95 - At-Tin ()

|

(1) అల్లాహ్ అంజూరం పై మరియు అది మొలచే ప్రదేశము పై మరియు జైతూన్ (ఆలివ్) పై మరియు ఈసా అలైహిస్సలాం ప్రవక్తగా పంపించబడ్డ ఫలస్తీన్ లోని భూమిలో అది మొలచే ప్రదేశంపై ప్రమాణం చేశాడు.

(2) మరియు ఆయన తన ప్రవక్త మూసా అలైహిస్సలాంతో సంభాషించిన ప్రాంతమైన సీనాయ్ పర్వతంపై ప్రమాణం చేశాడు.

(3) మరియు పవిత్ర పట్టణం మక్కాపై ప్రమాణం చేశాడు. అందులో ప్రవేశించే వారికి శాంతి కలుగును మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్తగా అందులో పంపించబడ్డారు.

(4) నిశ్చయంగా మేము మానవుడిని ఉత్తమ సృష్టిలో మరియు ఉత్తమ రూపంలో ఉనికిలోకి తెచ్చాము.

(5) ఆ పిదప మేము అతనిని ఇహలోకంలో వృద్దాప్యము వైపునకు మరియు ముసలి తనం వైపునకు మరల్చాము కావున అతను తన శరీరముతో ప్రయోజనం చెందడు ఏ విధంగానైతే అతడు తన స్వభావమును పాడు చేసుకుని నరకాగ్నిలోకి పోతే దానితో ప్రయోజనం చెందడో.

(6) కాని అల్లాహ్ ను విశ్వసించి సత్కర్మలు చేసిన వారు ఒక వేళ వారు వృద్దాప్యమునకు చేరుకున్నా వారి కొరకు అంతం కాని శాశ్వత ప్రతిఫలం కలదు. అది స్వర్గము. ఎందుకంటే వారు తమ స్వభావమును శుద్ధపరుచుకున్నారు.

(7) ఓ మానవుడా ఆయన అధిక సామర్ధ్య సూచనలను కళ్ళారా చూసిన తరువాత కూడా నిన్ను ఏ విషయం ప్రతిఫల దినమును తిరస్కరించటం పై పురిగొల్పుతుంది ?!

(8) ఏమీ అల్లాహ్ ప్రళయదినమును ప్రతిఫలదినంగా చేసి తీర్పునిచ్చేవారిలో నుంచి ఉత్తమ తీర్పునిచ్చేవాడు మరియు వారిలో నుండి ఉత్తమంగా న్యాయపూరితంగా వ్యవహరించేవాడు కాడా ?! ఏమీ అల్లాహ్ ఉపకారము చేసినవాడికి అతని ఉపకారము యోక్క ప్రతిఫలం,మరియు దుష్కర్మకు పాల్పడినవాడికి అతని దుష్కర్మ ప్రతిఫలం ప్రసాదించడానికి తన దాసుల మధ్య తీర్పునివ్వకుండా వారిని వృధాగా వదిలేస్తాడని అతడు అనుకుంటున్నాడా ?!