(1) అల్లాహ్ ఆకాశముపై ప్రమాణం చేశాడు మరియు ఆయన రాత్రి వేళ వచ్చే నక్షత్రముపై ప్రమాణం చేశాడు.
(2) ఓ ప్రవక్తా ఈ గొప్ప నక్షత్రము విషయము ఏమిటో మీకేమి తెలుసు ?!
(3) తన ప్రకాశవంతమైన కాంతితో ఆకాశమును ప్రకాశవంతం చేసే నక్షత్రం అది.
(4) ఏ మనిషి కూడా అల్లాహ్ ప్రళయదినం లెక్క తీసుకోవటం కొరకు అతని కర్మలను పరిరక్షించే ఒక దైవదూతను అతనిపై బాధ్యతగా నియమించకండా ఉండడు.
(5) మనిషి అల్లాహ్ అతన్ని దేని నుంచి సృష్టించాడో గమనించాలి ; అల్లాహ్ సామర్ధ్యము మరియు మనిషి అసమర్ధత అతనికి స్పష్టమవటానికి.
(6) అల్లాహ్ అతనిని చిమ్ముకుంటూ వెలువడే నీటితో సృష్టించాడు అది తల్లి గర్భంలో గుమ్మరించబడుతుంది.
(7) ఈ నీరు మనిషి వెన్నుముక ఎముకల మధ్య నుండి మరియు రొమ్ము ఎముకల మధ్య నుండి వెలువడుతుంది.
(8) నిశ్చయంగా పరిశుద్ధుడైన ఆయన ఈ హీనమైన నీటితో అతడిని సృష్టించినప్పుడు అతన్ని లెక్క తీసుకోవటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించటం కొరకు అతని మరణం తరువాత జీవింపజేసి మరల లేపటం పై సామర్ధ్యం కలవాడు.
(9) ఆ రోజు రహస్య విషయాలు పరీక్షించబడుతాయి. అప్పుడు హృదయములు దాచిన సంకల్పాలు మరియు విశ్వాసాలు,ఇతర విషయాలు బట్టబయలు చేయబడుతాయి. అప్పుడు వాటి నుండి పుణ్యాత్ముడు మరియు పాపాత్ముడు వేరు చేయబడుతారు.
(10) ఆ రోజు మానవునికి అల్లాహ్ శిక్ష నుండి ఆపటానికి ఎటువంటి శక్తి ఉండదు మరియు అతడికి సహాయం చేయటానికి ఏ సహాయకుడు ఉండడు.
(11) అల్లాహ్ వర్షము కల ఆకాశముపై ప్రమాణం చేశాడు. ఎందుకంటే అది దాని వైపు నుండి పదే పదే కురుస్తుంది.
(12) మరియు ఆయన భూమిపై ఏదైతే తనలో ఉన్న మొక్కలు,ఫలములు,వృక్షములతో చీలిపోతుందో ప్రమాణం చేశాడు.
(13) నశ్చయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ సత్యఅసత్యాల మధ్య మరియు నిజము అబద్దాల మధ్య వేరు చేసే మాట.
(14) మరియు అది ఆట మరియు అసత్యము కాదు. కాని అది గంభీరము మరియు సత్యము.
(15) నిశ్చయంగా తమ వద్దకు తమ ప్రవక్త తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించేవారు ఆయన దావత్ ను తిరస్కరించటానికి దాన్ని అసత్యపరచటానికి చాలా కుట్రలు పన్నుతున్నారు.
(16) మరియు నేను ధర్మమును భహిర్గతం చేసి అసత్యాన్ని పరిసమాప్తం చేయటానికి పన్నాగం పన్నుతున్నాను.
(17) ఓ ప్రవక్త ఈ తిరస్కారులకు గడువివ్వండి. వారికి కొంత గడువివ్వండి. మరియు వారి శిక్షను,వారి వినాశనమును మీరు తొందరగా కోరకండి.