆను వినలేదు,ఒక వేళ మీరు దాన్ని ఆరాధిస్తే అది మీ ఆరాధనను చూడలేదు,మీ నుండి ఎటువండి కీడును తొలగించలేదు,మీ కొరకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చదు అటువంటి దాన్ని మీరు ఎలా ఆరాధిస్తున్నారు ?!.

(43) ఓ నా తండ్రి నీ వద్దకు రాని జ్ఞానము నా వద్దకు దైవ వాణి ద్వారా వచ్చినది. కావున నీవు నన్ను అనుసరించు. నేను నీకు సన్మార్గమును చూపుతాను.

(44) ఓ నా తండ్రి మీరు షైతానును నీ విధేయత ద్వారా అతన్ని ఆరాధించకు.నిశ్చయంగా షైతాను రహ్మాను కొరకు అవిధేయపరుడు ఎప్పుడైతే ఆయన ఆదంనకు సాష్టాంగపడమని ఆదేశించాడో అప్పుడు సాష్టాంగపడలేదు.

(45) ఓ నా తండ్రి ఒక వేళ మీరు మీ అవిశ్వాస స్థితిలోనే మరణిస్తే మీకు కరుణామయుడి వద్ద నుండి శిక్ష చుట్టుకుంటుందని నేను భయపడుతున్నాను. అప్పుడు మీరు షైతానుకు విధేయత చూపటం వలన శిక్షలో అతనికి మీరు తోడుగా ఉంటారు.

(46) ఆజరు తన కుమారుడగు ఇబ్రాహీమ్ అలైహిస్సలాం తో ఓ ఇబ్రాహీమ్ నీవు నేను ఆరాధించే విగ్రహాలపట్ల విముఖత చూపుతున్నావా ?!. ఒక వేళ నీవు నా విగ్రహాలను దూషించటమును మానకపోతే నేను నిన్ను తప్పకుండా రాళ్ళతో కొడతాను. నీవు చాలా కాలం వరకు నా నుండి వేరైపో. నీవు నాతో మాట్లాడకు,నాతో పాటు సమావేశమవకు అని పలికాడు.

(47) ఇబ్రాహీమ్ అలైహిస్సలాం తన తండ్రితో ఇలా పలికారు : నా తరపు నుండి మీపై సలాం. మీరు నా నుండి ధ్వేషించేది మీకు కలగదు. తొందరలోనే నేను మీ కొరకు నా ప్రభువుతో మన్నింపును,సన్మార్గమును కోరుతాను. నిశ్చయంగా ఆయన నాపై అధికంగా దయకలవాడు.

(48) మరియు నేను మీ నుండి వేరైపోతాను. మరియు మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్న మీ ఆరాధ్య దైవాల నుండి వేరైపోతాను. మరియు నేను ఒక్కడైన నా ప్రభువుని వేడుకుంటాను,ఆయనతోపాటు దేనినీ సాటి కల్పించను. బహుశా నేను అతడిని వేడుకున్నప్పుడు అతడు నన్ను ఆపడు. ఒక వేళ ఆపితే నేను అతడిని వేడుకోవటం ద్వారా దౌర్భాగ్యుడినైపోతాను.

(49) ఎప్పుడైతే ఆయన వారిని విడిచిపెట్టారో,అల్లాహ్ ను వదిలి వారు పూజించే విగ్రహాలను వదిలేశారో తన ఇంటి వారిని కోల్పోవటం మూలంగా ఆయనకు మేము పరిహారమిచ్చాము. అప్పుడు మేము ఆయనకు ఆయన కుమారుడగు ఇస్ హాఖ్ ను ప్రసాధించాము. మరియు మేము ఆయనకు ఆయన మనవడగు యాఖూబ్ ను ప్రసాధించాము. వారిద్దరిలో నుండి ప్రతి ఒక్కరిని మేము ప్రవక్తలుగా చేశాము.

(50) మరియు మేము వారికి దైవ దౌత్యంతోపాటు మా కారుణ్యము నుండి చాలా మేలును ప్రసాధించాము. మరియు మేము వారి కొరకు దాసుల నాలుకలపై నిరంతరం మంచి కీర్తిని కలుగచేశాము.

(51) మరియు ఓ ప్రవక్తా మీరు మీపై అవతరింపబడిన ఖుర్ఆన్ లో మూసా అలైహిస్సలాం వృత్తాంతమును గుర్తు చేసుకోండి. నిశ్చయంగా ఆయన ఎంచుకోబడినవాడు,ఎన్నుకోబడినవాడు. మరియు అతడు ఒక ప్రవక్త,సందేశహరుడు.

(52) మరియు మూసా అలైహిస్సలాం ఉన్న స్థానమును బట్టి కొండయొక్క కుడి వైపు నుండి మేము ఆయనను పిలిచాము. మరియు మేము ఆయనను మట్లాడటానికి దగ్గర చేశాము. అక్కడే అల్లాహ్ ఆయనకు తన మాటను వినిపించాడు.

(53) మరియు మేము ఆయనకు మా కారుణ్యము నుండి,ఆయనపై మా అనుగ్రహమును ఆయన సోదరుడు హారూన్ అలైహిస్సలాంను ప్రవక్తగా ఆయన తన ప్రభువును అడిగినప్పుడు ఆయన అర్ధనను స్వీకరిస్తూ ప్రసాధించాము.

(54) మరియు ఓ ప్రవక్తా మీపై అవతరింపబడిన ఖుర్ఆన్ లో ఇస్మాయీల్ అలైహిస్సలాం వృత్తాంతమును గుర్తు చేసుకోండి. నిశ్చయంగా ఆయన వాగ్ధానపాలనలో సత్యవంతుడు. ఆయన ఏదైన వాగ్ధానం చేస్తే దాన్ని నెరవేరుస్తాడు. మరియు ఆయన సందేశహరుడు,ఒక ప్రవక్త.

(55) మరియు ఆయన తన ఇంటివారిని నమాజును నెలకొల్పమని,జకాత్ ను చెల్లించమని ఆదేశించేవాడు. మరియు ఆయన తన ప్రభువు వద్ద ప్రీతి పాత్రుడుగా ఉండేవాడు.

(56) ఓ ప్రవక్తా మీపై అవతరింపబడిన ఖుర్ఆన్ లో ఇద్రీస్ అలైహిస్సలాం వృత్తాంతమును మీరు గుర్తు చేయండి. నిశ్చయంగా ఆయన అత్యంత నిజాయితీ పరుడు,అల్లాహ్ ఆయతులను దృవీకరించేవాడు,అల్లాహ్ ప్రవక్తల్లోంచి ఒక ప్రవక్త.

(57) మరియు మేము ఆయనకు ప్రసాధించిన దైవదౌత్యం ద్వారా ఆయన కీర్తిని ఉన్నతం చేశాము. అప్పుడు ఆయన ఉన్నత స్థానం కలవాడైపోయాడు.

(58) ఈ సూరాలో మొదట జకరియ్యా అలైహిస్సలాం నుండి అంతిమంగా ఇద్రీసు అలైహిమస్సలాం వరకు ప్రస్తావించబడిన వీరందరు వారే ఎవరికైతే అల్లాహ్ దైవదౌత్యమును ప్రసాధించాడో ఆదం అలైహిస్సలాం సంతానము నుండి,నూహ్ అలైహిస్సలాం తోపాటు నావలో మేము ఎత్తిన వారి సంతానము నుండి, ఇబ్రాహీం అలైహిస్సలాం సంతానము నుండి,యాఖూబ్ అలైహిస్సలాం సంతాము నుండి మరియు మేము ఇస్లాం వైపు మార్గమును అనుగ్రహించిన వారిలో నుండి వారు. మేము వారిని ఎన్నుకుని సందేశహరులను చేశాము. వారు అల్లాహ్ ఆయతులను పటించబడుతుండగా విన్నప్పుడు అల్లాహ్ కొరకు ఆయనతో భయము వలన ఏడుస్తూ సాష్టాంగపడుతారు.

(59) అయితే ఎన్నుకోబడిన ఈ ప్రవక్తలందరి తరువాత చెడును,అపమార్గమును అనుసరించేవారు వచ్చారు. వారు నమాజులను వృధా చేశారు. వారు వాటిని కోరిన విధంగా పాటించలేదు. వారు తమ మనస్సులకు తోచిన విధంగా వ్యభిచారము లాంటి పాప కార్యములకు పాల్పడ్డారు. అయితే వారు తొందరలోనే నరకములో చెడును,పరాభవమును పొందుతారు.

(60) కానీ ఎవరైతే తమ లోపములనుండి,అతిక్రమించిన దాని నుండి పశ్చాత్తాప్పడి,అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి,సత్కార్యమును చేసిన వారు ఈ గుణాలతో వర్ణించబడిన వారందరు స్వర్గములో ప్రవేశిస్తారు. వారి కర్మల ప్రతిఫలము నుండి కొంచము కూడా తగ్గించబడదు ఒక వేళ అది తక్కువ అయిన సరే.

(61) అగోచర జగత్తులోని శాస్వతమైన,స్థిరమైన ఆ స్వర్గవనాలు వేటి గురించైతే అనంత కరుణామయుడు తన పుణ్య దాసులకు వారు అందులో ప్రవేశిస్తారని వాగ్దానం చేశాడో. వాస్తవానికి వారు వాటిని చూడకుండానే వాటి పట్ల విశ్వాసమును కనబరిచారు. స్వర్గము గురించి అల్లాహ్ వాగ్ధానము ఒక వేళ అది అగోచరమైనదైన ఖచ్చితంగా వచ్చి తీరుతుంది.

(62) వారు వాటిలో (స్వర్గవనాలలో) ఎటువంటి వ్యర్ధపు మాటలుగాని,అశ్లీల మాట గాని వినరు. అంతేకాదు వారిలో కొందరు కొందరికి సలాం చేయటమును,దైవ దూతలు వారికి సలాం చేయటమును వింటారు. మరియు ప్రొద్దున,సాయంత్రం వాటిలో వారు కోరుకున్న ఆహారం వారి వద్దకు వస్తుంది.

(63) ఈ లక్షణాల ద్వారా వర్ణించబడిన ఈ స్వర్గముకు ఆదేశములను పాటించి,వారింపబడిన వాటికి దూరంగా ఉన్న మా దాసులని వారసులుగా చేస్తాము.

(64) ఓ జిబ్రయీల్ మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా పలకండి : నిశ్చయంగా దైవదూతలు స్వయంగా దిగిరారు. వారు అల్లాహ్ ఆదేశముతో మాత్రమే దిగివస్తారు. పరలోక విషయం నుండి మేము ఏదైతే పొందుతామో,ఇహలోక విషయం నుండి మేము ఏదైతే వెనుక వదిలి వేశామో మరియు ఇహపరాలకు మధ్య ఉన్నది అంతా అల్లాహ్ కే చెందుతుంది. ఓ ప్రవక్తా మీ ప్రభువు ఏదీ మరవడు.

(65) ఆకాశములను సృష్టించినవాడు,భూమిని సృష్టించినవాడు,వాటి యజమాని,వాటి వ్యవహారాల పర్యాలోచన చేసేవాడు,వాటి మధ్య ఉన్న దానిని సృష్టించినవాడు, దాని యజమాని,దాని పర్యాలోచన చేసేవాడు ఆయనే. అయితే నీవు ఆయన ఒక్కడినే ఆరాధించు. ఆయనే ఆరాధనకు అర్హుడు. మరియు నీవు ఆయన్ని ఆరాధించటంలో నిలకడను చూపు. ఆయనకు పోలిన వాడు కాని సమానులు కాని అతనికి ఆరాధనలో భాగస్వామి అయ్యేవాడు లేడు.

(66) మరియు మరణాంతరము లేపబడటమును తిరస్కరించే అవిశ్వాసపరుడు పరిహాసమాడుతూ ఇలా పలికే వాడు : ఏమీ నేను మరణించినప్పుడు నా సమాది నుండి రెండవసారి జీవింపజేసి వెలికి తీయబడుతానా ?!. నిశ్చయంగా ఇది చాలా దూరమైన విషయం.

(67) మరణాంతరం లేపబడటమును తిరస్కరించే ఇతనికి ఇంతకు ముందు అతడు ఏమీ లేనప్పుడు మేము అతన్ని సృష్టించిన విషయం గుర్తులేదా ?!అయితే మొదటి సారి సృష్టించటం రెండవసారి సృష్టించటమునకు ఆధారపూరితమవుతుంది. దానికి తోడు రెండవసారి సృష్టించటం ఎంతో సులభము,ఎంతో సులువు.

(68) ఓ ప్రవక్తా నీ ప్రభువు సాక్షిగా మేము తప్పకుండా వారిని వారి సమాదుల నుండి వెలికితీసి వారిని మార్గ భ్రష్టులు చేసిన వారి షైతానులను తోడుగా హషర్ లోకి తీసుకుని వస్తాము. ఆ తరువాత వారిని వారి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి అవమానపరచి నరక ద్వారముల వద్దకు తీసుకువస్తాము.

(69) ఆ తరువాత మేము అవిధేయతలో తీవ్రమైన మార్గభ్రష్టుల వర్గముల్లోంచి ప్రతీ వర్గమును కఠినంగా,తీవ్రంగా వేరుచేస్తాము. వారు వారి నాయకులై ఉండేవారు.

(70) ఆ పిదప నరకాగ్నిలో ప్రవేశించడానికి మరియు దాని వేడిని,దాని బాధలను అనుభవించడానికి ఎవరు ఎక్కువ అర్హులో మాకు బాగా తెలుసు.

(71) ఓ ప్రవక్తా మీలో నుండి ఎవరూ కూడా నరకము నడిబొడ్డుపై వేయబడిన మార్గ వంతెన పైనుండి దాటకుండా ఉండడు.ఈ దాటటం అన్నది అల్లాహ్ నిర్ణయించిన దృఢమైన నిర్ణయం. అల్లాహ్ నిర్ణయాన్ని మార్చేవాడు ఎవడూ లేడు.

(72) మార్గముపై ఈ దాటిన తరువాత మేము తమ ప్రభువుతో ఆయన ఆదేశాలను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడిన వారిని రక్షిస్తాము. మరియు దుర్మార్గులను వారి మోకాళ్ళ మీద కూర్చున్నట్లు వదిలివేస్తాము. దాని నుండి వారు పారిపోలేరు.

(73) మా ప్రవక్తపై అవతరింపబడిన స్పష్టమైన మా ఆయతులను ప్రజలపై చదవబడినప్పుడు అవిశ్వాసపరులు విశ్వాసపరులతో ఇలా పలికారు : మా రెండు వర్గముల్లోంచి స్థితిని బట్టి,నివాసమును బట్టి ఎవరు ఉత్తములు మరియు సభను బట్టి,సమావేశమును బట్టి ఎవరు మంచి వారు, మా వర్గము వారా లేదా మీ వర్గము వారా ?!.

(74) తాము ఉన్న ఈ భౌతిక ఆధిక్యత వలన గర్వపడే ఈ అవిశ్వాసపరులందరికన్న మందు చాలా సమాజములను మేము నాశనం చేశాము. వారు సంపదలో వీరికన్న ఉన్నతమైనవారు,వారి దుస్తుల అమూల్యత వలన,వారి శరీరములకు ప్రసాధించబడ్డ అనుగ్రహముల వలన చూడటానికి వారి కన్న ఉన్నతమైన వారు.

(75) ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఎవరైతే తన మార్గభ్రష్టతలో మునిగి ఉంటాడో అనంత కరుణామయుడు అతడిని మార్గభ్రష్టతలో అతడు అధికమయ్యే వరకు గడువును ఇస్తాడు.చివరికి వారు తమకు వాగ్ధానం చేయబడిన శీఘ్రంగా లభించే శిక్షను ఇహలోకంలో లేదా ఆలస్యంగా లభించే శిక్షను పరలోకంలో కళ్ళార చూసినప్పుడు వారు ఆ సమయంలో ఎవరు చెడు స్థానం గల వాడు, ఎవడు తక్కువ సహాయకులు గలవాడో తెలుసుకుంటాడు. అతని వర్గమా లేదా విశ్వాసపరుల వర్గమా ?.

(76) మార్గ భ్రష్టతలో అధికమవటానికి గడువివ్వబడిన వీరందరికి భిన్నంగా అల్లాహ్ సన్మార్గం పొందిన వారందరిని విశ్వాసంలో,విధేయతలో అధికం చేస్తాడు. ఓ ప్రవక్తా శాస్వత ఆనందాలకు దారి తీసే సత్కార్యాలు మీ ప్రభువు వద్ద ప్రతిఫలం పరంగా,మంచి పరిణామం పరంగా ఎక్కువ ప్రయోజనకరమైనవి.

(77) ఓ ప్రవక్తా మా వాదనలను తిరస్కరించి,నేను ఒక వేళ మరణించి మరల లేపబడితే తప్పకుండా చాలా సంపదను,సంతానమును ఇవ్వ బడుతాను అని పలికే వాడిని మీరు చూశారా ?.

(78) ఏమీ అతడు అగోచర జ్ఞానము తెలుసుకున్నాడా ఆధారం గురించి అతను ఏదైతే మాట్లాడుతున్నాడో ?!.లేదా తన ప్రభువు వద్ద అతడిని ఆయన తప్పకుండా స్వర్గంలో ప్రవేశింపజేస్తాడని,తప్పకుండా అతనికి సంపదను,సంతానమును ప్రసాధిస్తాడని ఏదైన వాగ్ధానం తయారు చేసుకున్నాడా ?!.

(79) విషయం అతడు అనుకున్నట్లుగా జరగదు.అతడు మాట్లాడే వాటిని,అతడు చేసే వాటిని మేము వ్రాస్తాము. అతడు అసత్యము యొక్క ఏదైతే వాదన చేస్తున్నాడో దాని కారణం చేత అతడికి మేము శిక్షపై శిక్షను అధికం చేస్తాము.

(80) మరియు మేము అతడిని వినాశనమునకు గురి చేసిన తరువాత అతడు వదిలి వెళ్ళిన సంపదకు,సంతానమునకు మేము వారసులమవుతాము. మరియు అతడు ప్రయోజనం చెందిన సంపదను,మర్యాదను గుంజుకోబడిన స్థితిలో ఒంటరిగా ప్రళయదినాన మా వద్దకు వస్తాడు.

(81) ముష్రికులు అల్లాహ్ ను వదిలి తమ కొరకు ఆరాధ్య దైవాలను వారు వారి కొరకు సహాయకులుగా,మద్దతు దారులాగా అయి వారు వారితో సహాయం పొందటానికి చేసుకున్నారు.

(82) విషయం వారు అనుకున్నట్లు జరగదు. వారు అల్లాహ్ ను వదిలి ఆరాధించే ఈ ఆరాధ్యదైవాలు తమ కొరకు ముష్రికులు చేసిన ఆరాధనను ప్రళయదినాన తిరస్కరించి వారిని ఉపేక్షిస్తారు.మరియు వారికి శతృవులైపోతారు.

(83) ఓ ప్రవక్తా మేము షైతానులను పంపించి అవిశ్వాసపరులను పాపకార్యములను చేయటానికి,అల్లాహ్ మార్గము నుండి ఆటంకము కలగించటానికి వారిని ప్రేరేపించేలా వారికి అధికారమును కలిగించినది మీరు చూడలేదా ?.

(84) ఓ ప్రవక్తా మీరు అల్లాహ్ ను వారికి త్వరగా శిక్షించమని కోరి తొందర చేయకండి. మేము వారి వయస్సులను షుమారు చేస్తున్నాము. చివరికి వారి గడువు సమయం ముగిసినప్పుడు వారు దేనికి హక్కుదారులో ఆ శిక్షను వారికి కలుగ జేస్తాము.

(85) ఓ ప్రవక్తా మీరు మేము తమ ప్రభువు పై ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం ద్వార భీతి కలిగిన వారిని వారి ప్రభువు ముందట మాన,మర్యాదలతో అతిధులుగా సమీకరించే రోజైన ప్రళయదినమును గుర్తు చేసుకోండి.

(86) మరియు మేము అవిశ్వాసపరులను దప్పిక స్థితిలో తోలుకు పోతాము.

(87) ఇహలోకములో అల్లాహ్ యందు ఆయన పై,ఆయన ప్రవక్తల పై విశ్వాసము ద్వారా ప్రమాణమును ఏర్పరచున్న వాడికి తప్ప ఈ అవిశ్వాసపరులందరిలోంచి వారిలో కొందరి కొరకు సిఫారసు చేసే అధికారముండదు.

(88) మరియు యూదులు,క్రైస్తవులు,కొందరు ముష్రికులు కరుణామయుడు కుమారుడిని ఏర్పాటు చేసుకున్నాడని పలికారు.

(89) ఓ ఇలా పలికిన వారా నిశ్ఛయంగా మీరు చాలా పెద్ద విషయాన్ని తీసుకుని వచ్చారు.

(90) ఈ దుర మాట వలన ఆకాశములు బ్రద్ధలైపోవచ్చు,భూమి చీలిపోవచ్చు,పర్వతాలు ధ్వంసమై పడిపోవచ్చు.

(91) ఇవన్నీ వారు కరుణామయుడికి కుమారుడిని అంటగట్టినందుకు. వీటి నుండి అల్లాహ్ చాలా మహోన్నతుడు.

(92) మరియు కరుణామయుడు కుమారుడిని ఏర్పరచుకోవటం ఆయన దాని నుండి పరిశిద్ధుడు కాబట్టి సరికాదు.

(93) ఆకాశముల్లో ఉన్న దైవదూతల్లోంచి,మానవులు,జిన్నుల్లోంచి ప్రతి ఒక్కరు ప్రళయ దినాన తమ ప్రభువు ముందట కడు వినయంతో మాత్రమే వస్తారు.

(94) నిశ్ఛయంగా ఆయన వారిని జ్ఞానపరంగా చుట్టు ముట్టి ఉన్నాడు,వారిని లెక్కవేసి ఉన్నాడు.వారి నుండి ఏదీ ఆయన పై గోప్యంగా ఉండదు.

(95) వారిలో నుండి ప్రతి ఒక్కడు ఆయన ముందు ప్రళయదినాన తన కొరకు ఎటువంటి సహాయకుడు లేకుండా,ఎటువంటి సంపద లేకుండా ఒంటరిగా వస్తాడు.

(96) నిశ్ఛయంగా అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి అల్లాహ్ కి సంతృప్తికరమైన సత్కార్యములను చేసేవారికి అల్లాహ్ తొందరలోనే తన ప్రేమతో వారికి తన దాసుల వద్ద ప్రేమను కలుగజేస్తాడు.

(97) ఓ ప్రవక్తా మేము ఈ ఖుర్ఆన్ ను మీ భాషలో అవతరింపజేసి సులభతరం చేశాము. దాని ద్వార మీరు నా ఆదేశాలను పాటించి,నేను వారించిన వాటికి దూరంగా ఉండే భీతిపరులకు శుభవార్తను ఇవ్వటానికి మరియు తగువులాడటంలో,సత్యమును అంగీకరించే విషయంలోఅహంభావంలో తీవ్రమైన జాతివారిని దాని ద్వారా మీరు భయపెట్టటానికి.

(98) మీ జాతి వారి కన్న ముందు ఎన్నో సమాజములను వినాశనమునకు గురి చేశాము.అయితే ఆ సమాజముల్లోంచి ఈ రోజు ఏ ఒక్క దాన్నైన మీరు గమనించగలరా ?!.వారికి ఏదైన తేలికైన నిట్టూర్పును మీరు వినగలరా ?!.అల్లాహ్ ప్రకటించినప్పుడు వారికి సంభవించినదే ఇతరులకు సంభవించినది.