21 - Al-Anbiyaa ()

|

(1) ప్రళయదినాన ప్రజల కొరకు వారి కర్మలపై వారి లెక్క దగ్గరైనది. వారు ఇహలోకములో మునిగి ఉండటం వలన పరలోకము నుండి విముఖత చూపుతూ పరధ్యానంలో పడి ఉన్నస్థితిలో ఉన్నారు.

(2) వారి వద్దకు వారి ప్రభువు వద్ద నుండి ఖుర్ఆన్ లో ఏదైన కొత్త సందేశము అవతరించి వస్తే వారు దాన్ని ప్రయోజనం చెందని విధంగా మాత్రమే వింటారు,అంతే కాక అందులో ఉన్న వాటిని పట్టించుకోకుండా ఆడుకుంటూ వింటారు.

(3) వారు దాన్ని వింటారు వాస్తవానికి వారి హృదయములు దాని నుండి పరధ్యానంలో పడి ఉన్నాయి. మరియు దుర్మార్గులు ఆ సందేశమును తిరస్కరించటం ద్వారా దాచారు దేని గురించైతే వారు రహస్య మంతనాలు చేస్తూ పలికారు : తాను ప్రవక్తనని వాదించే ఇతడు మీలాంటి ఒక మనిషి మాత్రమే,మీకు అతనికి మధ్య ఎటువంటి వ్యత్యాసం లేదు. మరియు అతను తీసుకుని వచ్చినది మంత్రజాలము. అతడు మీలాంటి ఒక మనిషి అని,అతను తీసుకుని వచ్చినది మంత్రజాలము అని మీకు తెలిసికూడా అతనినే మీరు అనుసరిస్తారా ?!.

(4) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా పలికారు : మీరు దాచి పెట్టిన మాట నా ప్రభువుకు తెలుసు. భూమ్యాకాశముల్లో పలికే వారితో వెలువడే ప్రతీ మాట ఆయనకు తెలుసు. మరియు ఆయన తన దాసుల మాటలను బాగా వినే వాడును,వారి కర్మలను బాగా తెలిసిన వాడును. మరియు ఆయన వారికి వాటి పరంగా ప్రతిఫలమును తొందరలోనే ప్రసాదిస్తాడు.

(5) అంతే కాక వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చిన దాని విషయంలో సందేహించుకున్నారు. కొన్ని సార్లు వారు ఎటువంటి వివరణ లేని మిశ్రమ కలలు అన్నారు. కొన్ని సార్లు వారు కాదు కాదు అతను దాన్ని ఎటువంటి మూలం లేకుండా కల్పించుకున్నాడు అన్నారు. కొన్ని సార్లు వారు అతడు కవి అన్నారు. ఒక వేళ అతను తన వాదనలో సత్యవంతుడే అయితే పూర్వ ప్రవక్తల లాంటి ఏదైన మహిమను మా వద్దకు తీసుకుని రావాలి. నిశ్ఛయంగా వారు మూసా యొక్క చేతి కర్ర,సాలెహ్ యొక్క ఒంటె లాంటి మహిమలను తీసుకుని వచ్చారు.

(6) ఈ ప్రతిపాదించిన వారందరి కన్నా ముందు ఏ బస్తీ విశ్వసించలేదు. వారు సూచనల అవతరణ గురించి ప్రతిపాదించారు,అప్పుడు వారు ప్రతిపాదించిన విధంగా వారికి అవి ప్రసాదించబడినవి,కానీ వారు వాటిని తిరస్కరించారు. అప్పుడు మేమువారిని తుదిముట్టించాము. అయితే వీరందరూ విశ్వసిస్తారా ?!.

(7) ఓ ప్రవక్తా మేము మీ కన్నా మునుపు పంపించిన వారందరు మానవుల్లోంచి మగవారు మాత్రమే,మేము వారికి దైవవాణిని చేరవేశాము. మేము వారిని దైవ దూతలగా పంపించలేదు. అది మీకు తెలియకపోతే మీ కన్నా ముందు నుండి ఉన్న గ్రంధవహులను మీరు అడగండి.

(8) మేము వారి వద్దకు పంపించిన ప్రవక్తలను ఆహారమును తినని శరీరాలు కలవారిగా చేయలేదు. కాని వారు ఇతరులు తినేటట్లుగా తినేవారు.మరియు వారు మరణించకుండా ఇహలోకములో శాస్వతంగా ఉండరు.

(9) ఆ తరువాత మా ప్రవక్తల కొరకు మేము చేసిన వాగ్దానమును వినాశనం నుండి మేము వారిని రక్షించినప్పుడు,విశ్వాసపరుల్లోంచి మేము కోరిన వారిని రక్షించినప్పుడు పూర్తి చేశాము. మరియు మేము అల్లాహ్ పట్ల తమ అవిశ్వాసము ద్వారా,తమ పాప కార్యములకు పాల్పడటం ద్వారా హద్దు మీరిన వారిని తుదిముట్టించాము.

(10) నిశ్ఛయంగా మేము మీ వైపునకు ఖుర్ఆన్ ను అవతరింపజేశాము ఒక వేళ మీరు దాన్ని విశ్వసించి అందులో ఉన్న వాటిని ఆచరిస్తే అందులో మీకు గౌరవము,మీకు గర్వము ఉన్నది. అయితే ఏమీ మీరు దానిని అర్ధం చేసుకోరా ?! .అయితే మీరు దానిపై విశ్వాసమును కనబరచటానికి,అందులో ఉన్న వాటిని ఆచరించటానికి త్వరపడండి.

(11) ఎన్నో బస్తీలను అవిశ్వాసముతో తమ దుర్మార్గము వలన మేము తుదిముట్టించాము. మరియు వాటి తరువాత ఇతర జాతుల వారిని మేము సృష్టించాము.

(12) వినాశనమునకు గురయ్యేవారు ఎప్పుడైతే కూకటి వ్రేళ్ళ నుండి పెకిలించే మా శిక్ష చూస్తారో అప్పుడు వారు తమ బస్తీ నుండి వినాశనము నుండి శీఘ్రంగా పారిపోతారు.

(13) అప్పుడు వారిని హేళన పధ్ధతిలో ఇలా పిలవబడుతుంది : మీరు పారిపోకండి, మీరు అనుభవిస్తున్న మీ సుఖసంపదల వైపునకు ,మీ నివాసముల వైపునకు మరలండి. బహుశా మీరు మీ ఇహలోకము నుండి కొద్దిగా ప్రశ్నించబడుతారు.

(14) ఈ దుర్మార్గులందరు తమ పాపమును అంగీకరిస్తూ ఇలా పలుకుతారు : అయ్యో మా వినాశనం,మా నష్టం నిశ్ఛయంగా అల్లాహ్ పట్ల మా అవిశ్వాసం వలన మేము దుర్మార్గుల్లోంచి అయిపోయాము.

(15) వారు నిర్విరామంగా తమ పాపములను అంగీకరిస్తూ,తమపై వినాశనము కొరకు పదేపదే శాపనార్ధాలు పెడుతూనే ఉన్నారు. చివరికి మేము వారిని కోయబడిన పైరు వలే వారికి ఎటువంటి చలనము లేక మరణించిన వారి వలె చేశాము.

(16) మరియు మేము ఆకాశములను,భూమిని,వాటి మధ్య ఉన్న వాటిని ఆటగా,వ్యర్ధంగా సృష్టించలేదు. కానీ వాటిని మేము మా సామర్ధ్యముపై సూచించటానికి సృష్టించాము.

(17) ఒక వేళ మేము భార్యను గాని సంతానమును గాని చేయదలచుకుంటే దాన్ని మా వద్ద ఉన్న వాటిలోంచి చేసుకునే వారము. మేము దాని నుండి అతీతులము కాబట్టి అలా చేయము.

(18) కాని మేము మా ప్రవక్తల వైపు దైవ వాణి ద్వార చేరవేసిన సత్యముతో అవిశ్వాసపరుల అసత్యముపై విసిరి కొడతాము. అప్పుడు అది దాన్ని నామరూపాలు లేకుండా చేస్తుంది. అప్పుడు వారి అసత్యము నశించిపోతుంది. ఆయన భార్యను,సంతానమును చేసుకున్నాడని పలికే వారా ఆయనకు తగని దానిని ఆయనకొరకు మీరు కల్పించటం వలన మీ కొరకు వినాశనం కలదు.

(19) ఆకాశముల అధికారము,భూమి యొక్క అధికారము పరిశుద్ధుడైన,ఒక్కడైన ఆయనకే చెందుతుంది. ఆయన వద్ద ఉన్న దైవ దూతలు ఆయన ఆరాధన చేయటం నుండి గర్వించరు,దాని నుండి వారు అలసిపోరు.

(20) వారు ఎల్లప్పుడు అల్లాహ్ పరిశుద్ధతను కొనియాడతూ ఉంటారు. దాని నుండి వారు విసిగిపోరు.

(21) కాని ముష్రికులు అల్లాహ్ ను వదిలి కొన్ని ఆరాధ్య దైవాలను చేసుకున్నారు. వారు మృతులను జీవింపజేయలేరు. అటువంటప్పుడు వారు దాని నుండి అశక్తులైన వారిని ఎలా ఆరాధిస్తున్నారు ?!.

(22) ఒక వేళ భూమ్యాకాశముల్లో అల్లాహ్ తప్ప అనేక ఆరాధ్యదైవాలు ఉంటే అధికారములో ఆరాధ్య దైవాల తగువులాట వలన అవి రెండు నాశనమైపోయేవి. మరియు దానికి విరుద్ధముగా జరిగినది. సింహాసనానికి ప్రభువైన అల్లాహ్ ముష్రికులు ఏదైతే ఆయనపై అబద్దముగా ఆయనకు భాగస్వాములు ఉన్నారని తెలుపుతున్నారో దాని నుండి అతీతుడు.

(23) మరియు అల్లాహ్ తన అధికారములో,తన నిర్ణయములో ప్రత్యేకుడు. ఆయన నిర్ణయించిన దాని గురించి,ఆయన తీర్పునిచ్చిన దాని గురించి ఆయనను ఎవరు ప్రశ్నించరు. మరియు ఆయన తన దాసులను వారి కర్మల గురించి ప్రశ్నిస్తాడు, వాటిపరంగా వారికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.

(24) కానీ వారందరు అల్లాహ్ ను వదిలి ఆరాధ్యదైవాలను చేసుకున్నారు. ఓ ప్రవక్తా మీరు ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : ఆరాధనకు వారు అర్హత కలవారని మీ ఆధారమును తీసుకుని రండి. ఇది నాపై అవతరింపబడిన గ్రంధము. మరియు ప్రవక్తలపై అవతరింపబడిన గ్రంధములు మీకు వాటిలో ఎటువంటి అవసరం లేదు. అంతే కాదు చాలామంది ముష్రికులు అజ్ఞానమును,అనుకరణను ఆధారంగా తీసుకున్నారు. అయితే వారు సత్యమును స్వీకరించటం నుండి విముఖత చూపుతున్నారు.

(25) ఓ ప్రవక్తా మేము మీకన్నా ముందు ఏ ప్రవక్తను పంపినా "నేను తప్ప వాస్తవ ఆరాధ్య దైవం ఎవరూ లేరు కాబట్టి మీరు నన్నే ఆరాధించండి,నాతోపాటు దేనినీ సాటి కల్పించకండి" అని మాత్రమే అతనికి దైవ వాణి ద్వారా తెలియజేశాము.

(26) ముష్రికులు అల్లాహ్ దైవదూతలను కుమార్తెలుగా చేసుకున్నాడు అన్నారు. పరిశుద్ధుడైన ఆయన అతీతుడు,వారు పలుకుతున్న అబద్దము నుండి పరిశుద్ధుడు. అంతే కాదు దైవదూతలు అల్లాహ్ కు దాసులు,ఆయనచే గౌరవించబడినవారు,ఆయనకు దగ్గర చేయబడినవారు.

(27) వారు తమ ప్రభువు కన్నా ముందు ఏదీ మాట్లాడరు. ఆయన వారికి ఆదేశించనంత వరకు ఆయనతో మాట్లాడరు. మరియు వారు ఆయన ఆదేశమును పాలిస్తారు. ఏ ఆదేశములోను వారు ఆయనని విబేధించరు.

(28) వారి మునుపటి ఆచరణలు,వాటి తదుపరి ఆచరణలు ఆయనకు తెలుసు. మరియు అల్లాహ్ ఎవరి కొరకు సిఫారసు చేయటాన్ని అంగీకరిస్తాడో వారి కొరకు ఆయన అనుమతితో మాత్రమే వారు సిఫారసు కోరగలరు. మరియు వారు పరిశుద్ధుడైన ఆయన భయము వలన జాగ్రత్తపడుతుంటారు. ఏ ఆదేశంలో గాని ఏ వారింపులో గాని వారు ఆయనను విబేధించరు.

(29) మరియు దైవ దూతల్లోంచి ఎవరైన ఊహానుసారం నిశ్ఛయంగా నేను అల్లాహ్ కాకుండా ఒక ఆరాధ్య దైవము అని పలికితే అప్పుడు నిశ్ఛయంగా మేము అతని మాట వలన అతనికి ప్రళయ దినాన నరకము శిక్షను ప్రతిఫలంగా ఇస్తాము. అతడు అందులో శాస్వతంగా ఉంటాడు. మరియు ఈ ప్రతిఫలము లాంటి ప్రతిఫలమును అవిశ్వాసము వలన,అల్లాహ్ తో పాటు సాటి కల్పించటం వలన దుర్మార్గులైన వారికి మేము ప్రసాదిస్తాము.

(30) ఏమీ అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచిన వారికి ఆకాశములూ,భూమి రెండూ ఒక దానితో ఒకటి కలిసిపోయి ఉండేవని తెలియదా. దాని నుండి వర్షం కురవటానికి వాటి మధ్య ఎటువంటి ఖాళీ ఉండేది కాదు. అప్పుడు మేము ఆ రెండింటి మధ్య వేరు చేశాము. మరియు మేము ఆకాశము నుండి భూమి పైకి కురిసిన నీటితో జంతువుల్లోంచి,మొక్కల్లోంచి ప్రతీ దానిని పుట్టించాము. అయితే వారు దీని నుండి గుణపాఠం నేర్చుకొని ఒక్కడైన అల్లాహ్ పై విశ్వాసమును కనబరచరా ?!.

(31) మరియు భూమిలో తనపై ఉన్న వారిని తీసుకుని ప్రకంపించకుండా ఉండటానికి స్థిరమైన పర్వతాలను పుట్టించాము. మరియు మేము అందులో విశాలమైన మార్గాలను, దారులను వారు తమ ప్రయాణాల్లో తమ లక్ష్యాలను చేరటానికి మార్గములను పొండటానికి తయారు చేశాము.

(32) మరియు మేము ఆకాశమును ఎటువంటి స్థంభాలు లేకుండా కూడా పడిపోవటం నుండి భద్రంగా ఉండే కప్పుగా సృష్టించాము మరియు దొంగచాటుగా వినటం నుండి భద్రంగా ఉండే విధంగా చేశాము. మరియు ముష్రికులు ఆకాశములో ఉన్న సూర్యుడు,చంద్రుడు లాంటి సూచనల పట్ల విముఖత చూపుతున్నారు,గుణపాఠము నేర్చుకోవటం లేదు.

(33) మరియు ఒక్కడైన అల్లాహ్ ఆయనే రాత్రిని విశ్రాంతి కొరకు సృష్టించాడు. మరియు పగలును జీవనోపాధిని సంపాదించటం కొరకు సృష్టించాడు. మరియు ఆయన సూర్యుడిని పగటి సూచనగా,చంద్రుడిని రాత్రి సూచనగా సృష్టించాడు. సూర్య,చంద్రుల్లోంచి ప్రతి ఒక్కటి తన ప్రత్యేక కక్ష్యలో పయనిస్తున్నది. అది దాని నుండి మరలదు,ఒక వైపునకు వాలదు.

(34) ఓ ప్రవక్తా మీకన్న ముందు మేము మానవుల్లోంచి ఏ ఒక్కరి కొరకు కూడా ఈ జీవితంలో శాస్వతంగా ఉండేటట్లు చేయలేదే ?. అయితే ఈ జీవితంలో మీ ఆయుష్షు పూర్తయి మీరు చనిపోతారా. అప్పుడు మీ తరువాత వీరందరు శాస్వతంగా ఉంటారా ?!. ఖచ్చితంగా అలా జరుగదు.

(35) ప్రతీ మనిషి అతడు విశ్వాసపరుడైనా గాని అవిశ్వాసపరుడైనా గాని ఇహలోకములో మరణ రుచిని చూస్తాడు. ఓ ప్రజలారా మేము మిమ్మల్ని ఇహలోక జీవితంలో బాధ్యతల ద్వారా,సుఖభోగాల ద్వారా,ప్రతీకారము ద్వారా పరీక్షిస్తాము. ఆ తరువాత మీరు మీ మరణము తరువాత ఇతరుల వైపున కాకుండా మా వైపునకే మరలించబడుతారు. అప్పుడు మేము మీ ఆచరణల పరంగా మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము.

(36) ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరు మిమ్మల్ని చూసినప్పుడు మిమ్మల్ని మాత్రం పరిహాసంగా తీసుకుని తమను అనుసరించే వారిలో తమ మాట ద్వారా ధ్వేషాన్ని రగిలిస్తూ ఇలా పలికే వారు ఏమిటీ ఇతడు మీరు ఆరాధించే మీ ఆరాధ్య దైవాలను దూషిస్తున్నాడా ?!. మరియు వారు మిమ్మల్ని పరిహాసంగా చేసుకోవటంతోపాటు వారి పై అల్లాహ్ అవతరింపజేసిన ఖుర్ఆన్ ను తిరస్కరించేవారు, ఆయన వారికి ప్రసాదించిన అనుగ్రహాల పట్ల కృతఘ్నులైపోయారు. అయితే వారు అన్ని చెడులను సమీకరించుకోవటం వలన వారు ఎక్కువ లోపమునకు హక్కుదారులు.

(37) మానవుడు తొందరపాటు జీవిగా పుట్టించబడ్డాడు. అయితే అతను విషయాలు జరగకముందే తొందర చేస్తాడు. మరియు శిక్ష గురించి ముష్రికులు తొందర చేయటం అందులో నుంచే. ఓ తొందర చేసేవారా నేను త్వరలోనే మీరు తొందర చేస్తున్న నా శిక్షను మీకు చూపిస్తాను. ఆయితే మీరు దాన్ని తొందరగా అవటమును కోరకండి.

(38) మరణాంతరం లేపబడటమును తిరస్కరించే అవిశ్వాసపరులు తొందరపడుతూ ఇలా పలికే వారు : ఓ ముస్లిములారా మీరు మాకు దేని గురించి అయితే బెదిరిస్తున్నారో మరణాంతరం లేపబడటంలోంచి ఒక వేళ మీరు అది జరిగే విషయంలో మీరు బెదిరిస్తున్న దానిలో సత్యవంతులే అయితే అది ఎప్పుడు జరుగునో తెలపండి ?!.

(39) ఒక వేళ మరణాంతరము లేపబడటమును తిరస్కరించే అవిశ్వాసపరులు వీరందరు తమ ముఖముల నుండి,తమ వీపుల నుండి నరకాగ్నిని తొలగించుకోలేనప్పటి వైనమును,వారి నుండి శిక్షను తొలగించటం ద్వారా వారికి సహాయపడు వాడు ఎవడూ లేడని తెలుసుకుని ఒకవేళ దాన్ని నమ్మితే వారు శిక్ష గురించి తొందర చేయరు.

(40) వారు శిక్షించబడే ఈ అగ్ని వారికి తెలిసినట్లు వారి వద్దకు రాదు. కాని అది వారి వద్దకు అకస్మాత్తుగా వస్తుంది. అయితే వారు దాన్ని తమ నుండి నిర్మూలించుకోలేరు. వారు పశ్ఛాత్తాప్పడి వారికి కారుణ్యము కలిగెంత వరకు వారికి గడువు ఇవ్వబడదు.

(41) మరియు ఓ ప్రవక్తా ఒక వేళ మీ జాతి వారు మీతో ఎగతాళి చేస్తే ఈ విషయంలో మీరు మొదటి వారు కాదు. నిశ్ఛయంగా మీకన్న మనుపు ప్రవక్తలూ ఎగతాళి చేయబడ్డారు. అయితే వారితో ఎగతాళి చేసిన అవిశ్వాసపరులకు ఆ శిక్ష దేని గురించి అయితే వారిని ఇహలోకంలో వారి ప్రవక్తలు భయపెట్టినప్పుడు వారు ఎగతాళి చేసే వారో చుట్టుకుంది.

(42) ఓ ప్రవక్తా శిక్ష గురించి తొందర చేసే వీరందరితో ఇలా పలకండి : కరుణామయుడు మీపై శిక్షను అవతరింపజేయదలిస్తే,మిమ్మల్ని తుదిముట్టించదలిస్తే దాని నుండి రేయింబవళ్ళు మిమ్మల్ని రక్షించేవాడు ఎవడు ?. కానీ వారు తమ ప్రభువు యొక్క హితోపదేశముల నుండి,ఆయన వాదనల నుండి విముఖత చూపుతున్నారు, అజ్ఞానము,బుద్ధిలేమి వలన వారు వాటిలో నుండి కొంచెము కూడా యోచన చేయటం లేదు.

(43) లేదా వారి కొరకు మా శిక్ష నుండి ఆపే దైవాలు ఎవరైన ఉన్నారా ?. వారు తమ నుండి కీడును తొలగించుకోవటం ద్వారా,తమకు లాభం చేసుకోవటం ద్వారా తమకు తామే సహాయం చేసుకోలేరు. మరియు ఎవరైతే తమ స్వయం కొరకు సహాయం చేసుకోలేడో వాడు ఎలా ఇతరులకు సహాయం చేయగలడు ?. మరియు వారు మా శిక్ష నుండి రక్షించబడలేరు.

(44) అయినా మేము ఈ అవిశ్వాసపరులందరికి జీవనోపాధిని కల్పించాము. మరియు వారి తాత ముత్తాతలపై మా అనుగ్రహాలను వ్యాపింపజేసి జీవనోపాధిని కల్పించాము. వారిని నెమ్మది నెమ్మదిగా తీసుకుని వెళ్ళటానికి. చివరికి వారి కాలము పొడుగయి వారు దానితో మోసపోయారు. వారు తమ అవిశ్వాసముపైనే ఉన్నారు. ఏమీ మా అనుగ్రహాల వలన మోసపోయి మా శిక్ష గురించి తొందర చేసే వీరందరు మేము భూమిని దాని వాసులపై మా అధికారము ద్వారా దాని నలువైపుల నుండి తగ్గించుకుంటూ వస్తున్నది చూడటం లేదా, ఇతరులపై వచ్చిపడినది వారిపై పడనంత వరకు వారు వాటి ద్వారా గుణపాఠం నేర్చుకోవటానికి ?!. వీరందరు గెలుపొందేవారు కాదు. కాని వారే ఓడిపోయేవారు.

(45) ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ ప్రజలారా నేను మిమ్మల్ని ఆ దైవ వాణి ఆధారంగా దేనినైతే నా ప్రభువు నా వైపు అవతరింపజేశాడో దాని ద్వారా అల్లాహ్ శిక్ష నుండి భయపెడుతున్నాను. సత్యమును వినటం నుండి చెవిటివారైపోయిన వారు అల్లాహ్ శిక్ష నుండి భయపెట్టబడినప్పుడు దేని వైపునైతే వారు పిలవబడుతున్నారో దాన్ని స్వీకరించే ఉద్దేశముతో వినలేరు.

(46) ఓ ప్రవక్తా ఒక వేళ శిక్ష గురించి తొందర చేసే వీరందరికి నీ ప్రభువు యొక్క శిక్ష నుండి కొంత భాగము ముట్టుకుంటే అప్పుడు వారు తప్పకుండా ఇలా అంటారు : అయ్యో మా వినాశనము,మా నష్టము నిశ్ఛయంగా మేము అల్లాహ్ తో పాటు సాటి కల్పించటం ద్వారా,ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించటం ద్వారా దుర్మార్గులమైపోయాము.

(47) మరియు మేము ప్రళయదిన వాసుల కొరకు న్యాయపూరితమైన తూకములను వాటి ద్వారా వారి కర్మలను తూకమేయటానికి ఏర్పాటు చేస్తాము. ఆ రోజు ఏ మనిషిని అతని పుణ్యాలను తగ్గించి లేదా అతని పాపాలను అధికం చేసి హింసించటం జరగదు. ఒక వేళ తూకమేయబడేది ఆవ గింజంత బరువంత కొద్దిగా ఉన్నా మేము దాన్ని తీసుకుని వస్తాము. మరియు మా దాసుల కర్మలను లెక్క వేయటానికి మేము చాలు.

(48) మరియు నిశ్చయంగా మేము మూసా,హారూన్ అలైహిమస్సలాంనకు తౌరాతును సత్య అసత్యాల మధ్య,హలాల్,హరాంల మధ్య వ్యత్యాసమును చూపే దానిగా,దాని పట్ల విశ్వాసమును కనబరిచే వారికి మార్గదర్శకముగా మరియు తమ ప్రభువు పట్ల భీతి కలిగిన వారి కొరకు హితోపదేశముగా ప్రసాదించాము.

(49) ఎవరైతే తమ ఆ ప్రభువు యొక్క శిక్ష నుండి భయపడుతారో ఎవరినైతే వారు చూడకుండానే విశ్వసించారో వారు ప్రళయము నుండి భయపడుతారు.

(50) మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ దాని ద్వారా హితబోధన గ్రహించదలచిన వాడి కొరకు ఒక జ్ఞాపికము,హితబోధన,చాలా ప్రయోజనకరమైనది,మేలైనది ఇలా అయినా కూడా మీరు దాన్ని తిరస్కరిస్తున్నారా ?!. దానిని స్వీకరించకుండా,దాని ప్రకారం ఆచరించకుండా ?!.

(51) మరియు నిశ్ఛయంగా మేము ఇబ్రాహీం అలైహిస్సలాంకి ఆయన బాల్యములోనే ఆయన జాతి వారిపై వాదనను (హుజ్జత్) ప్రసాదించాము. మరియు మేము ఆయన గురించి తెలిసినవారము. అప్పుడు మా జ్ఞానములో వాదన నుండి ఆయన జాతి వారిపై ఆయన దేనికి అర్హులో అది మేము ఆయనకు ప్రసాదించాము.

(52) అప్పుడు ఆయన తన తండ్రి ఆజర్ తో,తన జాతి వారితో ఇలా పలికారు : మీ చేతులతో మీరు తయారు చేసుకున్న ఈ విగ్రహాలు ,వేటి ఆరాధన మీరు చేస్తున్నారో ఇవి ఏమిటి ?.

(53) ఆయనకి ఆయన జాతివారు మేము మా తాతముత్తాతలను వాటిని ఆరాధిస్తుండగా చూశాము. మరియు వారిని నమూనాగా తీసుకుని మేము వాటిని ఆరాధిస్తున్నాము అని అన్నారు.

(54) ఇబ్రాహీం అలైహిస్సలాం వారితో ఇలా పలికారు : నిశ్ఛయంగా ఓ అనుసరించేవారా మీరు అనుసరించబడిన మీ తాతముత్తాతలు సత్యము యొక్క స్పష్టమైన మార్గము నుండి వైదొలిగి అపమార్గములో ఉన్నారు.

(55) ఆయనతో ఆయన జాతివారు ఇలా పలికారు : నీవు ఏదైతే పలికావో అప్పుడు మా వద్దకు సత్యాన్ని తీసుకుని వచ్చావా లేదా నీవు ఆషామాషీగా అంటున్నావా ?.

(56) ఇబ్రాహీమ్ అలైహిస్సలాం ఇలా పలికారు : కాని నేను మీ వద్దకు వాస్తవాన్ని తీసుకుని వచ్చాను, ఆషామాషీని తీసుకురాలేదు. అయితే నీ ప్రభువు ఆయన భూమ్యాకాశముల ప్రభువు ఎవరైతే వాటిని పూర్వ నమూనా లేకుండా సృష్టించాడో. మరియు నేను ఆయన మీ ప్రభువు అని, భూమ్యాకాశముల ప్రభువు అని సాక్ష్యం పలికే వారిలోంచి వాడిని. మరియు మీ విగ్రహాలకు వాటిలో నుండి ఏ భాగము లేదు.

(57) మరియు ఇబ్రాహీం అలైహిస్సలాం ఆయన జాతి వారు ఆయన మాట విననప్పుడు ఇలా పలికారు : అల్లాహ్ సాక్షిగా మీరు మీ పండుగ కొరకు మీ విగ్రహాలకు దూరంగా వెళ్ళిన తరువాత నేను మీ విగ్రహాల కొరకు మీకు ఇష్టం లేని దాని యుక్తి పన్నుతాను.

(58) అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి విగ్రహాలను చిన్నచిన్న ముక్కలు అయ్యే వరకు విరగ్గొట్టారు. మరియు వాటి పెద్ద విగ్రహమును వారు తిరిగి దాని వద్దకు వచ్చి దానితో వాటిని విరగ్గొట్టిన వారి గురించి వారు అడుగుతారని ఆశించి వదిలి వేశారు.

(59) వారు తిరిగి వచ్చి తమ విగ్రహాలను విరిగి ఉండగా చూసినప్పుడు వారు ఒకరినొకరు ఇలా అడిగారు : మా విగ్రహాలను ఎవరు విరగ్గొట్టారు ?. ఎవరైతే వాటిని విరగ్గొట్టాడో అతడు గౌరవానికి,పవిత్రతకు అర్హులైన వాటిని కించపరచినప్పుడు దుర్మార్గుల్లోంచి వాడు.

(60) వారిలో నుండి కొందరు ఇలా పలికారు : మేము ఒక యువకుడిని వాటి గురించి చెడుగా ప్రస్తావిస్తుండగా,వారి లోపాలను తెలుపుతుండగా విన్నాము. అతడిని ఇబ్రాహీం అని పిలుస్తారు. బహుశా వాటిని విరగ్గొట్టినవాడు అతడే నేమో.

(61) వారి నాయకులు ఇలా పలికారు : మీరు ఇబ్రాహీంను ప్రజల కళ్ళముందుకు,దృష్టికి తీసుకుని రండి బహుశా వారు అతను చేసిన దాన్ని అంగీకరిస్తుండగా చూస్తారు,అప్పుడు అతని అంగీకారము మీ కొరకు దానికి ఒక ఋజువు అవుతుంది.

(62) అప్పుడు వారు ఇబ్రాహీం అలైహిస్సలాంను తీసుకుని వచ్చి అతనితో ఇలా అడిగారు : ఓ ఇబ్రాహీం మా విగ్రహాలపట్ల ఈ దుష్చర్యకు పాల్పడినవాడవు నీవేనా ?!.

(63) ఇబ్రాహీం అలైహిస్సలాం వారిపై వ్యంగ్యంగా,ప్రజల దృష్టి ముందు వారి విగ్రహాల అశక్తతను బహిరంగపరుస్తూ ఇలా పలికారు : దాన్ని నేను చేయలేదు కాని దాన్ని విగ్రహాల్లో పెద్ద విగ్రహం చేసింది,కావున మీరు మీ విగ్రహాలను అడగండి ఒక వేళ అవి మాట్లాడగలిగితే.

(64) అప్పుడు వారు యోచన చూస్తూ,దీర్ఘంగా ఆలోచిస్తూ తమ స్వయం వైపునకు మరలారు. అప్పుడు వారికి తమ విగ్రహాలు లాభం కలిగించవని,నష్టం కలిగించవని స్పష్టమయింది. అయితే వారు అల్లాహ్ ను వదిలి వాటిని ఆరాధించినప్పుడు దుర్మార్గులైపోయారు.

(65) ఆ తరువాత వారు విబేధించటానికి,తిరస్కరించటానికి మరలి వచ్చి ఇలా పలికారు : ఓ ఇబ్రాహీం ఈ విగ్రహాలు మాట్లాడవని నీకు ఖచ్చితంగా తెలుసు. అటువంటప్పుడు నీవు ఎలా మమ్మల్ని వాటితో అడగమని ఆదేశిస్తున్నావు ?. వారు దాన్ని తమకి ఆధారంగా తీసుకోదలచారు కాని అది వారికి వ్యతిరేకంగా ఆధారమయింది.

(66) ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని ఖండిస్తూ ఇలా పలికారు : మీరు అల్లాహ్ ను వదిలి మీకు ఏమి లాభం చేకూర్చని,నష్టం చేకూర్చని కొన్ని విగ్రహాలను ఆరాధిస్తున్నారా ?. వారు తమ స్వయం నుండి నష్టమును తొలగించటం నుండి లేదా తమ కొరకు లాభం తీసుకుని రావటం నుండి అశక్తులు.

(67) మీ కొరకు ధూత్కారము,మీరు అల్లాహ్ ను వదిలి, లాభం చేకూర్చని,నష్టం కలిగించని ఈ విగ్రహాలను మీరు ఆరాధించటమునకు ధూత్కారము. అయితే మీరు వాటిని ఆరాధించటమును వదిలి వేయటానికి ఇది మీకు తెలియదా ?!.

(68) వారు అతడిని వాదనతో ఎదుర్కోలేనప్పుడు బలవంతం చేయటం వైపునకు వారు మగ్గు చూపి ఇలా పలికారు : మీరు మీ ఆ విగ్రహాల కొరకు వేటినైతే అతను శిధిలం చేశాడో,విరగ్గొట్టాడో సహాయముగా ఇబ్రాహీంను అగ్నితో కాల్చి వేయండి. ఒక వేళ మీరు నిరోదక శిక్షగా దానిని చేసే వారే అయితే.

(69) అయితే వారు అగ్నిని రాజేశి ఆయనను అందులో విసిరేశారు. అప్పుడు మేము ఇలా పలికాము : ఓ అగ్ని నీవు ఇబ్రాహీం కొరకు చల్లగాను,సురక్షితంగాను మారిపో. అప్పుడు అది అలాగే అయిపోయింది. అప్పుడు ఆయనకు బాధ కలగలేదు.

(70) ఇబ్రాహీం అలైహిస్సలాం జాతి వారు ఆయనను కాల్చి వేయటం ద్వారా ఆయనకు కీడు చేయాలనుకున్నారు. అప్పుడు మేము వారి కుట్రను బెడసి కొట్టి వారినే మేము వినాశనమునకు గురయ్యే వారిగా,ఓటమి పాలయ్యే వారిగా చేశాము.

(71) మరియు మేము ఆయనను రక్షించాము,లూత్ అలైహిస్సలాంను రక్షించాము. మరియు మేము వారిద్దరిని ప్రవక్తలను పంపించటము ద్వారా,సృష్టితాల కొరకు ఆహారపదార్ధములను వ్యాపింపజేయటం ద్వారా మేము శుభాలను కురిపించిన ప్రాంతమైన షామ్ (సిరియా) వైపునకు తీసుకుని వెళ్ళాము.

(72) మరియు మేము ఆయన తనకు ఒక కుమారుడిని ప్రసాదించమని తన ప్రభువుతో వేడుకున్నప్పుడు ఆయనకు ఇస్హాఖ్ ను ప్రసాదించాము. మరియు ఆయనకు మేము అదనంగా యాఖూబ్ ను ప్రసాదించాము. మరియు ఇబ్రాహీం,ఆయన ఇద్దరు కుమారులైన ఇస్హాఖ్,యాఖూబ్ లో నుండి ప్రతి ఒక్కరిని మేము సద్వర్తనలుగా,అల్లాహ్ కు విధేయులుగా చేశాము.

(73) మరియు మేము వారిని నాయకులుగా (అయిమ్మ) తీర్చిదిద్దాము మంచిలో ప్రజలు వారితో మార్గము పొందుతారు. వారు ప్రజలను ఒకే అల్లాహ్ ఆరాధన వైపునకు మహోన్నతుడైన ఆయన ఆదేశముతో పిలుస్తారు. మరియు మేము వారి వైపునకు సత్కార్యములు చేయమని,నమాజులను వాటి పరిపూర్ణ పధ్ధతిలో పాఠించమని,జకాత్ ను చెల్లించమని దైవవాణి ద్వారా తెలియపరచాము. మరియు వారు మాకు లోబడి ఉన్నారు.

(74) మరియు మేము లూత్ అలైహిస్సలాంనకు ప్రత్యర్ధుల మధ్య తీర్పునిచ్చి నిర్ణయాలు తీసుకునే అధికారమును ప్రసాదించాము. మరియు మేము అతని ధర్మ విషయంలో జ్ఞానమును ప్రసాదించాము. మరియు మేము ఆయనను ఆ శిక్ష నుండి దేనినైతే మేము ఆయన నగరము (సద్దూమ్) పై కురిపించామో దాని నుండి రక్షించాము. అక్కడి వాసులు అశ్లీల కార్యలను చేసేవారు. నిశ్ఛయంగా వారు తమ ప్రభువు విధేయత నుండి వైదొలగి చెడును కలిగిన జాతివారు.

(75) అతని జాతి వారికి కలిగిన శిక్ష నుండి మేము అతనిని రక్షించినప్పుడు అతన్ని మేము మా కారుణ్యంలో ప్రవేశింపజేశాము. నిశ్ఛయంగా అతడు మా ఆదేశములను పాఠించి,మేము వారించిన వాటికి దూరంగా ఉండే పుణ్యాత్ములలోంచి వాడు.

(76) మరియు ఓ ప్రవక్తా మీరు నూహ్ అలైహిస్సలాం గాధను ఇబ్రాహీం,లూత్ అలైహిమస్సలాం కన్న ముందు ఆయన అల్లాహ్ ను పిలిచివప్పటి వైనమును గుర్తు చేసుకోండి. ఆయన కోరిన దాన్ని ఆయనకు ప్రసాదించి ఆయన (ప్రార్ధనను) మేము అంగీకరించాము. అప్పుడు మేము ఆయన్నీ రక్షించాము. మరియు విశ్వసించిన ఆయన ఇంటి వారిని మేము మహా విపత్తు నుండి రక్షించాము.

(77) మరియు ఆయన నిజాయితీని సూచించే ఆయతుల ద్వారా మేము ఆయనకు మద్దతిచ్చిన వాటిని తిరస్కరించిన జాతి వారి కుట్ర నుండి ఆయనని మేము రక్షించాము. నిశ్ఛయంగా వారు చెడ్డ,దుష్ట జాతివారు. అయితే మేము వారందరిని ముంచి నాశనము చేశాము.

(78) ఓ ప్రవక్తా మీరు దావూద్,అతని కుమారుడు సులైమాన్ అలైహిమస్సలాం వారి వద్దకు తీసుకుని రాబడిన ఇద్దరి ప్రత్యర్ధుల విషయంలో వారిరువురు ఒక వివాదం విషయంలో తీర్పునిచ్చినప్పటి గాధను గుర్తు చేసుకోండి. ఇద్దరు ప్రత్యర్ధుల్లోంచి ఒకరి మేకలు ఒక రాత్రి ఇంకొకరి చేనులో పడి దాన్ని పాడు చేశాయి. మరియు మేము దావూద్,సులైమాను తీర్పుకి సాక్షులుగా ఉన్నాము. వారిరువురి తీర్పులో నుండి ఏదీ మా నుండి అదృశ్యం కాలేదు.

(79) అప్పుడు మేము సులైమానుకు ఆయన తండ్రి దావూదుకు కాకుండా తీర్పు యొక్క అవగాహనను కలిగించాము. దావూద్,సులైమానులో నుండి ప్రతి ఒక్కరికి మేము దైవ దౌత్యమును,ధర్మ ఆదేశాల జ్ఞానమును ప్రసాదించాము. సులైమాన్ అలైహిస్సలాం ఒక్కడికే దాన్ని మేము ప్రత్యేకించ లేదు. మరియు మేము పర్వతములను దావూదుతో పాటు విధేయత చూపే విధంగా చేశాము. అవి ఆయన స్థుతులు పలకటంతో పాటు స్థుతులు పలికేవి. మరియు మేము పక్షులను ఆయన కొరకు విధేయులగా చేశాము. మరియు అవగాహన కల్పించటం,తీర్పు నివ్వటమును,జ్ఞానమును ,ఆదీనంలో చేయటమును ప్రసాదించటం చేసేవారము మేమే.

(80) మరియు మేము సులైమానుకు కాకుండా దావుద్ కి మీ శరీరాలపై ఆయుధాల దాడి నుండి మిమ్మల్ని రక్షించటం కొరకు కవచములను తయారు చేయటమును నేర్పించాము. ఓ ప్రజలారా అల్లాహ్ మీపై అనుగ్రహించిన ఈ అనుగ్రహాలకి కృతజ్ఞతలు తెలుపుకుంటారా ?!.

(81) మరియు మేము సులైమాను కొరకు తీవ్రంగా వీచే గాలిని ఆదీనంలో చేశాము. ఆయన దాన్ని ఆదేశించినప్పుడు ఆది ఆయన ఆదేశం మేరకు మేము దైవ ప్రవక్తలను పంపించటం ద్వారా,ఆహారోపాధిని వ్యాపింపచేయటం ద్వారా మేము శుభాలను కలిగించి షామ్ ప్రాంతము వైపునకు వీస్తుంది. మరియు మాకు ప్రతీది తెలుసు. అందులో నుండి ఏదీ మాపై గోప్యంగా ఉండదు.

(82) మరియు మేము షైతానుల్లోంచి కొందరిని ఆదీనంలో చేశాము. ఆయన కొరకు సముద్రంలో మునిగి ముత్యాలను,ఇతరవాటిని తీసేవారు ఉన్నారు. మరియు వారు ఇతర కార్యములు నిర్మాణాలు చేయటం లాంటి కార్యాలూ చేస్తారు. మరియు మేము వారి సంఖ్యలను,వారి కార్యాలను కనిపెట్టుకుని ఉంటాము. వాటిలో నుండి ఏదీ మా నుండి తప్పి పోదు.

(83) ఓ ప్రవక్తా తనకు ఆపద కలిగినప్పుడు పరిశుద్ధుడైన తన ప్రభువును ఇలా పలుకుతూ అర్ధించినప్పటి అయ్యూబ్ అలైహిస్సలాం గాధను గుర్తు చేసుకోండి : ఓ నా ప్రభువా రోగము ద్వారా,ఇంటి వారిని కోల్పోవటం ద్వారా నాపై ఆపద కలిగినది. మరియు నీవు కరుణామయులందరిలో కెల్లా గొప్ప కరుణామయుడివి. అందులో నుండి నాకు కలిగిన దాన్ని నా నుండి దూరం చేయి.

(84) అప్పుడు మేము ఆయన దుఆను స్వీకరించి ఆయనకు కలిగిన కీడును ఆయన నుండి మేము తొలగించాము. ఆయన కోల్పోయిన ఆయన ఇంటి వారిని,ఆయన సంతానమును ఆయనకు ప్రసాదించాము. మరియు మేము వారితో పాటు వారిని పోలిన వారిని ఆయనకు ప్రసాదించాము.ఇదంతా మేము మా వద్ద నుండి కారుణ్యముగా,ఆరాధన ద్వారా అల్లాహ్ కొరకు విధేయత చూపే ప్రతి ఒక్కరి కొరకు,అయ్యూబ్ సహనం పాటించినట్లు సహనం పాటించటానికి హితబోధనగా చేశాము.

(85) ఓ ప్రవక్తా మీరు ఇస్మాయీలు,ఇద్రీసు,జుల్ కిఫ్ల్ అలైహిముస్సలాములను గుర్తు చేసుకోండి. వారందరిలో నుండి ప్రతి ఒక్కరు ఆపదపై,అల్లాహ్ వారికిచ్చిన బాధ్యతను నెరవేర్చటం పై సహనం చూపే వారిలోంచి వారు.

(86) మరియు మేము వారందరిని మా కారుణ్యములో ప్రవేశింపజేశి వారిని దైవ ప్రవక్తలుగా చేశాము. మరియు మేము వారిని స్వర్గములో ప్రవేశింపజేశాము. నిశ్ఛయంగా వారు తమ ప్రభువు యొక్క విధేయతలో ఆచరించిన అల్లాహ్ దాసుల్లోంచి వారు. మరియు వారి అంతర్గతములు,వారి బహిర్గతములు మంచిగా అయినవి.

(87) ఓ ప్రవక్తా మీరు చేప వారైన యూనుస్ అలైహిస్సలాం గాధను ఆయన తన ప్రభువు అనుమతి లేకండా అతని జాతి వారు అవిధేయతలో కొనసాగటం వలన వారిపై కోపముతో వెళ్ళినప్పటి వైనమును గుర్తు చేసుకోండి. అతడు అలా వెళ్ళిపోవటంపై అతనిని శిక్షించటం ద్వారా మేము అతనిని ఇబ్బంది పెట్టమని అతడు భావించాడు. అయితే అతడిని చేప మింగినప్పుడు అతడు తీవ్ర ఇబ్బంది,బంధీ వలన బాధించబడ్డాడు. అప్పుడు అతడు రాత్రి,సముద్రం,చేప కడుపు చీకట్లలో తన అపరాధమును అంగీకరిస్తూ అల్లాహ్ యందు తన తరపు నుండి పశ్ఛాత్తాప్పడుతూ మొర పెట్టుకున్నాడు. అప్పుడు అతను ఇలా పలికాడు : నీవు తప్ప ఎవరూ వాస్తవ అరాధ్య దైవం లేడు. నీవు అతీతుడివి,పరిశుద్ధుడివి. నిశ్ఛయంగా నేను దుర్మార్గుల్లోంచి వాడిని.

(88) అప్పుడు మేము అతని దుఆను స్వీకరించాము. మరియు మేము అతడిని చీకట్లలో నుంచి,చేప కడుపులో నుంచి వెలికి తీసి తీవ్ర దుఃఖము నుండి అతడికి విముక్తిని కలిగించాము. యూనుస్ ను ఈ దుఃఖము నుండి విముక్తి కలిగించినట్లే విశ్వాసపరులను వారు దుఃఖములో పడి అల్లాహ్ తో మొర పెట్టుకున్నప్పుడు మేము విముక్తిని కలిగిస్తాము.

(89) ఓ ప్రవక్తా జకరియా అలైహిస్సలాం గాధను ఆయన పరిశుద్ధుడైన తన ప్రభువును ఇలా పలుకుతూ మొర పెట్టుకున్నప్పటి వైనమును గుర్తు చేసుకోండి : ఓ నా ప్రభువా నీవు నన్ను ఎటువంటి సంతానము లేకుండా ఒంటరి వాడిని చేయకు. వాస్తవానికి నీవు ఉత్తమంగా ఉంచే వాడివి. అయితే నీవు నా తరువాత ఉండే ఒక కుమారుడిని నాకు ప్రసాదించు.

(90) అప్పుడు మేము అతని దుఆను స్వీకరించి,అతనికి కుమారుడిగా యహ్యాను ప్రసాదించాము. మరియు అతని భార్యను మేము యోగ్యురాలిగా చేశాము. అప్పుడు ఆమె సంతానమును జన్మనివ్వలేనిది అయి కూడా సంతానమును జన్మనిచ్చేదిగా అయిపోయినది. నిశ్ఛయంగా జకరియా,అతని భార్య,అతని కుమారుడు సత్కార్యములు చేయటమునకు త్వరపడే వారు. మరియు వారు మా వద్ద ఉన్న పుణ్యమును ఆశిస్తూ, మా వద్ద ఉన్న శిక్ష నుండి భయపడుతూ మమ్మల్ని వేడుకునేవారు. మరియు వారు మా కొరకు వినమ్రులై ఉండేవారు.

(91) ఓ ప్రవక్తా వ్యభిచారము నుండి తన శీలాన్ని కాపాడుకున్న మర్యమ్ అలైహస్సలాం గాధను గుర్తు చేసుకోండి. అప్పుడు అల్లాహ్ ఆమె వద్దకు జిబ్రయీల్ అలైహిస్సలాంను పంపించాడు. అప్పుడు ఆయన ఆమెలో ఊదితే ఆమె ఈసా అలైహిస్సలాంను గర్భంగా దాల్చింది. మరియు ఆమె,ఆమె కుమారుడు ఈసా అలైహిమస్సలాం ఇద్దరు ప్రజల కొరకు అల్లాహ్ సామర్ధ్యంపై, మరియు తండ్రి లేకుండా అతడు ఆయనను పుట్టించినప్పుడు అతడిని ఏదీ అశక్తుడిని చేయలేదు అన్న దానిపై ఒక సూచన అయ్యారు.

(92) ఓ ప్రజలారా నిశ్ఛయంగా మీ ఈ ధర్మము ఒకే ఒక ధర్మము. అది ఇస్లాం ధర్మమైన తౌహీదు (ఏక దైవ ధర్మం). మరియు నేను మీ ప్రభువును. అయితే నీవు ఆరాధనను నా ఒక్కడి కొరకే ప్రత్యేకించు.

(93) మరియు ప్రజలు వేరు వేరు అయిపోయారు. అప్పుడు వారిలో నుండి ఒకే దైవమును విశ్వసించేవాడు,బహుదైవారాధకుడు,అవిశ్వాసపరుడు,విశ్వాసపరుడు అయిపోయారు. వేరు వేరు అయిన వీరందరు ప్రళయదినాన మా ఒక్కరి వైపునకే మరలి వస్తారు. అప్పుడు మేము వారిని వారి ఆచరణల పరంగా ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము.

(94) వారిలో నుంచి ఎవరైతే అల్లాహ్ పై,ఆయన ప్రవక్తలపై,అంతిమ దినముపై విశ్వాసమును కనబరుస్తూ సత్కార్యములు చేస్తాడో అతని సత్కర్మ తిరస్కరించబడదు. అంతే కాదు అల్లాహ్ అతని పుణ్యమును ఆదరించి దాన్ని రెట్టింపు చేస్తాడు. మరియు అతడు మరణాంతరం లేపబడిన రోజు దాన్ని తన కర్మల పత్రంలో పొందుతాడు. అప్పుడు దానితో సంతోషిస్తాడు.

(95) మరియు ఇది ఒక గ్రామ ప్రజలకు అసాధ్యం. వారు పశ్ఛాత్తాప్పడి వారి తౌబా స్వీకరించబడటానికి ఇహలోకము వైపునకు వారు మరలటమును వారి అవిశ్వాసం వలన మేము వారిపై నిషేదించాము.

(96) యాజూజ్,మాజూజ్ అడ్డు కట్ట తెరవబడేంత వరకు ఎన్నటికి వారు మరలరు. మరియు వారు ఆ రోజు భూమి నుండి ప్రతి ఎత్తైన ప్రదేశము నుండి వేగముగా బయలుదేరి వస్తారు.

(97) వారు బయటకి రావటంతో ప్రళయదినం దగ్గరపడింది. మరియు దాని భయాందోళనలు,దాని తీవ్రతలు బహిర్గతమైనవి. అప్పుడు దాని భయాందోళనల తీవ్రత వలన అవిశ్వాసపరుల కళ్ళు తెరుచుకుని ఉండిపోయి వారు ఇలా పలికారు : అయ్యో మా దౌర్భాగ్యం నిశ్ఛయంగా మేము ఇహలోకంలో ఆటల్లో,ఈ గొప్ప దినము కొరకు సిద్ధం అవటం నుండి అశ్రద్ధలో పడి ఉన్నాము. అంతే కాదు మేము అవిశ్వాసము,పాప కార్యలకు పాల్పడటం వలన దుర్మార్గులమైపోయాము.

(98) ఓ ముష్రికులారా నిశ్ఛయంగా మీరు, మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధించే విగ్రహాలు,మీ ఆరాధన నుండి సంతుష్టపడిన జిన్నులు,మానవులు నరకమునకు ఇంధనమవుతారు,మీరూ,మీ ఆరాధ్య దైవాలు అందులో ప్రవేశిస్తారు.

(99) ఒక వేళ ఈ ఆరాధించబడేవి వాస్తవంగా ఆరాధించబడే దైవాలే అయితే వారు తమను ఆరాధించే వారితోపాటు నరకంలో ప్రవేశించేవారు కాదు. మరియు ఆరాధించేవారిలో నుండి,ఆరాధించబడే వారిలో నుండి ప్రతి ఒక్కరు నరకాగ్నిలో ఉంటారు. వారు అందులో నుంచి బయటకు రాకుండా అందులో వారు శాస్వతంగా నివాసముంటారు.

(100) అందులో వారికి కలిగిన బాధల వలన వారికి తీవ్రమైన మూలగటం ఉంటుంది. మరియు వారు నరకాగ్నిలో వారికి కలిగిన భయాందోళనల తీవ్రత వలన శబ్ధములను వినలేరు.

(101) ఎప్పుడైతే ముష్రికులు ఆరాధన చేయబడిన ఈసా,దైవదూతలు తొందరలోనే నరకంలో ప్రవేశిస్తారని పలికారో అల్లాహ్ ఇలా పలికాడు : నిశ్చయంగా అల్లాహ్ యొక్క జ్ఞానములో ఈసా అలైహిస్సలాం లాంటి సద్వర్తనులు నరకము నుండి దూరంగా ఉంచబడతారని ముందే తెలపబడినది.

(102) వారి చెవుల వరకు నరకము యొక్క ధ్వని చేరదు. మరియు వారు అందులో తమ మనస్సులు కోరిన అనుగ్రహాల్లో,రుచులలో నివాసముంటారు. వారి అనుగ్రహాలు ఎన్నటికి అంతమవవు.

(103) నరకాగ్ని తన వాసులపై నుండి చుట్టుముట్టినప్పుడు పెద్ద భయాందోళన వారికి భయమును కలిగించదు. మరియు దైవదూతలు వారికి ఇలా అభినందనలు తెలుపుతూ ఆహ్వానిస్తారు : ఇహలోకములో మీతో వాగ్దానం చేయబడిన,అందులో మీరు పొందే అనుగ్రహాల గురించి మీకు శుభవార్త ఇవ్వబడిన మీ రోజు ఇది.

(104) ఆ రోజు మేము ఆకాశమును పత్రికను దానిలో ఉన్నవాటితో సహా చుట్టేసినట్లు చుట్టేస్తాము. మరియు మేము సృష్టితాలను వారు మొదటిసారి పుట్టించబడిన వారి రూపముల్లోనే సమీకరిస్తాము. మేము ఎటువంటి విబేధము లేని ఇలాంటి వాగ్దానమును చేశాము. నిశ్ఛయంగా మేము చేసిన వాగ్దానమును నెరవేరుస్తాము.

(105) మేము లౌహె మహ్ఫూజ్ లో అల్లాహ్ విధేయతలో ఆచరించే సజ్జనులైన అల్లాహ్ దాసులు భూమికి వారసులవుతారని,వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జాతివారని వ్రాసిన తరువాతే మేము ప్రవక్తలపై అవతరింపజేసిన గ్రంధాలలో వ్రాశాము.

(106) నిశ్చయంగా మేము అవతరింపజేసిన హితబోధనలో తమ కొరకు ధర్మ బద్ధం చేసిన వాటితో తమ ప్రభువు ఆరాధన చేసే వారికి సందేశం ఉన్నది. వారే దానితో ప్రయోజనం చెందుతారు.

(107) ఓ ముహమ్మద్ ప్రజలందరి సన్మార్గము,వారిని అల్లాహ్ శిక్ష నుండి కాపాడటంపై మీలో ఉన్న అత్యాశ గుణము వలన మిమ్మల్ని మేము ప్రవక్తగానే కాకుండా సృష్టితాలందరి కొరకు కారుణ్యమూర్తిగా పంపించాము.

(108) ఓ ప్రవక్తా మీరు ఇలా తెలియపరచండి : నా ప్రభువు తరపు నుండి మీ సత్య ఆరాధ్య దైవం ఒకే ఆరాధ్య దైవం అని,ఆయనతో పాటు ఎవరు సాటి లేరని,ఆయనే అల్లాహ్ అని నాపై దైవ వాణి అవతరించింది. అయితే మీరు ఆయనను విశ్వసించటానికి,ఆయనపై విధేయతతో ఆచరించటానికి విధేయులవ్వండి.

(109) ఒక వేళ వీరందరు మీరు వారి వద్దకు తీసుకుని వచ్చిన దాని నుండి విముఖత చూపితే ఓ ప్రవక్తా వారితో మీరు ఇలా పలకండి : నేను,మీరు సమానమైన విషయంపై ఉన్నామని,మీకూ నాకు మధ్య విరోధమున్నదని మీకు నేను తెలియపరచాను. మరియు అల్లాహ్ వాగ్దానం చేసిన తన శిక్ష మీపై ఎప్పుడు దిగుతుందో నాకు తెలియదు.

(110) నిశ్చయంగా మీరు బహిర్గతంగా పలికినది అల్లాహ్ కి తెలుసు,మరియు మీరు గోప్యంగా ఉంచినదీ ఆయనకు తెలుసు. వాటిలోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు ఆయన దాని పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.

(111) మరియు బహుశా శిక్ష విషయంలో మీకు గడువివ్వటం మీకు పరీక్షేమో,మీరు మీ అవిశ్వాసంలో,మీ మార్గ భ్రష్టతలో పెరిగిపోవటం కొరకు అల్లాహ్ యొక్క జ్ఞానంలో నిర్ణయించబడిన ఒక గడువు వరకు వదిలిపెట్టటం,మీకు ప్రయోజనం కలిగించటమేమో నాకు తెలియదు.

(112) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రభువుతో మొర పెట్టుకుంటూ ఇలా పలికారు : ఓ నా ప్రభువా నీవు మాకు, అవిశ్వాసంపై మొండి తనం కలిగిన నా జాతి వారి మధ్య సత్యంతో కూడుకున్న తీర్పునివ్వు. మీరు పలికే అవిశ్వాసము,తిరస్కారపు మాటల నుండి కరుణామయుడు అయిన మా ప్రభువుతో మేము సహాయమును కోరుతున్నాము.