(1) ఒక్కడైన ఆయన చేతిలో రాజ్యాధికారము కలిగిన అల్లాహ్ మేలు ఎంతో అధికము మరియు ఎక్కువ. మరియు ఆయన ప్రతీది చేసే సామర్ధ్యం కలవాడు. ఆయనను ఏదినూ అశక్తుడిని చేయదు.
(2) ఆయనే ఓ ప్రజలారా మీలో నుంచి ఆచరణ పరంగా మంచివారో పరీక్షించటం కొరకు మరణమును,జీవనమును సృష్టించాడు. ఆయనే ఎవరూ ఓడించలేని సర్వాధిక్యుడు. తన దాసుల్లోంచి పశ్ఛాత్తాపడే వారి పాపములను మన్నించేవాడును.
(3) ఆయనే సప్త ఆకాశములను సృష్టించాడు. ప్రతీ ఆకాశము దాని ముందు ఉన్న దాని పై ఉండి ఒక ఆకాశము ఇంకో ఆకాశమునకు అంటిపెట్టుకుని లేనట్లుగా ఉన్నది. ఓ సందర్శకుడా నీవు అల్లాహ్ సృష్టించిన దానిలో ఎటువంటి హెచ్చు తగ్గులను మరియు అస్తవ్యస్తతను చూడలేవు. కావున నీవు దృష్టిని సారించు ఏమీ నీవు ఏదైన పగులును లేదా బీటలను చూశావా ?! నీవు ఖచ్చితంగా దాన్ని చూడలేవు. నీవు మాత్రం ఒక నిర్మాణాత్మకమైన విస్తృతమైన సృష్టిని చూస్తావు.
(4) ఆ తరువాత నీవు పదే పదే దృష్టిని సారించు నీ చూపులు ఎటువంటి లోపమును గాని అస్తవ్యస్తతను చూడ లేక నిరాశులై నీ వైపునకు మరలుతాయి. మరియు అవి చూడలేక అలసిపోయి ఉంటాయి.
(5) మరియు మేము భూమికి అతి దగ్గరగా ఉన్న ఆకాశాన్ని ప్రకాశవంతమైన నక్షత్రాలతో అలంకరించాము. మరియు మేము ఆ నక్షత్రాలను అగ్ని జ్వాలలుగా చేశాము. దొంగ చాటుగా వినే షైతానులు వాటి ద్వారా కొట్టబడుతారు. మరియు అవి వారిని దహించి వేస్తాయి. మరియు మేము పరలోకంలో వారి కొరకు భగభగ మండే అగ్నిని సిద్ధపరచి ఉంచాము.
(6) మరియు తమ ప్రభువును తిరస్కరించే వారి కొరకు ప్రళయదినమున మండుతున్న అగ్ని శిక్ష కలదు. వారు దేనివైపునైతే మరలి వెళ్ళుతున్నారో ఆ మరలే స్థానము ఎంతో చెడ్డది.
(7) వారు నరకాగ్నిలో విసిరి వేయబడినప్పుడు వారు తీవ్రమైన భయంకరమైన గర్జనను వింటారు. మరియు అది కుండ ఉడికినట్లు ఉడకబెట్టబడుతుంటుంది.
(8) దాదాపు దాని కొంతభాగము దానిలో ప్రవేశించేవారిపై తీవ్రమైన కోపము వలన ప్రేలిపోయి వేరైపోయినట్లుగా ఉంటుంది. అవిశ్వాసపరులైన దాని వాసుల్లోంచి ఒక సమూహం అందులో విసిరివేయబడినప్పుడు దాని బాధ్యత వహించే దూతలు వారిని గద్దిస్తూ ఇలా ప్రశ్నిస్తారు : ఏమీ అల్లాహ్ శిక్ష నుండి మిమ్మల్ని భయపెట్టే ఒక ప్రవక్త ఇహలోకంలో మీ వద్దకు రాలేదా ?.
(9) మరియు అవిశ్వాసపరులు ఇలా సమాధానమిస్తారు : ఎందుకు రాలేదు. అల్లాహ్ శిక్ష నుండి మమ్మల్ని భయపెడుతూ ఒక ప్రవక్త మా వద్దకు వచ్చాడు. అప్పుడు మేము అతన్ని తిరస్కరించి అతనితో ఇలా పలికాము : అల్లాహ్ ఎటువంటి దైవ వాణిని అవతరింపజేయలేదు. ఓ ప్రవక్తల్లారా మీరు మాత్రం సత్యము నుండి ఘోర అపమార్గములో ఉన్నారు.
(10) మరియు అవిశ్వాసపరులు ఇలా పలుకుతారు : ఒక వేళ మేము ప్రయోజనం చెందే విధంగా విని ఉంటే లేదా అసత్యము నుండి సత్యమును వేరు చేసే వారి బుద్ది లాగా మేము అర్ధం చేసుకుని ఉంటే మేము నరక వాసులందరితో ఉండేవారము కాదు. అంతే కాదు మేము ప్రవక్తలను విశ్వసించి వారు తీసుకుని వచ్చిన దాన్ని దృవీకరించి ఉండేవారము. మరియు మేము స్వర్గ వాసుల్లోంచి అయి ఉండేవారము.
(11) అప్పుడు వారు స్వయంగా అవిశ్వసించిన దాన్ని,తిరస్కరించిన దాన్ని అంగీకరిస్తారు. అప్పుడు వారు నరకానికి అర్హులవుతారు. కావున నరక వాసుల కొరకు (దైవ కారుణ్యం) దూరమవుగాక.
(12) నిశ్చయంగా ఎవరైతే తమ ఏకాంతములో అల్లాహ్ తో భయపడుతారో వారి కొరకు వారి పాపముల మన్నింపు కలదు. మరియు వారి కొరకు గొప్ప ప్రతిఫలం కలదు. అది స్వర్గము.
(13) ఓ ప్రజలారా మీరు మీ మాటలను గోప్యంగా ఉంచి పలికినా లేదా వాటిని బహిరంగంగా పలికినా అల్లాహ్ వాటి గురించి తెలుసుకుంటాడు. నిశ్చయంగా పరిశుద్ధుడైన ఆయనకు తన దాసుల హృదయముల్లో ఉన్నది బాగా తెలుసు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
(14) సృష్టిరాసులన్నింటిని సృష్టించిన వాడికి రహస్యము గురించి మరియు రహస్యము కన్న గోప్యమైన వాటి గురించి తెలియదా ?! మరియు ఆయన తన దాసుల పట్ల సూక్ష్మ గ్రాహి,వారి వ్యవహారముల గురించి బాగా తెలిసినవాడు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
(15) ఆయనే భూమిని మీ కొరకు దానిపై నివాసముండటానికి సౌలభ్యముగా,మరియు మెత్తగా చేశాడు. కావున మీరు దాని ప్రక్కలలో,దాని మార్గముల్లో నడవండి. మరియు ఆయన అందులో మీ కొరకు సిద్ధం చేసి ఉంచిన ఆయన ఆహారోపాధిలో నుండి తినండి. మరియు లెక్క తీసుకోబడటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు మీరు మరణాంతరం లేపబడి వెళ్ళటం ఆయన ఒక్కడివైపే.
(16) ఏమీ ఆకాశముల్లో ఉన్న అల్లాహ్ భూమిని ఖారూన్ క్రింది నుండి అది నివాసమునకు సౌలభ్యంగా,యోగ్యంగా ఉన్నతరువాత కూడా చీల్చినట్లు మీ క్రింది నుండి చీల్చుతాడన్న దాని నుండి నిర్భయులైపోయారా ?!. అప్పుడు అది స్థిరంగా ఉన్న తరువాత కూడా మిమ్మల్ని తీసుకుని ప్రకంపిస్తుంది.
(17) లేదా ఆకాశముల్లో ఉన్న అల్లాహ్ లూత్ జాతి వారిపై రాళ్ళను కురిపించినట్లు మీపై ఆకాశము నుండి రాళ్ళను కురిపించడని నిర్భయులైపోయారా ?!. మీరు నా శిక్షను కళ్ళారా చూసినప్పుడు మీకు నా హెచ్చరిక ఎలా ఉందో మీరు తెలుసుకుంటారు. కాని మీరు శిక్షను కళ్ళారా చూసిన తరువాత దాని నుండి ప్రయోజనం చెందలేరు.
(18) నిశ్చయంగా ఈ ముష్రికులందరి కన్న ముందు గతించిన సమాజాల వారు తిరస్కరించారు. వారు తమ అవిశ్వాసంపై,తమ తిరస్కారంపై మొండిగా వ్యవహరించినప్పుడు అల్లాహ్ శిక్ష వారిపై అవతరించింది. అయితే వారిపై నా శిక్ష ఎలా ఉందో ?! నిశ్చయంగా అది తీవ్రమైన శిక్షగా అయినది.
(19) ఏమీ ఈ తిరస్కారులందరు తమపై పక్షులను అవి ఎగిరేటప్పుడు చూడటంలేదా అవి తమ రెక్కలను గాలిలో ఒక సారి చాపితే ఇంకోసారి వాటిని తమ వైపు ముడుచుకుంటున్నాయి. అవి భూమిపై పడిపోకుండా వాటిని అల్లాహ్ మాత్రమే అదిమిపట్టి ఉన్నాడు. నిశ్చయంగా ఆయన ప్రతీది చూస్తున్నాడు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
(20) ఓ అవిశ్వాసపరులారా ఒక వేళ అల్లాహ్ మిమ్మల్ని శిక్షించదలచితే అల్లాహ్ శిక్షను మీ నుండి ఆపే ఏ సైన్యము మీ కొరకు లేదు. అవిశ్వాసపరులు మాత్రం మోసగించబడి ఉన్నారు. వారిని షైతాను మోసం చేశాడు. అతనితో వారు మోసపోయారు.
(21) ఒక వేళ అల్లాహ్ తన ఆహారోపాధిని మీకు చేరటం నుండి ఆపివేస్తే మీకు ఆహారమును ప్రసాదించేవాడు ఎవడూ ఉండడు. కాని జరిగిందేమిటంటే అవిశ్వాసపరులు వ్యతిరేకతలో,అహంకారంలో,సత్యము నుండి ఆగిపోవటంలో కొనసాగిపోయారు.
(22) ఏమీ తన ముఖంపై తల క్రిందలై నడిచేవాడు - అతడు ముష్రికు - ఎక్కువ సన్మార్గంపై ఉన్నాడా లేదా సన్మార్గంపై తిన్నగా నడిచే విశ్వాసపరుడు ఎక్కువ సన్మార్గంపై ఉన్నాడా ?!
(23) ఓ ప్రవక్తా తిరస్కరించే ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : అల్లాహ్ యే మిమ్మల్ని సృష్టించాడు. మరియు ఆయన మీ కొరకు వినే చెవులను మరియు మీరు చూసే కళ్ళను మరియు మీరు అర్ధం చేసుకునే హృదయములను చేశాడు. ఆయన మీకు అనుగ్రహించిన అనుగ్రహాలపై మీరు చాలా తక్కువ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.
(24) ఓ ప్రవక్తా తిరస్కరించే ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : అల్లాహ్ యే మిమ్మల్ని భూమిలో వ్యాపింపజేశాడు మరియు అందులో విస్తరింపజేశాడు. ఏమీ సృష్టించలేనటువంటి మీ విగ్రహాలు కాదు. ప్రళయదినమున లెక్క తీసుకోబడటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు మీరు ఆయన ఒక్కడి వైపే సమీకరించబడుతారు. మీ విగ్రహాల వైపు కాదు. కావున మీరు ఆయనతో భయపడండి. మరియు ఆయన ఒక్కడినే ఆరాధించండి.
(25) మరణాంతరం లేపబడటంను దూరంగా భావిస్తూ మరణాంతరం లేపబడటమును తిరస్కరించే వారు ఇలా పలికేవారు : ఓ ముహమ్మద్ నీవు మరియు నీ సహచరులు మాతో చేసిన ఈ వాగ్దానము ఎప్పుడు పూర్తి కానున్నది ఒక వేళ మీరు అది రాబోతున్నదని మీ వాదనలో మీరు సత్యవంతులే అయితే ?!
(26) ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నిశ్చయంగా ప్రళయము యొక్క జ్ఞానము అల్లాహ్ వద్ద ఉన్నది. అది ఎప్పుడు వాటిల్లుతుందో ఆయనకు మాత్రమే తెలుసు. నేను మాత్రం మీకు స్పష్టంగా హెచ్చరించేవాడిని.
(27) ఎప్పుడైతే వారిపై వాగ్దానం వచ్చిపడి వారు శిక్షను తమకు దగ్గరవటమును కళ్లారా చూసినప్పుడు అది ప్రళయదినము అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచిన వారి ముఖములు మారిపోతాయి మరియు నల్లగా మారిపోతాయి. మరియు వారితో ఇలా పలకబడును : ఇది అదే దేనినైతే మీరు ఇహలోకంలో కోరేవారో మరియు తొందరపెట్టేవారో.
(28) ఓ ప్రవక్తా ఈ తిరస్కరించే ముష్రికులతో వారిని ఖండిస్తూ ఇలా పలకండి : మీరు నాకు చెప్పండి ఒక వేళ అల్లాహ్ నన్ను మరణింపజేసి, నాతోపాటు ఉన్న విశ్వాసపరులను మరణింపజేస్తే అవిశ్వాసపరులని బాధాకరమైన శిక్ష నుండి ఎవరు రక్షిస్తారు ?!. దాని నుండి వారిని ఎవరూ రక్షించరు.
(29) ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో మీరు ఇలా పలకండి : అనంత కరుణామయుడు అయిన ఆయనే మిమ్మల్ని తన ఒక్కడి ఆరాధన వైపు పిలుస్తున్నాడు. మేము ఆయన్ని విశ్వసించాము. మా వ్యవహారాలన్నింటిలో ఆయన ఒక్కడిపైనే మేము నమ్మకమును కలిగి ఉన్నాము. మీరు తొందరలోనే ఖచ్చితంగా తెలుసుకుంటారు ఎవరు స్పష్టమైన మార్గ భ్రష్టతలో ఉన్నారో ఎవరు సన్మార్గంపై ఉన్నారో.
(30) ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : మీరు నాకు చెప్పండి ఒక వేళ మీరు త్రాగే నీరు మీరు చేరలేనంత వరకు భూమి లోతులో అయిపోతే మీ వద్దకు ఎక్కువగా ప్రవహించే నీరును ఎవరు తీసుకుని వస్తారు ?! అల్లాహ్ తప్ప ఎవరూ కాదు.